సంస్కరణలో సంస్కారం ఏదీ? On Kandukuri
20-05-2019 00:08:41
https://www.andhrajyothy.com/artical?SID=797447
ముద్దు పళని గురించి నువ్వేం రాశావో అని తెలుసుకోవడానికి ‘ఆంధ్రకవుల చరిత్రము’ తెరిచా. అమ్మ.. నా.. తాతా..! సంస్కరణ సరే, నీ సంస్కారం ఏ గూట్లో పెట్టావు స్వామీ ఆ రాతలో? ముద్దుపళని గురించి ‘దీనికి మంచి సంస్కృతాంధ్ర సాహిత్యమును గలదు’ అని ఒప్పుకుంటూనే, ‘ఈ గ్రంథములోని భాగములనేకములు స్త్రీలు వినదగినవియు, స్త్రీ నోటి నుండి రాదగినవియూ కాదు’ అని వాక్రుచ్చిన నీలో మనువు కనిపించబట్టే కదా బెంగుళూరు నాగరత్నమ్మ, ‘సిగ్గనేది ఆడవాళ్ళకి మాత్రమే ఉండాల్సిన నీతా?’ అని నిలదీసింది. మొల్ల గురించి ‘ఆమె, ఈమె’ అని రాసిన నువ్వు ముద్దు పళనిని మాత్రం ‘అదీ, ఇదీ’ అనడం.. నీ సంస్కారాన్ని ఏ గంప కింద పెట్టి చేసిన పని?
ADVERTISEMENT
POWERED BY PLAYSTREAM
మీరు రాసిన పుస్తకాల పుటలు తిప్పేకొద్దీ పొరలు తొలుగుతున్నాయి. అసలు మీ కాలపు సంస్కరణ వెనుక ఉన్నది మీరు మాత్రమే కాదనీ, మీరు సాగిలపడిన తెల్లదొరల బుర్రలనీ కూడా అనుమానం కలుగుతోంది. తుపాకులతో ఈ దేశపు నేలను గెలవగలం కానీ, ఇక్కడి ప్రజలను గెలవలేమని అర్థమయ్యాక తెల్లదొరలు చేసిన ఆలోచనల్లోంచి పుట్టిన ‘సంస్కరణ’కు మీరే ఆయుధాలయ్యారేమో!
మెలికలు తిప్పి తలకు చుట్టిన పాగా, నెహ్రూకాలర్ కోటూ, చురుగ్గా చూసే కళ్లూ, కిందికి వాలిన గుబురు మీసాలూ, గడుసుతనపు గాంభీర్యంతో కూడిన నవ్వూ.. జమీందారులా ఉండే నీ బొమ్మ చూస్తే కొంచెం భయంగా, కొంచెం భక్తిగా, బోలెడంత గర్వంగా ఉండేది తాతా అప్పట్లో. నువ్వెంత గొప్పవాడివో నాకు చిన్నప్పుడే తెలుసు. ఎందుకంటే పాఠాల్లో చదువుకున్నాం కదా! మా ఇంటి మట్టి గోడల అరలో నువ్వు రాసిన ‘ఆంధ్రకవుల చరిత్రము’ పుస్తకం ఉండేది. నేనెప్పుడూ చదవలేదు. మా తెలుగుటీచరమ్మ అడిగినప్పుడు మాత్రం నాయనని అడిగి తీసుకువెళ్లి ఇచ్చేవాడిని. గాంధీ తాత గురించీ, నెహ్రూ గురించీ, నీ గురించీ, గురజాడ, ఆంధ్రకేసరిల గురించీ మా నాయన చాలా సంగతులు చెప్పేవాడు. అందుకే నీ పేరు చెప్పగానే, ‘‘గొప్ప సంస్కర్త, స్త్రీలకు విద్య అవసరమని చెప్పినవాడు, వితంతు వివాహాలు ముందుండి జరిపించిన వాడు.’’ అని నిద్రలో కూడా వల్లె వేసినట్టుగా చెప్పగలిగే వాడిని. ఇప్పటికీ తెలుగు నేల మీద అవే మాటలు వినిపిస్తున్నాయనుకో. కానీ, బెంగుళూరు నాగరత్మమ్మ గురించి తెలుగులో వచ్చిన పుస్తకం చదివినప్పటి నుంచీ మాత్రం నాలోపల ఏదో పురుగు తొలుస్తూనే ఉంది. ఇంత మహానుభావుడూ ఇట్లా ప్రవర్తిస్తాడా అని నమ్మీ నమ్మలేక మధనపడుతూనే ఉన్నాను. బెంగుళూరు నాగరత్నమ్మ తనకి ఇష్టమైన కవయిత్రి ముద్దుపళని రాసిన ‘రాధికా సాంత్వనము’ అచ్చేసిందనే కదా నీకు అంత కోపం పొడుచుకోని వచ్చింది.
