Abdul Rajahussain - “బండెనక బండి కట్టి
2-10-2018
4-10-2018
నైజాము సర్కరోడా నాజీల మించినోడా....పాటలో కవి యాదగిరి
నిజాము పేరును ప్రస్తావించనే లేదని,దాన్ని గద్దర్ మార్చి నిజామ్ పేరు చేర్చి
మతాంతీకరణ చేశాడన్న విమర్శ ఇంకా వినవస్తూనే వుంది.
తెలంగాణ పోరాట పాటల రిఫరెన్స్ తో డా.గంగాధర్ గారు కాకతీయ
యూనివర్సిటీ కి సమర్పించిన పిహెచ్ డి థీసిస్ లో కూడా సవివరంగా
పేర్కొన్నారు.నైజాము సర్కరోడా పాటను యాదగిరే రాశాడన్నది
దీని సారం.!!
అదే కింద రిఫరెన్సుగా ఇస్తున్నాను.విమర్శకులు గమనించగలరు
6-10-2018
2-10-2018
నైజాము సర్కరోడా..!!..నాజీల మించినోడా!!
ఈ పాటను ప్రజాకవి యాదగిరి రాశారు.ఇందులో స్పష్టంగా నిజామును,
నిజాము సర్కారును దుయ్యబట్టాడు.ప్రజాకవుల పాటలు జనం నాలుకలపైనే
వుంటాయి కాబట్టి పాఠ్యాంతరాలు రావడానికి అవకాశముంది.ఇదే పాటకు
మూడు పాఠ్యాంతరాల్ని సేకరించి ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు తమ
"తెలంగాణ పోరాట పాటల " సంకలనంలో పొందు పరిచారు.ఈ మూడింటిలో
కూడా నిజాము పై విమర్శలు గుప్పించారు కవి యాదగిరి.తెలంగాణ పోరాట
పాటల వరకు ప్రస్తుతం లభ్యమవుతున్న ప్రామాణిక సంకలనం ఇది.
నిజాము సర్కారును దుయ్యబట్టాడు.ప్రజాకవుల పాటలు జనం నాలుకలపైనే
వుంటాయి కాబట్టి పాఠ్యాంతరాలు రావడానికి అవకాశముంది.ఇదే పాటకు
మూడు పాఠ్యాంతరాల్ని సేకరించి ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు తమ
"తెలంగాణ పోరాట పాటల " సంకలనంలో పొందు పరిచారు.ఈ మూడింటిలో
కూడా నిజాము పై విమర్శలు గుప్పించారు కవి యాదగిరి.తెలంగాణ పోరాట
పాటల వరకు ప్రస్తుతం లభ్యమవుతున్న ప్రామాణిక సంకలనం ఇది.
అయితే... ప్రజాగాయకుడు గద్దర్ కావాలనే పాటలోనిజాము పేరు చేర్చి
ముస్లింలకు ద్రోహం చేశారని కొందరు ఆరోపిస్తున్నారు.ఇందులో నిజానిజాలకు
పాఠకులే న్యాయ నిర్ణేతలు.
ముస్లింలకు ద్రోహం చేశారని కొందరు ఆరోపిస్తున్నారు.ఇందులో నిజానిజాలకు
పాఠకులే న్యాయ నిర్ణేతలు.
4-10-2018
నైజాము సర్కరోడా నాజీల మించినోడా....పాటలో కవి యాదగిరి
నిజాము పేరును ప్రస్తావించనే లేదని,దాన్ని గద్దర్ మార్చి నిజామ్ పేరు చేర్చి
మతాంతీకరణ చేశాడన్న విమర్శ ఇంకా వినవస్తూనే వుంది.
తెలంగాణ పోరాట పాటల రిఫరెన్స్ తో డా.గంగాధర్ గారు కాకతీయ
యూనివర్సిటీ కి సమర్పించిన పిహెచ్ డి థీసిస్ లో కూడా సవివరంగా
పేర్కొన్నారు.నైజాము సర్కరోడా పాటను యాదగిరే రాశాడన్నది
దీని సారం.!!
అదే కింద రిఫరెన్సుగా ఇస్తున్నాను.విమర్శకులు గమనించగలరు
“బండెనక బండి కట్టి “పాటను ‘గద్దర్ ‘ మార్చి పాడాడా?
నిజాంను నిందించి గద్దర్ ముస్లింల పట్ల’ గద్దారీ ‘ చేశాడా?
