Friday, 20 May 2022

హిందూత్వ' కల సాకారం దిశగా!?

 హిందూత్వ' కల సాకారం దిశగా!?

--------------------------------------------

-అవయ్ శుక్లా, రిటైర్డ్ ఐఏఎస్ 

అనువాదం : రాఘవ శర్మ


ఈ క్రీడలో భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా పయనిస్తోంది.

 'హిందూ రాష్ట్రం ' ప్రకటించడానికి మరి కొన్నేళ్ళు పట్టవచ్చు. 

క్షేత్ర స్థాయిలో అదొక రూపాన్ని సంతరించుకుంటోంది. 

త్వరలో అదొక వాస్తవ రూపం దాల్చనుంది. 

ఈ పరిస్థితి అనివార్యతను అంగీకరిస్తూ, మౌనం దాల్చి, నోరు మూసుకోవడం మంచిదని చాలా మంది భావిస్తున్నారు. 

పార్లమెంటులో కానీ, న్యాయస్థానాల్లో కాని 'హిందూ రాష్ట్రం' చట్టబద్దతను సాధించడానికంటే ముందు అది ప్రజల మనసులను గెలవాలి. 

దానికి మూడు అంచెల ఎత్తుగడ ; మద్దతును కూడగట్టడం, వ్యతిరేకించే వారిని నీరుగార్చడం, అది ఏర్పడే సమయానికి క్షేత్రస్థాయిలో అత్యధిక సంఖ్యాకుల దేశమనే భావనను పాదుకొల్పడం.

ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఇది చేసేయాలి. 

ఒక వేళ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అది అదనపు బలమే అవుతుంది.

 అలా జరగకపోతే, ఆ రకమైన భారత దేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి వీలులేకుండా రంగాన్ని సిద్ధం చేసుకోవాలి. 

ఇతర రాజకీయ పార్టీలు గందరగోళంతో తడబడుతున్నప్పుడు, అధికారం కోసం అహంభావంతో పోటీపడుతున్నప్పుడు, ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడానికి బీజేపీకి ఒక కౄరమైన ప్రణాళిక ఉంది.

 'హిందూ రాష్ట్రం ' ఆవిర్భావానికి ముందు మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు 'జాతి వ్యతిరేకులు' అని,  ఇతర మతస్థులను కూడా అదే గాటన కట్టేసి, 80 శాతం ఉన్న అత్యధిక సంఖ్యాకులైన హిందూవుల చేత 'మమ' అనిపించాలి. 

ఇదంతా చట్టపరం, అల్లరిమూకల 'కీడుకలయిక'తో జరగాలి.

దీనిలో ట్రిపుల్ తలాక్, హిజాబ్ నిషేధం, గొడ్డుమాంసం నిషేధం, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరసత్వ నమోదు(ఎస్ఆర్ సీ), ఉమ్మడి పౌరశిక్షాస్మృతి వంటి వన్నీ మొదటి తరహావి.

శోభాయాత్ర, మసీదుల ముందు రెచ్చగొట్టే నినాదాలు చేయడం, బుల్ డోజర్లను ఉపయోగించడం, ధర్మ సంసద్‌లు, మీ ముఖం పైనే హనుమాన్ చాలీసా చదవడం వంటి వన్నీ రెండవ తరహావి. 

ఏమాత్రం కనికరం లేని పీడించే ఈ చర్యలకు తోడుగా, క్రూరంగా స్పందించడం, రెచ్చగొట్టడం, నినాదాలు చేయడం ద్వారా ఇతర మతస్తులను అధిక సంఖ్యాకుల దృష్టిలో దయ్యాలు, భూతాలుగా చిత్రించడాన్నే బీజేపీ కోరుకుంటోంది. 

సారవంతమైన నేలలో విభజన విత్తనాలు నాటడానికి భయమనే ఒక మానసిక జబ్బును సృష్టించాలనేది వారి ఆలోచన.

 ఈ విషయంలో బీజేపీ కొంత విజయాన్ని సాధించింది.

 జహంగీర్ పురి, ఖర్గోన్, జోధ్ పూర్ సంఘటనలన్నీ ఊహించినదానికంటే ఎక్కువ ఫలితాన్నిస్తున్నాయి.

పక్కదారి పట్టిన తన ప్రాపంచిక దృక్పథానికి మద్దతును కూడగట్టడంలో బీజేపీ పూర్తి విజయాన్ని సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. 