ముద్దుపళని గురించి నువ్వు అంతేసి మాటలు అన్నావనే కదా బెంగుళూరు నాగరత్నమ్మ నీ మీద రుసరుసలాడింది. ఇంతకీ ముద్దు పళని గురించి నువ్వేం రాశావో అని తెలుసుకోవడానికి ఇంత పెద్దయ్యాక ఇప్పుడు ‘ఆంధ్రకవుల చరిత్రము’ తెరిచా. అమ్మ.. నా.. తాతా..! సంస్కరణ సరే, నీ సంస్కారం ఏ గూట్లో పెట్టావు స్వామీ ఆ రాతలో? ముద్దుపళని గురించి ‘‘దీనికి మంచి సంస్కృతాంధ్ర సాహిత్యమునుగలదు’’ అని ఒప్పుకుంటూనే, ‘‘ఈ గ్రంథములోని భాగములనేకములు స్త్రీలు వినదగినవియు, స్త్రీ నోటి నుండి రాదగినవియూ కాదు’’ అని వాక్రుచ్చిన నీలో మనువు కనిపించబట్టే కదా బెంగుళూరు నాగరత్నమ్మ, ‘‘సిగ్గనేది ఆడవాళ్ళకి మాత్రమే ఉండాల్సిన నీతా?’’ అని నిలదీసింది. ‘‘ఇది జారత్వమే కులవృత్తిగా గల వేశ్యయగుట చేత స్త్రీ జన స్వాభావికమయిన సిగ్గును విడిచి శృంగారరసమనుపేర సంభోగాదివర్ణనములను పుస్తకమునిండా మిక్కిలి జేసినది’’ అని తీర్పు ఎట్లా ఇచ్చేశావయ్యా? మొల్ల గురించి ‘ఆమె, ఈమె’ అని రాసిన నువ్వు ముద్దుపళనిని మాత్రం ‘అదీ, ఇదీ’ అనడం.. నీ సంస్కారాన్ని ఏ గంపకింద పెట్టి చేసిన పని?
సంగీత, సాహిత్యాలలో నిష్ణాతురాలయిన కవయిత్రిని వ్యభిచారి అంటావా? ఆమె రాసే కాలానికి పుట్టనైనా పుట్టని నువ్వు, ఎప్పుడు తొంగి చూశావు దొరా.. ఆమె వ్యభిచారం చేస్తూ ఉంటే..? నువ్వంత దుర్మార్గంగా, దురుసుగా రాశావు కాబట్టే కదా బెంగుళూరు నాగరత్నమ్మ అందుబాటులో లేని ‘రాధికాసాంత్వనం’ పుస్తకాన్ని, ముందుమాటలో నిన్ను చెడా మడా చెరిగేసి మరీ తిరిగి అచ్చేసింది. ఆ కోపంతో ఆ పుస్తకాన్ని నిషేధించడానికి ఎన్ని కుట్రలూ, వ్యూహాలూ పన్నావో! 1910లో అచ్చయిన ఆ పుస్తకాన్ని తిడుతూ ‘శశిలేఖ’లో 1911లో వచ్చిన వ్యాసం వెనుక ఉన్నది నువ్వేనంట కదా. ఐపీసీ సెక్షన్ 292 కింద ఈ పుస్తకాన్ని నిషేధించవచ్చని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి అధికారికంగా లేఖ రాసిన ప్రభుత్వ అనువాదకుడు గోటేటి కనకరాజు నీ శిష్యుడని అందరికీ తెలుసునే. ఆ లేఖ తర్వాత పోలీసులు పుస్తకాల షాపుల మీద పడి అభ్యంతరకరమైనవని 18 పుస్తకాలు గుర్తిస్తే, వాటిలో నువ్వు రాసిన ‘రసికజన మనో రంజనం’ కూడా ఉందా, లేదా? రాధికా సాంత్వనంలో ఉన్న శృంగార వర్ణన నీ పుస్తకంలోనూ ఉందని బెంగుళూరు నాగరత్నమ్మ నిరూపించలేదా? మరి చివరాఖరికి నిషేధిత జాబితాలోంచి అంచలంచెలుగా నీ పేరూ, నీ పుస్తకం పేరూ ఎలా జారిపోయాయో తమరు సెలవివ్వనే లేదేం? పుస్తకాల మీదకి పోలీసులను ఉసిగొల్పి, రాసినవాళ్ళ మీద కేసులు బనాయించి ముప్పుతిప్పలు పెట్టడానికి- తొలి తెలుగు నవల రాసిన నీకు, తొలి తెలుగు మహిళా పత్రిక ప్రారంభించిన నీకు, తెలుగులో తొలి స్వీయ చరిత్ర వెలువరించిన నీకు మనసెట్లా వచ్చింది మహానుభావా?
