Published: Wed, 08 Jun 2022 02:48:18 ISTహోంతెలంగాణ
గ్యాంగ్ రేప్ నిజమే - సాదుద్దీన్ A1
గ్యాంగ్ రేప్ నిజమే
ఇన్నోవాలోనే ఐదుగురు అత్యాచారం చేశారు
జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం వెనకాల ఘాతుకం..!
బాలిక మెడ, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలు
నిందితుల్లో సాదుద్దీన్ ఏ1,
మిగతా నలుగురు మైనర్లు
అందరిపై పోక్సో, కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కేసులు నమోదు
ఫొటో, వీడియో వైరల్ చేసినందుకు ఐటీ చట్టం కిందా..20 ఏళ్ల జైలు లేదా జీవిత ఖైదు లేదా
మరణ శిక్షకారు దిగిన మైనర్ ఏ6..
పోక్సో కేసు.. 5-7 ఏళ్ల జైలు?
పారదర్శకంగా దర్యాప్తు.. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు
మీడియా సమావేశంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. నేడు తీర్పు
హైదరాబాద్ సిటీ/కవాడిగూడ/బంజారాహిల్స్, జూన్ 7(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన..హైదరాబాద్ జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనకు పాల్పడినది ఐదుగురు వ్యక్తులని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కాగా, మిగతా నలుగురు మైనర్లుగా పేర్కొన్నారు. అత్యాచారానికి ముందే కారు దిగి వెళ్లిపోయిన మరో మైనర్‌ను ఆరో నిందితుడిగా చేర్చినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44, పెద్దమ్మ గుడి వెనకాల ఇన్నోవా కారులో అత్యాచారం జరిగినట్లు వివరించారు. తొలుత ఓ మైనర్, ఆ తర్వాత ఇతర మైనర్లు, చివరగా సాదుద్దీన్ అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్నొన్నారు. బాలిక మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర గాయాలయినట్లు చెప్పారు.
ఘటన జరిగిన నాటి నుంచి జరిగిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ వెల్లడించారు. సాదుద్దీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని.. ఐదుగరు మైనర్లను జువైనల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని.. దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని.. ఆధారాల సేకరణలో కొంత జాప్యమైనా నిందితులకు కఠిన శిక్షలు పడేలా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. సీపీ చెప్పినదాని ప్రకారం..
బాలికను వేధించి.. వెంబడించి..బెంగళూరులో నివసించే హైదరాబాద్‌కు చెందిన మైనర్.. పార్టీ నిర్వహణకు మార్చిలోనే ప్రణాళిక వేసుకుని నగరంలో ఉన్న తన వయస్కులైన స్నేహితులతో చర్చించాడు. వారు జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని అమ్నేషియా పబ్ బాగుంటుందని సూచించారు. ఏప్రిల్‌లో ఈ ముగ్గురూ బుకింగ్‌కు వెళ్లి రూ.1,200 ఉన్న ఒక్కో టికెట్‌ను రూ.900కు మాట్లాడుకున్నారు. కొద్ది రోజులకు.. ఇద్దరు మైనర్లు వచ్చి మద్యం, పొగాకు ఉత్పత్తుల రహిత జోన్‌లో మే 28వ తేదీన మొత్తం 150 మంది పాల్గొనేలా పార్టీ కోసం బుక్ చేశారు. అయితే, పార్టీలో చాలామంది ఆసక్తి చూపడంతో టికెట్లను రూ.1,200 నుంచి రూ.1,300కి అమ్ముకున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన మైనర్, ఇక్కడి మిత్రులు రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించారు. బాధిత బాలికకు ఓ స్నేహితుడు ఆఫర్ ఇవ్వడంతో రూ.1,300 చెల్లించి టోకెన్ తీసుకుంది. మే 28న మధ్యాహ్నం 1 గంటకు ఆమె పబ్‌కు చేరుకుంది. 1.10కు స్నేహితుడితో లోపలికి వెళ్లింది. 1.50 వరకు ఇద్దరూ డ్యాన్స్ చేశారు. తర్వాత స్నేహితుడు వెళ్లిపోయాడు. అదే సమయంలో మరో స్నేహితురాలు కలిసింది. 3.15 సమయంలో నిందితుల్లో ఓ మైనర్ వారివద్దకు వచ్చాడు.
