Tuesday, 3 May 2022

ఉర్దూలోనూ గ్రూప్‌-1 పరీక్షలా? హిందువులకు ఉద్యోగాలు రాకుండా కుట్ర

ఉర్దూలోనూ గ్రూప్‌-1 పరీక్షలా? హిందువులకు ఉద్యోగాలు రాకుండా కుట్ర

ఆ జవాబు పత్రాలను ఎవరు దిద్దుతారు

హిందువులకు ఉద్యోగాలు రాకుండా కుట్ర

ఇలాంటి దుశ్చర్యలను సహించేది లేదు

బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


మహబూబ్‌నగర్‌, మే 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘గ్రూప్‌-1 ఉద్యోగాలు హిందూ యువతకు రాకుండా సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు. గ్రూప్‌-1 పరీక్షలు ఉర్దూలో రాసేందుకు అనుమతించారు. ఆ జవాబు పత్రాల్ని ఎవరు దిద్దుతారు. ఒక వర్గానికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేందుకే సీఎం కేసీఆర్‌ ఈ పన్నాగం పన్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా దేవరకద్రలో జరిగిన బహిరంగ సభలో సంజయ్‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కుట్రపై బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్‌ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా హిందూ యువత తరఫున  తాము పోరాడతామని, యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ భాషలకు బీజేపీ వ్యతిరేకంకాదని, కానీ మత ప్రాతిపదికన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు. పాలమూరులో వలసలున్నాయని తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని.. అలా చేస్తే.. సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుందా..? అని సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనని.. ప్రజలను మోసం చేసేందుకే ఉస్మానియా వర్సిటీకి రాహుల్‌గాంధీ రాక పేరుతో నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కేంద్రం ధాన్యం కొనడంలేదని రాజకీయం చేస్తూ, సకాలంలో కొనుగోలు చేయకుండా రైతులకు నష్టం కలిగించేలా సీఎం కేసీఆర్‌ కార్యాచరణ అమలు చేస్తున్నారని చెప్పారు. తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోతే, కేంద్రాన్ని బద్నాం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. 

No comments:

Post a Comment