గాంధీ మహాత్ముడా?
04-02-2020 01:33:15
ఆయన నిరశన, సత్యాగ్రహం పెద్ద నాటకం
స్వాతంత్య్ర పోరాటం వట్టి డ్రామా
బ్రిటిష్ వారి సహకారంతో నాటకం ఆడారు
నా రక్తం మరిగిపోతోంది.. బీజేపీ ఎంపీ హెగ్డే
రాజ్యాంగంపై రామకృష్ణులు, హనుమ ఫొటోలుండేవి
కాంగ్రెస్ తొలగించింది.. మరో ఎంపీ పర్వేజ్ వర్మ
నిరసనకారులను షూట్‌చేయాలని
గతంలో అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య
దద్దరిల్లిన పార్లమెంట్.. ఇరకాటంలో బీజేపీ
‘‘గాంధీ ఆమరణ దీక్షలు, సత్యాగ్రహం వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని కాంగ్రెస్ సమర్థకులు అంటూ ఉంటారు. మా పోరాటం చూసి బ్రిటిషర్లు భయపడిపోయి స్వాతంత్య్రం ఇచ్చేశారని చెబుతుంటారు. కానీ నిజం ఏంటంటే... సత్యాగ్రహాల వల్ల బ్రిటిష్‌వారు దేశాన్ని వదిలిపోలేదు. వారు విసిగిపోయి మనకు స్వాతంత్య్రం ఇచ్చారంతే! ఇలాంటి చరిత్రను చదివినపుడు నా రక్తం మరిగిపోతుంది. గాంధీ లాంటివారు ఈ దేశంలో మహాత్ములైపోయారు’’
- అనంతకుమార్ హెగ్డే
బెంగళూరు-న్యూఢిల్లీ ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ ఎంపీలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని తీవ్ర ఇరకాటంలో పడేస్తున్నాయి. జాతిపిత గాంధీజీ నడిపించిన స్వాతంత్య్ర సమరం పెద్ద డ్రామా అని ఒక ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేయగా..... రాజ్యాంగంపై రాముడు, కృష్ణుడు, హనుమంతుడి చిత్రాలుండేవని మరో ఎంపీ అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన సాగిస్తున్న వారు ప్రజల ఇళ్లల్లోకి వచ్చి మీ చెల్లెళ్లను, ఆడవారిని రేప్ చేస్తారని ఒక ఎంపీ అంటే ఆందోళనకారులందరినీ కాల్చిపారెయ్యాలని మరో ఎంపీ తీవ్రంగా మండిపడ్డారు.
శ్రుతి మించి వారు చేస్తున్న ఈ వ్యాఖ్యలు సోమవారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యా యి. విపక్షాల విమర్శలకు తావిచ్చాయి. పార్లమెంటు దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మాజీ మంత్రి, కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఈసారి జాతిపిత మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘గాంధీజీ సహా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నేతలెవరూ పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినలేదు. అదంతా ఓ డ్రామా.
బ్రిటిష్ వారి సహకారంతో ఆడిన పెద్ద నాటకం. గాంధీ చేసిన ఆమరణ నిరాహార దీక్షలు, సత్యాగ్రహం కూడా నాటకమే. బ్రిటిష్ వారి అనుమతితో, వారితో కుమ్మక్కై చేసిన స్వాతంత్య్ర సమరం’’ అని హెగ్డే ఆదివారం ఉత్తర కన్నడ జిల్లాలో వీర్ సావర్కర్ సంస్మరణార్థం జరిగిన ఓ సభలో వ్యాఖ్యానించారు. ‘‘స్వాతంత్య్ర పోరాటాలు రెండు రకాలు. ఒకటి శస్త్రంతో (ఆయుధాలతో) కూడినది. రెండోది శాస్త్రయుతమైనది (మేఽధో పరమైన ప్రోద్బలంతో జరిగేది). ఈ రెండూ కాక మూడో రకం స్వాతంత్య్ర వీరులుంటారు. బ్రిటిష్ వారిని సంప్రదించి పోరాటం ఎలా చెయ్యాలో వారిని అడుగుతారు. మీరేం చెబితే అది చేస్తామని ఓ అవగాహనకు వస్తారు. ఇది ట్వంటీ20 మ్యాచ్ లాంటిది. మమ్మల్ని జైల్లో వేయాలని బ్రిటిషర్లను వేడుకుంటారు. ‘మమ్మల్ని సరిగా చూసుకుంటే చాలు. అంతకుమించి అక్కర్లేదు’ అంటారు. మన పోరాట వీరులు ఈ మూడోరకం’’ అని ఘాటుగా అన్నారు. ‘‘గాంధీజీ సత్యాగ్రహాలతో బ్రిటి్‌షవారు దేశాన్ని వదిలిపోలేదు. వారు విసిగిపోయి మనకు స్వాతంత్య్రం ఇచ్చారంతే! ఇలాంటి చరిత్రను చదివినపుడు నా రక్తం మరిగిపోతుంది’’ అన్నారు.
