Saturday, 12 February 2022

హిజాబ్‌ను టచ్ చేసి చూడండి.. చేతులు నరికేస్తా: సమాజ్‌వాదీ పార్టీ నేత రుబీనా

 హిజాబ్‌ను టచ్ చేసి చూడండి.. చేతులు నరికేస్తా: సమాజ్‌వాదీ పార్టీ నేత రుబీనా


అలీగఢ్: కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ను తాకింది. కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థలు హిజాబ్‌ను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అలీగఢ్ ముస్లి యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ నేత రుబీనా ఖానం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


హిజాబ్‌ను తాకేందుకు ప్రయత్నించే చేతులను తెగనరుకుతాని హెచ్చరించారు. భారతదేశ అక్కచెల్లెళ్లు, కుమార్తెల ఆత్మగౌరవంతో ఆడుకోవాలని ప్రయత్నిస్తే వారు ఝాన్సీ రాణి, రజియా సుల్తానాల్లా మారి హిజాబ్‌ను తాకే వారి చేతులను తెగ నరకడానికి ఎంతో సమయం పట్టదని అన్నారు.


భిన్నత్వంలో ఏకత్వం భారత్ గొప్పతనమని, ఇక్కడ ఎవరి మతాచారాలను వారు అనుసరిస్తారని పేర్కొన్నారు. కొందరు నుదట తిలకం దిద్దుకుంటే మరికొందరు తలపాగా ధరిస్తారని, ఇంకొందరు హిజాబ్ ధరిస్తారని అన్నారు. కొంగుతో ముఖాన్ని దాచుకోవడం (ఘూంఘట్), హిజాబ్ దేశ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు వీటిని వివాదాస్పదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని  నడిపించొచ్చని, కానీ మహిళల బలహీనులని మాత్రం భావించొద్దని రుబీనా హితవు పలికారు.

No comments:

Post a Comment