దర్గాలోకి అనుమతించాలంటూ ముస్లిం మహిళల పోరాటం
29-01-2016 12:51:50
ముంబై : ముస్లిం మహిళలు కూడా చైతన్యవంతులయ్యారు. నగరంలోని హాజీ అలీ దర్గాలోకి తమకు ప్రవేశం కల్పించాలంటూ గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ దర్గాకు రోజూ వందలాదిమంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రార్థనా స్థలంలోపలికి మహిళలను అనుమతించాలంటూ కొందరు ముస్లిం మహిళా నిరసనకారులు ధర్నా చేశారు. మహిళలపై ఆంక్షలు విధిస్తున్నది మతం కాదని, పురుషాధిక్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లాం సిద్ధాంతాలకు ఇది వ్యతిరేకమని, రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, రాజ్యాంగాన్ని ఇస్లాం సమర్థిస్తోందని పేర్కొన్నారు.ఈ దర్గా ట్రస్ట్‌పై ముస్లిం మహిళల హక్కుల సంఘం బోంబే హైకోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 18న విచారణ జరిపిన హైకోర్టు స్పందిస్తూ శబరిమల దేవాలయంలో మహిళల ప్రవేశానికి అనుమతి గురించి సుప్రీంకోర్టు అభిప్రాయం వెలువడే వరకు వేచి చూస్తామని ప్రకటించింది.
శని శింగణాపూర్‌లోని శనీశ్వర దేవాలయంలో మహిళలకు ప్రవేశంపై విధిస్తున్న నిషేధాన్ని ఎత్తేయాలంటూ ఇటీవలే కొందరు మహిళా భక్తులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. వారు దేవాలయంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ దేవాలయ ట్రస్టు అధికారులు, మహిళలు కలిసి సరైన పరిష్కారం కనుగొనాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం మహిళలు కూడా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.
మళ్లీ నోరుజారిన హోం మంత్రి
Others | Updated: January 29, 2016 15:13 (IST)
No comments:
Post a Comment