Monday, 21 February 2022

కర్ణాటకలో ‘హిజాబ్‌’పై అదే రగడ

 కర్ణాటకలో ‘హిజాబ్‌’పై అదే రగడ

Feb 08, 2022, 06:00 IST

Hijab row hots up in Karnataka, CM Basavaraj Bommai appeals for peace - Sakshi

రాష్ట్రంలో శాంతిని కాపాడాలని సీఎం బసవరాజ బొమ్మై విజ్ఞప్తి


బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్‌(బురఖా) గొడవ మరింత ముదురుతోంది. విద్యాసంస్థల్లో నిర్దేశిత ఏకరూప దుస్తులు(యూనిఫామ్‌) ధరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు విద్యార్థులు ధిక్కరించారు. ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌లో ఓ కాలేజీలో విద్యార్థినులు సోమవారం హిజాబ్‌ ధరించి తరగతులకు హాజరయ్యారు. వారితో ప్రిన్సిపాల్‌ మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వు గురించి వివరించారు. హిజాబ్‌ తొలగించేందుకు విద్యార్థినులు నిరాకరించారు. దీంతో వారికోసం కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్లాలని ప్రిన్సిపాల్‌ సూచించారు. ఇందుకు నిరసనగా వారు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించారు. హిజాబ్‌ రగడపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పందించారు.








రాష్ట్రంలో శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూనిఫామ్‌ నిబంధనలు పాటించాలని విద్యాసంస్థలను కోరారు. హిజాబ్‌పై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్‌ మాట్లాడుతూ.. హిజాబ్‌ ధరించిన వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు. రోడ్లపై నిరసనకు దిగితే పాఠాలు కోల్పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. రోడ్లపై బైఠాయించడం భారతీయ సంస్కృతి కాదన్నారు. హిజాబ్‌ ధరించినవారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.


అలాంటి వారిని సాధారణ తరగతుల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ చిక్కబళ్లాపూర్, బాగల్‌కోట్, బెళగావి, హసన్, మండ్య తదితర ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు ధరించి, కాలేజీలకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం కావాలంటూ బెళగావి, మండ్యాలో విద్యార్థినులు నిరసన ర్యాలీ చేపట్టారు. హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. చిక్కమగళూరులో కొందరు విద్యార్థులు నీలి రంగు కండువాలు ధరించి, కాలేజీకి చేరుకున్నారు. జైభీమ్‌ అంటూ నినదించారు. హిజాబ్‌ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. 

జాతీయంహిజాబ్ ధరించిన విద్యార్థినులు తరగతులకు రాకుండా నిషేధం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750బెంగళూరు : ముస్లిమ్ విద్యార్థినులు హిజాబ్ లతో తరగతులకు హాజరుకాకుండా విధించిన నిషేధంపై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు విచారించనుంది.జనవరి 1వతేదీన కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకాకుండా నిషేధించారు. కళాశాల యాజమాన్యం నిషేధానికి కారణం వెనుక కొత్త యూనిఫాం విధానాన్ని ఉదాహరించింది. హిజాబ్‌పై నిషేధానికి వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడంతో ఈ సమస్య ఇప్పుడు ఉడిపిలోని ఇతర ప్రభుత్వ కళాశాలలకు వ్యాపించింది.కుందాపురలో విద్యార్థినులు ఇప్పటికీ తరగతులకు హాజరు కావడం లేదు.కుందాపురా కళాశాలలో మొత్తం 28 మంది ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకావద్దని ముస్లిం బాలికలు హిజాబ్ ధరించాలని పట్టుబట్టినందుకు ప్రతిస్పందనగా కొన్ని హిందూ సంఘాలు కాలేజీ క్యాంపస్‌లో అబ్బాయిలను కాషాయపు శాలువాలు ధరించమని కోరాయి.

