చిత్తశుద్ధి లేని కొత్త రిజర్వేషన్లు - BJP
22-04-2017 02:44:21
http://www.andhrajyothy.com/artical?SID=401973
జనాభాలో 12 శాతం ఉన్న వర్గానికి అదే స్థాయిలో రిజర్వేషన్ కల్పించడంలో శాస్త్రీయత ఏమిటి? 52 నుంచి 54 శాతం ఉన్న వర్గాలకు 25శాతం రిజర్వేషన్లు అమలవుతుంటే సర్కార్‌కు బాధ కలగలేదు. ముస్లింలకు మాత్రం అన్యాయం జరిగిపోతున్నదంటూ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం చూస్తుంటే ఆయనలో బీసీ వ్యతిరేకత కనపడుతున్నది.
కొండనాలికకు మందేస్తే... ఉన్న నాలిక ఊడిందన్న విధంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం తీసుకువచ్చిన రిజర్వేషన్ బిల్లు. 2001 జాతీయ జనగణన గణాంకాల ప్రకారం ముస్లిం మైనా ర్టీల జనాభా 11.64శాతం. దీని ప్రకారం 12శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టబద్ధం కాదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక సైతం బీసీ-–ఈలో ఇప్పుడున్న నాలుగు శాతానికి మరో ఆరు శాతం కలిపి మొత్తం పదిశాతం చేయాలని సూచించింది. ఆ నివేదిక ప్రకారం చూసినా రాష్ట్ర ప్రభు త్వం 12 శాతం చేయడానికి చట్టబద్ధత లేదు. న్యాయస్థానాల తీర్పంటే మాకు లెక్కలేదు. చట్టాల పట్ల, రాజ్యంగం పట్ల మాకు గౌరవం లేదు. కమిషన్‌లు ఇచ్చే నివేదికలను అసలే పట్టించుకోం. మేము చేసిందే చట్టం... చెప్పిందే శాసనం అన్నట్లుగా టీఆర్ఎస్ సర్కార్ వైఖరి ఉంది.
గత ప్రభుత్వాల అనుభవాలను, న్యాయస్థానాల తీర్పులను పరిగణనలోకి తీసుకొని బిల్లులు రూపొందించడం వీరికి ససేమిరా ఇష్టముండదు. ఇందులో భాగమే ఇటీవల రూపొందించిన రిజర్వేషన్ బిల్లు. ఈ బిల్లును తమ సంఖ్యా బలంతో చట్టసభల్లో ఆమోదింపచేసుకున్నారు. దీనిపై ముస్లిం మైనార్టీ సోదరుల్లోనే అనుమానాలు ఉన్నాయి. ఇది న్యాయస్థానాల్లో నిలుస్తుందో లేదో అన్న భయం, ఆందోళన వారిలో లేకపోలేదు.
తెలంగాణ సర్కార్ తెచ్చిన ఈ బిల్లుతో రిజర్వేషన్లు 62శాతానికి పెరిగాయి. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదని సూచించింది. తమిళనాడు ప్రభుత్వం 69శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా విచారణలోనే ఉంది. అయితే తమిళనాడుతో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాల రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ కింద చేర్చడంతో అక్కడ అమలుకు నోచుకున్నాయి. తమిళనాడు మాదిరి మన రాష్ట్రంలో 62శాతానికి పెరిగిన రిజర్వేషన్లు అమలు కావాలంటే... 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. లేదంటే అమలు సాధ్యం కాదన్నది సుస్పష్టం. భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ విధానాన్ని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చడమంటే తేనె తుట్టెను కదపడమే అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కోర్టులో ఉన్న బంతిని కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టి రాజకీయ క్రీడ ఆడాలన్న దురుద్దేశం తప్పా.... రిజర్వేషన్ల అమలుపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది అర్థం అవుతుంది.
బీసీ–-ఈలో మాత్రం రిజర్వేషన్లు పెంచి మిగిలిన బీసీ కులాలకు ఎందుకు అన్యాయం చేశారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. టీఆర్‌ఎస్‌కు ముస్లింలపై ఉన్న ప్రేమ ఇతర బీసీ కులాలపై లేదని స్పష్టమవుతుంది. జనాభాలో పన్నెండు శాతంగా ఉన్న ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను కల్పించడంలో కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి ఇతర బీసీ కులాలపై లేదు. జనాభాలో 52 నుంచి 54 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగరంగాల్లో 25శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా, రాజకీయ రంగంలో స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇది ఇలా ఉంటే వీరిలో ఎంబీసీలు 30 నుంచి 35శాతం ఉంటారని ఒక అంచనా. బీసీ–-ఏలో చేరిన ఎల్లాపులతో తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు ఎంబీసీలు. వీటిపై కేసీఆర్ ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా? దీనిపై తెలంగాణ సర్కార్ సమాధానం చెప్పాలి. ఇప్పటికే బీసీ జాబితాలో ఉన్న ఎంబీసీలు తమకు అన్యాయం జరగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు విద్యా, ఉపాధి అవకాశాల్లోనూ ఇటు రాజకీయంగా స్థానిక సంస్థల్లోనూ తమకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఎంబీసీలను ఉద్ధరిస్తామంటున్న, వారికి కార్పోరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చామని చెబుతున్న ముఖ్యమంత్రి... రాజ్యాంగబద్ధంగా వారికి దక్కాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఎందుకు శ్రద్ధపెట్టలేదో సమాధానం