'The damage to Indian democracy is not reversible'
Opinion by Arundhati Roy
June 22, 2022
https://edition.cnn.com/2022/06/22/opinions/bjp-hindu-muslim-democracy-modi-arundhati-roy/index.html?fbclid=IwAR2xIyGVXO8l9uMGGlpWJDO7JPC8VzdtS96pH53tEMTWsQdhIDn5smFWGao
Arundhati Roy is the author of "The God of Small Things," which won the Booker Prize in 1997 and "The Ministry of Utmost Happiness," which was long-listed for the Man Booker Prize in 2017. Her collected political writing has been published as "My Seditious Heart" (2018) and "Azadi" (2020). She lives in New Delhi. The views expressed in this commentary are her own. View more opinion at CNN.
New Delhi (CNN)When two spokespeople from India's ruling Hindu nationalist Bharatiya Janata Party (BJP) made derogatory comments about the Prophet Mohammed last month, it prompted an international firestorm.
The incident led to protests among India's Muslim minority in several
states. Some Muslim-majority nations summoned their India ambassadors. India's
foreign ministry said the comments did not reflect the views of the government,
and the officials involved -- one of whom later withdrew her remarks -- faced
disciplinary action.
But for India's 200 million Muslims, these comments were not an isolated
incident.
Rather, they were the culmination of the BJP's "engineering hatred
of a common enemy," says bestselling Indian author Arundhati Roy.
Indian officials demolish several houses after protests over anti-Islam
remarks
Indian officials demolish several houses after protests over anti-Islam
remarks
"India's tragedy is not that it's the worst place in the world --
it's that we are on our way there. We're burning down our house. India is an
experiment that is failing dangerously," she told CNN.
"Many, many of my beloved friends -- poets, writers, professors,
lawyers, human rights activists and journalists -- are in prison, most of them
charged under a dreaded law called the Unlawful Activities Prevention Act, all
of them for speaking up for minorities, Dalits and forest-dwellers facing
displacement and state terror.
"Among them are people I consider to be India's most important
minds. It makes one wonder what living as a free person in the time of fascism
means. What does it mean to be a bestselling author when the world is
breaking?" writes Roy.
In this email interview with CNN Opinion, Roy says Indian politics has
something in common with the US Capitol riots, that Prime Minister Narendra
Modi is stoking hatred, and talks about who the real power in India lies with.
CNN: What does this incident involving BJP officials' comments about the
Prophet Mohammed reveal about Indian politics today?
Roy: It reveals how successfully the clear and present existential threat
posed by Hindu nationalism in India has been masked by the face it presents to
the outside world. You know the people in strange clothes, the man in furs and
antlers who stormed the US Capitol? We're being ruled by their equivalent here.
The difference is that they are not a collection of random lunatics. They are
members of the most powerful organization in India -- the RSS (Rashtriya
Swayamsevak Sangh), whose founding ideologues openly admired Hitler and likened
the Muslims of India to the Jews of Germany. RSS is the real power in India.
CNN: What is the connection between the BJP and RSS?
Roy: The ruling party, the BJP (Bharatiya Janata Party), considered to be
one of the richest political parties in the world, is only the front office of
the RSS. Founded in 1925, the RSS, traditionally controlled by a handful of
Brahmins, now has millions of members including Prime Minister Narendra Modi,
who has been a member since his teenage years, and most of his cabinet
ministers.
It has its own vast militia, its own schools, labor unions and women's
organizations. It's not a political party, it's something of a shape-shifter, a
master of double-speak, its sources of funding are amorphous and leave no legal
trail, it works through an array of affiliates, but it's a nation within a
nation.
The RSS believes that India should be declared a Hindu nation, just as Pakistan,
Iran and several countries in the Persian Gulf are Islamic nations, just as
Israel is legally the "nation-state of the Jewish people."
A demonstration against the state government demolition of the house of a
local Muslim leader in Prayagraj on June 13. The demolition followed clashes
after controversial remarks made by two BJP officials about the Prophet
Mohammed.
A demonstration against the state government demolition of the house of a
local Muslim leader in Prayagraj on June 13. The demolition followed clashes
after controversial remarks made by two BJP officials about the Prophet
Mohammed.
In fact, the RSS believes in what it calls "Akhand Bharat," a
sort of fantasy that is futuristic and ancient all at once -- a future Ancient
India which includes Pakistan and Bangladesh which will be conquered and
subject to Hindu rule. To flatten India's mind-boggling religious, socialand
subnational identities, more diverse than all of Europe, into the strict
hierarchy of a moribund, caste-bound Hindu nation is an unimaginably violent
process. It means setting aside the constitution and undoing the very idea of
India.
First in the line of fire is the Muslim community. Close behind are
Christians -- a tiny minority that is also being brutalized. Last year alone
there were more than 400 attacks on Christians. Churches have been vandalized,
priests and nuns beaten up, their congregations threatened and humiliated.
In the last two national elections, in 2014 and 2019, the BJP has shown
that it can win a solid majority in the national parliament without the votes
of India's 200-million-strong Muslim community. That has effectively resulted
in a sort of disenfranchisement and political isolation of Muslims, which is
extremely dangerous.
Opinion: In the world's largest democracy, 'looking
Muslim' could cost your life
Opinion: In the world's largest democracy, 'looking Muslim' could cost
your life
There is also a new anti-Muslim citizenship law, a sort of
refugee-manufacturing policy in which those who cannot produce a mandated set
of "legacy papers," which few people have, can find themselves
deprived of citizenship. Nearly 2 million people in the state of Assam have
already been struck off the National Register of Citizens. Massive detention centers
for those who have been stripped of citizenship are being constructed all over
the country.
But isolating Muslims is not enough. Creating an artificial majority out
of a very diverse Hindu community that consists of thousands of castes and
ethnicities is equally important if the BJP is to remain in power. The cement
for that is engineering hatred of a common enemy. This requires an incremental
ratcheting up of bigotry.
Apart from the mass killings and lynching of Muslims by Hindu vigilantes
in recent years, we have the steady drumbeat of hatred and outlandish
disinformation beamed into peoples' homes by approximately 400 TV channels and
countless newspapers. On social media handles viewed by millions of people
there are open calls for the genocide of Muslims -- and videos demonstrating
how it should be done.
We regularly see provocative demonstrations by thousands of
sword-wielding Hindu men marching through areas in which Muslims live. The
deeply disrespectful comments about Prophet Mohammed made by a BJP spokeswoman
on national TV this May was a part of this constituency-building exercise. As
was the unconscionable bulldozing by municipal authorities of the homes of
Muslims who dared to come out in protest.
