Thursday, 1 September 2022

అంబెడ్కర్ భారత రాజ్యాంగం రాయలేదు అనే వారికీ ఇది అసలు సిసలు సమాధానము

 The total membership of the Constituent Assembly was 389 of which 292 were representatives of the provinces, 93 represented the princely states and four were from the chief commissioner provinces of Delhi, Ajmer-Merwara, Coorg and British Baluchistan.


అంబెడ్కర్ భారత రాజ్యాంగం రాయలేదు అనే వారికీ ఇది  అసలు సిసలు  సమాధానము .....వ్యతిరేకులకు సమాధానము చెప్పడం కోసమైనా చదవండి🙏

ముందుగా రాజ్యాంగం ఆగస్టు 29 1947 నా స్వతంత్ర భారత రాజ్యంగ ముసాయిదా రచనా సంఘము ఏర్పడిన రోజు .... మన దేశానికి రాజ్యంగము వ్రాయడానికి 7 గురు సభ్యులను ఎన్నుకోవడము జరిగింది ఆ 7 గురిలో డా.బాబాసాహేబ్ అంబేద్కర్ గారిని చైర్మేన్ గా నియమించారు.... 

మిగతా  సభ్యుల వివరాలు..

1...అల్లాడి కృష్ణ  స్వామిఅయ్యర్...


2...కే.యమ్ మున్షి...

 

3. యన్.గోపాలస్వామి అయ్యమగార్..


4.మహమ్మద్ సాదుల్లా..


5.యన్ మాధవిమీనన్..


 6.డి.పి.ఖైతాన్...(ఈయన మరణం తో ఆయన స్థానంలో టి. టి  కృష్ణమచారి వచ్చారు) 


రాజ్యంగ రచనా పూర్తిగా అంబేద్కర్ మీదనే బారము పడింది ఎందుకంటే...


A)....దీనిలో టి. టి  కృష్ణమచారి  గారికీ న్యాయ శాస్త్రం లో ప్రావిణ్యం  లేదు అలాగే పట్ట భద్రుడు కూడా కాదు... 


B)...ఇద్దరు సబ్యులు యితర దేశాల కార్యకలాపాలో మునిగి పోయారు....


C)....ఇంకోకరు అనారోగ్య కారణాలవల్ల....


D)...మిగతావారు కాంగ్రేస్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు....అలాగే..ఇంకొక కారణం కూడా తోడు అయ్యింది వారికీ అది ఏంటి అంటే వారికీ (  సభ్యులకు) ఢిల్లీ  చాల దూరం ఉండడం ద్వారా కూడా వారు రాజ్యాంగ రచన లో పాల్గొనలేదు.. 


అందుచేత అంబేద్కర్ ఒక్కరి మీదనే బారము పడడము వల్ల ఆయన అనారోగ్యముతో భాదపడుతునే అయనకు అప్పచేప్పిన భాద్యతను పూర్తిచేసి 1949 నవంబర్ 26 న అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్,ప్రదాని నేహ్రుకు అందచేయడము వారు ఆ రాజ్యంగ ప్రతిని అదే రోజు ఆమోదించడము జరిగింది ....


ఈ రాజ్యంగాన్ని జనవరి 26 ,1950 నుండి అమలు చేసారు...


స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పాలన వ్యవస్థ ఇంకా నిర్మాణం కాని క్లిష్టమైన వాతావరణంలో మన రాజ్యాంగ రచన జరిగింది. దీనికి రచనా కమిటీ ఛైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతకంటే ముందు ఆయన్ను అసలు రాజ్యాంగ సభకే వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాయి అప్పుడున్న కొన్ని పార్టీలు.... కుట్ర లో దాగి ఉన్న చరిత్ర కూడా చూడాలి..లేకపోతే మేల్కొనలేము..  


((((( 1.....అంబెడ్కర్ గారు అప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఓపిగ్గా ఎదుర్కొని బెంగాల్ రాష్ట్రం నుండి రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు బాబా సాహెబ్. తన సొంత రాష్ట్రమైన మహరాష్ట్రనుంచి ఆయన ఓడిపొయేలా చేసి, ఆయన్ను రాజ్యాంగ రచనా కమిటీలో లేకుండా చేయాలనుకున్నారు అప్పటి కాంగ్రెస్ నాయకులు మరియు హిందూ మహాసభవారు. అప్పుడు బెంగాల్ శాసనసభ ఎస్సీ ఫెడరేషన్ మరియు ముస్లిం లీగు సభ్యులు కలిసి ఆయన్ను తమ రాష్ట్రం నుండి ఎన్నికయ్యేలా చూసి బాబాసాహెబ్ ను రాజ్యాంగ రచనాకమిటీలో స్థానం దక్కేలా చేసారు.


