Tuesday, 27 November 2018

బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం - బుడన్‌బేగ్‌

 బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం -  బుడన్‌బేగ్‌ 

‘బీజేపీతో లోపాయికారీ ఒప్పందం.. అందుకే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నా..’

టీఆర్‌ఎస్‌కు బేగ్‌ రాజీనామా!
ఐడీసీ చైర్మన్‌ పదవికీ గుడ్‌బై చెప్పనున్న మైనారిటీ నేత
రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- ఖమ్మం): టీఆర్‌ఎస్‌కు ఖమ్మం జిల్లాలో ఊహించని షాక్‌ తగి లింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపు, ఇతర కారణాలతో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న వారు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. రాష్ట్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న ఖమ్మం జిల్లా మైనారిటీ నేత బుడన్‌బేగ్‌ టీఆర్‌ఎస్‌కి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం ఖమ్మంలో రాహుల్‌, చంద్రబాబు హాజరు కానున్న మహాకూటమి సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన ‘దేశం’ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే బేగ్‌ మంగళవారం ఆయన టీఆర్‌ఎస్‌కు రాజీనామాచేసి, అందుకు దారితీసిన కార ణాలను మీడియా సమావేశం ద్వారా వెల్లడించనున్నారు. తొలుత సీపీఐలో పనిచేసిన బుడాన్‌బేగ్‌ తెలం గాణ ఉద్యమ తరుణంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

గత లోక్‌ సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ ఎస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన గతేడాది పరి శ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితుల య్యారు. అయితే ఈ సారి అసెంబ్లీ టికెట్‌ ఆశించిన ఆయనకు ఆ అవకాశం లభించక పోవడంతో అసంతృప్తితో ఉంటూనే ఆయన పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనెల 19న ఖమ్మంలో నిర్వహించిన కేసీఆర్‌ బహిరంగ సభకు కూడా బేగ్‌ అధ్యక్షత వహించడంతో పాటు అన్నీ తానై నడిపించారు. అయితే మహాకూటమి అభ్యర్థిగా ఖమ్మం అసెంబ్లీ బరిలో ఉన్న టీడీపీ నేత నామ నాగేశ్వ రరావు. టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న బేగ్‌తో చర్చలు జరిపారు. అనంతరం విషయాన్ని నామ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో సముచిత స్థానం కల్పి స్తామని టీడీపీ అధినేత నుంచి స్పష్టమైన హామీ రావడంతో టీడీపీలో చేరాలని బేగ్‌ నిర్ణయం తీసుకు న్నారు. అయితే బేగ్‌ పార్టీ మారు తున్నా రన్న విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినా... ఫలించలేదు. మున్ముందు ఆయన టీఆర్‌ఎస్‌ లో కొనసాగేందుకు అయిష్టత చూపి నట్టు సమాచారం. తొలినుంచి టీఆర్‌ఎస్‌ జెండా పట్టిన బేగ్‌ ఆపార్టీని వీడి టీడీపీలో చేరుతు న్నారన్న విషయం చర్చనీయాంశం అయ్యింది. దీంతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలూ టీడీపీ బాటపట్ట నున్న ట్టు పుకార్లుషికారు చేస్తు న్నాయి.

టీడీపీలో చేరుతున్నా... : బేగ్‌
పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ బేగ్‌ను సంప్రదించగా.. తాను మంగళవారం టీఆర్‌ఎస్‌కు రాజీనామాచేసి బుధవారం టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. ‘సేవ్‌ ఇండియా’ నినాదంతో చంద్రబాబునాయుడు దేశవ్యాప్తంగా లౌకికశక్తుల ఐక్యతకు కృషి చేస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుని మైనార్టీల అభివృద్ధి, సం క్షేమాన్ని విస్మరించారని, అందువల్లే తాను టీఆర్‌ఎస్‌ కు రాజీనామాచేసి టీడీపీలో చేరాలని నిర్ణయిం చుకున్నట్టు స్పష్టంచేశారు.

No comments:

Post a Comment