To flatten India's mind-boggling religious, social, and subnational identities... into the strict hierarchy of a moribund, caste-bound Hindu nation is an unimaginably violent process
Arundhati Roy
Some of the protestors publicly called for beheadings and hanging and
asking for a blasphemy law which the BJP would probably be more than happy to
pass and use to silence its critics in swifter and more deadly ways. These
individuals helped to confirm every deeply held prejudice about Muslims that
the Hindu Right works so hard to perpetuate.
As a concession to international outrage, the BJP has suspended its
spokeswoman, Nupur Sharma, but she has been openly embraced by its cadre. The
polarization has worked in the BJP's favor.
CNN: And what does Prime Minister Narendra Modi have to do with it?
Roy: Modi has made no comment whatsoever about the spokeswoman or the
protests. A standard tactic of his. In situations like this, his followers,
correctly I believe, read his silence as support. Although he increasingly
positions himself as a messiah, he is an RSS man, and he knows that the
organization is grooming other leaders who are waiting in the wings. But for
now, he is the uncontested figurehead.
Modi made his political debut in October 2001. He was appointed, not
elected, chief minister of the state of Gujarat. It was just weeks after the
9/11 attacks in the United States. The world was convulsed by Islamophobia. It
was the perfect political climate for the RSS.
India's Prime Minister, Narendra Modi, pictured here on June 6,
has not publicly commented on the recent BJP officials' comments about
the Prophet Mohammed.
India's Prime Minister, Narendra Modi, pictured here on June 6, has not
publicly commented on the recent BJP officials' comments about the Prophet
Mohammed.
A few months later, in February 2002, following an act of arson in which
a railway carriage carrying Hindu pilgrims was burnt, there was a brutal pogrom
against Muslims in the villages and towns of Gujarat. It lasted for weeks.
While the police watched, more than a thousand people were slaughtered in broad
daylight, women were gang-raped and burnt alive, and tens of thousands were
displaced from their homes. Subsequently the murderers were caught on camera
boasting of their deeds. Many spoke of how they were inspired and protected by
Modi.
Modi was unapologetic and came to be known as "Hindu Hriday
Samrat" -- the Emperor of Hindu Hearts. Soon after the 2002 massacre, he
called for state elections and won with a massive majority. He has never looked
back since -- he was elected Chief Minister of Gujarat for three terms and in
2014 was elected prime minister. And we in India have begun to look at
massacres and hatefulness against Muslims as an integral part of election
campaigns. During Modi's tenure as Gujarat Chief Minster, Hitler made it into a
school textbook published by the Gujarat State Board of School Textbooks as an
inspirational leader.
CNN: Over the years, Modi's popularity and his brand of politics has not
waned. Why is that?
Roy: For the same reasons that studies of the algorithms of Facebook and
Twitter show that hatefulness gets far more traction than decency. Miserable
people, oppressed people, unemployed people, people living in crushing poverty
are voting themselves into further hellishness, their sunken eyes fixed on the
object of their hate.
After Modi's shocking display of callous incompetence during the pandemic
-- the sudden lockdown in the first wave that led to millions of stranded
workers many of who had to walk thousands of miles home to their villages, the
millions of deaths in the second wave -- some still shake their heads in
sorrowful awe and say, "Without Modi, it would have been worse."
They've swallowed the story they've been fed about themselves, about
their own lives. Meanwhile Modi has zero accountability. He has never addressed
a single press conference in all his years as prime minister. All we get are
staged performances and photo ops.
CNN: What has contributed to this situation where the Modi government
feels immune from any international reaction or action?
Roy: I don't think it is immune at all. On the contrary, our
globe-trotting, head-of-state-hugging prime minister cares deeply about international
opinion. None of us have ever seen him hug a fellow Indian. The optics of his
foreign trips are carefully curated. His millions of followers refer to him as
"Vishwa-Guru," the Guru of the Whole World.
'We have been living in terror': Muslims in New Delhi say
they are being targeted
'We have been living in terror': Muslims in New Delhi say they are being
targeted 03:26
Barack Obama, Donald Trump, Angela Merkel, Emmanuel Macron, Boris Johnson
have all indulged him. International action and reaction is only a game of
pragmatism and expediency. It has to do with trade and geopolitics, race,
religion and ethnicity, and very little with values and morality.
If India is buying a fleet of fighter planes from, say, France, it knows
that lynching and a little mass murder will, at most, get a delicate
finger-wag. A big market is excellent insurance against moral censure.
Right now, foreign relations are a little tricky for India because of the
Ukraine war and India's proximity to Russia. So, India's crimes in Kashmir and
this very violent form of Hindu nationalism is coming under a little scrutiny.
But these are all just bargaining chips in the Great Game. Sorry to sound so
cynical, but I am.
CNN: How should India's international Muslim trading partners respond?
(And the world, for that matter?)
Roy: Most of the countries that you refer to as India's "Muslim
trading partners" have long ago given up any pretense of democracy or
diversity. They are already at the destination that Modi and the BJP are trying
to drag India toward. The destination that we dread to arrive at, the
theocratic state.
India's tragedy is not that it's the worst place in the world -- it's
that we are on our way there. We're burning down our house. India is an
experiment that is failing dangerously. Failing because our elected leaders are
blinded by hate -- and crippled by a severe lack of intelligence, which is the
more dangerous thing. The consequences will be unimaginable.
As for what the rest of the world can do, all one can hope for is that
people pay attention and form an informed opinion. And realize that their
profits from this immense "market" will dry up if the market ceases
to exist. The Indian economy is in a lot of trouble. Wealthy people, businesses
big and small, have begun to flee. They are good and accurate weather vanes.
CNN: Is India truly the world's largest democracy?
Roy: A democracy doesn't just mean having regular elections. You cannot
be a democracy when 200 million people who constitute a religious minority are
expected to live without rights. When you can lynch them, kill them,
incarcerate them, economically and socially boycott them, bulldoze their homes
with complete immunity and threaten to strip them of citizenship. When the
murderers and lynchers can aspire to move swiftly up the political ladder.
CNN: The damage done to Indian democracy -- is it reversible?
Roy: The systematic indoctrination of people on the scale on which it has
taken place over decades is hard to reverse. Every institution that is supposed
to make up the system of checks and balances has been hollowed out, repurposed
and deployed against people as a weapon of Hindu nationalism. In terms of
political opposition, there are political parties that have successfully
opposed the BJP at the state level in Tamil Nadu, Bengal, Kerala, Maharashtra,
Punjab, but opposition is virtually non-existent at the national level.