బి.నర్సింగరావు దర్శకత్వంలో 1980 లో వచ్చిన “మా భూమి “ సినిమాలో
“బండెనక బండి కట్టి ...పదహారు బళ్ళు కట్టీ “అనే నిజాం వ్యతిరేక పాటను ఎవరు రాశారన్న
దానిపై సామాజిక మాద్యమంలో బోలెడు చర్చ జరుగుతోంది.ఈ పాటను ‘ప్రతాపరెడ్డి దొరను’
ఉద్దేశించి యాదగిరి అనే ప్రజాకవిరాశాడని,ఈ పాటలో యాదగిరి నిజాంప్రస్తావనే తేలేదని,
కానీ,గద్దర్ ఈ పాటను మార్చి నిజాంపై లేనిపోని అబధ్ధాలు ప్రచారం చేశాడన్నది విమర్శకుల
ఆరోపణ.ఉద్దేశపూర్వకంగానే గద్దర్ ఒరిజినల్ పాటను మార్చి ‘మతాంతరీకరణకు,’పాల్పడి
గద్దర్ ముస్లింలపట్ల గద్దారీ కి పాల్పడ్డాడన్నది వారి అభియోగం.కాగాదీనికి గద్దర్ స్వయంగా
వివరణ ఇవ్వాలన్నది వీళ్ళ డిమాండ్.
తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం ముగిసిన పాతికేళ్ళ తర్వాత “మా భూమి సినిమా
వచ్చింది. అంటే ఈ సినిమా విడుదలై దాదాపు 38సంవత్సరాలు గడిచాయి.అప్పుడు లేని
అభ్యంతరాలు ఇప్పుడు కొత్తగా తలెత్తడం ఆశ్చర్యం.
ఈ విషయమై ఇంతరకు గద్దర్ వివరణ ఇవ్వలేదు.(అసలు వివరణ అవసరమా?కాదా?
అన్న విషయం కాస్సేపు పక్కనబెడదాం )
అసలు జరిగిందేమిటి?
“బండెనక బండ కట్టి “పాటను ప్రతాపరెడ్డిని ఉద్దేశించి రాసిందే.అయితే కవి పేరు తెలీదు.
జయధీర్ తిరుమలరావు గారి 'తెలంగాణ పోరాట పాటలు ‘ సంకలనంలో ఈ పాటను
ఓ అజ్ఞాతకవి రాశాడని వుంది.(పే… 50 )
ముందుగా ఈ పాటను చూద్దాం…
*“ప్రతాప రెడ్డి దొర “పాట. !!
“బండెనక బండి కట్టి
పదహారు బళ్ళు కట్టి
ఏ బండ్ల పోతవు కొడకో
నా కొడక ప్రతాప రెడ్డి !!
దొడ్లన్ని కాలిపాయె
ఎడ్లన్నీ ఎల్లిపాయె
ఇకనైన లజ్జ లేద
నా కొడుక ప్రతాపరెడ్డి
గొల్లోళ్ళు గొర్లువొడిసె
రైతోళ్ళు బియ్యమొడిసె
ఇక ఏమి తింటవు కొడుకో
నా కొడక ప్రతాపరెడ్డి
పెదపంది “సూరిగాడు “
సినపంది “మల్లిగాడు “
మీ ఇద్దర్ని తింటం కొడకో
నా కొడక ప్రతాపరెడ్డి “....
... అజ్ఞాత కవి !!
నిజానికి ఈ పాట కంటే ఉద్యమ సమయంలో ఓ ఊపు ఊపిన పాట‘నైజాము సర్కరోడా..
నాజీల మించినౌరో.’.అనే పాట .ఈ పాటను ప్రజాకవి యాదగిరి రాశాడు.
మాభూమి సినిమాలో గద్దర్ పాట !!
“ మా భూమి “ సినిమాలో ని 'బండెనక బండి కట్టి 'అనేపాటను గద్దర్ చేత పాడించారు.
ఆ సినిమాలో ఈ పాటకు ఆయనే నటించారు .ఈ పాట పాపులర్ కావడంతో, అప్పట్లో
చాలా మంది ఈ పాటను గద్దరే స్వయంగా రాసి,పాడారని అనుకున్నవాళ్ళు కూడా
లేకపోలేదు.
గద్దర్ పాటలోని మతలబు ..!!
గద్దర్ పాడిన పాటకు సంబంధించి ప్రస్తుత వివాదంలోని మతలబు అర్థం కావాలంటే…
యాదగిరి పేరిట వున్న రెండు పాటలు..ఇక ' మా భూమి “ సినిమాలో గద్దర్ పాడిన పాటల
‘ పూర్తి పాఠాల్ని గమనించాల్సివుంటుంది.
ముందుగా ‘యాదగిరి రాసిన నైజాము సర్కరోడా’ పాటను చూద్దాం !!
