Original article of Mr. Golapudiతప్పక చదవండి...
అక్బరుద్దీన్ ఒవైసీకి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శరీరంలో స్థిరపడి దానిని నయం చెయ్యాలని కూడా గ్రహించని, చెయ్యనక్కరలేదనిభావించిన అలసత్వానికి గుర్తుగా వికటించి బయటపడిన కేన్సర్ అక్బరుద్దీన్ ఒవైసీ. ఇప్పుడు బయటపడినా చికిత్సకి లొంగని చావుకి గుర్తు ఈ 'కేన్సర్'. అయితే అంత దయనీయమైన దశలో ఉన్నదా హిందూదేశం? హిందూమతం?మన మతానికి విస్తృతి ఎక్కువ. ఔదార్యం ఎక్కువ. జాలి ఎక్కువ. సంయమనం ఎక్కువ. అన్నిటికీ మించి అలసత్వం ఎక్కువ. బట్టల్లేని సీతమ్మనీ, నగ్నంగా నిలిపిన భరతమాతనీ చూసికూడాతన తల్లికి బట్టలు తొడిగిన ఎమ్.ఎఫ్.హుస్సేన్‌గారి కళాస్వేచ్ఛని నెత్తికెత్తుకునే కళాతృష్ణ మనది. 'మతం' గురించి ఎవరు మాట్లాడినా, దేవుడిని వెనకేసుకొచ్చినా'హిందుత్వ'మని కత్తులు దూసే సెక్యులర్ కవచాలు తొడుక్కున్న ఆత్మవంచన చేసుకునే అవకాశవాద పార్టీలున్న దేశం మనది. మనం నలుగురు ముస్లిం పెద్దల్ని రాష్ట్రపతుల్ని చేసుకున్నాం. ఇద్దరు ముస్లింలను ఉపరాష్ట్రపతుల్ని చేసుకుని గౌరవించుకున్నాం. మరే ముస్లిం దేశంలోనూ ఏ హిందువూ ఏ విధమయిన పదవిలోనూ నిలిచిన దాఖలాలు లేవు. నెదర్లాండులో తమ దేవుడిని వెక్కిరించే కార్టూన్లు వేస్తే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఆస్తులూ, ఇళ్లూ తగలెట్టారు. తమ దేవుడిని దూషించిన ముస్లిం రచయితనే చంపాలని మరో దేశపు మతగురువు శాసిస్తే -యిప్పటికీ సాల్మన్ రష్దీ రహస్యపు బతుకు బతుకుతున్నాడు. మనం చిత్రగుప్తుడిని, యముడినీ (రెండు 'యముడికి మొగుడు' సినీమాల్ని చూసి సంతోషించాం) శ్రీకృష్ణుడినీ,నారదుడినీ ఆటపట్టిస్తే ప్రేక్షకులు వందరోజులు చూసి ధన్యులవుతారు. బ్రాహ్మణ్యాన్నిగర్హించి -వాళ్ల చేత పేడ తినిపిస్తే -బ్రాహ్మణతరులు కిల కిల నవ్వుకుంటారు. ముస్లింలలో అలాంటిపరాచికాలు ఎప్పుడయినా ఎవరయినా చేసిన దాఖలాలు ఉన్నాయా? చేసి బతికి బట్టకట్టగలరా?ఈ దేశంలో ముస్లిం సోదరులంతా ఒకటి. ఎక్కడ ఉన్నా ఒకటిగా ఓటువేస్తారు. అయిదేళ్ల ఆడపిల్లకి బురఖా వేస్తారు. అరవైయ్యేళ్ల ముసలాయనా టోపీ పెడతారు. తమని కాదంటే పదేళ్ల పిల్లనీ కాల్చి చంపుతారు. మతం పట్ల గౌరవం, మరొక పక్క భయం - వారిని సంఘటిత పరుస్తుంది.