Muslim demonstrators at a protest demanding the arrest of Bharatiya
Janata Party (BJP) official Nupur Sharma following her comments about the
Prophet Mohammed, in Kolkata on June 10.
Muslim demonstrators at a protest demanding the arrest of Bharatiya
Janata Party (BJP) official Nupur Sharma following her comments about the
Prophet Mohammed, in Kolkata on June 10.
The whole system of elections has been gamed. You can win a huge majority
of seats even without anything close to a majority of actual votes. In India,
we have a first-past-the-post, multi-party democracy. This means that even if
you get say only 20% of the vote in a constituency, as long as its higher than
your closest rival, you win. A rich party can put up spurious candidates to
split the votes. But that's just one trick in a whole bag of tricks.
And, anyway, how do you woo an indoctrinated population? By proving that
you are a better, prouder Hindu? Nobody can beat the BJP at that game. And
right now, that's the only game in town. As far as mainstream politics goes.
So, no, I don't believe the damage is reversible. I believe we will be
broken and then reborn. Change will only come when and if at all an accepting,
gullible, fatalistic people realize what's being done to them. And then it will
come suddenly, and from the street. Not from the system. Until then... God help
us.
CNN: What changes have you personally experienced that echo the changes
taking place in India at large?
Roy: To begin with, many, many of my beloved friends -- poets, writers,
professors, lawyers, human rights activists and journalists -- are in prison.
Among them are people I consider to be India's most important minds. It makes
one wonder what living as a free person in the time of fascism means.
What does it mean to be a bestselling author when the world is breaking?
What does it mean to be considered a 'success' when the world is failing and
everything you care about is being decimated? What is the moral way to be? The
moral thing to do?
I am one of those unfortunate people who saw this coming decades ago. I
said so. I wrote so. At the time that made me something of a crazy outlier --
one of those people who sets off a fire alarm right when the party's going
really well and everyone's happy. In some ways it un-homed (not un-housed) me
in all sorts of ways, literally and metaphorically -- which is not a bad thing
for a writer, actually.
What does it mean to be a bestselling author when the world is breaking?
Arundhati Roy
The idea of patriotism has been fused with the idea of Hindu nationalism,
so people like myself are on the A-list of "anti-nationals." Of
course it helps their cause that I am not Hindu. My mother who raised me is
Christian. My estranged father who I never really knew came from a Hindu family
and converted to Christianity as did his father and his father's father. But
this doesn't enrage them as much as the things I write and say. Particularly
about Kashmir. A Bollywood actor and BJP member of parliament suggested that I
be tied to an army jeep and used as a human shield by the Indian Army in
Kashmir. They really should try that.
Sadly, the BJP's macro-radicalization has resulted in micro-versions of
the same thing. It is mirrored by its allies, its doorkeepers, concierges and
maintenance staff, as well as its victims. As everybody turns inward, bitter
and doctrinaire, as every form of solidarity crumbles, as the garbage mountains
grow and the rivers shrink, as stock characters locked into their own little
ideological bubbles shout at each other on TV, I feel my own skin tightening around
me, containing me, too. I struggle against that every day. The only home one
has is in literature and poetry. That sentence that makes you gasp -- or smile
out loud. The song that breaks your heart.
CNN: What kind of India would you like to see -- and how do we get there?
Roy: My dreams are not, and never have been, limited by the shape of the map of India, or any country. They've always been either much smaller or much bigger. The dream worth dreaming is to see our world moving toward a shared understanding of justice, however slowly, instead of racing away from it at the pace we are.
భారత ప్రజాస్వామ్యానికి చెరపలేని ప్రమాదం
అరుంధతీ రాయ్
(సి ఎన్ ఎన్ ఒపినియన్ కు ఇచ్చిన ఇమెయిల్ ఇంటర్వ్యూ. సి ఎన్ ఎన్ వెబ్ సైట్ మీద జూన్ 22న వెలువడింది)
సి ఎన్ ఎన్: మహమ్మద్ ప్రవక్త
గురించి బిజెపి అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు ఇవాళ్టి భారత రాజకీయాల గురించి
తెలిపేదేమిటి?
అరుంధతీ రాయ్: దేశంలో తమ ఉనికి ప్రమాదంలో పడిందని చెప్పుకునే హిందూ జాతీయవాదం
బైటి ప్రపంచానికి చూపడానికి వేసుకున్న ముసుగును ఈ ఘటన స్పష్టంగా ప్రదర్శించింది. అమెరికా
అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన వింత దుస్తుల, ఫర్ కోటు వేసుకుని, కొమ్ములు పెట్టుకున్న
మనుషుల గురించి మీకు తెలుసు. సరిగ్గా వాళ్లకు సరిపోలే మనుషులే మమ్మల్ని ఇక్కడ పాలిస్తున్నారు.
తేడా ఏమంటే, వీళ్లు వాళ్లలాగ కేవలం పిచ్చివాళ్ల గుంపు కాదు. వీళ్లు భారతదేశంలో అత్యంత
శక్తిమంతమైన సంస్థ సభ్యులు. ఆ సంస్థ పేరు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. దాని స్థాపక సిద్ధాంతకర్తలు
బహిరంగంగా హిట్లర్ ను ఆరాధించారు. భారతీయ ముస్లింలను జర్మనీలోని యూదులతో పోల్చారు.
ఇవాళ దేశంలో నిజంగా అధికారం నెరపుతున్న శక్తి ఆర్ ఎస్ ఎస్.
సి ఎన్ ఎన్: బిజెపి కీ ఆర్
ఎస్ ఎస్ కీ సంబంధం ఏమిటి?
అరుంధతీ రాయ్: ప్రపంచంలోకెల్లా సంపన్నమైన రాజకీయ పార్టీల్లో ఒకటైన భారతీయ జనతా
పార్టీ వాస్తవంగా ఆర్ ఎస్ ఎస్ కు ముంగిలి కార్యాలయం. 1925లో స్థాపించబడిన ఆర్ ఎస్ ఎస్
ను సాంప్రదాయకంగా పిడికెడు మంది బ్రాహ్మణులు అదుపు చేస్తుంటారు. దానిలో ప్రస్తుతం లక్షలాది
మంది సభ్యులున్నారు. నూనూగు మీసాల వయసు నుంచి ఆర్ ఎస్ ఎస్ సభ్యుడైన ప్రస్తుత ప్రధానమంత్రి
నరేంద్ర మోడీతో సహా, ఆయన మంత్రివర్గంలోని చాలమంది అందులో సభ్యులే.