వీరేశం తాతా.. ముద్దుపళని, బెంగుళూరు నాగరత్నమ్మల మీద నీకున్నది సాహిత్యపరమైన వైరమే అని నన్ను నేను సముదాయించుకుని సమాధానపడుదామనుకున్నా. కానీ, ‘జర్నలిజంలో కందుకూరి స్థానం’ అనే అంశం మీద కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో మాట్లాడమని వినోదిని అడిగినపుడు నువ్వు రాసి అచ్చేసుకున్న వివేకవర్ధని వ్యాసాలు చదవడం మొదలుపెట్టాక అర్థమయింది పంతులయ్యా.. నీ ద్వేషం వాళ్ళ మీద కాదు, వాళ్ళు పుట్టిన కులం మీద అని. సంగీత, నృత్య కళలనే దైవంగా భావించిన స్త్రీల గురించి నీ రాతల్లో చిమ్మిన విషం.. గుండెల్లో దేవినట్లుందయ్యా. ‘‘బోగముమేళమనగా స్పష్టమయిన భాషలో లంజెల దండనియేకదా యర్థము? మనమెంతో వేడుకపడి వధూవరుల బాగునుగోరి శుభకార్యము చేసికొన్నప్పుడానంద పరిపూర్తికయి మనకు పనికిమాలినలంజెలతోడి సాంగత్యమెందుకు? నీతిమాలిన లంజెలచేత పాడించు బూతుపాటలకన్న...’’ (‘వేశ్యాకాంతలు’ వ్యాసంలో). ఇంతేసి మాటలన్న నిన్ను స్త్రీజనోద్ధారకుడివని ఎలా అనగలనయ్యా? ‘‘సంగీతమిప్పుడు లంజెల యధీనమై’’పోయిందని వగసిపోతూ, ఆ సంగీత నృత్యాలను కూడా నువ్వు ఎగతాళిచేసిన తీరు, ‘‘వారిలో కొందరు పాట పాడిరా యింటనెవ్వరో మృతినొంది యుందురని పొరుగువారందరును పరుగెత్తుకొని రావలసిందే! ఆటయాడిరా- కాళ్ళక్రింద పుట్టెడు ధాన్యమున్నను నలిగి తెల్లని బియ్యము గావలసినదే! అభినయము పట్టిరా- కాళ్ళును చేతులును వంకరబోయెడు దొమ్మరోగమని వైద్యుని నిమిత్తము పరుగెత్తవలసినదే!’’- ఇదేమి రాత తండ్రీ? నువ్వు అవమానించింది, ఆనాటి ముద్దుపళని నుంచి మొన్నటి బాల సరస్వతి, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సహా నిన్నటి భానుమతి దాకా అని తలచుకున్నపుడు కడుపు రగిలిపోదా? సంగీత, నృత్య కళలని కళావంతుల నుంచి దూరం చేయడానికి జరిగిన కుట్ర వెనుక ‘సంస్కరణ’ దాగి ఉందని నీ వ్యాసాలు చదివే కొద్దీ మరింతగా అర్ధమవుతోంది కందుకూరి వీరేశలింగం పంతులయ్యా.