*నైజాము సర్కరోడా….పాట !!
“నైజాము సర్కరోడా
నాజీల మించినోడా
యమ బాధపెడ్తివి కొడుకో
నైజాము సర్కరోడా!
పండిన పంటనంత
తిండికైన ఉంచకుండ
తీసుకు వెళ్ళినావు
నైజాము సర్కరోడా!
దున్నాను భూమిలేక
వుండాను ఇల్లు లేక
పరదేశము వెల్తీమి కొడుకో
నైజాము సర్కరోడా!
పోలీసు మిల్ట్రి చూసి
మేము లొంగి వస్తామని
ఒక ఆశపడ్తివి కొడుకో
నైజాము సర్కరోడా!
పోలీసు మిల్ట్రిగానీ
లాఠీ దెబ్బలు గానీ
మిషీని గన్నులూ గానీ
తుపాకీ బాంబులూ గానీ
నీ వెన్ని తెచ్చిన గానీ
మేం లొంగీరాం కొడకో
నైజాము సర్కరోడా !
కంచారు గాడ్డులాను
లంచగొండి పోలీసోల్ల
నీవు పెంచినావు కొడకో
నైజాము సర్కరోడా !
చుట్టు పట్టు సూర్యపేట
నట్టనడుమ నల్లగొండ
ఆవాలా హైద్రాబాదా
తర్వాత గోలకొండ
గోలకొండా ఖిల్లా కిందా మీ
గోరి కడ్తాం కొడకో
నైజాము సర్కరోడా !!
... యాదగిరి !!
(జయధీర్ సంకలనం!! తెలంగాణ పోరాట పాటలు ..పేజి 96,97 )
యాదగిరి పేరుతో వున్న మరోపాట..(పై పాటకు పాఠాంతరంగా కనిపిస్తుంది,,)
దీని పల్లవి కూడా పై పాట పల్లవినే పోలివుండటం గమనార్హం .!
* నాజీ నైజాం..!!
నాజీల మించినౌరో ! నైజాము సర్కరోడా
యమ బాధపెడ్తివి కొడకో!నైజాము సర్కరోడా
భూమిని దున్ని డోకి…పైరూలనెల్ల సాకి
పండించు పంటనంత...దండించి మేస్తిఔరా!
లేని ధాన్యమంటూ..లేని జనం గొట్టి
బంగ్లాల బంటివౌరో...నైజాము సర్కరోడా!
పండీన పంటనెల్ల.. తిండీకి వుంచుకుంటే
నువు తీసికుంటివౌరా..నైజాము సర్కరోడా
నీ అయ్య దున్న లేదు..నీ అవ్వ కొయ్య లేదు
ఎవడబ్బ సొమ్ము కొడకో..నైజాము సర్కరోడా
జావలేని మమ్మూ..లేవి వసూళ్ళంటూ
చావగొడ్తివౌరో.. నైజాము సర్కరోడా
కంచారి గాడ్దులల్లే...లంచగొండి ఆప్సరుల
నీవు పెంచినావు కొడకో.. నైజాము సర్కరోడ”.
. ….. !!యాదగిరి.!!
(జయధీర్ తెలంగాణ పోరాట పాటల సంకలనం.పేజి 48)
ఇక “మా భూమి “(1980) సినిమాలో గద్దర్ పాడిన పాట పూర్తి పాఠం చూడండి!!
*“ బండెనక బండి కట్టి... పదహారు బళ్ళు కట్టి
ఏ బండ్లో వస్తవు కొడకో..నైజాము సర్కరోడా
నాజీల మించినౌరో..నైజాము సర్కరోడా !!
పోలీసు మిల్ట్రి రెండు...బలవంతులానుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడకో..నువ్వు పల్లెలు దోస్తివి కొడకో
నైజాము సర్కరోడా... నాజీల మించినౌరో …...
నైజాము సర్కరోడా!!
.!!..బండెనక బండి కట్టి!!
జాగీరు దారులంతా..జామీనుదారులంతా
నీ అండా జేరిరి కొడకో...నీ అండా జేరిరి కొడకో
నైజాము సర్కరోడా !!
!!బండెనక బండి కట్టి !!
స్త్రీ పురుషలంత గలిసి...ఇల్లాలమంత గలిసి
వడిశేల రాళ్ళు నింపి...వడివడిగ కొడితేను
కారాలు నీళ్ళు కలిపి...కళ్ళల్లొ జల్లితేను
నీ మిల్ట్రీ పారిపాయెరో...నైజాము సర్కరోడా!!
…!!బండెనక బండి కట్టి!!
