Wednesday 4 November 2015

షారుక్‌... పాక్‌కు వచ్చేసెయ్‌: హఫీజ్‌

షారుక్‌... పాక్‌కు వచ్చేసెయ్‌: హఫీజ్‌
Updated :05-11-2015 02:45:20
ఇస్లామాబాద్‌: ముంబైపై ఉగ్రదాడుల సూత్రధారి, పాక్‌లో నిషేధిత జ మాత్‌ ఉద్దవా సంస్థ అధినేత హఫీజ్‌ సయీద్‌ బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌కు ఆహ్వానం పలికాడు. ‘‘ఇస్లాంను ఇండియా గౌరవించకపోతే పాకిస్థాన్‌కొచ్చెయ్‌’’ అంటూ ట్విట్టర్‌లో స్వాగతించాడు. ముస్లింలుగా వివక్షకు గురవుతూ భారత్‌లో జీవించలేని పరిస్థితిలో ఉన్నవారంతా వచ్చేయొచ్చన్నాడు. దేశంలో అసహన వాతావరణంపై షారుక్‌ వ్యాఖ్యలతో విశ్వహిందూ పరిషత్‌ నాయకురాలు సాధ్వి ప్రాచీ ఆయనను పాక్‌ ఏజెంట్‌గా అభివర్ణించింది. దరిమిలా హఫీజ్‌ ఇలా ట్విట్టర్‌కెక్కాడు.

No comments:

Post a Comment