దానికి దాని సొంత సైన్యం ఉంది. సొంత పాఠశాలలున్నాయి, కార్మిక సంఘాలున్నాయి, మహిళా
సంఘాలున్నాయి. అది ఒక రాజకీయ పార్టీ కాదు. అది ఒక రకమైన ఊసరవెల్లి. రెండు నాల్కల మాటల
మొనగాడు. దానికి నిధులు ఎక్కడినుంచి వస్తాయో వనరులు అస్పష్టమైనవి. అది ఎటువంటి చట్టబద్ధమైన
ఆధారాలనూ వదలదు. అది లెక్కలేనన్ని అనుబంధ సంస్థల రూపంలో పనిచేస్తుంది. అది ఒక జాతి
లోపలి జాతి.
పాకిస్తాన్, ఇరాన్, పర్షియన్ గల్ఫ్ లోని అనేక దేశాలు తమను తాము ఇస్లామిక్ దేశాలు
అని గుర్తించుకున్నట్టుగా, ఇజ్రాయెల్ అధికారికంగా, చట్టబద్ధంగా “యూదు ప్రజల జాతి రాజ్యం”
అని ప్రకటించుకున్నట్టుగా, భారతదేశం కూడ హిందూ దేశంగా ప్రకటించుకోవాలని ఆర్ ఎస్ ఎస్
భావిస్తుంది.
నిజం చెప్పాలంటే, ఆర్ ఎస్ ఎస్ ‘అఖండ భారత్’ అనే ఒక రకమైన మిథ్యను విశ్వసిస్తుంది.
అది ఒక భవిష్యత్ ఊహ, అదే సమయంలో ప్రాచీనమైనది కూడ. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను ఓడించి,
హిందూ పాలనకు పాదాక్రాంతం చేసుకుని, నిర్మించబోయే భవిష్యత్ ప్రాచీన భారతదేశం అది. అబ్బురపడేంత
మత, సామాజిక, ఉపజాతీయ అస్తిత్వాల వైవిధ్యంతో నిండిన భారతదేశాన్ని, యూరప్ కన్న ఎక్కువ
బహుళత్వం ఉన్న భారతదేశాన్ని, చదును చేసి, ఒక కాలం చెల్లిన, కుల ఆధారిత, కచ్చితమైన అంతరాల
హిందూ జాతిగా మార్చాలనే ఆలోచనే ఊహించశక్యం కానంత హింసా ప్రక్రియ. దాని అర్థం భారత రాజ్యాంగాన్ని
పక్కనపెట్టడం. భారతదేశం అనే మౌలిక భావననే రద్దు చేయడం.
ఈ హింసాత్మకమైన దాడిలో మొదటివరుస
దెబ్బకు గురయ్యేది ముస్లిం సమాజం. వారి వెనుకనే ఉండబోయేది
క్రైస్తవులు. వాళ్లు నిజానికి అత్యంత స్వల్పమైన అల్ప సంఖ్యాక సమూహమే గాని, వారి మీద
కూడ దాడులు జరుగుతున్నాయి. ఒక్క గత సంవత్సరంలోనే క్రైస్తవుల మీద 400 లకు పైగా దాడులు
జరిగాయి. చర్చిలను తగులబెట్టారు, ధ్వంసం చేశారు. ప్రీస్టులనూ నన్ లనూ కొట్టారు. వారి
ప్రార్థనా కూటములను బెదిరించారు, అవమానించారు.
2014లో, 2019లో జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికలలో, దేశంలోని ఇరవై కోట్ల ముస్లిం
సమాజపు వోట్లు లేకుండానే జాతీయ పార్లమెంటులో అధిక్య స్థానాలు గెల్చుకోగలనని బిజెపి
చూపెట్టింది. ఇది వాస్తవికంగా ఒక రకంగా ముస్లింల వోట్లు రద్దు చేయడంగా పరిణమించింది.
వారి రాజకీయ ఒంటరితనానికి దారి తీసింది. ఇది చాల ప్రమాదకరం.
అంతేగాక, కొత్త ముస్లిం వ్యతిరేక పౌరసత్వ చట్టం అమలులోకి వచ్చింది. ఇది ఒకరకంగా
కాందిశీకులను తయారు చేసే పథకం. తప్పనిసరి అని చెపుతున్న తమ “వారసత్వ పత్రాలు” చూపలేని
జనాభా కాందిశీకులుగా మారిపోతారు. ఆ పత్రాలు అతి కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటాయి.
మిగిలిన వారు తమ పౌరసత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. అస్సాం రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు
ఇరవై లక్షల మంది పేర్లను జాతీయ పౌరుల జాబితా నుంచి కొట్టివేశారు. ఇలా పౌరసత్వం పోగొట్టుకున్నవారి
కోసం భారీ నిర్బంధ కేంద్రాలను నిర్మించే పని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నది.
అయితే, ముస్లింలను ఒంటరులను చేయడం ఒక్కటే సరిపోదు. వేల కులాలతో, నరజాతులతో చాల వైవిధ్యం
ఉన్న హిందూ సమాజాన్ని కృత్రిమంగా ఒకే ఆధిక్య సమూహంగా తయారుచేయడం బిజెపి అధికారంలో కొనసాగడానికి
అత్యవసరం. అందరికీ కలిపి ఒకే ఉమ్మడి శత్రువు ఉన్నారని బూచి చూపి ద్వేషాన్ని రగిల్చడమే
ఆ ఆధిక్యతా నిర్మాణానికి అవసరమైన సిమెంటు. అందుకు ఎప్పటికప్పుడు మూర్ఖత్వాన్ని పెంచి
పోషించవలసి ఉంటుంది.
హిందూ హింసావాద మూకలు ముస్లింలను ఊచకోత కోసిన, కొట్టి చంపిన ఘటనలతో పాటు, ఇళ్లలోకే
ద్వేష ప్రచారం, తప్పుడు సమాచార వెల్లువ నిరంతరాయంగా సాగుతున్నాయి. దేశంలోని దాదాపు
400 టివి చానళ్లు, లెక్కలేనన్ని వార్తా పత్రికలు ఈ పని చేస్తున్నాయి. లక్షలాది మంది
చూసే సోషల్ మీడియా వేదికల మీద మారణకాండలు జరిపి ముస్లింలను నిర్మూలించమనే బహిరంగ పిలుపులు,
ఆ పని ఎలా చేయాలో ప్రదర్శించే వీడియోలు సాగుతున్నాయి.
