గోమాంసం ఓకే
28-11-2018 02:28:54
మిషనరీకి టికెట్
మిజోరంలో కమలం రూటే వేరు
స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించటం, వాటికి తగట్టుగా తమ విధానాలను మార్చుకోవటం రాజకీయ పార్టీలకు ప్రాణావసరం. బీజేపీలాంటి జాతీయ పార్టీలు కూడా కొన్ని సందర్భాలలో స్థానికావసరాలుగా తగ్గట్టుగా తమ విధానాలను మార్చుకోకతప్పదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మిజోరం. 87 శాతం క్రైస్తవులు నివసించే ఈ రాష్ట్రంలో ఆచారాలు, వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. బీజేపీ దీనికి తగ్గట్టుగా తమ విధానాలను మార్చుకుంటూ వచ్చింది.
మతమార్పిడులకు సంబంధించిన అంశాలలో క్రైస్తవ మిషనరీల పాత్రపై బీజేపీ, దాని అనుబంధ సంస్థలు అనేక పోరాటాలు చేస్తున్నాయి. అలాంటి బీజేపీలోకి క్రైస్తవ మిషనరీ రెవరెండ్ ఎల్.ఆర్. కోల్నిని చేర్చుకోవటం.. ఆయనకు వెంటనే అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వటం మిజోరంలో చర్చనీయాంశమయింది. ఇప్పటి దాకా బీజేపీ ఓట్ల కోసం చక్మాలు, బౌద్ధులపైనే ఆధారపడుతూ వచ్చింది.
అయితే క్రైస్తవులు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఆధిపత్యం సాధించాలంటే వారిని కూడా తమతో కలుపుకొని పోవాలని బీజేపీ భావిస్తోంది. ‘‘మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. మా ప్రత్యర్థులు మాపై అలాంటి ముద్ర వేస్తున్నారు. క్రైస్తవులు అధికంగా ఉన్న మూడు ఈశాన్య రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు కదా?’’ అంటారు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటంలో కీలకపాత్ర వహించిన బిశ్వశర్మ. ఈ ఎన్నికల్లో గెలిస్తే- తాము క్రైస్తవులకు వ్యతిరేకం కాదని చెప్పటానికి ఒక ఉదాహరణగా బీజేపీ ప్రయత్నం చేయవచ్చు.
బీఫ్‌పై వైఖరి వేరే!
మిజోరంలో ఎక్కువ మంది ప్రజలు గోమాంసాన్ని తింటారు. పర్వతసానువుల్లో ఉన్న తమకు అదే బలవర్ధకమైన ఆహారమని వారు భావిస్తారు. గోమాంసం విషయంలో, బీజేపీ జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానం అందరికి తెలిసిందే! అయితే మిజోరంలో మాత్రం బీజేపీ చాలా భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. ఇది ఎన్నికలకు సంబంధించిన అంశమే కాదని.. తాము స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లలో కలగజేసుకోబోమనేది బీజేపీ నేతల వాదన. బీజేపీ కేంద్రనాయకత్వం, దాని అనుబంధ సంస్థలు ఈ వైఖరినే సమర్థిస్తున్నాయి. బీఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటుగా, సంపూర్ణ మద్య నిషేధంపై కూడా బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మిజోరంలో కాంగ్రెస్ సర్కారు 2014లో మద్యనిషేధాన్ని ఎత్తివేసింది. దీని వల్ల యువత మద్యానికి బానిసలు అవుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఇదొక ప్రధానమైన ప్రచారాంశంగా మారింది. మిజో నేషనల్ ఫ్రంట్ తాము సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటిస్తే.. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే చర్చితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామంటోంది.
మద్యనిషేధానికి సంబంధించి బీజేపీకి జాతీయ విధానమేమీ లేదు. గుజరాత్‌తో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్న బీజేపీ.. ఇతర రాష్ట్రాల్లో ఆ విషయానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వటం లేదు. మిజోరంలో మాత్రం- తాము అధికారంలోకి వస్తే స్థానికంగా ఉత్పత్తి చేసే మద్యాన్ని అనుమతిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే మద్యాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది.

No comments:
Post a Comment