చుట్టుమట్టూ సూర్యపేట...నట్టనడుమ నల్లగొండ
నువ్వుండేది హైద్రబాదా..దానిపక్కాన గోలకొండ
గొల్కొండా ఖిల్లా కిందా...నీ గోరీ కడతాం కొడకో
నైజాము సర్కరోడా…..!!
.!!”బండెనక బండి కట్టి “!! (మాభూమి సినిమా )
ప్రధానఆరోపణ…!!
“‘బండెనక బండి కట్టి ‘ పాటలో ప్రతాపరెడ్డి ప్రస్తావన వుండగా..గద్దర్ నిజాం ను ఉద్దేశించి
పాట పాడాడు “.
నిజమే...బండెనక బండి కట్టి అనే పాటలో నిజాము ప్రస్తావన లేదు!అది ప్రతాపరెడ్డిని
ఉద్దేశించే కవి రాశాడు.అయితే సినిమా పాటకోసం అజ్ఞాత కవి పేరిట వున్న ఈ పాట
పల్లవిని మాత్రమే తీసుకున్నారు.అంతకు మించి ఈ పాటలోని ఒక్క పదాన్ని కూడా
ముట్టుకో లేదు.
అలాగే..ఈపాటలోవున్న ప్రతాప రెడ్డి ప్రస్తావనను తొలిగించి,కావాలనే నిజాంను జొప్పించి
గద్దర్ పాట పాడాడన్నది విమర్శకుల అభియోగం.
గద్దర్ అసలు పాటను పక్కన బెట్టి,”నిజాంపై లేనిపోని నిందలు మోపి మతాంతరీకరించి
గద్దర్ ముస్లింల పట్ల గద్దారీ చేశాడన్నది “, విమర్శకుల ఆరోపణ.
ఈ ఆరోపణకు గద్దర్ వివరణ ఇవ్వాలన్నది వారి డిమాండ్ !!
ఇక అసలు విషయంలోకి వద్దాం…!!
పై నాలుగు పాటల్ని ఓ సారి గమనించండి.సినిమా కోసం ప్రజాకవులు రాసిన
మూడు పాటల్లోని కొన్ని చరణాలను తీసుకొని మాభూమి సినిమాలో పాటగా
కూర్చారు.పై మూడు పాటల్లో లేని ఓ చరణాన్ని కొత్తగా చేర్చారు.(స్త్రీ పురుషులంత గలిసీ
అన్న చరణం ) అయితే ప్రజాకవుల పాటల్లో ఇలాంటి అర్థం వచ్చే చరణాలున్నాయి.
గద్దర్ పాడిన పాటలోని పల్లవిని ఓ అజ్ఞాత కవి రాసిన ‘ప్రతాపరెడ్డి దొర’పాట నుంచి
తీసుకున్నారు.
ఇక గద్దర్ పాటలోని చివరి చరణాన్ని యాదగిరి రాసిన పాటలోనుంచి తీసుకొని యథా
తథంగా పెట్టుకున్నారు.యాదగిరి పాటలోని మరో చరణాన్ని కొన్ని మార్పులు చేశారు.మొత్తానికి
ఇందులో అభ్యంతరాలుగా చెబుతున్న” నైజాము సర్కరోడా...నాజీల మించినోడా!
గోల్కొండా ఖిల్లా కిందా...నీ గోరీకడతాం కొడకో.!!.చరణాలన్నీ యాదగిరి పాటలోనివే.
సినిమా పాటకు అనువుగా..అందుబాటులో వున్న ప్రజాకవుల పాటల చరణాలనే
వాడుకున్నారు తప్ప ,ఈ పాటలో గద్దర్ కావాలని స్వయంగా మార్పులు చేసిన దాఖలాల్లేవు
అసలు విషయం ఇలా వుండగా గద్దర్ ఈ పాటలో ..”కావాలని” నిజాం నవాబును ఎలా
నిందించి నట్లవుతుందో అర్థం కాదు. పాటలోని మార్పులు సినిమా దర్శకుడి అభిరుచిమేరకు
జరుగుతాయి.నిజానికి ఇందులో గద్దర్ చేసిన” మతాంతరీకరణ “ ఏముంది.? సినిమా పాట
నిజాం ను ఉద్దేశించి వుంది కాబట్టి కావాలని మతాంతరీకరించినట్లవుతుందా? అలాగే
ఈ పాటలో గద్దర్ ముస్లింల పట్ల చేసిన ‘గద్దారీ ‘ (మోసం ) ఏమిటో కూడా అర్థంకాని
మిలియన్ డాలర్ ప్రశ్న?
‘మతం’ కాదు…’గతం’....!!