కాగా హిజాబ్ వివాదంపై కర్నాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ట్విటర్‌లో క్లారిటీ ఇచ్చారు. నిరసన తెలుపుతున్న విద్యార్థినులు విడిగా కూర్చుని తమ నిరసనను కొనసాగించాలన్నారు. తరగతులకు హాజరు కావాలంటే విద్యార్థినులు తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌ను పాటించాలని విద్యాశాఖ మంత్రి పునరుద్ఘాటించారు.హిజాబ్ ధరించాలని పట్టుబట్టే విద్యార్థినులను ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించబోమని బీసీ నగేష్ తెలిపారు.చిక్కమంగళూరు కళాశాలలో కొంతమంది విద్యార్థులు నీలిరంగు కండువాలు ధరించి వచ్చి, కాషాయ కండువాలు ధరించిన వారి ముందు ‘జై భీమ్’ నినాదాలు చేశారు. హిజాబ్ ధరించిన బాలికలకు మద్దతుగా కొందరు విద్యార్థులు నీలం కండువాలు ధరించారు.


Feb 8 2022 @ 01:26AMహోం జాతీయం

హిజాబ్‌’పై పార్లమెంటులో రగడ కర్ణాటక సర్కారు తీరుపై పలువురి అభ్యంతరం


బెంగళూరు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ముఖాన్ని కప్పేసేలా ముస్లిం విద్యార్థినులు ధరిస్తున్న వస్త్రధారణ(హిజాబ్‌) అంశంపై పార్లమెంటులో రగడ చోటు చేసుకుంది. సోమవారం లోక్‌సభలో ఈ అంశాన్ని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షాలకు చెందిన సభ్యులు ప్రస్తావించారు. విద్యార్థినుల వస్త్రధారణ ఆధారంగా బోధనను అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ తక్షణం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటక సర్కారు తీరు సరికాదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని ఉడుపి కళాశాలలో ప్రారంభమైన హిజాబ్‌ వివాదం రాష్ట్రంలోని పలు జిల్లాలకు విస్తరించి ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. దీని వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఆరోపించారు. 



శివమొగ్గ ఉద్రిక్తతలు: కొనసాగుతున్న బజరంగ్‌ దళ్‌ నిరసనలు.. వాడివేడిగా రాజకీయ విమర్శలు

Feb 21, 2022, 15:31 IST

Protest Over Karnataka Shivamogga Amid Bajrang Dal Man Murder - Sakshi

Shivamogga Tensions: బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హత్యోదంతం కన్నడ నాట కార్చిచ్చు రగిల్చింది. హర్ష అనే 26 ఏళ్ల వ్యక్తిని గత రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో శివమొగ్గలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 







సాక్షి, బెంగళూరు: బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హత్యకు నిరసనగా సోమవారం సీగేహట్టిలో వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. టియర్‌ గ్యాస్‌ ప్రదర్శించి.. నిరసనకారులను చెదరగొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రెండురోజులపాటు విద్యా సంస్థల బంద్‌ ప్రకటించడంతో పాటు జనాలు గుమిగూడడంపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ.. బజరంగ్‌ దళ్‌ మద్దతుదారులు హర్ష మృతదేహాంతో భారీగా ర్యాలీ తీస్తూ ఇంటికి తీసుకెళ్లారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్‌ నెలకొంది. 


‘హిజాబ్‌’తో సంబంధం లేదు!

ఇదిలా ఉండగా.. హిజాబ్‌ వివాదం వల్లే ఈ హత్య జరిగిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం నడుస్తుండడం కలకలం రేపింది. దీనిని ఖండిస్తూ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఈ హత్యకు కారణం వేరే ఉంది. పోలీసులు కేసును చేధించే పనిలో ఉన్నారు. శివమొగ్గ సమస్యాత్మక ప్రాంతం. కాబట్టి, ఇలాంటి పుకార్లను ప్రసారం చేయకండని ఆయన విజ్ఞప్తి చేశారు. 


మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై.. ఘటనపై స్పందించారు. పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయని, దర్యాప్తు వేగంగా జరుగుతోందని, నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ప్రకటించారు.

No comments:

Post a Comment