ముస్లింలు నివసించే ప్రాంతాల గుండా వేలాది మంది హిందూ పురుషులు కత్తులు పట్టుకుని
రెచ్చగొట్టే ప్రదర్శనలు జరపడం ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. మే లో ఒక బిజెపి అధికార
ప్రతినిధి ఒక జాతీయ టివి మీద మహమ్మద్ ప్రవక్త మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఇలా తమ
నియోజకవర్గాన్ని రూపొందించుకునే కసరత్తులో భాగమే. దాని పట్ల నిరసన తెల్పడానికి సాహసించిన
ముస్లింల ఇళ్లను మునిసిపల్ అధికారులు నేలమట్టం చేయడమనే దారుణమైన చర్య కూడ అందులో భాగమే.
ప్రత్యర్థుల తలలు తీయాలని, దైవదూషణకు వ్యతిరేకంగా చట్టం తేవాలని నిరసనకారులలో
కొందరు కూడ బహిరంగంగానే ప్రకటించారు. అటువంటి చట్టం తేవడం బహుశా బిజెపికి చాల సంతోషంగా
ఉంటుంది. దాని ద్వారా అది తన విమర్శకుల నోళ్లు మూయించే దారుణమైన అవకాశాలు దొరుకుతాయి.
హిందూ మితవాదులు ముస్లింల పట్ల ఏ దురభిప్రాయాలు లోతుగా వ్యాపింపజేయాలని అతి తీవ్రంగా
ప్రయత్నిస్తున్నారో, ఈ వ్యక్తుల మాటలూ చేతలూ ఆ దురభిప్రాయాలను నిర్ధారిస్తున్నాయి.
అంతర్జాతీయ నిరసన పెల్లుబికింది గనుక, ఒక రాయితీగా బిజెపి తన అధికార ప్రతినిధి
నూపుర్ శర్మను సస్పెండ్ చేసింది. కాని ఆ పార్టీ శ్రేణులన్నీ ఆమెను బహిరంగంగా సమర్థించాయి.
విభజన బిజెపి కే అనుకూలంగా పరిణమించింది.
సి ఎన్ ఎన్: దీనంతటితో ప్రధాని నరేంద్ర మోడీకి ఏం సంబంధం?
అరుంధతీ రాయ్: అధికార ప్రతినిధి గురించి గాని, నిరసనల గురించి గాని మోడీ పెదవి విప్పలేదు. ఆయనకు బాగా అలవాటయిన విద్య అది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మౌనానికి ఆయన అనుచరులు సమర్థన అనే అర్థమే చెప్పుకుంటారు. ఆ అర్థం సరైనదే. తనను తాను రక్షకుడుగా చూపుకోవడానికి ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, వాస్తవంగా ఆయన ఒక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త. తన సంస్థ మరికొందరు నాయకులను తయారు చేస్తున్నదనీ, వారు తన స్థానం చేపట్టడానికి నిరీక్షిస్తున్నారనీ కూడ ఆయనకు తెలుసు. ప్రస్తుతానికైతే ఆయన ఎదురులేని నాయకుడే.
మోడీ రాజకీయ రంగ ప్రవేశం 2001 అక్టోబర్ లో జరిగింది. ఆయనను గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించారనీ, ఆయన ఎన్నుకోబడలేదనీ గుర్తుంచుకోండి. అది సరిగ్గా అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు జరిగాక కొన్ని వారాలకే. ప్రపంచమంతా ఇస్లామోఫోబియాలో తలమునకలుగా ఉండింది. ఆర్ ఎస్ ఎస్ కు సరిగ్గా సరిపోయిన రాజకీయ వాతావరణం అది.
కొన్ని నెలల తర్వాత, 2002 ఫిబ్రవరిలో హిందూ యాత్రికులు ప్రయాణిస్తున్న ఒక రైల్వే
బోగీ తగులబడిపోయిన ఘటన తర్వాత, గుజరాత్ లోని గ్రామాల్లో, పట్టణాల్లో ముస్లింల మీద దారుణమైన
ఊచకోత అమలయింది. ఆ దారుణ మారణ కాండ వారాల తరబడి సాగింది. పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తుండగా,
పట్టపగలు వెయ్యి మందికి పైగా నరికి చంపబడ్డారు. స్త్రీల మీద సామూహిక అత్యాచారాలు జరిగాయి,
సజీవంగా తగులబెట్టారు. వేలాది మంది తమ ఇళ్లు కోల్పోయి నిర్వాసితులయ్యారు. ఆ తర్వాత
ఆ హంతకులు తాము చేసిన పనుల గురించి గొప్పలు చెప్పుకుంటుండగా కెమెరాలకు చిక్కారు. వారిలో
చాలమంది తాము మోడీ నుంచి ఎలా ప్రేరణ పొందామో, ఆయన తమను ఎలా రక్షించాడో చెప్పారు.
మోడీ కించిత్తు పశ్చాత్తాపమైనా ప్రకటించలేదు. హిందూ హృదయ సామ్రాట్ అనే కీర్తి
పొందాడు. 2002 హనన కాండ తర్వాత కొద్ది రోజులకే ఆయన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రకటించి,
భారీ ఆధిక్యతతో గెలుపొందాడు. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. మూడు సార్లు గుజరాత్
ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. ఇక దేశంలో ముస్లింలకు
వ్యతిరేకంగా మారణకాండలూ, విద్వేష ప్రచారాలూ ఎన్నికల ప్రచారసరళిలో విడదీయరాని భాగమని
మేం నమ్మడం ప్రారంభించాం. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాత్ రాష్ట్ర
పాఠశాలల పాఠ్యపుస్తకాల బోర్డు ప్రచురించిన ఒక పాఠ్యపుస్తకంలో హిట్లర్ గురించి ప్రేరణాత్మక
నాయకుడుగా ఒక పాఠం కూడ చేరింది.
సి ఎన్ ఎన్: మరి ఇన్ని సంవత్సరాలు
గడిచినా, మోడీ జనాకర్షణ, ఆయన తరహా రాజకీయాలు తగ్గుముఖం పట్టలేదు. ఎందువల్ల?
అరుంధతీ రాయ్: మర్యాద కన్న ఎక్కువగా ద్వేష ప్రచారానికే ప్రాచుర్యం ఉంటుందని ఫేస్
బుక్, ట్విట్టర్ ల గణాంకాల అధ్యయనాలు చెప్పినప్పుడు ఏ కారణం ఉందో ఇక్కడా అదే కారణం.