మనదేశంలో మనం మహారాష్ట్రులం, తమిళులం, బెంగాళీలం, వెనుకబడిన వారం, ముందుబడినవారం, కులాలవారం, రెడ్లం, కమ్మవారం, కాపులం, బ్రాహ్మణులం, శ్రీవైష్ణవులం, శైవులం, మాలలం, మాదిగలం -మనం సామూహిక ప్రతిపత్తిని ఏనాడూ ప్రకటించుకోము. ఎవరూ ఎవరిమాటా వినరు. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరయినా ఎప్పుడయినా ముస్లింలకు ప్రాతిపదిక మతం. మనకి? వ్యక్తిగత ప్రయోజనం, స్వలాభం, డబ్బు, పదవి, ఎదుటివాడి పతనం -మరేదో, మరేదో.హిందూదేశంలో ముస్లింల 'హజ్' యాత్రకి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రపంచంలోని 52 ముస్లిం దేశాలలో ఏ దేశంలోనూ ఈ ఉపకారం లేదు. శుభం. మరి భారతదేశంలో కాశీ, గయ, కేదార్, బదరీ, వైష్ణోదేవి యాత్రలకు మన ప్రభుత్వం ఆర్థిక సహాయం చెయ్యదేం? అడిగే నాధుడేడీ? వాళ్ల స్వార్దాలకే వ్యవధి చాలకపోయె. మన చిన్న పొట్టకు శ్రీరామరక్ష. మన కులానికి మేలు కలిగితే చాలు. మొన్న విశాఖపట్నంలో ఓ స్వామీజీని బహిరంగంగా కొట్టారు. కారణమేదయినా ఈ పనిని ఏదీ? ఒక 'ఇమామ్'కి దమ్ముంటే చేయమనండి. మనది భారతదేశం. పరాయి పెద్దని అవమానించమనడం ఉద్దేశం కాదు. మన మర్యాదకి నీడలేదని చెప్పడం ఉద్దేశం.అక్బరుద్దీన్ చేసిన ప్రసంగం ఏ హిందువయినా చేసి బతికి బట్టకట్టగలడా? ముస్లింలు మాట దేవుడెరుగు. ఔదార్యం కట్టలుతెంచుకునే మన సెక్యులర్ వీరులు 'హిందుత్వం' పేరిట గొంతుచించుకోరా?అక్బరుద్దీన్ అరాచకాన్ని ఉత్తరప్రదేశ్లోమరో ముస్లిం నాయకుడు సమర్థించారు! హిందూ దేశంలో ముస్లింల కిచ్చిన ప్రత్యేక స్థానం మరే ముస్లిం దేశంలోనయినా హిందువుల కిచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ దేశంలో 15 శాతం మైనారిటీ వర్గాన్ని 85 శాతం మెజారిటీ వర్గం నెత్తిన పెట్టుకుంటోంది.కరుణానిధికి రామాయణం కట్టుకథ. ఆయన మన ముఖ్యమంత్రి. దేవుడిని నమ్మని, నమ్మకం లేదని బల్లగుద్దే ఏ ముస్లిమయినా ఏ ముస్లిం దేశంలో నయినా నాయకుడు కాగలడా?ఈ విచిత్రాన్ని ఎవరయినా గమనించారా? గాజాలో అరబ్బులు క్షేమంగా లేరు. పాకిస్తాన్లో వందలమంది ముస్లింలను వారే చంపుకుంటున్నారు. లిబియాలో, మొరాకోలో, ఆఫ్గనిస్థాన్‌లో, సిరియాలో, లెబనాన్‌లో, ఈజిప్టులో, ఇరాక్‌లో, యెమెన్‌లో ముస్లింలు హింసకు బలి అవుతున్నారు. ఆస్ట్రేలియాలో, ఇంగ్లండులో, ఫ్రాన్స్‌లో, ఇటలీలో, జర్మనీలో, స్వీడన్లో, అమెరికాలో, నార్వేలో వారు క్షేమంగా, హాయిగా ఉన్నారు. అయినా ఆ దేశాల్లో ముస్లింలు పై దేశాల్లో ముస్లింలుగా ఉండాలనుకుంటున్నారు.మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో ముస్లింలు మైనారిటీలుగా రాయితీలు పొందుతున్నారు. శుభం, మరి ఈ దేశంలోనే జమ్ము కాశ్మీర్లో, మిజోరంలో, నాగాలాండ్‌లో, అరుణాచల్‌ప్రదేశ్‌లో, మేఘాలయలో మైనారిటీలయిన హిందువులకు ఆ రాయితీలు యివ్వడం లేదేం?ముస్లిం మత కార్యకలాపాలను, వారి వ్యవహారాలను చూసే వక్ఫ్బోర్డులున్నాయి.వాటి ఆదాయాన్ని ఈ దేశంలో ఎవరయినా ముట్టుకోగలరా? పదిమంది దర్శించే ప్రతి హిందూ దేవాలయ పరిపాలనా, ఆదాయం -రాజకీయ నాయకుల, వారి ప్రతినిధుల చేతుల్లోకి పోయిందేం?ఎవరయినా మనల్ని తిట్టినప్పుడు -మనం హిందువులం. ఎవరూ తిట్టనప్పుడు -మనల్ని మనమే తిట్టుకునే స్వదేశీయులం. అదీ మన ప్రతాపం.'మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్!' అన్నాడు గిరీశం. అక్బరుద్దీన్ వంటి పెద్దలు ''వీళ్లంతా ఉత్త వెధవాయిలోయ్!''అని నవ్వుకుని ఉంటారు. అందుకే రొమ్ము విరుచుకుని -ప్రేక్షకులు మురిసిపోయేలాగ -హిందూ దేశంలో హిందువుల్ని తిట్టి -తీరిగ్గా లండన్ వెళ్లి కూర్చున్నారు. ఇక్కడ మన వీరంగం చూసి -అక్కడ పేపర్లలో చదువుకుని నవ్వుకుంటూ ఉండి ఉంటారు.కులాల పేరిట, వర్గాల పేరిట -కిష్టిగాడు, రాములు వెధవ, సీతి,లచ్చి స్థాయికి మతాన్ని యీడ్చిన గౌరవనీయులైన హిందువులు -మొదట ఇల్లు చక్కబెట్టుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. తమలోఏ లోపాలున్నా 'మతం'- భేషరతుగా -నయానికో, భయానికో -తమకి గుర్తింపునీ, బలాన్నీ, సామూహిక ప్రతిపత్తినీ యివ్వగల శక్తి అని ముస్లింలు నమ్ముతున్నారు. మనం ఏనాడయినా -ఎవరో మనని దుయ్యబట్టిన యిలాంటి అరుదయిన సందర్భాల్లో ప్రథమ కోపాన్ని చూపడం తప్ప -యిలాంటి సంఘటిత శక్తిని ప్రదర్శించామా?అక్బరుద్దీన్ తప్పు చేశాడా? ఇప్పుడు క్రైస్తవ మతాన్ని సహాయం తెచ్చుకుంటాను. మీ మతాన్ని, మీ విలువల్ని, మీ విశ్వాసాల్ని, మీ ఆచారాల్ని గౌరవించే మొనగాడెవరయినా ఉంటేమొదటి రాయి వెయ్యండి.నా ఉద్దేశంలో అక్బరుద్దీన్ ప్రసంగం మేలుకొలుపు. పేడ తినే బ్రాహ్మణ్యం, యముడిని వెక్కిరించే సినిమాలూ, స్వజనాన్ని గౌరవించుకోలేని స్వార్థం, వేలంటీన్ వేలం వెర్రికి విర్రవీగే సామూహిక పైత్యం, దేవుడు, దేవాలయాలు 'హిందుత్వం' అని రాజకీయ ప్రయోజనాలకు గొంతు చించుకునే అవకాశవాద పార్టీలూ మతానికి విలువని పెంచవు. అక్బరుద్దీన్ వంటి వారి నోటికి బలి అవుతాయి. అంతకంటే భయంకరమైన విషయం ప్రేక్షకుల ప్రశంస అనే హెచ్చరిక.
