గురి తప్పిన ఆనందాలు, ఆవేశాలు!
కె. శ్రీనివాస్
మంచివ్యాసం తప్పక చదవండి
20-06-2019 03:31:46
మన ఉద్వేగాలను, సంస్కారాన్ని ఉన్మాదాలకు తాకట్టు పెట్టినందువల్ల, సున్నితత్వాలను కోల్పోతున్నాం. సామరస్యాన్ని మరచిపోతున్నాం. మాంచెస్టర్‌లో ఇండోపాక్ మ్యాచ్ చూడడానికి కెనడా నుంచి ఒక జంట వచ్చింది. వారిలో ఒకరు పుట్టుకతో భారతీయులు, మరొకరు పుట్టుకతో పాకిస్థానీ. వాళ్లిద్దరూ భారత్–పాక్ క్రికెట్ జెర్సీలను సగం సగం కలిపి దుస్తులుగా కుట్టించుకున్నారు. కేవలం క్రీడావినోదం కోసం వాళ్లు అక్కడికి వచ్చారు. అంతే కాదు, రెండుదేశాల మధ్య శాంతి కోసం కూడా వచ్చారు! కానీ, ఈ జంట గురించి మన మీడియా పెద్ద హడావుడి చేయలేదు. యుద్ధానికి బదులు శాంతిని కోరుకోవడం ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ మాత్రమే కాదు, దేశద్రోహం కూడా.
వెస్టిండీస్‌ను బంగ్లాదేశ్ ఓడించిందంటే, ఆశ్చర్యంగా మాత్రమే కాదు, ముచ్చటగా కూడా ఉంటుంది. సాధారణంగా ప్రేక్షక స్థానంలో ఉండి, రెండు పక్షాల పోరాటాన్ని చూస్తున్నప్పుడు, మనకు తెలియకుండానే మనసు బలహీనుల పక్షం మొగ్గుతూ ఉంటుంది. సినిమా చూసినా అంతే, తోటరాముడు మాంత్రికుడిని ఓడిస్తే సంతోషం కానీ, లావుపాటి ప్రతినాయకుడు బక్కహీరోని తొక్కేస్తే ఏం ఆనందం ఉంటుంది? చిన్నదేశాల వాళ్లు, అణగారినవాళ్లు, విజేతలవుతారని ఎవరూ ఊహించని వాళ్లూ– ఇటువంటి అండర్‌డాగ్స్ పెద్ద ప్రత్యర్థిని ఓడిస్తే, ప్రేక్షకులలో ఉండే సహజన్యాయ అభిరుచికి ఏదో సంతృప్తి దొరుకుతుంది. అట్లాగే, ఓడిపోతే బాగుండని మనం అనుకునే పక్షంలో ధాటిగా, నిపుణతతో ఆడేవాళ్లు ఉంటే, వాళ్ల మీద కూడా అభిమానం కలుగుతుంది. ప్రేక్షకత్వం ఒక్కోసారి తటస్థత కూడా. దెయ్యంలో అయినా మంచి గుణం కనిపిస్తే గుర్తించడం, నిష్పక్షపాతమైన క్రీడాస్ఫూర్తి కలిగి ఉండడం మంచి విలువలని మనకు తెలుసు.