వాలిపోతున్న కళ్లను తమ ద్వేష లక్ష్యాల మీద ఎక్కుపెట్టిన దిక్కులేని ప్రజలు, పీడనకు
గురవుతున్న ప్రజలు, నిరుద్యోగులు, దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోతున్న ప్రజలు తమకు తామే
మరింత దుర్భరత్వంలోకి ఎంచుకుని మరీ దిగి పోతున్నారు.
పాండెమిక్ తో వ్యవహరించడంలో తన దారుణమైన అసమర్థతను మోడీ దిగ్భ్రాంతికరంగా ప్రదర్శించుకున్నాడు. కొవిడ్ మొదటి తరంగంలో హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించి లక్షలాది వలస కార్మికులు తమ గ్రామాలకు చేరడానికి వేలాది మైళ్లు నడవవలసిన పరిస్థితి కల్పించాడు. రెండో తరంగంలో లక్షలాది మరణాలకు కారణమయ్యాడు. అయినా కొందరు, విషాదంగా తలలూపుతూ, “మోడీ లేకపోతే, ఇంకెంత దారుణంగా ఉండేదో” అంటున్నారు.
వాళ్లు తమ గురించీ, తమ జీవితాల గురించీ ఎవరో అందించిన కథనాన్ని మారుమాట లేకుండా మింగడానికి సిద్ధపడ్డారు.
ఇక మోడీకి జవాబుదారీతనం అనేది శూన్యం. ప్రధానమంత్రిగా ఉన్న ఇన్ని సంవత్సరాలలో మోడీ ఒక్కటంటే ఒక్క పత్రికా సమావేశంలో మాట్లాడలేదు. మనకు దొరికేవన్నీ పకడ్బందీగా తయారైన ప్రదర్శనలూ, ఫొటో అవకాశాలూ మాత్రమే.
సి ఎన్ ఎన్: అంతర్జాతీయ ప్రతిస్పందనలు గాని, చర్యలు గాని తననేమీ చెయ్యలేవని భావించే స్థితికి మోడీ ప్రభుత్వం చేరుకోవడానికి దోహదం చేసినవేమిటి?
అరుంధతీ రాయ్: ఏమీ చెయ్యలేవనే మాట నిజమని అనుకోను. అందుకు భిన్నంగా, భూగోళాన్ని చుట్టేసే, దేశాధినేతలను కావలించుకునే ప్రధానమంత్రి అంతర్జాతీయ అభిప్రాయాన్ని తీవ్రంగా పట్టించుకుంటాడనుకుంటాను. ఆయన ఒక తోటి భారతీయుడిని కావలించుకోగా చూసినవాళ్లెవరూ లేరు. ఆయన విదేశీ ప్రయాణాల దృశ్యాలను చాల జాగ్రత్తగా తీర్చిదిద్దుతారు. లక్షలాది మంది ఆయన అనుచరులు ఆయనను విశ్వ గురు అని పిలుస్తారు.
బారక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, ఏంజెలా మెర్కెల్, ఇమాన్యువల్ మాక్రాన్, బోరిస్ జాన్సన్ ప్రతి ఒక్కరూ ఆయనను ముద్దు చేశారు. అంతర్జాతీయ చర్యలూ ప్రతిచర్యలూ అనేది కేవలం ఎప్పటికెయ్యది ప్రస్తుతంబొ అనే క్రీడ లాంటిది. దానికి వాణిజ్యంతో, భౌగోళిక రాజకీయాలతో, నరజాతులతో, ప్రాంతాలతో, జాతీయతత్వాలతో సంబంధం ఉంటుంది గాని విలువలతో, నైతికతతో సంబంధం తక్కువ.
భారతదేశం, ఉదాహరణకు ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలను కొంటున్నదనుకోండి, అప్పుడు దేశంలో ఈ కొట్టి చంపడాలు, సామూహిక ఊచకోతలు, ఎక్కువలో ఎక్కువ ఒక సున్నితమైన వేలు కదలికకు దారి తీయవచ్చు. ఒక సువిశాల, పెద్ద మార్కెట్ అనేది నైతిక మందలింపు మీద మంచి అవరోధం.
ఇప్పటికిప్పుడు చెప్పాలంటే, భారతదేశానికి విదేశీ సంబంధాలు కాస్త చిక్కుముడిలా ఉన్నాయి. ఒకవైపు యుక్రేన్ యుద్ధమూ, మరొకవైపు రష్యాతో సాన్నిహిత్యమూ. అందువల్ల కశ్మీర్ లో భారత ప్రభుత్వ నేరాలూ, హిందూ జాతీయవాదపు అతి హింసా రూపమూ కొంచెం విమర్శకు గురవుతున్నాయి. కాని ఒక పెద్ద క్రీడలో ఇవన్నీ చిన్న చిన్న బేరసారాలు. నిరాశగా మాట్లాడుతున్నందుకు క్షమించండి. కాని తప్పదు.
సి ఎన్ ఎన్: భారతదేశపు అంతర్జాతీయ ముస్లిం వాణిజ్య భాగస్వాములు, ఆ మాటకొస్తే అసలు ప్రపంచమే ఎట్లా స్పందించాలంటారు?
అరుంధతీ రాయ్: భారతదేశపు “ముస్లిం వాణిజ్య భాగస్వాములు” అని మీరు ప్రస్తావిస్తున్న దేశాలలో ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యం, బహుళత్వం అనే సిగ్గు బిళ్లలను ఎప్పుడో వదిలేశాయి. మోడీ, బిజెపి భారతదేశాన్ని ఏ గమ్యానికి లాగదలచుకున్నారో ఆ గమ్యానికి అవి ఎప్పుడో చేరిపోయాయి. అది మనం చేరడానికి భయపడవలసిన గమ్యం. అది ఒక మతరాజ్యం.
భారతదేశపు విషాదం ఏమంటే, అది ప్రపంచంలోకెల్లా ఘోరమైన స్థలమేమీ కాదు. అటువంటి
ఘోరమైన స్థలానికి చేరే దారిలో ఉన్నాం. అంతే. మేం మా ఇల్లు తగులబెట్టుకుంటున్నాం. భారతదేశం
అనేది అతి భయానకంగా విఫలమైన ప్రయోగం. ఎందుకు విఫలమవుతున్నామంటే, మా ఎన్నికైన నాయకులకు
ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి. జ్ఞానం పెద్ద ఎత్తున లోపించడం వల్ల వైకల్యం సంభవించింది.
