Saturday, 1 September 2018

List of Promises by Chandrababu at NARA HAMARA – TDP HAMARA

List of Promises by Chandrababu at NARA HAMARA – TDP HAMARA

నారా హమారా టీడీపీ హమారా  GUNTUR 28.08.18
S.No. Assurance 
Finance & Loans
1 ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వద్ద రుణాల కోసం పెండింగులో ఉన్న 30,000పైగా దరఖాస్తుల్ని  పరిశీలించి రుణాలు మంజూరు చేయడానికి ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయల కేటాయింపు. 
2 ముస్లిం కార్ డ్రైవర్లను యజమానిగా మార్చడానికి  200 కార్లను పంపిణీ చేస్తాము. అవసరం అయితే కార్ల సంఖ్యను పెంచుతాం.
3 మెకానిక్కులు, రిపేరర్లు తమ వృత్తికి సంబంధించిన పనిముట్లను సమకూర్చుకోవడానికి ఒక్కొక్కరికి  20 వేల రూపాయల వరకు బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాం. 
4 సునార్ / బంగారం పని చేసే వారికి రుణసౌకర్యం కల్పించడానికి 10 కోట్ల  రూపాయల కేటాయింపు. 
5 ముస్లింలకు కూడా సబ్ ప్లాన్ లో రుణాలు మంజూరు చేస్తాం.  
6 నూర్ బాషాల కోసం ప్రత్యేకంగా ఒక ఫినాన్స్ కార్పొరేషన్ ను  ఏర్పాటు చేసి దాని కోసం 40 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. 
Infraustracture 
7 ఆటోనగర్ లలో ఉన్న ముస్లిం మెకానిక్కులకు షెడ్లు వంటి మౌలిక నిర్మాణాలను ప్రభుత్వమే చేపడుతుంది. 
Education & Coaching
8 విదేశాల్లో ఉన్నత విద్యను ఆశించేవారికి 15 లక్షల రూపాయల వరకు  ఆర్థిక సహాయం /ఉపకారవేతనాలు. 
9 10వ తరగతి ఉత్తర్ణులైన వారికి వృత్తి విద్యాకోర్సుల ద్వార   సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడానికి  5 కోట్ల రూపాయల కేటాయింపు. 
10 ముస్లిం పిల్లలకు 450 కోట్లతో 25 రెసిడెన్సీ పాఠశాలలను ఏర్పాటు చేస్తాం.
11 సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ అందించడానికి ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు. 
Language 
12 రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటూ కృష్ణ, గుంటూరులో జిల్లాల్లో ఉర్దూ భాషను రెండవ భాషగా గుర్తింపు ఇస్తాం. 
13 ఉర్దూ పాఠశాలల్ని అభివృద్ధి చేస్తాం.
14 అధికంగా ముస్లిం జనాభా ఎక్కువగావున్న ప్రాంతంలో ఉర్డుని రెండవ భాషగా గుర్తిస్తాం. 
Mob Lynching 
15 మూకోన్మాద దాడుల నుండి ముస్లింలను కాపాడుతాం.
Personal Law
16 ట్రిపుల్ తలాక్ ను శిక్షించదగ్గ నేరంగా పరిగణించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు – 2017 ను రాజ్యసభలొ అడ్డుకుంటాం.  
17 పట్టణానికి ఒక  ఒక పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కమిటీని  ఏర్పాటు చేసి అందులో ఒక సభ్యునిగా ముస్లిం పెద్దను / మేధావిని నియమిస్తాం. 
Politics 
18 అతి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ముస్లింకు స్థానం కల్పిస్తాం. 
19 రాబోయే ఎన్నికల్లో ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇస్తాం. మేము ఇవ్వడానికి సిద్దం ముస్లింలు  నాయకులుగా ఎదిగి అంది పుచ్చుకోవడానికి సిధ్ధంకావాలి. 
Religion 
20 వచ్చే ఏడాది నుండి హజ్ యాత్రికుల కోసం విజయవాడ నుండే విమాన సౌకర్యం. 
21 ముస్లిం జనాభా 3 వేలకు పైన ఉన్న మండలాల్లో ఒక ప్రభుత్వ ఖాజిని నియమిస్తాం. 
22 హఫీజ్, ఆలిం, ముఫ్టిలకు సాధికార ధృవపత్రాలు ఇవ్వడానికి వీలుగా మదరసాల గుర్తింపు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. 
23 హఫీజ్, అలిం, ముఫ్తిలకు ఉచితంగా హజ్ యాత్ర ఏర్పాటు. 
24 పేద ముస్లిం పిల్లలకు రంజాన్ నెలలో ఉచితంగా 2 జతల బట్టలు పంపిణి.  
25 రాష్ట్రంలోని దర్గాలు అన్నింటి  అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు కేతాయింపు. 
26 కడపలో ఇస్తిమా నిర్వహణ కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు. 
27 గుంటూరులో అంజుమన్ షాదిఖనా, స్మశాన వాటికల ఏర్పాటుకు కృషి చేస్తాం. 
Reservations
28 విద్యా ఉపాధి రంగాల్లో ఇప్పుడున్న 4% రిజర్వేషన్లను పరిరక్షిస్తాం. 
Wakf 
29 అమరావతిలోని వక్ఫ్ భూమిలో ప్రభుత్వమే ఒక మసీదును నిర్మిస్తుంది.
30 రాష్ట్రంలోని వక్ఫ్ భూముల్ని పరిరక్షించడమేగాక వాటి ఆదాయాన్ని పెంచుతాం. 

No comments:

Post a Comment