 ఆపై జరిగిన పరిణామాలు దేశ విభజనను తెచ్చాయి, ఆ విభజన వల్ల అంబేద్కర్ ఎన్నికైన బెంగాల్ స్థానం తూర్పు పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయేసరికి, అంబేద్కర్ మరోసారి తన సభ్యత్వం కోల్పోవాల్సివచ్చింది. ఇలా ఈ ప్రాంతం పాకిస్తాన్ లోకి వెళ్ళిపోవడం వెనక కూడా అంబేద్కర్ ను రాజ్యాంగ రచనా కమిటీలో లేకుండా చేయాలనే కాంగ్రెస్ నాయకుల కుట్ర ఉంది. ఈ అన్యాయాన్ని అంబేద్కర్ బ్రిటిష్ ప్రధానికీ, ప్రతిపక్ష నాయకులకూ విన్నవించగా, ఈ తప్పిదాన్ని సరిచేసి అంబేద్కర్ ను మరే ప్రాంతం నుంచైనా ఎన్నుకోవాల్సిందిగా ప్రధాని నెహ్రూ ను ఆదేశించేసరికి, పూనే నుంచి ఎన్నుకోవాలనుకున్న మాల్వాంకర్ ను తప్పించి అంబేద్కర్ ను ఎన్నుకోవడం జరిగింది.


ఇలా కాంగ్రెస్ నాయకులు, వల్లభాయ్ పటేల్ కలిసి పన్నిన కుట్రను సమర్ధంగా ఎదుర్కొని అంబేద్కర్ రాజ్యాంగ రచనా కమిటీ లో చోటు సంపాదించుకున్నారు.....


2.....అంబేడ్కర్ ను  రాజ్యాంగ పరిషత్తు కు రానివ్వకుండా చేయడానికి అంబేడ్కర్ గెలిచిన తూర్పు బెంగాల్ లో ఒక ప్రాంతాన్నే

పాకిస్తాన్ కి ఇచ్చేశారా?


దేశ భూభాగాన్ని కోల్పోవడానికి కారకులు, దేశద్రోహులు ఎవరు? 


Constituent Assembly Debates:  book no 1 లో అంబేద్కర్ పేరు బెంగాల్ ప్రావెన్సీ లో వుండగా book no 2 కి వచ్చేసరికి బొంబాయి ప్రావిన్సులో కి ఎందుకు మారిపోయింది? ఈ కుట్రకు కారకులెవరు ?


భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకునే ముందు మనం తప్పనిసరిగా రాజ్యాంగం​ ను రూపొందించే బాద్యతలు తీసుకున్న రాజ్యంగ పరిషత్ కు సభ్యులను ఎలా ఎన్నుకున్నారు, ఆ ఎన్నిక విధానం ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ పరిషత్ లో అంబేడ్కర్ సభ్యుడు ఎలా అయ్యాడు, దానికి అయన పడ్డ కష్టాలను మనం తప్పక తెలుసుకోవాలి.​​​ 


రాజ్యంగ పరిషత్ కు 1946​ జులై, ఆగష్టు లలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు భారతదేశంలో  బ్రిటిష్ సంస్థానాలు, స్వదేశీ సంస్థానాలు అనే రెండు పరిపాలన విభాగాలు ఉండేవి. ప్రతీ సంస్థానం నుంచి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు చొప్పున పరిషత్ కు తీసుకున్నారు. ఇలా 296 మంది బ్రిటీష్ సంస్థానాల నుంచి ఎన్నుకోపడ్డారు. మొత్తం 389 మంది సభ్యులుగా గల రాజ్యాంగ పరిషత్ లో మిగతా 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి పాతినిద్యం వహించారు. అయితే బ్రిటిష్ సంస్థానాలలో రాజ్యాంగ పరిషత్ కు జరిగిన ఎన్నికలలో షెడ్యుల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ను అంబేడ్కర్ ను ఓడించటానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కుట్ర పన్ని అప్పటి బొంబాయి సంస్థాన ప్రధాన మంత్రియైన B G కేర్ కు సూచనలు చేసి ఓడించడం జరిగింది.ఈ కుట్రలో వామ పక్షాలు కుడా పటేల్ తో చేతులు కలపడం చాలా శోచనీయం.....


పటేల్ చేసిన ఈ కుట్రను గమనించిన బెంగాల్ లోని #నామశూద్రుల నాయకుడైన #మహాప్రన్ #జోగేంద్ర నాథ్ మండల్ #జెస్సోర్ #ఖుల్నా నుంచి పోటీ చేసిన తమ అభ్యర్థియైన ముఖుంద్ బిహారి మల్లిక్ తో రాజీనామా చేయించి అంబేడ్కర్ చేత పోటీ చేయించడం జరిగింది. ఇలా ఐక్య బెంగాల్ నుంచి పోటీచేసిన అంబేడ్కర్ గెలిచి రాజ్యాంగ పరిషత్ కు ఎన్నిక కాబడ్డాడు. ఐతే ఈ ఎన్నికలో షెడ్యుల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ కు బెంగాల్ లెజిస్లేచర్ లో పూర్తి మెజారిటి లేకపోవడంతో  కాలిసిన 4 బదలీ ఓట్లును ఆంగ్లో ఇండియన్, స్వంతంత్ర దళిత, ముస్లిం లీగ్ అభ్యర్ధుల మద్దతుతో  5 ఓట్లు సాధించి రాజ్యాంగ పరిషత్ కు ఎన్నిక కాబడ్డారు. అయినా కూడా కాంగ్రెస్ లో ఉన్న కొంతమందికి అంబేడ్కర్ గిట్టలేదు. అందుకే దేశ విభజన సమయంలో అంబేడ్కర్ ఎన్నుకోబడ్డ తూర్పు బెంగాల్ ప్రాంతమైన  జెస్సోర్ ఖుల్నాను విభజనలో బాగంగా పాకిస్తాన్ కు ఇవ్వడం జరిగింది...