ప్రతి రోజూ వాట్సప్ ద్వారా విద్వేష పూరిత సందేశాలు పంపడం, మాద్యమాలలో వచ్చే వార్తల స్వభావం, వినిపించే కంఠస్వరాలను ఉద్యోగ విరమణ చేసిన వారి సమూహాలకు, మతత్వానికి అద్భుత రూపమైన క్రూరత్వం వల్ల లబ్ది పొందే పెద్ద పెద్ద పెట్టుబడులలో సభ్యులకు పంపడం, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి ఫిరాయించడం, ఎలక్ట్రోల్ బాండ్లకు బ్రహ్మాండంగా సాయపడడం, లఖింపూర్ కే రిలోని ఎనిమిది స్థానాలలో విజయం సాధించడం వంటివన్నీ దీనికి సాక్ష్యం.

 దేశంలో బీజేపీ మతతత్వ, అధిక సంఖ్యాక వాదాన్ని పూర్తిగా అంగీకరించడం ఒక వైపు అయితే, నోరుమూసుకుని ఉండడమో, దాంతో ప్రయాణించి మితిమీరిన లబ్ధి పొందడమో మరొక వైపు. 

ఈ మహత్తరమైన పథకాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే, బీజేపీ పాలిత రాష్ట్రాలలో రాష్ట్ర పోలీసుల ద్వారా, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా నిర్ధాక్షిణ్యంగా చిదిమేస్తారు. 

జిగ్నేష్ మెవానిని అరెస్టు చేసి 2,500 మైళ్ళ దూరంలో ఉన్న మరో రాష్ట్రంలోకి తీసుకెళ్ళడం, ఆకార్ పటేల్, రాణా అయూబ్ వంటి వారు విదేశాలకు వెళ్ళ కుండా అడ్డుకోవడం, తమకు ఇబ్బందిగా ఉన్న టీవీ స్టేషన్లను, యూట్యూబ్

ఛానళ్ళను మూసివేయడం, స్వచ్ఛంద సంస్థలను తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోమనడం, 'తప్పుడు' పాఠాలు చెప్పారని ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తొలగించడం, మీకిచ్చిన భూమిలోకి ప్రవేశించడాన్ని అడ్డుకుంటే మీ ఇళ్ళను బుల్ డోజర్ తో ధ్వంసం చేయడం.

మన ప్రధానమంత్రి తన దేశంలో ఎనిమిదేళ్ళుగా పత్రికా సమావేశం నిర్వహించకపోవడం, విదేశాలలో నిర్వహించే పత్రికా సమావేశాల్లో ప్రశ్నలకు అవకాశం ఇవ్వకపోవడం అనేది కారణం లేకుండా జరగదు. 

తాజాగా విడుదలైన పత్రికా స్వేచ్చ జాబితాలో మనం మరో ఎనిమిది స్థానాలకు దిగజారిపోవడం కూడా కారణం లేకుండా జరగలేదు.

 పత్రికా స్వేచ్ఛ గురించి సర్వేచేసి తయారుచేసిన 180 దేశాల జాబితాలో మనం 150వ స్థానంలో ఉన్నాం. 

అంతకు ముందు 142వ స్థానంలో ఉన్నాం. 

ఒక పెద్ద ధ్యేయాన్ని సాధించడంలో ఇవ్వన్నీ చిన్న చిన్న మార్పులే. 

బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకునే మార్గంలోనే దేశం స్థిరంగా పయనిస్తోందనడం ఒక చేదు నిజం. 

ఉదారభావాలున్న వారిలో, మైనారిటీలలో ఒక అలుపును సృష్టిస్తోంది. 

ప్రతిపక్షం కూడా దీనికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటోంది. 

నితీష్ కుమార్ ఏ క్రమశిక్షణలతో రాజకీయాలలో ఎదిగారో, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం(కాలం కలిసొచ్చి రాష్ట్రపతిగా ఎన్నికై ఆ పదవిలో ఉన్నంత కాలం) ఆ క్రమశిక్షణకు ద్రోహం జరిగిపోతూనే ఉంటుంది. 