ప్రపంచకప్పు క్రికెట్ పోటీలో భాగంగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జూన్ 16 నాడు ఇండియా–పాకిస్థాన్ ఆడాయి. ఈ ఆటకు ముందు విపరీతమైన ఆసక్తి, ఉత్కంఠ, ఊహాగానాలు, బెట్టింగ్. ఆరేడేళ్ల నుంచి ఇండియా పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ ఆడడం లేదు. ఏడాదిగా ఇతర వేదికల మీద కూడా ఆడలేదు. దాయాదుల పోరు– అని మీడియా బాధ్యతారహితంగానో, అలవాటుగానో పిలిచే సందర్భం కాబట్టి కొంత, ఈ విరామం తరువాత ఆడుతున్న ఆట కాబట్టి మరి కొంత, జూన్ 16ను ప్రత్యేకమైన రోజుగా చేశాయి. అయితే, చాలా కాలంగా పాకిస్థాన్ జట్టు బలహీనంగా ఉంటున్నది. ప్రపంచకప్పులో గత ఆరు మేచ్‌లలో పాకిస్థాన్ ఓడిపోతూనే ఉన్నది. క్రికెట్ మెరుగుదలకు పాకిస్థాన్‌లో పెద్దగా జరుగుతున్న ప్రయత్నం కూడా ఏమీ లేదు. క్రికెట్ ఆటగాడు ప్రధాని అయినంత మాత్రాన పాక్‌జట్టు అకస్మాత్తుగా ప్రతిభాశాలి అయిపోదు కదా? అయినా, సరే, టోర్నమెంట్‌లో భారత–పాక్ మేచ్ చుట్టూ అమితమైన ఉత్కంఠ ఆవరించింది. ఆడుతున్న ఇంగ్లండ్‌లో ఈ మేచ్‌కు ప్రత్యేకత ఏమీ లేదు. అన్నిటిలాగే, ఇది కూడా ఒకానొక మేచ్, అంతకు మించి ఏ ప్రాధాన్యమూ లేదు– అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ఇదేమీ యుద్ధం కాదు, కేవలం ఆట మాత్రమే– అని పాకిస్థాన్ క్రీడాకారులు కూడా వ్యాఖ్యానించారు. కానీ, భారత్‌లోనూ, బహుశా పాకిస్థాన్‌లో కూడా ఒకరకమైన ఉద్రిక్తతా పూర్వక ఆసక్తి ఆవరించింది. కానీ, క్రికెట్‌ను జాగ్రత్తగా గమనిస్తున్నవారెవరికైనా తెలిసిన విషయం– భారత జట్టు ముందు పాక్ జట్టు తీసికట్టు అని. అనుకున్నట్టుగానే పాక్ ఓడిపోయింది. పాక్ కెప్టెన్‌కు కొవ్వు పెరిగిందా, తిండిపోతయ్యాడా, నిర్లక్ష్యం చేశాడా–అన్నవన్నీ క్రీడారంగ చర్చలే కానీ, ఫలితం మాత్రం పాక్ ఓటమి. అది కూడా ఏమంత హోరాహోరీ కాని ఆట. చప్పగా ముగిసిన క్రీడ. అయినాసరే, భారతీయ మీడియాకు పూనకం తగ్గలేదు. అదేదో ప్రపంచయుద్ధంలో మనమే గెలిచినట్టు పతాకశీర్షికలన్నీ పులిమేశారు. ఇది కూడా మరో సర్జికల్ స్ట్రయిక్– అని సాదాసీదా వ్యక్తి అనుకుంటేనో, లేదంటే ఓ వ్యంగ్యచిత్రకారుడు చిత్రిస్తేనో పరవాలేదు కానీ, భారతదేశ నూతన హోంమంత్రి, పాక్‌కు మరో దెబ్బ, భళిభళీ అంటూ ట్విట్టర్‌లో వీరంగం వేశారు. బలహీనంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్న టీమ్ మీద సాధించిన గెలుపు (అది టోర్నమెంట్‌లో భారత్‌ను ముందుకు తీసుకుపోయి ఉండవచ్చు) ఏ విధంగానూ అంత హంగామాకు తగినది కాదు. రోహిత్ సెంచరీ ఒక్కటే చెప్పుకోదగ్గ విశేషం అందులో. మరి ఎందుకు మనం బలహీనప్రత్యర్థిపై విజయానికి అంతగా సంబరపడుతున్నాం?
