ముసుగు...మహిళ సాధికారతకు ఆటంకం...
Posted On: Monday,May 13,2019
బుర్ఖాను, ఘూంఘట్‌ను కలిపి నిషేధించాలన్న మీ ప్రకటన నేపథ్యంలో 'కర్ణి సేన' మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. 'బుర్ఖాకు జాతీయ భద్రతకు, తీవ్రవాదానికి సంబంధం వుంది. ముసుగుకు సంబంధించి అన్న మాటలకు గాను అక్తర్ మూడు రోజుల లోగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పామ'ని కర్ణి సేన అధ్యక్షుడు అంటున్నారు. దానికి మీ స్పందన....?
బుర్ఖా, పర్దా, నఖాబ్ (మేలి ముసుగు)కు వ్యతిరేకంగా నా మిత్రులు, నేను గత 20 ఏళ్లగా నిర్విరామంగా పోరాడుతున్నాం. నన్ను క్షమాపణలు చెప్పమని అడిగిన వారికి బహుశా ఈ విషయం తెలీదేమో! చాలా కాలం కిందటే, ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా మేం మాట్లాడాం. అప్పుడది వార్తల్లోకి రాలేదు. మైనారిటీ తెగకు చెందిన తిరోగమన భావజాలానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ నిలబడ్డాను. మార్పు తీసుకురావాలంటే మనం పుట్టిన వర్గం మంచిచెడులేమిటో ముందు చూడాలి. అది మన మొదటి విధి. నేను మేలి ముసుగు గురించి ఒకసారి మాట్లాడినందుకు నన్ను క్షమాపణలు చెప్పమంటున్నారు. మేలి ముసుగు అనేది మతపరమైన విశ్వాసం కాదని, అది ఒక సంప్రదాయమని అందరికీ తెలుసు. అది మసకబారుతున్న సంప్రదాయం. కేవలం గ్రామాల్లో మాత్రమే వుందంటున్నారు. మరి అంత ప్రధానంగా లేనప్పుడు ఎందుకంత తీవ్రంగా స్పందిస్తున్నారు?
'క్షమాపణ చెప్పనట్లయితే...మీ కళ్లు పీకేస్తాం. నాలుక చీరేస్తాం. మీ ఇంట్లోకి జొరబడి తంతాం.... 'అంటున్నారు వారు!
అవును...నేను క్షమాపణలు చెప్పని పక్షంలో ఎదురయ్యే తీవ్ర పరిణామాలేంటనేవి కూడా చెప్పారు. ఏదైనా ఒక విషయాన్ని ఎవరైనా విబేధించవచ్చు. ఇరుపక్షాలూ అంగీకారానికి రాలేకపోవచ్చు. వారి దృష్టిలో నైతికత, సంప్రదాయాల విషయంలో వేరే అభిప్రాయం వుండివుండొచ్చు. నేను చెప్పింది వారికి అసాధారణంగా అనిపించవచ్చు. ఒకవేళ కష్టంగా అనిపిస్తే న్యాయస్థానంలో నా మీద కేసు పెట్టవచ్చు. అంతేగాని, ఒక నాగరిక సమాజంలో క్షమాపణలు చెప్పమని ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదు. 'అసహనం పెరిగిపోయింది. వాక్ స్వాతంత్య్రం తగ్గిపోయింది' అని నేనిప్పుడు అన్నాననుకోండి. అప్పుడు నామీద 'కుహనా లౌకికవాది, జాతి వ్యతిరేకి' అన్న ముద్ర వేస్తారు. నేను పెరిగిన భారతదేశం ఇది కాదు. పరమత సహనానికి మన దేశం పెట్టింది పేరు. మన ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి వాక్‌స్వాతంత్య్రాన్ని కల్పించింది. భిన్నాభిప్రాయా లను ఇక్కడ వింటారు. మన పొరుగు దేశాలలో ఈ స్వేచ్ఛ లేదు.
మీ ప్రకటన అంతటి గలాభాకు కారణమౌతుందని మీరు ఊహించారా?
వాళ్లు దీనిని ఇంత పెద్ద విషయం ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు. నేను బుర్ఖాను ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వున్నాను. నేను వారికి వ్యతిరేకినని ముస్లిం చాందసవాదులు ఇన్నాళ్లుగా భావిస్తు న్నారు. ఇప్పుడు, హిందూ చాందసవాదులు కూడా నన్ను శత్రువుగానే చూస్తున్నారు. ఘూంఘట్, నఖాబ్, బుర్ఖా...ముఖాన్ని కప్పే మతపరమైన, సామాజిక సంప్రదాయం ఏదైనా సరే మహిళ సాధికారతకు ఆటంకమే. దానిని నిషేధించాలి. భద్రతా కారణాల రీత్యా శ్రీలంక ముసుగును నిషేధించి వుండొచ్చు. మన దేశంలో మాత్రం మహిళా సాధికారత కోసం నిషేధించాలి. దేశ భద్రతకు ప్రమాదం అయినా కాకున్నా అది మహిళ ప్రగతికి మాత్రం ముప్పే.
