Wednesday 8 June 2022

జూబ్లీహిల్స్‌ బాలిక రేప్‌ కేసు...ఇన్నోవా కారు వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌దే

 Published: Wed, 08 Jun 2022 17:18:09 

జూబ్లీహిల్స్‌ బాలిక రేప్‌ కేసు...ఇన్నోవా కారు వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌దే

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ బాలిక రేప్‌ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితులు వాడిన ఇన్నోవా కారు వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌దిగా నిర్థారించారు. దినాజ్‌ పేరిట ఇన్నోవా కారును వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కొన్నారు. ఏడాదిన్నరగా వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ ఇన్నోవా నడుపుతున్నారు. మే 28న ఇన్నోవాలో వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కుమారుడు పబ్‌కు వెళ్లాడు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. ఒకవేళ విషయం బయటపడినా అంత తేలిగ్గా దొరక్కుండా ఉండేందుకు కుయుక్తులు పన్నారు. తమ సిమ్‌ కార్డులను ఇద్దరు ఇతర వ్యక్తుల ఫోన్లలో వేసి వాళ్లను గోవా పంపారు.. వారు మాత్రం తెలివిగా వేరే సిమ్‌లతో కర్ణాటక వెళ్లారు. అత్యాచారానికి వాడిన ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసేందుకు యత్నించారు. ప్రభుత్వ వాహనం అని ఉన్న స్టిక్కర్‌ను తొలగించేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబరును కూడా గుర్తుపట్టకుండా చేశారు. ఒక్కచోట ఉండకుండా వేర్వేరుచోట్లకు పరారయ్యారు. ఆఖరికి సోషల్‌ మీడియా ఖాతాలను డిలీట్‌ కొట్టి.. బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఇలా.. క్రిమినల్‌ బ్రెయిన్‌తో చేయాల్సినదంతా చేశారు. అయితే, బాలిక ధైర్యం కూడదీసుకుని నిజం చెప్పడంతో వారి దురాగతం దాగలేదు. అదే సమయంలో దొరక్కుండా తప్పించుకుందామనే వారి ప్రయత్నాలూ పారలేదు. ఇప్పుడు నిందితులందరూ కటకటాల వెనక్కు వెళ్లారు. 


No comments:

Post a Comment