చెప్పాలి. కొన్ని తాయిలాలు ప్రకటించి వారిని మభ్యపెట్టాలన్న ఆలోచనే తప్ప... డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగపరంగా వారికి కల్పించిన హక్కులను అమలుచేయాలన్న చిత్తశుద్ధి లేదు. నాడు రాజశేఖర్ రెడ్డి ముస్లింల కోసం బీసీ రిజర్వేషన్లలో కొత్తగా ఈ-–గ్రూపును ఏర్పాటుచేసి ఐదు శాతం (న్యాయస్థానం సూచనతో నాలుగు శాతానికి కుదించారు) రిజర్వేషన్‌ను కల్పించి మతప్రాతిపదిక రిజర్వేషన్లకు తెరతీశారు. బీజేపీ నాడే మత ప్రాతిపదిక రిజర్వేషన్లను వ్యతిరేకించింది. న్యాయస్థానాల్లో ఇది నిలువదని కూడా చెప్పింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం మరో ఎనిమిది శాతానికి పెంచి బీసీలను, మరీ ముఖ్యంగా ఇప్పటికే అన్యాయానికి గురౌతున్న ఎంబీసీలను ఇంకా అథఃపాతాళంలోకి నెట్టింది. ముస్లిం మైనార్టీలను బీసీ-–ఈ గ్రూపులో చేర్చడం వలన రాజకీయ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీరని అన్యాయం జరిగింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యాభై స్థానాలు బీసీలకు రిజర్వ్ కాగా 32 స్థానాల్లో ముస్లిం మైనార్టీలు దక్కించుకున్నారు. దీంతో ఇతర బీసీ కులాల వారు దారుణంగా అన్యాయానికి గురయ్యారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థానిక సంస్థలలో ఉన్న నామినేటెడ్ పోస్టులలో సుమారు ఆరువందల పోస్టులు ఒక్క ముస్లిం మైనార్టీలకే దక్కాయి. తద్వారా ఇతర బీసీ కులాలకు తీరని అన్యాయం జరిగింది. జనాభాలో పన్నెండు శాతం ఉన్న ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వడమంటే వారిలో ఒక్క శాతం కూడా ధనికులు లేరని తెలంగాణ సర్కార్ చెప్పదలుచుకుందా... ఇప్పటికే రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారిలో క్రిమీలేయర్ గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది.
క్రిమీలేయర్ వర్గాన్ని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలనే డిమాండ్ ఉంది. అటువంటి పరిస్థితుల్లో పన్నెండు శాతం ఉన్న జనాభాకు అదే స్థాయిలో రిజర్వేషన్ కల్పించడంలో శాస్త్రీయత ఏముందో నాకు అర్థం కావడం లేదు. యాభై రెండు నుంచి యాభై నాలుగు శాతం ఉన్న జనాభాకు 25శాతం రిజర్వేషన్లు అమలవుతుంటే తెలంగాణ సర్కార్‌కు బాధ కలగలేదు. ఇది అన్యాయమని అనిపించలేదు. ముస్లింలకు మాత్రం అన్యాయం జరిగిపోతుందంటూ శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఆయనలో బీసీ వ్యతిరేకత కనపడుతుంది. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఉన్నట్లే ఎస్టీలో కూడా వర్గీకరణ డిమాండ్ ఉంది. ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. వివిధ వర్గాల నుంచి అనేక డిమాండ్లు ముందుకు వచ్చాయి.
ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని వర్గాలకు సమన్యాయం చేయాల్సిన ప్రభుత్వం కేవలం ఒక్క వర్గానికే కొమ్ముకాయడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం.
బీసీలోని ఇతర కేటగిరీల రిజర్వేషన్లను కూడా పెంచుతామంటున్న ప్రభుత్వం దాని కోసం మరోకసారి అసెంబ్లీలో బిల్లును తెస్తారా? ఈ రెండు సంవత్సరాల్లో అది సాధ్యమా? మరి కానప్పుడు ఎందుకు బీసీలను మోసం చేస్తున్నారు? రాష్ట్ర రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ బిల్లును ఇంత హడావుడిగా అసమగ్రంగా ఎందుకు ఆమోదించుకున్నట్లు? దీని వెనకాల ఉన్న రాజకీయ దురుద్దేశం ఏమిటో ఆయనే చెప్పాలి. కీలకమైన రిజర్వేషన్ల బిల్లును తెచ్చేటప్పుడు అన్ని కోణాల్లో అన్ని వర్గాల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వచ్చే పరిణామాలను కూడా అంచనావేసి బిల్లు రూపొందించాలి. అంతేకానీ రెండు మూడు సంవత్సరాలకోసారి రిజర్వేషన్ల బిల్లును తేవడం అవగాహనరాహిత్యానికి నిదర్శనం. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ రాష్ట్రసమితి గొప్పలు చెప్పుకుంటుంది. మార్కెట్ కమిటీల్లో, పార్టీ కమిటీల్లో వారికి 51శాతం రిజర్వేషన్లు కల్పించామంటుంది. మంచిదే కానీ వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అదే విధానాన్ని కేబినెట్లో కూడా అమలుచేస్తే బాగుంటుంది. మీరు చెబుతున్న లెక్కల ప్రకారమే జనాభాలో 90శాతంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి కేబినెట్ లో ఎంత మందికి అవకాశం ఇచ్చారో మీరే చెప్పాలి. పార్టీ పదవులకు ఓ న్యాయం, మంత్రి పదవులకు ఓ న్యాయమా అని బడుగు బలహీన వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. దళిత సీఎంను చేయకున్నా కనీసం బడుగు బలహీన వర్గాలకు వారికి మంత్రి పదవులు ఇవ్వమని అడుగుతున్నారు. అప్పుడే కేసీఆర్‌కు బడుగు బలహీన వర్గాలపై ప్రేమ ఉన్నట్లు రుజువవుతుందని అంటున్నారు.
ఎం. రఘునందన్‌రావు
బీజేపీ రాష్ట్ర నాయకులు

No comments:
Post a Comment