మేం గెలిస్తే మత రిజర్వేషన్లు రద్దు
24-10-2018 02:30:45
ద్రోహులకు గుణపాఠం చెప్పండి: కిషన్
కేటీఆర్‌వి పగటి కలలు: లక్ష్మణ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్ల రద్దుపైనే తొలి సంతకం ఉంటుందని బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, ధన్వాడలో మంగళవారం నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనాల్లో ఆయన మాట్లాడుతూ ఓ వర్గానికి 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని కేసీఆర్ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత రాజకీయాల కోసం కూటమిగా ఏర్పడి ఓట్లు అడుగుతున్న తెలంగాణ ద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిన పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకెళ్లారన్న అంశంపై టీఆర్‌ఎస్ వద్ద జవాబు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు.
ఘట్‌కేసర్, కవాడిగూడలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుమారుడు అయినందునే కేటీఆర్ ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని, ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లలో ముషీరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధిని చూసి.. గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. చేవెళ్లలో నిర్వహించిన కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎ్‌సను ఓడించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు

No comments:
Post a Comment