వాస్తవానికి దేశ విభజన ఒప్పంధం ప్రకారం 50% అంతకంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలనే పాకిస్తాన్ కు ఇవ్వాల.కాని అంబేడ్కర్ ను భారత రాజ్యాంగ పరిషత్ కు దూరం చేయాలనే ఉద్దేశం తో 48% ముస్లిమ్స్ ఉన్న జెస్సోర్ ఖుల్నా ప్రాంతాన్ని పాకిస్తాన్ కు ఇవ్వడం జరిగింది. ఇలా జరిగిన ఇంత పెద్ద అన్యాయాన్ని అంబేడ్కర్  బ్రిటిష్ ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులకు విన్నవించగా చాల తీవ్రంగా తీసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం ఇది విభజన నిబంధనలకు వ్యతిరేకమని, ఈ తప్పిద్దాన్ని సరిచేసి జెస్సోర్ ఖుల్నా ప్రాంతాన్ని భారత్ లో కలపాలని లేదంటే అంబేడ్కర్ ను వేరే ప్రాంతం నుంచైనా ఎన్నుకోవాలని నెహ్రూకు చెప్పడం జరిగింది. ఈ సమస్య తీవ్రత ను గమనించిన కాంగ్రెస్ విభజన ప్రకియ ఆగి ఇంకా పెద్ద సమస్యలు తలెత్తుతాయని తప్పనిసరి పరిస్థితులలో పూణే నుంచి ఎన్నుకోవాలనుకున్న మాల్వంకర్ తప్పించి ఆ స్థానం నుంచి అంబేడ్కర్ ను ఎన్నుకోవడం జరిగింది. 

 

ఇలా కాంగ్రెస్, వల్లభాయ్ పటేల్ కుట్రలకు అంబేడ్కర్ తప్పనిసరిగా పూణే నుంచి పోటీ చేయవలసి వచ్చింది. 1940 దశాబ్దం మొత్తం అంబేడ్కర్ షెడ్యుల్డ్ కులాల హక్కుల కొరకు, వారి ప్రాతినిద్యం కొరకు కాంగ్రెస్ తో పోరాటం చేస్తూ వుండే వాడు. చాలా విషయాలలో అంబేడ్కర్ కాంగ్రెస్ పార్టీ కి పెద్ద విమర్శకుడిగా తయారయ్యాడు. అయినప్పటికీ అంబేడ్కర్ కాంగ్రెస్ తో ఉన్న రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి దేశం మీద ఉన్న ఎనలేని ప్రేమతో రాజ్యాంగ రచనలో వాళ్ళతో కలిసి పనిచేశారు. రాజ్యంగ పరిషత్ కు ఎన్నుకోబడ్డ చాలా మంది కాంగ్రెస్ సభ్యులకు రాజ్యాంగం ఎలా రాయాలో తెలీదు. కేవలం వారు కాంగ్రెస్ పార్టీ అని, జైళ్లకు వెళ్ళారని ఎన్నుకోవడం జరిగింది. అంబేడ్కర్ అసమాన ప్రతిభ, ఇతర దేశాల రాజ్యాంగాలపై ఆయనకు ఉన్న అపారజ్ఞానం చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతుగా నిలిచారు. అదే తరువాత కాలంలో కాంగ్రెస్ తో ఆయన పనిచేయడానికి పునాధీ అయ్యింది.


అంబేద్కర్ ను రాజ్యాంగం పరిషత్తుకు రానివ్వకుండా చెయ్యడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేయగలిగిన కుట్రలన్నీ చేశారు. ఈ కుట్రలన్నిటికి ప్రధాన సూత్రధారుడు ఆయనే. ఈ దేశంలో దళితులకు, అంబేడ్కర్ వాదులకు ఎవడైనా శత్రువు ఉన్నాడంటే అతను పటేల్ మాత్రమే...

*************

ఈ రోజు మన బారత రాజ్యంగo అమలు అయిన రోజు. 1858 నుంచి  1947 వరకూ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని  పరిపాలించారు  తరువాత 1947 august 15 న మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు  వదిలి వెళ్ళడo జరిగింది.  తరువాత మన దేశానికి రాజ్యాంగo  కావాలి  ఎవరు రాయగలరు అని ఒక చిన్న సందేశం వఛింది. మన మొదటి ప్రదాని మంత్రి అయిన నెహ్రూ గారు మన దేశం నుంచి కొంతమందిని అమెరికా లో ఉన్న కొలoబియా  యూనివర్సిటీ కి పoపారు  వాళ్ళు  మన వాళ్ళకి మీ దేశం లోనే ఒక ప్రపంచ  మేధావి అయిన Dr B.R అంబేద్కర్ గారిని  పెట్టుకుని ఇక్కడి  వరకూ ఎందుకు వచ్చారు  అని చెప్పి  తిరిగి మన దేశానికి పoపారు.