అతడు, సాదుద్దీన్ కలిసి అసభ్యంగా ప్రవర్తించారు. ఇతర మైనర్లు వీరితో చేరారు. బాలికలను వేధించడానికి అక్కడే ప్లాన్ చేసుకున్నారు. దీన్ని గమనించి బాలికలు సాయంత్రం 5.10కి బయటకు వచ్చేశారు. ఓ మేజర్ సహా ఏడుగురు మైనర్లు.. వారిని అనుసరించారు. ఓ బాలిక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయింది. సాయంత్రం 5.43 నలుగురు మైనర్లు మాటలు కలిపి బాధిత బాలికను మెర్సిడెజ్ బెంజ్‌లో ఎక్కించుకున్నారు. సాదుద్దీన్‌తో పాటు మరో నలుగురు ఇన్నోవా ఎక్కారు. రెండు కార్లు 5.51కి బంజారాహిల్స్ రోడ్ నం.14లో ఉన్న బేకరీ వద్దకు చేరాయి. బాలికను మెర్సిడెజ్ నుంచి ఇన్నోవాలోకి మార్చి 6.15కి అక్కడినుంచి బయల్దేరారు. సాదుద్దీన్, ఐదుగురు మైనర్లు, బాధితురాలు ఇందులో ఉన్నారు. సాయంత్రం 6.18కి మైనర్లలో ఒకరు బేకరీ వద్దకు వచ్చేశారు. అతడిని పోలీసులు విచారించగా తనకు ఫోన్ రావడంతో తిరిగి వచ్చేశానని చెప్పాడు. ఇక్కడినుంచి వెళ్లాక ఇన్నోవాలో పెద్దమ్మ గుడి దగ్గర నిందితులు అత్యాచారానికి పాల్పడారు. ఇక రాత్రి 7.31కి పోలీసులకు పబ్ వద్ద ఫుటేజీలో బాలిక కనిపించింది. రాత్రి 7.53కు ఆమెను తండ్రి పికప్ చేసుకుని వెళ్లిపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న బాలిక మే 31 రాత్రి వరకు బాలిక తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేకపోయింది.
మెడపైన గాయాలు, కుంగుబాటులో ఉండడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి జూబ్లీహిల్స్ ఠాణాకు తీసుకొచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత జరిగిన విషయం చెప్పలేకపోవడంతో బాలికను భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ 3-4 గంటలు మహిళా సిబ్బంది, అదనపు డీసీపీ శిరీష ధైర్యం చెప్పడంతో వాస్తవాలు వెల్లడించింది. వెంటనే బాలికను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌సాదుద్దీన్ మాలిక్‌ను ఏ1గా చేర్చిన పోలీసులు తొలుత అతడిని, ముగ్గురు మైనర్లను విడతలుగా అరెస్టు చేశారు. ఐదో, ఆరో నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీంతోపాటు 376డి, 373, మైనర్ కిడ్నాప్, వీడియోలు, ఫొటోలు వైరల్ చేసినందుకు ఐటీ చట్టం కింద కేసులు పెట్టారు. ప్రత్యేక కోర్టు ద్వారా ట్రయల్స్ నిర్వహించి నిందితులకు 20 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు.. లేదా జీవిత ఖైదు లేదా మరణ శిక్షలు పడే అవకాశం ఉందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. భారీ జరిమానాలు విధించే చాన్స్ కూడా ఉందన్నారు. కారు దిగివెళ్లిన మైనర్ (ఏ6)పై ఐపీసీ354, 373 9జి రెడ్ విత్ పొక్సో కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇతడికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే వీలుందని సీపీ చెప్పారు.
మైనర్లను అనుమతించినందుకు పబ్‌పై చర్యలుమైనర్లను అనుమతించిన పబ్‌లపైనా చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారు. రాజకీయంగా ఎన్నో ఆరోపణల మధ్య అతి జాగ్రత్తగా కేసు దర్యాప్తు చేశామన్నారు. పోక్సో యాక్ట్ ఉన్నందున ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తూ విచారించామన్నారు. మైనర్లు కార్లను నడిపినందుకూ చర్యలు ఉంటాయన్నారు.
కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తిసామూహిక అత్యాచారం ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు జువైనల్ కస్టడీ పిటీషన్‌పై నాంపల్లి కోర్టులో మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. బుధవారం కస్టడీపై తీర్పు వెలువరించనున్నట్లు సమాచారం. సాదుద్దీన్ మాలిక్‌తో పాటు మైనర్లను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలికకు వైద్య పరీక్షల రిపోర్టులు పోలీసుల చేతికి అందినట్లు సమాచారం. కార్లలో దొరికిన ఆధారాలతో వాటిని పోల్చి చూస్తున్నారు.
No comments:
Post a Comment