‘సీఏఏను వెనక్కి తీసుకోం’
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఏఏ ఆందోళనకారులపై తీవ్రవ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ లోక్‌సభలో విపక్షాల వాగ్బాణాలు ఎదుర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించే అవకాశాన్ని బీజేపీ పర్వేశ్‌కు ఇచ్చింది. షహీన్ బాఘ్ ఆందోళనకారులను రేపిస్టులుగా, హంతకులుగా కిందటి వారం అభివర్ణించిన పర్వేశ్‌కు అవకాశం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తూ కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు వాకౌట్ చేశాయి. అయినా పర్వేశ్ మళ్లీ షహీన్‌బాఘ్ ఆందోళనను లేవనెత్తారు.
‘‘ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను చంపేస్తామని ఆందోళనకారులన్నారు. ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ ప్రభుత్వం కాదు. మోదీ సర్కార్..’ సీఏఏను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదు’’ అని తేల్చిచెప్పారు. పైపెచ్చు ‘జై శ్రీరామ్’ అని నినదించాలని కాంగ్రెస్, విపక్ష సభ్యులనుద్దేశించి అన్నా రు. ‘‘నిజానికి దేశ రాజ్యాంగ అసలు ప్రతిపై రాముడు, కృష్ణుడు, హనుమంతుల వారి చిత్రాలుండేవి. కాంగ్రెస్ హయాంలో వాటిని తొలగించారు’’ అన్నారు.
‘బీజేపీ నేతలు నకిలీ హిందువులు’
ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా విపక్ష ఆగ్రహానికి గురయ్యారు. షహీన్‌బాఘ్ ఆందోళనకారులను కాల్చిపారెయ్యాలన్న వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశారు. ‘‘కాల్చిపారెయ్యడాన్ని ఆపండి.. ఎక్కడ మీ బులెట్లు?’’ అని ప్రశ్నించారు. జీరో అవర్‌లో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదురీ మాట్లాడుతూ.. ప్రజల గొంతును తూటా సాయంతో అణిచేయలేరన్నారు.
‘ప్రజలంతా రాజ్యాంగాన్ని కాపాడటం కోసం నిరసనలు తెలుపుతుంటే పోలీసులు వారిని నిర్దయగా హింసిస్తున్నారు. మీరంతా నకిలీ హిందువులు.’’ అని ఆయన ఎండగట్టారు. లోక్‌సభ మఽధ్యాహ్నం వరకూ స్తంభించిపోగా, రాజ్యసభలో రోజంతా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోయారు. లోక్‌సభలో కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే సహా 30 మంది ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. రాజ్యసభలోనూ ఇదే తంతుతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.
అనంత్ హెగ్డేకు షోకాజ్
ఎంపీలు, మంత్రుల వ్యాఖ్యలు బీజేపీని ఇబ్బందుల్లో పడేశాయి. వెంటనే క్షమాపణ చెప్పాలని అనంత్ హెగ్డేను పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరణ ఇవ్వాంటూ షోకాజ్ నోటీసును కేంద్ర నాయక త్వం ఆయనకు జారీ చేసింది. అటు కాంగ్రెస్ మాత్రం హెగ్డేపై నిప్పుల వర్షం కురిపించింది. ‘గాంధీజీ 150వ జయంత్యుత్సవాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రధాని పార్లమెంట్‌కు వచ్చి ఈ వ్యాఖ్యలను ఖండించాలి. తాను గాంధీకి విధేయులో గాడ్సేకో అన్నది తేల్చిచెప్పాలి’’ అని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment