Sunday, 16 April 2017

ముస్లిం రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధం: కిషన్‌రెడ్డి

ముస్లిం రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధం: కిషన్‌రెడ్డి
Sakshi | Updated: April 17, 2017 00:56 (IST)

http://www.sakshi.com/news/hyderabad/it-is-a-historical-blunder-468405?pfrom=inside-featured-stories
ఇది చారిత్రక తప్పిదం
ముస్లిం రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధం: కిషన్‌రెడ్డి

- హైకోర్టు, అంబేడ్కర్‌ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించారు
- ఎస్టీల రిజర్వేషన్లకు మద్దతిస్తున్నామని వెల్లడి
- అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యుల నిరసన
- ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు.. సస్పెండ్‌ చేసిన స్పీకర్‌ మధుసూదనాచారి

సాక్షి, హైదరాబాద్‌: ముస్లిం రిజర్వేషన్ల కోటా పెంపు నిర్ణయం చారిత్రక తప్పిదమని, అది రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు స్పష్టం చేశాయని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ కూడా మతపరమైన రిజర్వేషన్లలను వ్యతిరేకించారని గుర్తుచేశారు. అసెంబ్లీ లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. దీంతో కిషన్‌రెడ్డి సహా ఆ పార్టీ సభ్యులను స్పీకర్‌ శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారు.

ఇది రాజ్యాంగ విరుద్ధం
బిల్లుపై చర్చ సందర్భంగా రిజర్వేషన్ల పెంపును కిషన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపునకు తాము వ్యతిరేకం కాదని, గిరిజన కోటాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నామని తెలిపారు. గిరిజనుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉం దన్నారు. కానీ గిరిజన రిజర్వేషన్ల బిల్లుతో కలిపి మతపరమైన రిజర్వేషన్ల బిల్లు పెట్టడాన్ని కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. ‘‘ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్య. గతంలో కాంగ్రెస్‌ అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్లను హైకోర్టు రెండుసార్లు కొట్టివేసింది.

ఇప్పుడు ఆ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ బిల్లు తేవడం రాజ్యాంగ వ్యతిరేక చర్య. అది న్యాయస్థానాల్లో నిలవదు..’’అని మండిపడ్డారు. అయితే కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ దీటుగా స్పందించారు. తాము రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పూనుకోలేదని, నాడు కాంగ్రెస్‌ బీసీ–ఈ వర్గానికి 6 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించగా.. రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయని హైకోర్టు తీర్పు ఇచ్చిందని స్పష్టం చేశారు. బీసీ–ఈ వర్గాలకు రిజర్వేషన్లు పెంచడం మతపరమైన రిజర్వేషన్లు కాదని చెప్పారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు అంచనా కోసం సుధీర్‌ కమిషన్‌ వేశామన్నారు.

అది మతపరమైన కోణమే!
కేసీఆర్‌ వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. కేవలం మతపరమైన కోణంలోనే సుధీర్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ‘‘ముస్లింలలో సామాజిక అసమానత, వివక్ష, కులవ్యవస్థ లేదు. కుల, సామాజిక వివక్ష ఉన్నదంటే అది ఇస్లాంకు వ్యతిరేకం. అలాంటప్పుడు రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?’’అని ప్రశ్నించారు. వందల ఏళ్లు ముస్లింలు రాష్ట్ర పాల కులుగా ఉన్నారని, విద్యాపరంగా ముందున్నారని, అనేక విద్యా సంస్థలున్నాయని పేర్కొన్నారు.

రాజ్యాంగ రూపకల్పన సమయంలో ఎస్‌సీ ముఖర్జీ నేతృత్వాన 50 మంది ప్రముఖులతో రిజర్వేషన్లపై సబ్‌ కమిటీ వేయగా... మత ప్రస్తావనతో ఎలాంటి రిజర్వేషన్లు ఉండరాదని కమిటీ సూచించిందని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో బీసీలకు అన్యాయం జరుగు తుందని, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో 50 సీట్లు బీసీలకు కేటాయించినా.. 30 సీట్లు బీసీయేతరులు గెలిచారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పేద ముస్లింలు ఉంటే వారికి ఆర్థిక సహకారం అందించవచ్చని, ఉత్తరప్రదేశ్‌లో అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ పేద ముస్లింల పెళ్లిళ్లు, ఇతర అభివృధ్ధికి సహకారం అందిస్తున్నారని చెప్పారు.

నిరసన.. సస్పెన్షన్‌
కిషన్‌రెడ్డికి ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సేపు మాట్లాడుతుండటంతో స్పీకర్‌ ఆయన మైక్‌ కట్‌ చేశారు. దీంతో బీజేపీ సభ్యులు లేచి నిరసనకు దిగడంతో తిరిగి మైకు ఇచ్చారు. కిషన్‌రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడుతుండటంతో మళ్లీ మైక్‌ కట్‌ చేశారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోంచి ముందుకు వచ్చి ప్లకా ర్డులు ప్రదర్శించారు. ప్లకార్డులు తీసేస్తే రెండు నిమిషాలు గడువిస్తానని స్పీకర్‌ హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కానీ రెండు నిమిషాలు ముగిసినా కిషన్‌రెడ్డి మాట్లాడుతుండటంతో.. స్పీకర్‌ మళ్లీ మైక్‌ కట్‌చేసి అధికార పార్టీ సభ్యుడు షకీల్‌కు అవకాశ మిచ్చారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

స్పీకర్‌ కోరినా వెనక్కి తగ్గకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుని.. బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్,  రామచంద్రారెడ్డి, రాజాసింగ్‌లను ఈ సమావేశాల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అయినా వారు సభ నుంచి బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్‌  బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.

బీజేపి 'ముట్టడి' భగ్నం
http://epaper.sakshi.com/1173738/Hyderabad-Main/17-04-2017#page/6/2

No comments:

Post a Comment