--- గొల్లపూడి మారుతీరావు
Reply of Aranya Krishna
ఇందులో కొత్తదనం ఏమాత్రం లేదు. మీరు ద్వేషించే పాకిస్తాన్ వంటి దేశాల అధమాధమ స్తితిగతులతోనే పోల్చుకుంటూ ఇక్కడ అలా లేదుకదా సంతోషించండంటూ దబాయించటమే ఆ సారాంశం. స్వేచ్చ ఒకడిచ్చే బిక్ష అనుకుంటే బతకటం మించిన దరిద్రపుగొట్టు పని మరొకటి లేదు. నలుగురు రాష్ట్రపతులు, ఇద్దరు ఉపరాష్ట్రపతులు అంటూ జనాభా లెక్కలుతీయటం దేనికి పెద్దాయనా? వాళ్ళు కూడా నీలా, నాలా ఈ మట్టి మీద పుట్టారనుకోలేకనే కదా ఏదో పెళ్ళికొచ్చినవాళ్ళని గౌరవించిన పద్దతిలో మాట్లాడటం? వాళ్ళకు ఆ స్థాయి లేకుండానే వచ్చిందా? ఎవరు రాష్ట్రపతి ఐనా ముందుగా హైందవంతో పరిఢవిల్లే భారతీయ సంస్కృతికి నమోవాకాలు చెప్పందే ఆ స్థాయికి వస్తారా? గుజరాత్ మారణకాండకి ఎక్స్చేంజ్ గానే కదా కేవలం అడ్మినిస్ట్రేటర్ అయ్యుండి ఒక్క కలం కూడా కనుక్కోని కలాం గారికి రాష్ట్రపతి పదవి వరించింది. (ఆయన ఏమీ కనుక్కోలేదంటే కొందరికి మనస్తాపం కలగొచ్చు. ఆయన సోమరాజు గారో మరెవరి తోనో చౌకగా లభ్యమయ్యే"కలాం స్టెంట్" కనుక్కున్నాడని చెబుతారు. అది ఎంత విఫలమైనా పేటెంట్ మాత్రం దక్కించుకున్నారు. ప్రస్తుతం అది వాడకంలోనే లేదు. కానీ "కనుక్కున్న" ఘనత మాత్రం దక్కించుకున్నారు) ఆయన స్వాములు, సన్యాసులు దగ్గర మోకరిల్లబట్టే కదా ఆయన్ని భారతీయాత్మగా గుర్తించింది. మనముగ్గురు ఖానులు సూపర్ స్టార్లు. వాళ్ళు కూడా రమేష్, సురేష్ వంటి పాత్రలెయ్యబట్టేకదా స్టార్లయ్యారు. వాళ్ళు పోషించిందంతా హిందూ సెంటిమెంట్లే కదా. వాళ్ళ పెళ్ళాల పేర్లు చూసారా? గౌరి, కిరణ్‌లు. సల్మాన్ అయితే తన చెల్లి పెళ్ళి బ్రహ్మాణ్డంగా హైందవ పద్ధతిలోనే చేసాడు. తమ స్వీయ అస్తిత్వాన్ని నిలుపుకున్న ఏ మైనారిటీ మతస్తుడు ఉన్నతస్థాయికి పోలేడు. కానీ పాకిస్తాన్‌లోలా మన దేశంలో మైనారిటీ సంఖ్య ఏదో 1.6 శాతం కాదు. భారతదేశంలో అది సుమారు20 శాతం.ఇంక ప్రత్యేక రాయితీలు, ప్రతిపత్తిలు గురించి కూడా మీరెంతో మనస్తాపం చెందారు. తిరుపతి వెంకన్న దగ్గర, షిర్దీట్రస్ట్ దగ్గర ఉన్నదాని కంటే వక్ఫ్ బోర్డుల దగ్గరెక్కువుందా? మీరు వాళ్ళ ప్రయాణాలకిచ్చే రాయితీల గురించి బాధ పడుతున్నారు. తిరుపతి వెళ్ళాక కేవలం యాభై రూపాయిలకే కాటేజీలు దొరుకుతాయి. నిత్యాన్నదానాలుచేస్తారు. కేవలం 500 రూపాయిలకే అమర్నాధో మరే ఇతర ప్రాంతంలోనో హెలికాప్టర్ సౌకర్యం దొరుకుతుంది. వక్ఫ్ బోర్డు మీద ప్రభుత్వ నియంత్రణ లేదనుకోవటం అజ్ఞానం. బోలెడంత మంది స్వామీజీలు ఆశ్రమాల పేరుతో బాగానే వందల ఎకరాలు సంపాదించుకున్నారు. వేల కోట్ల రూపాయిల ఆస్థులున్న పుట్టపర్తి, బాల సాయిబాబా ఆశ్రమం మీద ప్రభుత్వ నియంత్రణ ఏమిటో చెప్పండి.ఒక ప్రాజెక్ట్ మొదలుపెడితే, ఒక ప్రభుత్వ భవంతి కడితే పాటించే ఆచారాలు హిందూ ఆచారాలు, హిందూ పూజలే కదా. అదంతా ప్రభుత్వ ఖర్చే కదా. సెక్రటేరియట్ నిండా బ్రహ్మకుమారీ సోదరీమణులు తెగ కనబడతారు. జగ్గీ బాబా గారితో చంద్రబాబు గారు శిక్షణలు ఇప్పించారు. ఇదంతా ప్రభుత్వ ఖర్చే. అంతరిక్ష పరిశోధనా ప్రయోగాల రాకెట్ మోడల్ని తిరుపతి వెంకన్న గారి పాదాల ముందు పెడతారు ముందుగా. షార్ కేంద్రంలోని గ్రామీణ దేవతకు కూడా పూజ చేస్తారు ముందుగా. ఇది సెక్యులరిజమా? నిజమే ఒకట్రెండు మైనారిటీ రాయితీలు మీకు పంటి కింద రాయిలా కలుక్కుమంటూంటాయి పాపం. మీ పంటి నొప్పికి నా సానుభూతి.అదృష్టవశాత్తు ముస్లీం మతంలో హైందవంలోలా అమానుష కులవిభజన జరిగి ఒక మనిషి మరో మనిషిని వివక్షగా చూసే పరిస్తితి లేదు. అయితే మతానికి ఉండే వెంకకబాటుతనమంతాఏ మతంలో అయినా ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఆశ్చర్యం లేదు. మీరు మనం రకరకాల కులాలుగా విడిపోయామన్నారు. నిజమే కదా. మరి ఈ శిక్ష తప్పదు కదా మనకు? అయినా మీరు పొరబాటున ఒక నిజం కూడా చెప్పారు. వాళ్ళు భయం వల్ల కూడా ఒక్కటిగా ఉంటారన్నారు. భయం ఎందుకొచ్చింది? దేనివల్ల వచ్చింది?"అయిదేళ్ల ఆడపిల్లకి బురఖా వేస్తారు. అరవైయ్యేళ్ల ముసలాయనా టోపీ పెడతారు. తమని కాదంటే పదేళ్ల పిల్లనీ కాల్చి చంపుతారు." ఎంత గొప్పగా సెలవిస్తారు సర్ మీరు? మనదగ్గర బాల్య వివాహాలు లేవు. చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసి చంపేవారందరు హైందవేతరులే కదా? అది ఏ మతానికి చెందినవారైనా సరే, మతాల మధ్య పోటీ తీసుకొచ్చే మీలాంటి వాళ్ళ వల్లే సమస్యలు. మీ వ్యాసం మొత్తం మిగతా మతాలు, ముఖ్యంగా ఇస్లాం, ఎంత భయకరమైనవి అని చెప్పటానికి అనేక ఉదాహరణలు ఇచ్చారు. ఒక మతం దుర్మార్గంగా తయారుకావటానికి ఆ వ్యస్థలో ఉండే ఆర్ధిక సంబంధాలు, విద్యాస్థాయి, మానవసంబంధాలు చాలా ముఖ్యమైనవి. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం దేశాలన్నీ ఒకే రకంగా లేవు. ఇండోనేషియా ఒక ఇస్లాం దేశం. రాజధాని జకర్తాలో నగరం నడిబొడ్డ్డున కృష్ణార్జునల పెద్ద విగ్రహం చూసాను. అక్కడ మాల్స్ కి రామామాల్, లక్ష్మణ మాల్ అన్న పేర్లు ఉంటాయి. వాళ్ళు హిందూ దేవతల్ని పూజించరు. కానీ గౌరవిస్తారు. మనకుందా ఆ స్థాయి? ముందు మీరు హిందువుగా మాట్లాడతారు. తరువాత కులాల ప్రస్థావన వచ్చినప్పుడు బ్రాహ్మణుడిగా మాట్లాడతారు. మీకెక్కడా మనుషుల్ని విభజించే భావజాలాల మీద ప్రేమ తగ్గదులెండి. ఎందుకంటే అది మీరు ఐడెంటిఫై అయ్యే వర్గానికి అత్యంత లాభసాటి.
No comments:
Post a Comment