‘‘పాతివ్రత్యముచే భూషితురాండ్రయి సర్వజనసమ్మోహనార్హురాండ్రయిన కులకాంతలయొద్దనే సర్వజనసమ్మోహనకరమయిన యీ సంగీతవిద్య’’ ఉండాలంటూ నువ్వు ఇచ్చిన సందేశాన్ని నీ బ్రాహ్మణ సమాజం బహు వేగంగానే అందుకున్నదనేందుకు సాక్ష్యం మద్రాసు మైలాపూరులో ఇప్పటికీ జరుగుతున్న సంగీత గోష్టులే కదా! పిచ్చికుక్క అని పేరుపెట్టి తరిమినట్టు వేశ్యలూ, వ్యభిచారులూ, పాతివ్రత్య సమాజానికి చీడపురుగులూ అని ముద్ర వేసి కళకు దూరం చేశాకనే కదా కులం పేరు మార్చుకుంటూ, దాచుకుంటూ బతుకుతున్నది. ఇంతకీ తమరి స్త్రీ విద్య, వితంతు వివాహాలు అనే సంస్కరణ పరిధి నీ వర్గపు స్త్రీలకే పరిమితం కదా.. మరి సబ్బండ వర్గాలున్న తెలుగునేల మీద నవయుగ వైతాళికుడివి ఎలా అయ్యావు? పోనీ నీ వర్గపు స్త్రీల పట్ల అయినా నీకు గౌరవం ఉన్నట్లు నీ రాతలు చదివితే అనిపించడం లేదే. ‘‘స్త్రీల అభివృద్ధి నిమిత్తమయి అక్కడక్కడ ఉత్తమ పురుషులు చేయు ప్రయత్నములకు మూఢతాపిశాచావేశముచేత స్త్రీలే ప్రతిబంధకారిణులగుచున్నారు’’ (‘స్త్రీలు చదువవలసిన విసయములు’ వ్యాసంలో) అన్న నీ అభిప్రాయం చదివాక నీ స్త్రీజనోద్ధరణ లోతుపాతులేమిటో అనే సంశయం కలుగదా? ‘‘మన స్త్రీలు నీతియందెంతయు హీనదశయందున్నారు. అసత్యమాడుట పాపమనియే వారికి జ్ఞానములేదు. అందుచేత ఏదో శిక్షను తప్పించుకొనుటకయి ప్రతి స్వల్ప విషయమునందును బొంకుచుందురు. తిట్లాడుట, పోట్లాడుట పాపమని వారికి తెలియనే తెలియదు’’ (‘భర్తకు భార్యా విషయమున నడుపవలసిన ధర్మములు’ వ్యాసంలో) అని సానుభూతి. అకటా.. మీ రాతల్లో ఎక్కడైనా స్త్రీ పక్షపాతం కనిపిస్తోందా, పోతపోసిన మగలక్షణం తప్ప. నిజానికి మిమ్మల్ని బ్రాహ్మణ పురుషజనోద్ధారకుడు అనడమే సబబు.
మీరు రాసిన పుస్తకాల పుటలు తిప్పేకొద్దీ పొరలు తొలుగుతున్నాయి. అసలు మీకాలపు సంస్కరణ వెనుక ఉన్నది మీరు మాత్రమే కాదనీ, మీరు సాగిలపడిన తెల్లదొరల బుర్రలనీ కూడా అనుమానం కలుగుతోంది. తుపాకులతో ఈ దేశపు నేలను గెలవగలం కానీ, ఇక్కడి ప్రజలను గెలవలేమని అర్థమయ్యాక తెల్లదొరలు చేసిన ఆలోచనల్లోంచి పుట్టిన ‘సంస్కరణ’కు మీరే ఆయుధాలయ్యారేమో! సిపాయీల తిరుగుబాటు జరిగిన ఈ నేల మీద నలభై యాభై ఏళ్ళ తర్వాత కూడా రాజుల్ని మోసినట్లే, దొరల్నీ మోసారు మీరు. రావుబహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులుగారూ... మీరాతనే ఇక్కడ ఉంటంకిస్తాను: ‘‘ఇంగ్లీషువారు హిందూ దేశమును జయించుటకు పూర్వము మహమ్మదీయుల దుష్టపాలనము చేత దేశము యొక్క స్థితి మిక్కలీ చెడి యుండినది’’ అంటూ.. ‘‘ఈ భరతఖండం ఇటువంటి దుస్థితినుండగా భాగ్యవశము చేత న్యాయపక్షావలంబకులును ప్రజాక్షేమాచార పరాయణులునూ అయిన యింగ్లీషువారు మనకు ప్రభువులుగా తటస్థించిరి’’ అని, ఇంగ్లీషు పాలనలో కలిగిన సౌఖ్యాల జాబితా ఇచ్చి ‘‘వీనియన్నింటికంటెను ముఖ్యమయినది దొరతనమువారు మనకు కావలసినంత స్వేచ్ఛను గలుగజేసియున్నారు. ఎల్లవారును మహారాజులవలె నుండి స్వతంత్రముగా సమస్త సుఖములు ననుభవించవచ్చును. ఇటువంటి సత్పరిపానము మరి యే ప్రభుత్వమునందును లభింపదు. కాబట్టి- మనదేశము యొక్క పురోవృద్ధికయి యీ ప్రభుత్వమే చిరకాలముండవలయునని జగదీశ్వరుని ప్రార్ధించుచు జనులు కృతజ్ఞులయి ప్రభుభక్తి గలవారయి యుండవలెను’’ (‘ఇంగ్లీషు ప్రభుత్వము వలని లాభములు’ అనే వ్యాసంలో). మరి ఇలా మోసిన మీకు రావుబహదూర్ బిరుదు రెక్కలు కట్టుకుని రాదా? రచనా సాహిత్య రంగాల్లోనూ మీ దురుసుతనం, దౌర్జన్యానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి
. రికార్డులు స్థాపించుకుంటూ, ప్రకటించుకుంటూ, ప్రచారం చేసుకుంటూ మీరు దూసుకుపోయిన తీరు విడ్డూరంగా ఉంటుంది. అసలు 1878లో నువ్వు రాసిన ‘రాజశేఖరచరిత్రము’ తొలి తెలుగు నవల కానే కాదనీ, కొక్కొండ వేంకటరత్నం ‘మహాశ్వేత’ నవలను 1867లోనే రాసినా అది 1895లో అచ్చవడంతో ఆ క్రెడిట్ నువ్వు కొట్టేశావనీ, నరహరి గోపలకృష్ణమచెట్టి రాసిన ‘శ్రీరంగరాజ చరిత్రము’ 1872లోనే అచ్చయినా సంపూర్ణ నవలా లక్షణాలు లేనందున దానినీ పక్కకు తప్పించారనీ, అయినా ‘శ్రీరంగరాజ చరిత్రము’కీ, ‘రాజశేఖర చరిత్రము’కీ చాలా పోలికలున్నాయనీ, ఇంకా మాట్లాడితే ఆలివర్ గోల్డ్‌స్మిత్ రాసిన ‘ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’ నవలను మక్కీకి మక్కీ దించావనీ... ఇలా అప్పట్లోనే బోలెడు విమర్శలు వచ్చినా కందుకూరి ఆర్మీకి జడిసి అంతా మిన్నకుండి పోయారనీ చెప్పుకుంటారు. సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ ఉండడం నీకో వరం అయ్యిందంట కదా. ‘ఈసపు నీతి కథలు’ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు తెలుగులో రాసి నీ ప్రింటింగ్ ప్రెస్‌లోనే అచ్చుకి ఇస్తే, అది ఎంతకీ అచ్చవలేదనీ, ఇంతలోనే నీ పేరుతో బొమ్మలతో ఈసపు నీతి కథలు పుస్తకం అచ్చయి వచ్చేసిందనీ పాపం నారాయణదాసే ఆత్మకథలో రాసుకున్నారు. నీ సంస్కరణ ఉద్యమం మీద కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి విమర్శలు రాస్తే సహించలేక, భరించలేక ఏకంగా ఒక పత్రికనే (సత్యవాదిని) తెరిచి ప్రతి దాడులకు దిగావు కదయ్యా. నువ్వు కన్నుమూసిన వందో సంవత్సరాన కూడా విమర్శనాత్మకంగా మాట్లాడుకునే పరిస్థితి లేదు పంతులయ్యా ఇక్కడ. అందుకే ఆవు వ్యాసాలనే మేం ఈ సంవత్సరం అంతా వల్లెవేసుకుంటున్నాం. వందేళ్ల తర్వాత కూడా నీకేం దిగుల్లేదులే! నిన్ను విగ్రహంగా మార్చేసుకుని పూజలతో మోస్తున్నవాళ్ళు నీ మీద ఈగ కూడా వాలనివ్వరు.
ఇట్లు,
నీ మనుమడు.. కాదు, కాదు
బెంగుళూరు నాగరత్నమ్మ మునిమనుమడు
ఆర్. ఎం. ఉమామహేశ్వరరావు

No comments:
Post a Comment