పార్లమెంటులో ప్రభుత్వాన్నిసమర్థించినంతకాలం నవీన్ పట్నాయక్ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

 ఫెడరలిజానికి బీటలు వారడాన్ని పట్టించుకోనంత కాలం వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

 హిందీ భాషను బలవంతంగా రుద్దడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం వంటి వన్నీ వారి కాళ్ళ కింద భూమిని తొలిచేస్తున్నాయి.

అనైతికం, అవకాశ వాదం, ద్వంద్వ వైఖరిలో బహుశా వీరందరికంటే అరవింద్   కేజిరీ  వాల్ ఆరితేరినట్టున్నారు. 

మోడీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడడం, ముస్లీంలను పట్టించుకోకపోవడం, షాహిన్ బాగ్ ను, జహింగిర్ పురి, ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లను, రైతుల ఆందోళనను కానీ పట్టించుకోకపోవడం చాలా ముఖ్యం. 

నిజానికి హింస నుంచి బీజేపీని బయటపడేయడానికి రోహింగ్యాల పైన, బంగ్లాదేశీయుల పైన ఆరోపించారు. 

ఇది పూర్తిగా సంప్రదాయ (రైటిస్ట్) ఆలోచనా ధోరణి. 

దీనికి దేశం చెల్లించే మూల్యాన్ని త్వరలో చూస్తారు.

 రెండు పడవల పైన ప్రయాణం సాధ్యం కాదు. 

ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేయకపోవడ మంటే, ప్రధాని కుర్చీ జూలును ఒంటరిగా దువ్వడానికి ప్రయత్నించడం, బీజేపీ కోసం నేలలో మరింత లోతుగా విత్తడానికి ఎక్కువ కాలం లేదు. 

ఇతర రాష్ట్రాలు త్వరలో బీజేపీని అనుసరించడానికి ఇదొక హెచ్చరిక; పశ్చిమ బెంగాల్ లో హింస, మహారాష్ట్రలో రాణా దంపతులపై దేశద్రోహ నేరం మోపడం, ఢిల్లీలో అలకాలంబ, కుమార్ విశ్వాస్లపై కే జిరీ  వాల్ పంజాబ్ పోలీసులను ప్రయోగించడం, రాజస్థాన్ లోని అల్వార్ లో బుల్ డోజర్‌ను ప్రయోగించడం. 

ప్రభుత్వం అనుసరించే తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పోరాడుతున్నప్పుడు, ఆ విధానాల అమలుకు ఇవ్వన్నీ అనుసరించే పద్ధతులు. 

ఈ రాష్ట్రాలు, వాటి ముఖ్యమంత్రులు బీజేపీ వాదనలకు చట్టబద్దతను కల్పిస్తాయి. 

రానున్న 'హిందూ రాష్ట్ర ఏర్పాటుకు పరిపాలనా పరమైన ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి.

 రాజ్యాంగ సంస్థలతోపాటు అన్ని సంస్థలు దీనిలో భాగస్వామ్యం కావడానికి అనుగుణంగా ఉన్నాయి. 

వాటికి అనుగుణంగా విద్యా రంగంలో పాఠ్యాంశాలు తయారు చేసే విభాగాలు కూడా ఫైజ్, మొగలుల చరిత్ర, ఫెడరలిజం, లౌకిక వాదం, సామాజిక, ఆర్థిక అసమానతలు వంటి ప్రజాస్వామిక భావనలను తొలగించేస్తున్నాయి. 

కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి అనుగుణంగా అఖిల భారత సర్వీసు నిబంధనలను మార్చివేస్తున్నారు. 

తాజాగా కశ్మీరుకు చెందిన తొలి ఐఏఎస్ అధికారి షాఫాయిజల్ ను రాజీనామా చేసిన మూడేళ్ళ తరువాత నిబంధనలకు వ్యతిరేకంగా మళ్ళీ సర్వీసులోకి తీసుకోవడం, కశ్మీర్ లో తమకు ఉపయోగపడతారని ఉండవచ్చు. 

కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ నిష్పక్షపాతంగా ఉండలేము అంటున్నాయి. 

మనదొక పోలీసు రాజ్యంగా తయారవుతోందని అస్సాంలో సెషన్స్ జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది ఊహాజనితమైనదని అస్సాం హైకోర్టు ఆ మాటను నిలిపివేసింది).

ఆర్మీ ప్రజాసంబంధాల అధికారి(పీఆర్ఓ) ఇఫ్తార్ విందుపై చేసిన ట్వీట్ ను తొలగించారు. 