క్రీడలు, రాజకీయాలు పరస్పరం సంబంధం లేనట్టు ఉండడం కూడా సాధ్యం కాదు, వాంఛనీయం కూడా కాదు. దక్షిణాఫ్రికా అనుసరించిన వర్ణవివక్ష విధానాలకు వ్యతిరేకంగా మనం ఆ దేశంలో ఏ ఆటా ఆడలేదు. 1975లో కావచ్చు, డేవిస్ కప్ డబల్స్ పైనల్స్ దాకా వచ్చిన భారత్, ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కావడంతో కప్పు వదులుకుంది. సోవియట్ యూనియన్ మీద నిరసనగా మాస్కో ఒలింపిక్స్‌ను అనేక దేశాలు బహిష్కరించాయి. అది వేరు. భారత పాకిస్థాన్ దేశాలు బహిష్కరించుకోవు, ఆటలాడతాయి, ఆ ఆటలద్వారా రాజకీయ, సైనిక, మత భావోద్వేగాలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. దాదాపుగా దేశవిభజన నుంచి ఇది జరుగుతున్నదే. ఇంతకాలం తరువాత ఇప్పుడు వెనుకకు తిరిగి చూస్తే, భారత– పాకిస్థాన్‌ల మధ్య వివిధ రంగాలలో అంతరం పెరుగుతూ రావడం కూడా గుర్తించవలసిన క్రమం. ఆర్థికరంగంలో కానీ, వైజ్ఞానికాభివృద్ధిలో కానీ, అంతర్గత శాంతి భద్రతల అంశంలో కానీ పాకిస్థాన్ చాలా దయనీయస్థితిలో ఉన్నది.
మహమ్మదాలీ జిన్నా పాకిస్థాన్ ఏర్పాటు ద్వారా సాధించదలచుకున్న లక్ష్యాలను విస్మరించిన పాలకులు, సైనిక బలగాల ముందు బలహీనులై, దేశాన్ని నియంతృత్వంలోకి తోశారు. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో, సోవియట్ యూనియన్‌కు అనుకూలంగా ఉండిన భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా పాకిస్థాన్‌ను ప్రోత్సహిస్తూ వచ్చింది. రష్యా ఆక్రమణలోని ఆప్ఘనిస్థాన్‌కు వ్యతిరేకంగా, ఆ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడానికి పాకిస్థాన్‌ను అమెరికా ఒక పావులా వాడుకున్నది. వీటన్నటికి తోడు మతఛాందసవాదులకు సైన్యంలోను, అధికారగణంలోను ఉన్న ప్రాబల్యం, ఆ దేశ పురోగతికి ప్రతిబంధకంగా మారింది. ప్రచ్ఛన్నయుద్ధ అనంతరం పాక్ మీద ఆధారపడడం అమెరికా తగ్గిస్తూ వచ్చింది. ఇన్ని దశాబ్దాల కాలంలో, అమెరికా పంచన ఉన్న పాకిస్థాన్‌కు వంచన తప్ప మరేమీ దక్కలేదు. భారత్‌తో జరిగిన అన్ని సైనిక ఘర్షణల్లోనూ పాకిస్థాన్ ఓడిపోయింది. తూర్పు బెంగాల్‌ను కోల్పోయింది. ప్రజలకు ఏ విధంగానూ మేలు చేయజాలని పాలకులకు, సైన్యానికి కశ్మీర్ వివాదం ఒక్కటి, తాము భారత్‌తో పోరాడుతున్నామని చెప్పుకోవడానికి మిగిలింది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు, క్రీడారంగంలోనే కాదు, సైనికంగా కూడా పాకిస్థాన్ భారత్‌కు సమవుజ్జీ కాదు. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం తాను జరిపినట్టు చెబుతున్న వైమానిక దాడి నూటికి నూరుపాళ్లు నిజం అనుకుంటే, అది కూడా పాకిస్థాన్ బలహీనతనే తెలియజేస్తుంది. తన అధీనంలోని భూభాగం మీద దాడి చేసి వందలాది మందిని హతమార్చితే, అసలు దాడేజరగలేదని వాదించేవాడు ఏమి శత్రువు?