తరువాత  రాజ్యాంగ ముసాయిదా కమిటీ వేసి ఆ కమిటీ కి Dr B.R అంబేద్కర్ గారిని  చైర్మన్ గా నియమించారు...


#IMP;  ఈ విషయాల నుంచి పతీ మనిషీ ప్రత్యేకించి దళిత జాతులు నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి. అప్పటికి ఉన్నతవర్గాల ప్రజలూ, మరికొంతమంది మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండి, మిగతా పౌరులకు ఏమాత్రం ప్రాతినిధ్యం లేని పరిస్థితి భారతదేశంలో నెలకొని ఉంది. ఆర్ధిక అసమానతలెన్ని ఉన్నా, రాజకీయంగా ప్రతీ పౌరునికీ ఒకే విలువ ఉండాలనీ, లేని పక్షంలో  అసమానతల వల్ల లబ్ధిపొందుతున్న శక్తులు వ్యవస్థను నాశనం చేస్తాయనీ గ్రహించిన బాబాసాహెబ్, తాను రాజ్యాంగ రచనా కమిటీలో ఉండాలనీ, అసమానతలకు తావులేని రాజ్యాంగాన్ని సిద్ధం చేయాలనీ తపనపడడం వల్లే అంతగా శ్రమించి స్థానం సంపాదించుకున్నారు.


ఐతే, రాజ్యాంగం ఎంత గొప్పగా రాయబడినా.. రాజ్యాంగం ఎలాంటి శక్తుల చేతిలో ఉంది అన్న విషయం మీద రాజ్యాంగం మంచిదిగా గానీ చెడ్డదిగా గానీ పరిణమిస్తుంది కనుక, రాజ్యాంగం తన విధిని చక్కగా నిర్వర్తించాలంటే అది ఈ దేశ పౌరులమీదా, వారు ఎన్నుకునే రాజకీయ ప్రతినిధుల చేతుల్లోనూ ఉంటుందని తేట తెల్లం చేసారు అంబేద్కర్. “తాను రాసిన రాజ్యాంగం అణిచివేయబడ్డ జాతుల హక్కులను నిలబెట్టలేక విఫలమైన పక్షంలో, దాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని కూడా తానే ఔతాన”ని 1949 నవంబరు 25 న, రాజ్యాంగ పరిషత్ నుద్దేశించి తానుచేసిన చివరి ప్రసంగంలో నిష్కర్షగా ప్రకటించారు. దాన్నిబట్టి ,ఈనాడు మనం అనుభవిస్తున్న వివక్షకు కారణం మనం ఎన్నుకున్న తప్పుడు నాయకులే అన్నది ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన ముఖ్య విషయం.


ఈ మాటలనుంచి, తాననుకున్నది ఎంత కష్టమైనదైనా సాధించడంలో అంబేద్కర్ చూపించిన బాధ్యత నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి అనే విషయం ఇప్పుడు మనమందరం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. తనజాతి ప్రశాంతంగా హక్కులతో అందరితో సమానంగా బ్రతకాలని ఇంత శ్రమించిన బాబాసాహెబ్ కు మనం సరైన గౌరవం ఎప్పుడైనా ఇచ్చామా? రిజర్వేషన్ల సృష్టికర్తను అన్నం పెట్టినవాడిగా మాత్రమే జమకట్టి, పే బ్యాక్ టు ద సొసైటీని తుంగలో తొక్కిన దొంగలం మనం కామా? రిజర్వేషన్ వల్ల జీతాలు సంపాదించుకుంటూ, తమ కుటుంబాలకు మాత్రం అంబేద్కర్ చేసిన త్యాగాలను ఏమాత్రం తెలియజేయకుండా వెన్నుపోటు పొడిచిన వారమేకదా మనమంతా?


తాముకూడా మనువాదుల గుంపులో చేరి, తన పక్కింటివాడు బాగుపడితే తనతో సమానమైపోతాడని, దుర్బుద్ధితో ఆలోచించిన వాళ్ళ వల్లే కదా..ఈరోజు అంబేద్కర్ అంటే ఒక కులనాయకుడిగా మిగిలి, చాందసుల చేతిలో వివాదాస్పద వ్యక్తిగా ముద్రవేయబడ్డాడు? ఈ క్లర్కుల గుంపు నావల్ల లభ్దిపొంది నన్ను మోసం చేసింది అని బాబాసాహెబ్ కళ్ళ నీళ్ళపర్యంతమైంది ఎవరుచేసిన ద్రోహం వల్ల?