సాహిత్యం సమకాలీనం.సమకాలిక సమాజానికి సాహిత్యం అద్దం లాంటిది!
నిజాం రాచరికంలో రజాకార్ల దౌష్ట్యాలు.ప్రజలు పడిన ఇబ్బందులు,సాయుధపోరాటం
అన్నీ సాహిత్యంలో ప్రతిబింబించాయి.ఇది ఎప్పుడైనా..ఎక్కడైనా జరిగే సహజ పరిణామమే.
అలాగే నిజాం పాలనలోని అరాచకాలకు,ప్రజలుపడిన బాధలకు స్పందించి ప్రజాకవులు గళమెత్తి
పాడారు. దీనికి మతంతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం గతంతోనే సంబంధం.
గడచిన నిజాం కాలంలో ప్రజలు పడిన బాధలే దీనికి ప్రాతిపదిక!నిజాంను సమర్ధించి వత్తాసు పలికిన
వారిలో రజాకార్ ముఠాలోని ముస్లింలతో పాటు హిందూ దొరలు,భూస్వాములు ,దేశ్ ముఖ్ లుకూడా
వున్నారన్న సంగతిని మరువకూడదు.అలాగే నిజాం పాలనలో బాధలు అనుభవించిన వారిలో హిందువు
లతో పాటుసాధారణ ముస్లీంలూ వున్నారు.నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో హిందూ
ముస్లింలు కలిసి పాల్గొన్నారు.కాబట్టి నాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని ఏ మతానికీ ముడిపెట్టి
చూడకూడదు.అలాచూస్తే...అంతకంటే అజ్ఞానం మరొకటి వుండదు.
గద్దర్ ‘సొంత’ పాట కాదు…!!
నిజానికి ‘ మాభూమి ‘ సినిమాలో గద్దర్ పాడిన పాట ఆయన సొంతం కాదు...అది ప్రజాకవుల
రచన.గద్దర్ కేవలంగాయకుడు మాత్రమే. ఈ సినిమా విడుదలయ్యాక గద్దర్ పాట తెలంగాణ
పల్లెల్లోమార్మోగింది.గద్దర్ ఎక్కడ కళా ప్రదర్శనలిచ్చినా..జనం పట్టుబట్టి మరీ ఈ పాటను
పాడించుకునేవారు . ఇప్పటికీ ఈ పాట తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలంగా వుంది.ఇక
ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.ప్రజల పోరాటం , జీవితాల్లో నుంచి వచ్చింది కాబట్టే
ఈ పాటకు ఇంతటి ప్రజాదరణ .
ఏతావాతా…..!!
పై విషయాల్ని పరిశీలిస్తే…”బండెనక బండి కట్టి” పాటను గద్దర్ కావాలని ముస్లింలకు
వ్యతిరేకంగా మార్చి పాడారనడం నిజం కాదు..ఈ ఆరోపణలో ఎంతమాత్రం పస లేదు.!!
ఇందులో ముస్లింల పట్ల గద్దర్ చేసిన గద్దారీ కూడా ఏంలేదు.
నిజాం మతంతో ఇక్కడ సంబంధమే లేదు.అతడ్ని ఓ రాచరికపు వ్యవస్థకు ప్రతినిథిగా,
ప్రజల్ని హింసించిన ఓ నియంతగానే చూడాలి తప్ప అతడ్ని ఓ మతానికి ప్రతినిథిగా చూడటం
సరైంది కాదు.
నిజాం పాలనను ఎంతో మంది వ్యతిరేకించారు.నిజాముకు వ్యతిరేకంగా సాయుధపోరాటం
కూడా చేశారు.వారికి తోడుగా కవులు కూడా స్పందించి నిజాం పాలనకు నిరసనగా కలం పట్టారు.
నిజాం, భూస్వాములకు వ్యతిరేకంగాఎన్నో పాటలు రచించారు.కవిత్వం రాశారు.కావ్యాలల్లారు.
నిజాం పీడను వదిలించేందుకు అక్షర సైనికులై కదం తొక్కారు.
కవుల అక్షర భేరి…..!!
తెలంగాణ ప్రజాపోరాటం ఇతివృత్తం ఆధారంగా దాశరథీ, కాళోజీ,గంగినేని,
సోమసుందర్,ఆరుద్ర,రెంటాల,రమణారెడ్డి,కుందుర్తి కావ్యాలు రాశారు.
మఖ్దూం మొహియుద్దీన్ అయితే “తెలంగాణ “ పేరుతో ఓ ప్రసిధ్ధ గేయాన్నే
రచించారు.