ఇంత బలహీనమైన దేశాన్ని మన శత్రువుగా పరిగణించడం, ఆ దేశం చుట్టూ మన భావోద్వేగాలను అల్లుకుని, దేశభక్తిని కేవలం ఆ దేశాన్ని వ్యతిరేకించడానికే కేటాయించడం మనం మానుకోవాలేమో? మన దేశంలో టెర్రరిస్టు దాడులకు ప్రోద్బలాన్నో, భూభాగాన్నో అందిస్తున్నదని తప్ప, పాకిస్థాన్ ద్వారా మన దేశసౌభాగ్యానికి ఇతరత్రా జరుగుతున్న విపరీతమైన హాని ఏమీ లేదు. టెర్రరిజం ఎగుమతి దిగుమతి సమస్యను భారతదేశం స్వతంత్రంగా పరిష్కరించుకోదలచుకుంటే, సైనికశక్తితో సహా అనేక మార్గాలున్నాయి. భారత–పాక్ దేశాలను పరస్పరం శత్రువులుగా నిలిపి వినోదాన్ని, ప్రయోజనాలను సాధిస్తున్న శక్తులేమైనా ఉన్నాయా అన్నది దేశభక్తులతో కిటకిటలాడుతున్న ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. భారతదేశ వనరులను పీల్చిపిప్పిచేస్తూ, మన దేశమార్కెట్‌లోకి ఆసాంతం దూసుకువస్తూ లబ్ధి పొందుతున్న సంపన్నదేశాలు, మన రాజకీయ వైఖరులను, మన విదేశాంగ విధానాలను శాసించే ప్రయత్నం చేస్తున్నాయే, అటువంటి పెద్ద శక్తులను కాక, ఒక అల్పజీవిని శత్రువుగా నిలబెట్టుకోవడంలో ఏమి హేతువు ఉన్నది?– అన్నది ప్రశ్న.
సోమవారం నాడు లోక్‌సభలో జరిగింది చూడండి. ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేసేటప్పుడు, అధికారపక్షం వారు జై శ్రీరామ్ అని, భారత్‌మాతాకీ జై అని, వందేమాతరం అనీ నినాదాలు చేశారు. ఆ నినాదాల వెనుక ఉన్న భావనకు ఒవైసీ వ్యతిరేకమని వారి ఉద్దేశ్యం కావచ్చు. వారికి సమాధానంగాతన దేశభక్తిని, దైవభక్తిని, దళిత బహుజన అనుకూలతను చెప్పే ప్రతినినాదాలను ఒవైసీ ఇచ్చారనుకోండి. ఆయనను అట్లా సభలో ‘ట్రోల్’ చేయడం ఏ రకంగానూ సభ్యతాసంస్కారాల ప్రమాణాలకు అనుగుణమైనది కాదు. ఆ సంఘటన మంచి చెడ్డలు వదిలేద్దాం. కేంద్రంలో గెలిచిన అధికారపక్షం– కాంగ్రెస్‌ను, వామపక్షాలను, ఎస్పీ–బిఎస్పీలను దారుణంగా ఓడించింది. వారందరి ప్రమాణాల సందర్భంగా గేలిచేయడం కానీ, నినాదాలివ్వడం కానీ చేయని అధికారపక్ష సభ్యులు కేవలం ఇద్దరు సభ్యులున్న ఎంఐఎం విషయంలో ఎందుకు అట్లా ప్రవర్తించారు? వాళ్లు తమ శత్రుస్థానాన్ని ఒవైసీకే ఎందుకు కట్టబెడుతున్నారు? అమెరికా రష్యా చైనాలను వదిలి, మన దేశభక్తిని పాకిస్థాన్ మీదికే గురిపెట్టినట్టు, ఎందుకు ఇట్లా జరుగుతున్నది? చిన్నదేశాలు ఒకటైతే, లోకాన్నే జయించవచ్చునని తెలియదా? మనకు తెలియదు, అమెరికాకు తెలుసు.

No comments:
Post a Comment