బాబాసాహెబ్ ను కులనాయకుడిగా చేసి ఆ మహా మేధావిని స్థానిక నేతకు కుదించే ద్రోహాలు ఇక మానేద్దాం. ఆయన ఆశయ సాధన అంటే చుట్టూ ఉన్న బడుగుజాతుల బిడ్డలకు విద్యతో పాటూ, కనీస ప్రాధమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా, అవి కల్పించేలా ప్రభుత్వాలను ఒత్తిడి చేయడం. బడుగులందరినీ  జ్ఞానవంతులను చేయడం, హెచ్చుతగ్గులు లేని వ్యవస్థ అందరి హక్కు అనే భావజాలాన్ని వీలైనంతగా సమాజానికి చేరవేసి, ఈ దేశపు ప్రతీ పౌరుడికీ ఒకటే విలువ కలిగి ఉండేలా ఇప్పటి యువ సమాజాన్నైనా తీర్చిదిద్దాల్సిన బాధ్యత..బాబాసాహెబ్ అంబేద్కర్ ను అర్ధంచేసుకున్న, అభిమానిస్తున్న ప్రతీ వ్యక్తిమీదా ఉంది. అలా చేయగలిగినప్పుడే ఆయన విగ్రహానికి దండ వేసి గౌరవించే స్థాయిని మనం సంపాదించుకున్నవారమౌతాం.....))))


కానీ భారతజాతికి దిశను చూపించే రాజ్యాంగ రచనకు అంబేద్కర్ మాత్రమే సరైనవ్యక్తి అని నాటి సభ్యులు  చెప్పడము జరిగింది .... తర్వాత రాజ్యాంగ రచన మొదలుపెట్టారు...


అంబేద్కర్ గారు మన బారత రాజ్యాంగo ను రాయడనికి 2 సంవస్తరాల 11 నెలల 18 రోజులు పట్టింది.అమెరికా రాజ్యాంగo లో కెవలం 7 ఆర్టికల్స్ ఉన్నయ్.  మొత్తం మన బారత  రాజ్యాంగo లో 395 ఆర్టికల్స్ 12 షెడ్యూల్లు ఉన్నాయి. ప్రపoచo లోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగo మనది.

-------####-----------------####------------------


భారత దేశ రాజ్యాంగం మన దేశానికి పవిత్ర గ్రంథం. దేశభక్తి గురించి, నినాదాల గురించి, స్వేచ్ఛ గురించి ఎన్నిరకాల అభిప్రాయాలున్నా… అన్నిoటికీ రాజ్యాంగమే ఆదర్శం.... భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది కాబట్టే రాజ్యాంగం అంటే అందరికీ అంత గౌరవం....అలాంటి రాజ్యాంగానికి కర్తకర్మ అన్నీ అంబేద్కరే.... స్వతంత్ర భారతదేశం భవిష్యత్ కు దిక్సూచిగా తన ఆత్మనే రాజ్యాంగ గ్రంథంగా రాసుకున్నారు అంబేద్కర్..... భారతజాతికి ఆయన ఇచ్చిన ఈ బహుమతి మతాలు, కులాలు, వర్గాలన్నిటినీ ఏకంగా చేసింది. ఏ తేడా లేకుండా ప్రతి పౌరుడికీ సమానమైన గుర్తింపు ఇచ్చింది. అందుకే అంబేద్కర్ అందరివాడయ్యారు....


అంబేద్కర్ ఆలోచనలే భారతీయులందరి ఆత్మగౌరవం.... అందుకే తరాలుగా అట్టడుగున ఉండిపోయిన ప్రజలకు ఆయన దేవుడు. ఆయన ఆలోచనలను కాదనేవాళ్లకు కూడా ఆయనే ఆదర్శం. అందరికీ కలిసి ఆయన శాశ్వత అవసరం. ఆ అవసరం అనివార్యంగా మారడానికి కారణం… మన రాజ్యాంగం. ఏ భేదం లేకుండా… భారత ప్రజలమైన మేము… అంటూ మొదలవుతుంది మన రాజ్యాంగం. ఈ ఒక్క మాటతో భారత నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పారు అంబేద్కర్. అప్పటికే కులాలుగా, మతాలుగా విడిపోయిన భారతీయులను ఒకే ఒక్క మాటతో ఒక్కటి చేశారు. ఈ సమానత్వంతోనే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు...


మనదేశం కంటే ముందే చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నాయి....అలా 130కి పైగా దేశాల రాజ్యాంగాలను చదివారు అంబేద్కర్. అవన్నీ అధ్యయనం చేసి మనకు అవసరం అనుకున్నవి, మన దేశ పరిస్థితులకు తగినట్టుగా మార్పులు చేశారు....

 మనదేశంలోని రకరకాల సమాజాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో చాలా ముందుగానే అంచనా వేసి… వాటికి పరిష్కారాలు చూపించేలా రాజ్యాంగ రచన చేశారు అంబేద్కర్....


దేశంలో పటిష్ఠమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు అంబేద్కర్. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. పాలకులు దారితప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కు ఇచ్చారు. హక్కులతో పాటు ప్రభుత్వాలను గైడ్ చేసేలా ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. మనకంటే చాలా ముందుగా రాజ్యాంగం రాసుకున్న అమెరికా వ్యవస్థ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయింది.... కొన్ని పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించింది. కానీ మన రాజ్యాంగం భవిష్యత్ ను చాలా ముందుగా ఊహించి పరిష్కారాలు చూపేలా రచించారు అంబేద్కర్....


