Thursday 23 June 2022

దూదేకులు, ముస్లిం ఫెడరేషన్‌కు నిధులేవి?...

 Published: Fri, 24 Jun 2022 

దూదేకులు, ముస్లిం ఫెడరేషన్‌కు నిధులేవి?...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750విదేశీ విద్యకు బ్రేక్‌.. 


దుల్హన్‌ రద్దు.. అమ్మఒడిలో కోతలు

దూదేకుల సంక్షేమం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఫెడరేషన్‌ ఏర్పాటుచేసింది. 2019-20లో వారి సంక్షేమం కోసం రూ.20 కోట్లు బడ్జెట్‌లో పెట్టింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధుల్లో 1.40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆ తర్వాత బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఆ ఫెడరేషన్‌ ఒకటుందనే ఎరుకే సర్కారుకు ఉన్నట్టు కనిపించడం లేదని ముస్లిం వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం అందరికీ ఇస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత, వాహనమిత్ర, చేదోడు, విద్యాదీవెన తదితర నవరత్నాల పథకాలన్నింటినీ మైనారిటీ బడ్జెట్‌లోనూ చూపి తిమ్మిని బమ్మిని చేశారు. చంద్రబాబు తెచ్చిన పథకాలను అటకెక్కించి నవరత్నాలే దిక్కు అని చెప్తున్నారు. స్వయం ఉపాధి యూనిట్లకు స్వస్తిచెప్పి ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీ యువత స్వావలంబనకు స్వస్తిపలికారు. 


ఉన్నతవిద్యకూ అందని భరోసా.... గత ప్రభుత్వంలో మైనారిటీ విద్యార్థుల ఉన్నతవిద్యకు ఒక భరోసా ఉండేది. యూపీఎస్సీ, ఎపీపీఎస్సీ తదితర పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారికీ, డీఎస్సీ కొట్టేందుకు పొందేందుకు తీసుకునే శిక్షణకు తానే ఫీజులు చెల్లించేది. విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీల్లో చదవాలనుకునే మైనారిటీ యువతకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించింది. తాజాగా విదేశీ విద్య, ఉన్నతవిద్య కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆర్థిక భారం పేద కుటుంబాలపై పడింది. కేవలం నవరత్నాల పథకాలతోనే ఉన్నతవిద్యకు ఎలాంటి భరోసా అందడం లేదని ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీ యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతోపాటు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లను రద్దు చేయడంతో వారు కార్పొరేట్‌ పాఠశాలలకు దూరమయ్యారు. 

No comments:

Post a Comment