*“అడవుల కొండల అనుంగు బిడ్డలు
పొలాల పొత్తిట పెరిగిన పాపలు
లేచిరి క్రోధోధ్ధత భీకరులై
సమరోధ్ధృత కాక్షేయ కరులై….
……………………………
హలాకూల జారుల పరిపాలన
పర్రెలు వారి బదాబదలయ్యెను “ అంటూ …..,
మఖ్దూం నిజాం పాలనను నిరశించాడు.
…!!.అనువాదం.!!
ఆరుద్ర ఈ ప్రాంతం వాడు కానప్పటికీ తెలంగాణ బాధితుల పక్షాననిలబడి “త్వమేవాహమ్ “
(1949 ) పేర ఓ కావ్యం రచించాడు.’నక్కలు తిరిగే తోటలో రాకాసి రాజొకడుండెరా “ అంటూ
అన్యాపదేశంగా నిజాం నవాబును ప్రస్తావించాడు.
పిఠాపురంకు చెందిన సోమసుందర్ “వజ్రాయుధం “ (1949 ) పేర తెలంగాణసాయుధ
పోరాటాన్ని కావ్యంగా రచించాడు.ఇందులో “ హిందూ ముస్లిం పీడిత శ్రమజీవులేకమైరి “
ఇక,”ఖబర్దార్ ! ఖబర్దార్ ! నైజాం పాదుషాహే !”.అంటూ నిజాం ను హెచ్చరిస్తాడు.
దాశరథి,కాళోజీ సరేసరి.ఒకరు ‘అగ్నివీణను’ మీటితే..మరొకరు 'నా గొడవంటూ ‘ తెలంగాణ
పోరాట ఆర్తిని వినిపించారు.
“ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని!
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ..కోటి రత్నాల వీణ “..అంటూ దాశరథి నిజామును పిశాచంతో
పోల్చాడు!
“నవయుగంబున నాజీ వృత్తుల నగ్న నృత్య మింకెన్నాళ్ళని? “నిజామును,అతని తాబేదార్లను
నిలదీశాడు కాళోజి.
“హత్యలు మృత్యువు ను ప్రసాదించే ఈ వ్యవస్థను భూస్థాపితం చేయాల”న్నాడు గంగినేని.
“పగలేయి నిజాం కోట ఎగరాయి ఎర్రబావుటా”...అంటూ గళమెత్తాడు రెంటాల గోపాలకృష్ణ.
“తే తెండి వడిసెలు రాలురువ్వండి...పోపొండి మిరపళపొడి కళ్ళుగుప్పండ”ని నిజాం సైన్యంపై
ఎలా విరుచుకు పడాలో జనప్రబోధం చేశాడు కేవిఆర్.
కుందుర్తి “తెలంగాణ “కావ్యం విశిష్టమైంది.
“రజాకార్లు పఠించడానికి యిక పలాయన మంత్రం ఒక్కటే మిగిలింద”ని కుందుర్తి జోశ్యం చెప్పాడు.
పోరాటపాటలు….!!
అలాగే...తెలంగాణ సాయుధ పోరాటం లో ఎందరో ప్రజాకవులు నిజాం పాలనను నిరసిస్తూ
పాటలల్లారు.
“నాజీ నైజాము రాజు...నలగొండ జిల్లాలోన
ప్రజలనుపట్టియు నానా...హింసలకు గురిజేసె “ నంటూ పట్టంశెట్టి ఉమా మహేశ్వరరావు
ఆలపించాడు.(నిద్దుర లేరా...తెలంగాణ స్వాతంత్ర్య గీతాలు )
“కరకు కత్తుల తోడ ఓ రాజా
ప్రజల కుత్తుకలు కోసోటి యమరాజా…”.అంటూ నిజాంరాజును ఉద్దేశించి ఓ అజ్ఞాత కవి
హెచ్చరించాడు…!! జయధీర్ సంకలనం !
“నైజాము ప్రభుత భూత
నాయకత్వ రాక్షసతైవమున్
దాని రూపు మాపకున్న
మనకు లేదు సౌఖ్యమున్ “...!!ముందడుగు వేయరా...మార్చ్ సాంగ్ !!
“పిచ్చి నిజాము రాక్షసుని భీకర మారణ హోమవాటి “...!!
….యరమాకుల వెంకట రమణా రెడ్డి !!
“రాక్షస రాజు నైజాము రాజు పిచ్చిగ రెచ్చి
మిలిటరీ కింకరుల మనపైకి తోలాడు.”....!! తిరునగరి రామాంజనేయులు !!
“నైజాము రాక్షసుణ్ణి రాజ ప్రముఖునిగ జేసి “....!! ఫకీర్ల పాట. !!
“కాశిం రజ్వీ కాల్చినా...నాజీ నైజాం నరికినా
ఎదురు దెబ్బ తీసేద్దాం...అదిరిబోవ తరిమేద్దాం”.....!! ముక్కామల నాగభూషణం !!
“నైజాం కీచకుడా!
నీ పీచమడంచ ప్రజలంతా
ఒక పిడికిట.!!ఒక గొంతుక
ఒక మోతై ధ్వనిస్తారు……!! సోమసుందర్ !!
“నైజాము సర్కారురా.. తెలుగోడ
నరకాసురునే మించెరా.. తెలుగోడ….!సుద్దాల హనుమంతు !
“నిజాం నిరంకుశత్వం...నిర్మూలంబయ్యేదాక
యెక్కడిదోయ్ శాంతెక్కడిదోయ్.!! ఎన్ రావు !! (1947)
ఒక్క గద్దర్ పాటే కాదు...నిజాం కు వ్యతిరేకంగా ఎన్నో పాటలు వచ్చాయి.
‘ పైశాచిక నిజాం రాజ్యాన్ని కూలదోయాలంటూ ‘ఎందరో కవులు గళమెత్తారు.
సాయుధ పోరాటం ముగిసి,నిజాం రాజ్యం భారత యూనియన్లో కలిసిన ఓ పాతికేళ్ళకు
(1980లో ) 'మాభూమి ‘ సినిమా వచ్చింది. అంటే...38సంవత్సరాల తర్వాత
ఈ సినిమాలో గద్దర్ పాడిన పాట నిజాంకు వ్యతిరేకంగా వుందని ,దానికి మతం
రంగు పులిమి వివాదం చేయడం ఎంత వరకు సమంజసమో విజ్ఞులకే వదిలేస్తున్నాను.
చివరగా…!
నిజాం ముస్లిం అయినంత మాత్రాన మస్లింలందరికి ప్రతినిథి కాడు.అలాగే ఇస్లాం మతానికి
పెద్ద దిక్కు కూడా కాదు.నిజాము నవాబు ఓ నియంత. ఓ అరాచక రాజకీయ వ్యవస్థకు
ప్రతినిథి మాత్రమే. అలాంటప్పుడు గద్దర్ నిజాంపై అబధ్ధాలు చెప్పాడని లేనిపోని శంకలు
కలిగించి మతంపేరిట జనాన్ని ఇలా రెచ్చగొట్టడం ఎందుకు? ఈ విమర్శకుల ఆరోపణల వెనుక
‘హిడెన్ అజెండా ‘ ..ఏమైనా వుందా? ఏమో? అది కాలమే తేల్చాలి.!!స్వస్తి!!
50Haneef Mahammad Shaik, Mohibullah Khan and 48 others
23 Comments
11 Shares
Like
Show more reactions
Comment
Share
Comments
Sabir Hussain Syed
Sabir Hussain Syed కాలమే ....
Hide this
LikeShow more reactions
· Reply · 4d
Ramakrishna Udata
Ramakrishna Udata Sir.. meeku enta opika!. Greate analytical item. Congratulations
1
Hide this
LikeShow more reactions
· Reply · 4d
Bolloju Baba
Bolloju Baba విపులంగా చేసిన శోధన. సహేతుకంగా ఉంది సర్
1
Hide this
LikeShow more reactions
· Reply · 4d
Murali Mohana Rao Ilapavuluri
Murali Mohana Rao Ilapavuluri చాలా పెద్ద విశ్లేషణాత్మక వ్యాసం రాశారు. సోమసుందర్, ఆరుద్ర, దాశరధి లాంటివారి మీద రాని వివాదాలు గద్దర్ మీద ఎందుకు? దీనికి కారణాలు విశ్లేషిస్తే మరొక వివాదం అవుతుంది. గద్దర్ మీద నాకు సదభిప్రాయం లేదు. అందుకే వ్యాఖ్యలు చేయలేను
2
Hide this
LikeShow more reactions
· Reply · 4d
Ravi Sangeveni
Ravi Sangeveni అద్భుతమైన విశ్లేషణ... అభినందనలు...
ఈ వివాదం లేవనెత్తిన వ్యక్తి మానసిక దివ్యాంగుడు తప్ప మరేం కాదు....
1
Hide this
LikeShow more reactions
· Reply · 4d
Abdul Rajahussain
Abdul Rajahussain ఆకాలంలో వున్నవాళ్ళు కొందరు ఉద్యమ స్ఫూర్తి తో రాశారు.ప్రజాకవులంతా
పోరాటంలో పాల్గొన్న వాళ్ళే
యాదగిరి గెరీల్లా పోరాట బృందం లో వుండేవాడు.