కొన్ని దేశాల్లో పన్ను కట్టేవాళ్లే ఓటర్లు. కొన్ని దేశాల్లో ఇంకొన్ని అర్హతలున్నవాళ్లకే ఓటు. వాటన్నిటికీ భిన్నంగా… దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్. టాటా, బిర్లా అయినా… రోజు కూలీ అయినా ఓటుకు ఒకటే విలువ. ఇదే అంబేద్కర్ ప్రతిపాదించిన అసలైన ప్రజాస్వామిక సిద్ధాంతం....


అంబేద్కర్ న్యాయశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు.... మనదేశంలో సామాజిక వివక్ష ఎలా ఉంటుందో, ఎదగడానికి ఎన్ని కష్టాలుంటాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే పౌరహక్కుల విలువను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా… వాటిని రాజ్యాంగంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిని ఎవరూ కాదనే అవకాశం లేకుండా తిరుగులేని రక్షణ కల్పించారు. ప్రజల చుట్టూనే వ్యవస్థ పనిచేసేలా చేశారు

ప్రతి పౌరుడూ తన ఆలోచనలు చెప్పుకోగలిగేలా భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు అంబేద్కర్....


దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబా సాహెబ్. అర్టికల్స్ 14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణకవచాలుగా నిలుస్తున్నాయి.


దేశంలోని ప్రజలకు తిండి, బట్ట, ఉద్యోగం ఇవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు అంబేద్కర్. అందరికీ సమాన అవకాశాలుండాలని చెప్పారు. మహిళలకు రాజకీయ స్వాతంత్ర్యం ఉండాలని చెప్పిన అరుదైన నేత అంబేద్కర్. దళితుల కోసం మాత్రమే కాదు దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన అసమాన నాయకుడు బాబా సాహెబ్. అంబేద్కర్ ను చదవకుండానే ఆయన్ను దళిత నాయకుడిగా ముద్రవేసిన చాలామందికి ఆయన చెప్పిన సమానత్వం ఎప్పటికీ అర్థం కుండానే ఉండిపోయింది.


దేశంలో ఎన్ని మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నా భారతజాతి సమైక్యతను,సమగ్రతను కోరుకున్నాడు  బాబాసాహెబ్ అంబేద్కర్ గారు....


ప్రాథమిక హక్కుల పరిపూర్ణ తత్వానికి  ఆదేశిక  సూత్రాలు జీవనాధారంగా  ఉన్నపుడే  సంక్షేమ రాజ్యం సాధ్యం అవుతుంది ...  


*@@ఐక్యరాజ్య  సమితి (UNO) పౌరుల  ఎదుగుదల వారి వికాసము  అవిభాజ్యము అనుఉల్లంఘనీయమైన  " మానవ హక్కులు "  అని ప్రకటించడానికంటే ముందే ఈ ఆదేశిక  సూత్రాలును  రూపొందించిన  ఘనత  అంబెడ్కర్ గారికీ చెల్లుతుంది*@@.......


భారత రాజ్యాంగమ 26 వ జనవరి 1950 లో భారతదేశ రాజ్యంగము  అమలులోకి వచ్చింది.ఈ రోజు భారత రాజ్యాంగము అమలులోకి వచ్చి 69 సంవత్సరాలు పూర్తికావస్తున్న భారతదేశ సామాజిక వ్యవస్థను మనం గమనించినట్లయితే రాజ్యంగము చెప్పినదానికి పూర్తిగా భిన్నముగా కనపడుతుంది. 


రాజ్యంగము అమలులోకి వచ్చేనాటికి భారతదేశ  అక్షరాస్యత కేవలం 8 నుండి 10 % వరకు మాత్రమే ఉంటుంది.కావున నిరక్షరాస్యులైన భారత సమాజం రాజ్యంగం , చట్టాలు తెలియక వాటిపై గౌరవములేక అజ్ఞానం, అంధవిశ్వాసముతో మతాలను , కులాలను విశ్వసించడముతో అంటరానితనాన్ని పాటించింది , అసమానత్వంలో విశ్వసించింది అని మనము అనుకున్నా  , ఈ రోజు 80% అక్షరాస్యతను సాదించిన భారత సమాజము  రాజ్యంగ శాసనాలను చట్టాలను  దుర్వినియోగపరచడం, వక్రీకరించడము వాటి పై గౌరవం లేకపోవడము   ఫలితంగా ఎర్పడిన లంచగొండి సమాజము , అవీనితి సమాజము , నేరప్రవృత్తి గల సమాజము , మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలు, దోపిడీలు,  అత్యాచారాలు, మతకల్లోలాలు , మతం పేరిట జరుగుతున్న మారణహోమాలు , కులాల కుళ్ళు కంపూ , ఆకలిచావులు , భృణహత్యలు , వరకట్న వేధింపులు, గృహ హింసలు, ......ఇటువంటి ధారుణమైన సమాజం ఎర్పడడానికి గల కారణాలను మనం ప్రజల నుండి తెలుసుకున్నట్లయితే కొంతమంది రాజ్యంగం విఫలత అనే కారణం చెబితే , కొంత మంది పాలకుల తప్పు అని చెప్పడం జరుగుతుంది. అది ఏ కారణమైన ఒకరి జరిగే నష్టం కాదు , మొత్తం భారతజాతికి జరుగుతున్న నష్టం అని ప్రతి పౌరుడు  మతానికి , జాతికి , కులానికి అతితంగా ఎందుకు ఆలోచించలేక పోతున్నాడు...? ? ? ? 


భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఈ క్రింది సౌలభ్యాలు కలిగించటం లక్ష్యంగా కలిగి ఉంటుంది. ...


● సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం...

 

● ఆలోచన స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని , విశ్వాసాన్ని కలిగి ఉండే ఆరాధన స్వేచ్ఛ...


● అంతస్తులోను , అవకాశములోను సమానత్వము...


● ప్రజలందరిలో దేశీయసమైక్యతను , అఖండతాభావాన్ని , వ్యక్తి గౌరవాన్ని పెంపొందించటం....


రాజ్యంగము పీఠికలోనే ఇంత గొప్ప లక్ష్యాలను నిర్దేశించినప్పటికి ....భారత దేశాన్ని ఏ చీడపురుగు పట్టింది.....? ? ? ? 


పీఠికలోనే స్వేచ్ఛ, సమానత్వము, సౌబ్రాతృత్వము చెప్పిన వీటిని అమలు కానివ్వకుండా అడ్డుకుంటున్న దుర్మార్గులు ఎవరు...? ? ? 


● భారత రాజ్యాంగము సమానత్వమును సాదించడానికి... 

అధికరణం : 14 - చట్టంముందు అందరు సమానులే..

 

అధికరణం : 15 -కుల , మత, లింగ వివక్షకు తావులేదు...


అధికరణం : 16 ప్రభుత్వ  ఉద్యోగాలలో అందరికి సమాన అవకాశాలు...


అధికరణం : 17 అంటరానితనం నిషేదం..


అధికరణం : 18 బిరుదుల నిషేదం...

 

భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వమును సాదించడానికి ఈ అధికరణలు ప్రాథమిక హక్కులలో ఉన్నప్పటికీ సమానత్వము సాదించడానికి అడ్డుకుంటున్న తివ్రవాదులు ఎవరు...?   

  

● భారత రాజ్యాంగము స్వేచ్ఛను సాదించడానికి

 

అధికరణం : 19 భావ ప్రకటన స్వేచ్ఛ

 

అధికరణం : 20 ఒక నేరానికి ఒకేసారి శిక్ష విధించాలి.

 

అధికరణం :  21 వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు 

అధికరణం : 21 A విద్యా హక్కు 


అధికరణం : 22 నిర్భంధములు , పరిమితులు...

 

● భారత రాజ్యాంగము దోపిడినుండి రక్షణ పొందడానికి 


అధికరణం : 23 శ్రమ శక్తిని దోపిడి చేయరాదు..

 

అధికరణం : 24 బాల కార్మికుల నిషేదము....

  

~• 26 నవంబర్ 1949 లో సంవిధాన సభకు రాజ్యంగము సమర్పిస్తు తన ఉపన్నాసములో రాజ్యంగ నిర్మాత అంటారు....


""" రాజ్యంగము ఎంత గొప్పదైన దానిని అమలు పరచేవాడు దుర్మార్గుడైతే ఆ రాజ్యంగము తన లక్ష్యము చేరదు """అని ఈ రోజు మన దేశంలో అదే జరుగుతుంది...


• చట్టం ముందర అందరు సమానులే అన్న రాజ్యంగము యొక్క అధికరణం : 14  పాలకవర్గాల చేతిలో కీలుబొమ్మ  అయింది...


• కుల , మత, లింగ వివక్షను చూవించరాదు అన్న రాజ్యంగము అది రాతకే పరిమితమై ఈ దేశంలో కులవివక్ష కొనసాగుతునే ఉంది , మత వివక్షను పాలకవర్గాలు చూవిస్తునే ఉన్నారు , లింగ వివక్ష ద్వారా భారతదేశ స్త్రీలు అనేక అవమానాలను , అనేక సమస్యలను ఎదుర్కుంటునే ఉన్నారు...


• లింగ వివక్షతలో భారత దేశము ప్రపంచములోని 142 దేశాల్లో 114 వ స్థానంలో ఉంది..

 

• ప్రభుత్వ  ఉద్యోగాలలో అందరికి సమాన అవకాశాలు అన్న రాజ్యంగమును పాలక వర్గాలు తమ పాలనలో తమ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తు రాజ్యంగమునకు ద్రోహం చేస్తున్నారు...

 

• అంటరానితనం నిషేదం అని రాజ్యంగం చెప్పినప్పటికి ఇది రాజ్యాంగము అమలుపర్చే వారి కంటికి ఇప్పటివరకు కనబడలేదు..


• మొన్న NCAER వారు జర్పిన సర్వేలో 

50% బ్రహ్మణులు  , 24 % అగ్రకులాలవారు , 33% వెనకబడిన కులాలవారు మేము అంటరానితనాన్ని పాటిస్తాం అని బహిరంగ ఉప్పుకున్నారు.

ఒక వారంలో అంటరాని కులాల వారిపై జరిగే నేరాలను చూస్తే ... 13 మందిని కులం పేరిట చంపుతున్నారు 

5 ఇండ్లను కులం పేరిట దహనం చేస్తున్నారు .

6 గురిని కులం పేరిట దూషిస్తున్నారు.

21 మంది మహిళల పై కులం పేరిట అత్యాచారాలు చేస్తున్నారు.

బాల కార్మికుల నిషేదం అన్న రాజ్యంగము గల భారత దేశంలో ఈ రోజు 7 కోట్ల బాల కార్మీకులు  ఉన్నారు...


ఉచితనిర్భంధ విద్యను భారత రాజ్యాంగము చెప్పిన భారత దేశ పాలక వర్గాలు విద్యను ప్రైవేటికరణ చేసి తమ వర్గ ప్రజలు విధ్యాసంస్థలను స్థాపించే విధంగా జాగ్రత్త పడ్డారు.ఫలితంగా శ్రామిక వర్గాల ప్రజలు విద్య నుండి దూరమవుతున్నారు.మరియు బాల కార్మికులుగా మారుతున్నారు...


• ప్రపంచ జనాభాలో 35 % నిరక్షరాస్యత ఈ రోజు భారత దేశంలో  ఉన్నది...

      

• ఏ చట్టాలైతే రాజ్యంగము యొక్క ప్రాథమిక హక్కులలో  ఉండి వాటికి కోర్టు రక్షణగా ఉందో ఆ చట్టాల పరిస్థితి  ఈ విధంగా ఉంటే రాజ్యంగము లోని ఎతర ఏ చట్టాల గురించి మాట్లడం వ్యర్థమే.

ఇంత గొప్ప రాజ్యంగము  ఉన్న మన దేశంలో ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులకు గల కారణం హిందుమతం..


●రాజ్యంగ శాసనాలను ,చట్టాలను దుర్వినియోగపరచడం , వక్రీకరించి నిర్వీరియ పరచడం అతిక్రమించడములో మనవారిని మించినవారు మరోకరు లేరు.కారణం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ పట్ల మనకు ఉన్న విశ్వాసము. 

రాజ్యంగమునకు పునాది సమానత్వం. కుల వ్యవస్థకు పునాది అసమానత్వం.రాజ్యాంగము ప్రజాస్వామ్యాబద్దమైనది .కుల వ్యవస్థ నియంతృత్వ పూరితమైనది . రాజ్యంగ శాసనాలు కుల శాసనాలకు అనుగుణంగా కాక భిన్నంగా వ్యతిరేకముగా ఉండడముతో వలన రాజ్యంగ శాసనాల పట్ల గౌరవం ప్రకటించడము లేదు  కులపిశాచులు ఫలితంగా రాజ్యంగము , చట్టాలను దుర్వినియోగపరచడం జరుగుతుంది.


*బౌద్ధం - భారత దేశం*


బౌద్ధ ధమ్మాన్నిపూర్తిగా చదివిన బోధిసత్వ బాబాసాహెబ్ బౌద్ధ మార్కును రాజ్యాంగం లో పొందు పరిచారు.రాజ్యాంగ పీఠిక బౌద్ధ ధమ్మా పీఠక అనే చెప్పవచ్చు .రాజ్యాంగ చిహ్నం అయినా ఏనుగు బౌద్ధo లో ప్రాముఖ్యత ను కలిగి ఉంది.బుద్ధుని తల్లి కి కలలో కనబడింది ఏనుగునే అని బుద్దుస్ట్ గ్రంథాలలో లిఖించబడింది....


 భారత దేశ సార్వత్రిక సార్వభౌమానికి చిహ్నమైన నాలుగు సింహాలు బౌద్ధ చక్రవర్తి సామ్రాట్ అశోకుని సార్వభౌమత్వానికి చిహ్నం.... 


భారత దేశ జెండాలో ఉన్న 8 ఆకుల అశోక చక్రం ,బౌద్ధంలో ని అష్టాంగ మార్గానికి చిహ్నం... 


24 ఆకులున్న అశోక చక్రం 12 సూత్రాల "ప్రతిత్యసముత్పాద "కి గుర్తు...


ఇలా బాబా సాహెబ్ భారత దేశ చిహ్నాల గుర్తింపులో బౌద్ధాన్ని మేళవించారు...


అలాగే


** ఏనుగు అనేది  జ్ఞానానికి , ధైర్యంకు , శక్తికి చిహ్నము ...ఏనుగలాగే మన ప్రజలు కూడా తమ కాళ్ళ మీద నిలబడేoదుకు  కొంత సమయము పట్టినను ....కానీ ఒక్కసారి వారు లేచి  నిలబడ్డాక  అదే విదంగా చైతన్యం  పొందాక ఇంకా వారిని ఏ శక్తీ కూడా ఆపలేదు....


అందుకే రిపబ్లిక్ పార్టీ ఎన్నికల గుర్తు ....అలాగే  రాజ్యాంగ గురుతు కూడా ఈ ఏనుగు నే .....


జై భీమ్..జై  బాబా సాహెబ్ అంబెడ్కర్ ... 

జై ప్రబుద్ధ భారత్..నీల్ సలామ్..

అంబేడ్కరిస్టు అని గర్వించు... 

అంబేద్కరిస్టు గా జీవించు....

No comments:

Post a Comment