ముస్లింలను మభ్యపెట్టేందుకే - పొన్నం
Sakshi | Updated: April 17, 2017 01:04 (IST)
http://www.sakshi.com/news/hyderabad/ponnam-prabhakar-comments-on-muslim-reservation-468408?pfrom=inside-featured-stories
చిక్కులుంటాయని తెలిసీ రిజర్వేషన్ల పెంపు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ముస్లింలను మభ్య పెట్టేందుకే ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టారని, పైగా అందుకు అనుచిత పద్ధతి అనుసరించారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు 50 శాతానికి మించితే న్యాయపరమైన చిక్కులుంటాయని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరదీశారని సోమవారం దుయ్యబట్టారు. ‘‘రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చా లంటే ఉభయసభల ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఇప్పటికే పలురాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇది సాధ్యమయ్యే పని కాదని తెలిసినా ప్రభుత్వం ఆగమేఘాలపై బిల్లు ప్రవేశ పెట్టింది’’ అని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలో 12 శాతమున్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడం సమంజసమేనని ఆయన పేర్కొన్నారు. అదే తరహాలో 52 శాత మున్న బీసీలకు 52 శాతం రిజర్వేషన్ బిల్లు తెచ్చి కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపిం చుకోవాలని డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment