తక్షణ ‘తలాక్’కు చెల్లు!
20-09-2018 01:08:14
వెంట వెంటనే 3 సార్లు తలాక్ చెబితే మూడేళ్ల జైలు..
కేంద్ర సర్కారు కేంద్రం ఆర్డినెన్స్
పాత ప్రతిపాదనలకు సవరణ
పోలీసులు తమంత తాముగా కేసు పెట్టలేరు
భార్య, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయాల్సిందే
పరిహారమిస్తేనే బెయిలు!
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: తక్షణ తలాక్‌పై పార్లమెంటులో సాధించలేని కేంద్రం.. ఆర్డినెన్స్ ద్వారా సాధించింది. వెంటవెంటనే మూడుసార్లు తలాక్ చెప్పేసి ‘నీ దారి నీదే’ అని చెప్పడాన్ని నిషేధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. బుధవారం కేంద్ర మంత్రివర్గం దీనిని ఆమోదించింది. ఇదే రోజు పొద్దుపోయాక రాష్ట్రపతి కోవింద్ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. అంతకుముందు ఆర్డినెన్స్‌పై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. ఆర్డినెన్స్ ప్రకారం... భార్యకు తక్షణం ముమ్మార్లు తలాక్ (తలాక్-ఎ-బిద్దత్) చెప్పడం నేరం! అలా చెప్పినా చెల్లదు. చట్ట విరుద్ధంగా తక్షణ తలాక్ చెబితే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అయితే, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశమున్న నేపథ్యంలో కేంద్రం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంది. విచారణ ప్రారంభానికి ముందే నిందితుడికి బెయిలు ఇచ్చే అవకాశం కల్పించింది. నిందితులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైనప్పటికీ పోలీసు స్టేషన్‌లో కాకుండా, కోర్టు ద్వారా బెయిలు పొందవచ్చు. అయితే, బాధితురాలి (భార్య) వాదన విన్న తర్వాతే జడ్జి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు బిల్లులో పేర్కొన్న నిబంధనల మేరకు భార్యకు పరిహారం చెల్లించేందుకు అంగీకరిస్తేనే బెయిలు లభిస్తుంది. పరిహారం ఎంత అన్నది నిబంధనల ప్రకారం మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. అదే సమయంలో... ఈ అంశంపై పోలీసులు తమంతట తాము ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేరు. భార్య, కుటుంబ సభ్యులు లేదా పెళ్లి వల్ల ఆమెకు బంధువులుగా మారినవారి ఫిర్యాదు మేరకే కేసు పెట్టాల్సి ఉంటుంది.
ఆ ముగ్గురు సహకరించాలి...
‘‘తక్షణ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు ఏడాది కిందటే తీర్పు చెప్పింది. అయినా ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది. అందువల్లే, ఆర్డినెన్స్ జారీ చేయడం తప్పనిసరి అత్యవసరంగా మారింది’’ అని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. లోక్‌సభలో గట్టెక్కిన ఈ బిల్లును రాజ్యసభలో అడ్డుకున్నారంటూ కాంగ్రె్‌సపై విమర్శలు గుప్పించారు. ‘‘ఇది సోనియాగాంధీపై నేను మోపుతున్న అభియోగం. ఓటుబ్యాంకు రాజకీయాల ఒత్తిడి వల్లే ఆమె మౌనం వహించారు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి సహకరించలేదు.’’ అని అన్నారు.
ఇది చరిత్రాత్మకం: బీజేపీ
తక్షణ తలాక్‌పై ఆర్డినెన్స్ జారీ చేయడం చరిత్రాత్మకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అభివర్ణించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం మహిళలను ఇబ్బందులు పెడుతున్న పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తక్షణ తలాక్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇష్రత్ జహాన్ ఆర్డినెన్స్ జారీపై హర్షం వ్యక్తం చేశారు. ఇక ముస్లిం పురుషులు, మత పెద్దలు తమ పద్ధతి మార్చుకోక తప్పదన్నారు. కాగా, ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన జేడీయూ.. ఇలాంటి సున్నితమైన అంశాలపై హడావుడి నిర్ణయాలు తీసుకోవడం తగదని పేర్కొంది.