సైన్యం కూడా అదే మార్గంలో పయనిస్తోందనడానికి ఇదొక చిన్న సంకేతం. 

కానీ, మనం ఇక్కడ మాట్లాడుతున్నదంతా భూతాలు, ప్రేతాలు వీస్తున్న గాలి గురించి. 

నిర్మొహమాటంగా చెప్పాలంటే న్యాయవ్యవస్థ మిశ్రమ లక్షణాలతో ఉంది. 

ఉపా చట్టం కింద అరెస్టైన నటాషా నర్ వాల్, దేవనగనకలిత లకు ఢిల్లీ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేయడం, పెగాసెస్ పైన విచారించడం, 'భద్రత' పేరుతో ఒక ఛానెల్ ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయడం వంటి శాశ్వతంగా నిలిచిపోయే తీర్పులను కూడా వచ్చాయి.

'ఉపా' చట్టం పైన ఇచ్చిన తీర్పులు ఎలగార్ పరిషత్ కేసులో నిర్బంధితుల వంటి వారికి వర్తించలేదు.

 ఎలక్ట్రోల్ బాండ్ల పైన ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను, వాటి మౌలికమైన సవాళ్ళను పట్టించుకోకపోవడం, కశ్మీర్ ను పునర్నిర్మించడం, ఆర్టికల్ 370, ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను నిర్ణయించడం వంటి వాటి పైన వాదనలను వినలేదు సరికదా, నిర్ణయం కూడా జరగలేదు. 

వందలాది హెబియస్ కార్పస్ ఫిర్యాదులపై వాదనలను వినలేదు. 

బుల్ డోజర్ల తో విధ్వంసం కొనసాగుతూనే ఉంది.

 ప్రభుత్వం చేసిన అన్యాయానికి గురైన వారికి, రాజ్య హింసకు బాధితులైన వారికి పరిహారం నిర్ణయించలేదు. 

ఉమర్ ఖలీదా కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను గమనించినట్టయితే, ప్రధానిపై ఏ విమర్శ రాకుండా ఆయన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసినట్టు స్పష్టమవుతోంది.

 మనం రోజు వారి వాడే పదాల నిఘంటువులో "తప్పుడు హామీలు” “క్రాంతి కార్” “ఇంక్విలాబ్' వంటివి సర్వసాధారణం. 

భావవ్యక్తీకరణలో ఏ పదాలు వాడాలో న్యాయస్థానాలు నిర్ణయించాలా?

 న్యాయవ్యవస్థను ఎవరు నడుపుతున్నారనేది అంచనా వేయడం కష్టం. 

దాని సంకేతాలు ప్రోత్సాహకరంగా లేవు.

హిందూ రాష్ట్రం ' ఏర్పడడానికి దేశం సిద్ధమైంది. 

ఎన్నికల్లో బీజేపీ తన గెలుపును కొనసాగిస్తోంది. 

బెంగాల్ వలె ఎక్కడైతే గెలవలేదో, అక్కడ తన ఓటు బ్యాంకును పెంచుకుంటుంది. 

ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాలు దీన్ని అంగీకరించకపోవచ్చు.

 డీలిమిటేషన్ కమిషన్లు, ఫైనాన్స్ కమిషన్లు, ఐఏఎస్, ఐపీఎస్ ల‌కు పునశచ్చరణ తరగతులు, పెగాసెస్ గూఢచర్యం, ఎలక్ట్రోల్ బాండ్లలో పెట్టిన కోట్ల రూపాయల వాడకం వంటి వాటి వల్ల దక్షిణాది రాష్ట్రాలను కూడా ఈ దారిలోకి తీసుకొస్తారు. 

మంటలు మన ఇళ్ళకు ఎంత దగ్గరగా వచ్చాయో అర్థం చేసుకోవచ్చు.

 వీటి నుంచి తప్పించుకోవడానికి మౌనం ఏ రకంగానూ భద్రమైంది కాదు. 

కవి షేక్ ఇబ్రహీం జక్ మనల్ని అడిగినట్టు:

“భయంతో ఇప్పుడు చనిపోతున్నామంటారు. చనిపోయాక కూడా శాంతి దొరకకపోతే ఇంకెలా?”

'ద వైర్' సౌజన్యంతో

నేటి 'మ‌న తెలంగాణ'  లో వ చ్చిన క‌థ‌నం

No comments:

Post a Comment