5
Hide this
LikeShow more reactions
· Reply · 4d
Haneef Mahammad Shaik
Haneef Mahammad Shaik మీ వివరణ,ఇచ్చిన సమాచారం.. కన్విన్సింగ్ గా ఉన్నాయి. థ్యాంక్యు సర్.
1
Hide this
LikeShow more reactions
· Reply · 4d · Edited
విరించి విరివింటి
విరించి విరివింటి నిజాం పై పోరాడిన వాళ్ళలో ముస్లింలది కూడా ప్రధాన భూమిక. ఇలాంటి అసంబద్ద, అసందర్భ ఆరోపణలు చేసేవాళ్ళకు తప్పనిసరి హిడెన్ అజెండలున్నాయి. Well written sir
1
Hide this
LikeShow more reactions
· Reply · 4d
Vijay Kumar Manam
Vijay Kumar Manam 🤗”#జనం_గొంతుక_కవిత్వీకరించిన…
#అలనాటి_సరస్వతీ_పుత్రుల_గురించి”!
**
…See More
1
Hide this
LikeShow more reactions
· Reply · 4d
Venkata Ramana Murty Killi
Venkata Ramana Murty Killi చక్కగా వివరించారు
చాలా విషయాలు ప్రస్తావించారు.
ధన్యవాదాలు
2
Hide this
LikeShow more reactions
· Reply · 4d
Yessp Sripada Shiva
Yessp Sripada Shiva అన్నా.. వందనాలు.. 🙏
మతాలకు.. గతాల మలినాలని రుద్ది రాజకీయం చెద్దామనుకునేవాళ్లకు.. మీ ఈ వివిరణ కళ్ళు విచ్చుకునేలా ఉంది..
---
…See More
Hide this
Image may contain: text
2
LikeShow more reactions
· Reply · 4d
Shaik Abdul Kareem
Shaik Abdul Kareem ee charcha inthatitho migisipoledu. danny article purthiga chadavali. andulo oka imp konanni vismarinchinatluga undi.
1
Hide this
LikeShow more reactions
· Reply · 4d
Abdul Rajahussain
Abdul Rajahussain replied
·
1 Reply
Kavitha Siddoju
Kavitha Siddoju Thank you sir. నిన్నటి నుండి మీ article కోసం ఎదురుచూపు. చాలా ఆలోచించాను. . Good and correct analysis.
2
Hide this
LikeShow more reactions
· Reply · 3d
Chandrashaker Bandi
Chandrashaker Bandi అద్భుతమైన విశ్లేషణ... అభినందనలు .. sir
1
Hide this
LikeShow more reactions
· Reply · 3d
Jaswanth Kadugaya
Jaswanth Kadugaya చాలా గొప్ప గా వుంది విశ్లేషణ బాగుంది
1
Hide this
LikeShow more reactions
· Reply · 3d
Abbu Bhai
Abbu Bhai Chaala Information Dorikindhi, Sukriya Saab
1
Hide this
LikeShow more reactions
· Reply · 3d
Raghu Babu Yarlagadda
Raghu Babu Yarlagadda మంచి వ్యాసం 🙏 పీడిత ప్రజల వేదన నుండి పొంగిన విప్లవ గీతానికి దశాబ్దాల తరువాత మలినపు రంగులు పులిమే వారికి కనువిప్పు కలిగించే పరిశోధన - విశ్లేషణ.🙏
1
Hide this
LikeShow more reactions
· Reply · 3d · Edited
Rajamraju Gottumukkala
Rajamraju Gottumukkala విశ్లేషణ బాగుంది.ప్రతి పాటలో కవి అంతర్మధనం చూడాలి
1
Hide this
LikeShow more reactions
· Reply · 3d
Ma Wahab
Ma Wahab గద్దర్ ఎక్కడున్నారు..లేరుగా....ఆ గద్దర్..నల్ల చద్దార్ కప్పుకున్న గద్దర్..ఇప్పుడునది..ఓట్ల గద్దారి
Hide this
LikeShow more reactions
· Reply · 3d
Mohammed Mubashir
Mohammed Mubashir All these people responsible for millions of Muslims massacare, which is recorded in Pt. Sundarlal Committee report
Hide this
LikeShow more reactions
· Reply · 3d
Marasani Vijayababu
Marasani Vijayababu చక్కటి విశ్లేషణ మిత్రమా
1
Hide this
LikeShow more reactions
· Reply · 3d
Mohan Kumar
Mohan Kumar Very well written
1
Hide this
LikeShow more reactions
· Reply · 2d
A.m. Khan Yazdani Danny
Write a comment…
No comments:
Post a Comment