ఆ 24 లక్షల మంది సంగతి చూడండి: ఒవైసీ
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తక్షణ తలాక్‌ను ‘శిక్షార్హ నేరం’గా పరిగణిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇది ముస్లిం మహిళల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ‘‘ఇస్లాంలో పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం. దీనిని శిక్షాస్మృతిలోకి తీసుకురావడం చెల్లదు’’ అని అన్నారు. పైగా, కేవలం ముస్లింలను ఉద్దేశించి చేసిన ఈ చట్టం రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లేనన్నారు. దీనిపై అఖిలభారత ముస్లిం పర్సనల్ లాబోర్డు, మహిళా సంస్థలు సుప్రీంకోర్టులో పోరాడాలని పిలుపునిచ్చారు. ‘‘పెళ్లి అయినప్పటికీ భర్త వదిలేయడంతో ఒంటరిగా ఉన్న 24లక్షల మంది మహిళలకు మేలు జరిగేలా చట్టం చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
ఆమెకే అధికారం...
ఈ కేసుల్లో పరస్పర రాజీకి (కాంపౌండబుల్) కూడా వీలుంటుంది. భార్యా భర్తల మధ్య వివాదాన్ని మేజిస్ట్రేట్ పరిష్కరించవచ్చు. తలాక్-ఎ-బిద్దత్‌ను ఇరుపక్షాలు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఇది భార్య కోరినప్పుడు మాత్రమే వీలుపడుతుంది. అలాగే... తనకు, మైనర్లయిన పిల్లలకు అవసరమైన భరణం ఇప్పించాల్సిందిగా బాధితురాలే కోర్టును ఆశ్రయించవచ్చు. మైనర్ పిల్లలను తనకే అప్పగించాలని అభ్యర్థించవచ్చు. గతనెల 29వ తేదీన జరిగిన కేబినెట్‌లోనే దీనికి సంబంధించిన సవరణలను ఆమోదించారు.
22 దేశాల్లో నిషేధం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక సహా ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలు ఇప్పటికే తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించాయి. పాక్, బంగ్లాదేశ్‌లలోనైతే విడాకులివ్వాలనుకుంటున్న వ్యక్తి ‘మధ్యవర్తిత్వ కౌన్సిల్’కు లిఖితపూర్వకంగా తెలియజేసి, ఆ కాపీని భార్యకు కూడా ఇవ్వాలి. జియో న్యూస్ కథనం ప్రకారం పాక్‌లో 1961లో జారీ అయిన ముస్లిం కుటుంబ చట్టం ఆర్డినెన్స్ తక్షణ ట్రిపుల్ తలాక్‌ను రద్దుచేసింది. అఫ్ఘానిస్థాన్‌లో ఒకే భేటీలో 3సార్లు ‘తలాక్’ చెబితే చెల్లదు. శ్రీలంకలో ముస్లిం వివాహాలు, విడాకుల చట్టం- 1951ను 2006లో సవరించినప్పటి నుంచి తక్షణ తలాక్‌పై నిషేధం కొనసాగుతోంది. టర్కీ, సైప్రస్, ట్యునీషియా, అల్గేరియా, మలేసియా, జోర్డాన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, బ్రూనై, యూఏఈ, ఇండోనేసియా, లిబియా, సూడాన్, లెబనాన్, సౌదీ, మొరాకో, కువైట్‌లూ తక్షణ తలాక్‌ను నిషేధించాయి. కాగా, 22 దేశాలు ట్రిపుల్ తలాక్‌ను నియంత్రించినప్పటికీ, భారత్‌లో మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఇప్పటి వరకు సాధ్యం కాలేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.

No comments:
Post a Comment