Saturday, 5 October 2019

అయోధ్యపై 17నే వాదనలు ముగించాలి: సుప్రీం

అయోధ్యపై 17నే వాదనలు ముగించాలి: సుప్రీం

05-10-2019 02:54:18
న్యూఢిల్లీ, అక్టోబరు 4: అయోధ్య వివాదంపై వాదనలను ఈనెల 17వ తేదీనే ముగించాలని సుప్రీంకోర్టు కక్షిదారులందరినీ ఆదేశించింది. వాదనల ముగింపునకు తుది గడువును ఈనెల 18గా మొదట సుప్రీం నిర్ణయించింది. కానీ ఆ డెడ్‌లైన్‌ను తాజాగా ఒకరోజు ముందుకు జరిపింది. 17న విచారణ సంపూర్ణంగా ముగించాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. నవంబరు 17న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ చేయనున్నారు. ఆ లోగా తీర్పు వెలువరించాలన్నది బెంచ్‌ యత్నం.

కేంద్ర గుమ్మటం కిందే పుట్టాడా?: ముస్లిం పక్షాలు
‘‘అయోధ్యలో రాముడు పుట్టాడు. కాదనం... కానీ ఆ అయోధ్యలో ఎక్కడ పుట్టాడు? నేలమట్టం చేసిన బాబ్రీమసీదు కేంద్ర గుమ్మటం కింది భాగంలోనే రాముడు పుట్టాడని అంటున్నారు. ఏమిటి దానికి ఆధారం? అసలు వివాదం ఇదే... ఆ చోటే పుట్టాడని చెప్పలేమని హిందూ పక్షాలు ఒప్పుకొని ఉండుంటే ఈ వివాదం ఎప్పుడే తేలిపోయేది’’ అని ముస్లిం పక్షాల తరఫున వాదించిన రాజీవ్‌ ధవన్‌ అన్నారు. 1950-1990 కాలం లో మసీదు రూపురేఖలు మార్చే ప్రయత్నాలెన్నో చేశారని వాదించారు.

No comments:

Post a Comment