అది చాల ప్రమాదకరమైన విషయం. దాని పర్యవసానాలు ఊహించడానికి వీలు లేనివి.
ఇక మిగిలిన ప్రపంచం ఏమి చేయవచ్చు అని అడిగితే, ఎక్కడున్నవారైనా ఈ దేశం గురించి శ్రద్ధ వహించండి, వాస్తవాలు తెలుసుకుని అభిప్రాయాలు ఏర్పరచుకోండి. అసలు ఈ మార్కెట్ అనేదే ఉనికిలో లేకుండా పోతే, ఈ “మార్కెట్” నుంచి మీరు ఆశిస్తున్న ఇబ్బడి ముబ్బడి లాభాలు కూడ వట్టిపోతాయని గుర్తించండి. భారత ఆర్థిక వ్యవస్థ చాల ఇబ్బందుల్లో ఉంది. సంపన్నులు, పెద్దా చిన్నా వ్యాపారులు దేశం విడిచి పారిపోతున్నారు. వాతావరణాన్ని సరిగ్గా పసిగట్టే కచ్చితమైన, మంచి సూచికలు వాళ్లు.
సి ఎన్ ఎన్: నిజంగానే భారతదేశం
ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యమా?
అరుంధతీ రాయ్: ప్రజాస్వామ్యమంటే క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం ఒక్కటి మాత్రమే కాదు. మత అల్ప సంఖ్యాక వర్గంగా ఉన్న ఇరవై కోట్ల మంది ప్రజలను ఏ హక్కులూ లేకుండా జీవించమని అడిగేది ప్రజాస్వామ్యం కాదు. వాళ్లను కొట్టి చంపడం, ఊచకోత కోయడం, జైళ్లలో నిర్బంధించడం, వాళ్లమీద ఆర్థిక, సాంఘిక బహిష్కరణ అమలు చేయడం, విచారణా, శిక్షా భయం లేకుండా వాళ్ల ఇళ్లను నేలమట్టం చేయడం, వాళ్ల పౌరసత్వాన్ని లాగివేస్తామని బెదిరించడం సాగుతుంటే అది ప్రజాస్వామ్యం కాదు. హంతకులూ, కొట్టిచంపే దుర్మార్గులూ త్వరత్వరగా రాజకీయ నిచ్చెన పైకెక్కే చోటు ప్రజాస్వామ్యం కాదు.
సి ఎన్ ఎన్: భారత ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టాన్ని సవరించడం సాధ్యమేనా?
అరుంధతీ రాయ్: ఏ స్థాయిలో దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం ప్రజల మెదళ్లలో విష భావజాలం
నింపడం జరిగిందో చూస్తే దాన్ని వెనక్కి తిప్పడం కష్టం అనిపిస్తుంది. విధినిషేధాలతో,
విచక్షణతో ఉండవలసిన ప్రతి ఒక్క నిర్మాణాన్నీ డొల్లగా మార్చారు, హిందూ జాతీయవాద ఆయుధంగా
మార్చి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే కొత్త లక్ష్యం ఏర్పరిచారు, ప్రజలకు వ్యతిరేకంగా
ఎక్కుపెట్టారు. రాజకీయ ప్రతిపక్షం విషయానికొస్తే, తమిళనాడు, బెంగాల్, కేరళ, మహారాష్ట్ర,
పంజాబ్ వంటి చోట రాష్ట్రస్థాయిలో బిజెపిని జయప్రదంగా ఎదుర్కొన్న రాజకీయ పార్టీలున్నాయి.
కాని జాతీయ స్థాయిలో ప్రతిపక్షం అనేది ఉనికిలో లేదనే చెప్పవచ్చు.
మొత్తం ఎన్నికల వ్యవస్థనే ఒక ఆటగా మార్చేశారు. ఉన్న మొత్తం వోట్లలో అత్యధిక వోట్లకు
సమీపంగా కూడ రాకుండానే, అత్యధిక స్థానాలు గెలుచుకోవచ్చు. భారతదేశంలో ప్రత్యర్థులకన్న
ఎక్కువ వోట్లు వస్తే గెలిచే, బహుళ పార్టీల ప్రజాస్వామ్యం ఉంది. అంటే అర్థమేమంటే, ఒక
నియోజకవర్గంలో మీకు 20 శాతం వోట్లు మాత్రమే వచ్చినా, అవి మీ సమీప ప్రత్యర్థికన్న ఎక్కువ
అయినట్టయితే మీరు గెలిచినట్టే. ఒక డబ్బులున్న పార్టీ వోట్లను చీల్చడానికి ఎందరో కుహనా
అభ్యర్థులను నిలబెట్టవచ్చు. ఎన్నికల్లో ఉన్న అనేక గారడీల బుట్టలో ఈ గారడీ ఒకానొకటి
మాత్రమే.
అంతేకాదు, ఏది ఏమైనా, బుర్ర నిండా భావజాలం నింపుకున్న ప్రజానీకాన్ని మీరు ఎలా
ఆకర్షించగలరు? మీరు మెరుగైన, ఎక్కువ గర్వం ఉన్న హిందువు అని రుజువు చేసుకుని మాత్రమేనా?
ఆ క్రీడలో బిజెపి కి ఎవరూ సాటి కారు. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ ఆటే ఆడుతున్నారు.
కనీసం ప్రధాన స్రవంతి రాజకీయాలలో ఆ ఆటే నడుస్తున్నది.
కనుక, నేను ఈ నష్టాన్ని సవరించగలమని అనుకోవడం లేదు. మేం ధ్వంసమైపోతామనీ, తిరిగి
జన్మిస్తామనీ నాకనిపిస్తున్నది. జరుగుతున్నదాన్ని అంగీకరిస్తున్న, అమాయకులైన, లొంగిపోతున్న
ప్రజలు ఆ జరుగుతున్నది తమకు ప్రమాదమని గుర్తిస్తే మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. అప్పుడిక
ఆ మార్పు హఠాత్తుగా వచ్చేస్తుంది. ఆ మార్పు వీథుల్లో నుంచి వస్తుంది. అది వ్యవస్థ లోపలి
నుంచి రాదు. అప్పటివరకూ.... దేవుడే మమ్మల్ని కాపాడాలి.
సి ఎన్ ఎన్: భారతదేశం మొత్తంగా
జరుగుతున్న మార్పులలో వేటి ప్రతిధ్వనులను మీరు వ్యక్తిగతంగా అనుభవించారు?
అరుంధతీ రాయ్: మొట్టమొదట చెప్పాలంటే, నా ప్రియమైన స్నేహితులెందరో, ఎందరో – కవులు,
రచయితలు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు – జైళ్లలో
ఉన్నారు. వారిలో కొందరు భారతదేశపు అత్యంత ప్రధానమైన మేధావులని నేననుకుంటాను. ఫాసిజం
కాలంలో స్వేచ్చాజీవిగా ఉండడమంటే ఏమిటని ఆలోచించక తప్పని స్థితి ఇది.
ప్రపంచమే బద్దలవుతున్నప్పుడు, ప్రముఖ రచయిత అంటే అర్థమేమిటి? ప్రపంచం కుప్పకూలిపోతున్నప్పుడు,
మీకు ప్రాణప్రదంగా అనిపించినవన్నీ చిన్నాభిన్నమవుతున్నప్పుడు “విజయం” అనే మాటకు అర్థమేమిటి?
నైతికంగా ఉండడమంటే ఏమిటి? ఏ నైతిక ప్రవర్తనను అనుసరించాలి?
ఇది ఇలా జరగబోతుందని దశాబ్దాల
కిందనే గుర్తించిన దురదృష్టకరమైన వ్యక్తులలో ఒకరిని నేను. ఆ మాట అప్పుడే చెప్పాను. రాశాను. అప్పుడు నన్ను ఏదో పిచ్చి ఊహ చేస్తున్న బైటి
మనిషిగా చూశారు. విందు సరదాగా సాగిపోతున్నప్పుడు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నప్పుడు
తప్పుడు హెచ్చరిక సంకేతాలు ఇస్తున్న మనిషిగా చూశారు. ఒక రకంగా అది నన్ను ఇంటి నుంచి
కాదు, సొంత ఇంటి నుంచే బైటపెట్టింది. ఆ మాట అక్షరాలా నిజమే, ఆలంకారికంగానూ నిజమే. అయితే,
వాస్తవంగా ఆ స్థితి ఒక రచయితకు అంత చెడ్డదేమీ కాదు.
దేశభక్తి అనే భావన, హిందూ జాతీయవాదం అనే భావనతో కలగలిసి వచ్చింది. అందువల్ల నావంటి
వాళ్ల పేర్లు “దేశద్రోహుల” మొట్టమొదటి జాబితాలో చేరాయి. నేను హిందువును కూడ కాకపోవడం
వల్ల వాళ్ల ప్రయోజనం సిద్ధించింది. నన్ను పెంచిన తల్లి ఒక క్రైస్తవురాలు. మమ్మల్ని
విడిచి వెళ్లిపోయిన నా తండ్రిని నేనెన్నడూ చూడలేదు గాని, ఆయన ఒక హిందూ కుటుంబం నుంచి
వచ్చాడు, క్రైస్తవంలోకి మతం మారాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన తండ్రీ, తాతా కూడ మారారు.
కాని వాళ్లకు కోపం తెప్పించేది నా తల్లిదండ్రుల మతం కన్న ఎక్కువ నా రాతలు. ప్రత్యేకంగా
కశ్మీర్ గురించి నా రాతలు వాళ్లకు మంటలు పుట్టిస్తాయి. ఒక బాలీవుడు నటుడు, బిజెపి పార్లమెంటు
సభ్యుడు నన్ను కశ్మీర్ లోని భారత సైన్యం ఒక సైనిక జీపుకు కట్టేసి, మానవ కవచంగా వాడుకోవాలని
సూచించాడు. నిజంగానే వాళ్లు అది ప్రయత్నించాలి.
విషాదమేమంటే, బిజెపి స్థూల స్థాయిలో ప్రవేశపెట్టిన ఈ అతివాదం సూక్ష్మ స్థాయిలో
అతివాదంగా పరిణమించింది. అది అద్దంలో కనబడినట్టుగా, దాని మిత్ర పక్షాలలో, దాని ద్వారపాలకులలో,
దాని కాపలాదారులలో, దాని నిర్వహణా సిబ్బందిలో కనబడుతున్నది. చివరికి దాని బాధితులలో
కూడ కనబడుతున్నది. ప్రతి ఒక్కరూ తమలోకి తాము ముడుచుకుంటున్నారు, చేదుగా, మొరటుగా మారుతున్నారు.
దానితో ప్రతి ఒక్క సంఘీభావ రూపమూ కుప్పకూలిపోతున్నది. చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయి.
జీవనదులు ఇంకిపోతున్నాయి. టివిలో నిలువ పాత్రలైన నిలయ విద్వాంసులు తమ చిన్నారి సిద్ధాంతపు
గాలిబుడగల్లో ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే నా సొంత చర్మం నా చుట్టూ
బిగుసుకుంటున్నట్టు, నా మీద పరిమితులు విధిస్తున్నట్టు అనిపిస్తున్నది. ప్రతిరోజూ నేను
దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. అప్పుడిక మిగిలే ఏకైక స్వగృహం సాహిత్యమూ కవిత్వమూ
మాత్రమే. ఎక్కడో ఒక వాక్యం మిమ్మల్ని గుటక వేసేలా చేస్తుంది. లేదా బిగ్గరగా చిరునవ్వు
నవ్విస్తుంది. ఒక పాట మీ గుండెల్ని పగలదీస్తుంది.
సి ఎన్ ఎన్: మీరు ఎటువంటి
భారతదేశాన్ని చూడదలిచారు – అక్కడికి ఎలా వెళ్లగలం?
అరుంధతీ రాయ్: నా స్వప్నాలు ఇప్పుడూ
ఎప్పుడూ కూడ భారతదేశపు, ఆ మాటకొస్తే ఏ దేశపు, చిత్రపటానికైనా పరిమితమైనవి కావు. నా
కలలు ఎప్పుడూ అయితే చాల చిన్నవైనా కావచ్చు. లేదా చాల పెద్దవైనా కావచ్చు. కనవలసిన కల
ఏమంటే మన ప్రపంచం న్యాయం పట్ల ఉమ్మడి అవగాహన ఉండే దిశగా కదలాలనేది. ఆ కదలిక ఎంత నెమ్మదిగా,
మందకొడిగా అయినా కావచ్చు. కాని ఇప్పుడు జరుగుతున్నట్టుగా వ్యతిరేక దిశలో వేగంగా పరుగెత్తడం
కాదు.
సి ఎన్ ఎన్ వెబ్ సైట్ మీద జూన్ 22, 2022న అచ్చయింది.
తెలుగు: ఎన్ వేణుగోపాల్
https://edition.cnn.com/.../bjp-hindu-muslim.../index.html
No comments:
Post a Comment