బుర్ఖాను మేలి ముసుగును ఒకేలా చూడాలని మీకు ఎందుకనిపించింది? బుర్ఖా మహిళ శిరస్సు నుంచి బొటనవేలి వరకు కప్పివేస్తుంది. మేలి ముసుగు మొహాన్ని మాత్రమే పాక్షికంగా కప్పుతుంది. 'బుర్ఖాని నిషేధించేట్లయితే మేలి ముసుగును కూడా నిషేధించాలి' అని ఎందుకన్నారు?
'అయితే' అనేదేం లేదు. అది నిషేధించారు కనక దీన్ని కూడా నిషేధించాలని కాదు. ఓ మనిషి మొహాన్ని ఎందుకు కప్పాలి? స్వేచ్ఛను, ప్రగతిని అడ్డుకునేది ఏదైనా సరే ఆపాల్సిందే. నేను భద్రత కోణంలో మాట్లాడడం లేదు. మహిళ సాధికారత గురించి మాట్లాడాను. ఇది రెండు సంప్రదాయా లను సమం చేయడం గురించి కాదు. మతం, సంప్రదాయం, విలువలు, సంస్కృతి పేర మహిళ మొహాన్ని కప్పుతున్నారు. రెండిట్లోనూ ఎలాంటి బేధం లేదు.
అనేక దేశాలు మొహాన్ని కప్పే ముసుగులను నిషేధించాయి కదా....
అన్నిటి కంటే ఫ్రాన్స్ ముందుంది. అందుకు ఆ దేశాన్ని నేను అభినందిస్తాను కూడా. అక్కడి కార్యాలయాల్లో మతపరమైన ముసుగులేవీ వేసుకోకూడదు. మతపరమైన గుర్తింపును బహిరంగంగా ప్రదర్శించకూడదన్న తొలి దేశమది. అది నాకు నచ్చింది.
ఫ్రాన్స్‌లో ముఖాలను కప్పే ముసుగులను నిషేధించడం... మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని... ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం 2018 అక్టోబర్‌లో ప్రకటించింది...
నేను దీనిని పూర్తిగా విభేదిస్తున్నాను. ముసుగు వేసుకోవాలో లేదో మహిళలే నిర్ణయించు కుంటారంటే ఎలా? 'సతి'ని నిషేధించారు. అవునా కాదా? దీన్ని ఆచరించాలా లేదా అనేది మహిళ ఇష్టానికేం విడిచిపెట్టలేదు. ఇది తప్పు కనక ఆపాలని చెప్పారు. బాల్య వివాహం విషయం లోనూ అంతే. అది చిన్నారులు, వారి తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వదలలేదు కదా? ఇటువంటి తప్పుడు సంప్రదాయాలను నిషేధించేందుకు ఆయా తెగలు అనుమతించే వరకు వేచి వుండనక్కర్లేదు. అదేవిధంగా, నేను 'ట్రిపుల్ తలాక్'ని కూడా ఎప్పుడూ వ్యతిరేకిస్తాను. ఇలాంటివి 'ఎంపిక'గా వుండకూడదు. 'చెడు' అనుకుంటే నిషేధించడమే. అబ్రహం లింకన్ బానిసత్వాన్ని నిషేధించలేదూ!
బుర్ఖా లేదా మేలి ముసుగును వారి ఇష్టానికి ఎందుకు విడిచిపెట్టకూడదు?
ఎందుకంటే...అధిక శాతం మహిళలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగల పరిస్థితుల్లో లేరు. తోటి వారి ఒత్తిడి వుంటుంది. బుర్ఖా వేసుకోవడం మంచిదని బాల్యం నుంచి వారికి నూరిపోస్తారు. బుర్ఖా వేసుకుంటే తమ తెగలో మంచి పేరు పొందవచ్చని, కుటుంబాల్లో మగవాళ్లు సంతోషిస్తారని, దాంతో కొద్దిగా స్వేచ్ఛ లభించవచ్చని కొంతమంది మహిళలు భావించ వచ్చు. ఇలా అనేక కారణాలున్నాయి. వారికి మొదట ఒక వంద సంవత్సరాల పాటు స్వేచ్ఛ ఇచ్చి చూడండి. ఆ తర్వాత 'బుర్ఖా వేసుకోవాలను కుంటున్నారా?' అనడిగి చూడండి. కొన్ని తరాల పాటు నఖాబ్ లేకుండా జీవించనివ్వండి. ఆ తర్వాత మళ్లీ ముగుసు వేసుకుంటారా అనడిగి చూడండి.
యువతులు చాలీచాలని దుస్తులు వేసుకోవడం వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్న మహిళ వీడియో ఒకటి వైరల్ అవుతోంది...
తల నుంచి కాలి వేళ్ల వరకు కప్పి వుంచే చీరలు, సల్వార్ కమీజ్, లెహంగాలు వేసుకున్న మహిళలపై ఎప్పుడూ అత్యాచారాలు జరగలేదా? తప్పుడు విషయాలను విశ్వసించేలా చాలామంది మహిళలకు బోధిస్తుంటారు.
తన కుమార్తెలను క్రికెట్ ఆడేందుకు అనుమతించబోనని పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ తన పుస్తకంలో తెలియచేశారు. క్రికెట్ కాకుండా... ఇష్టమైతే ఇన్‌డోర్ గేమ్స్ అడుకోవడానికి వారికి అనుమతి వుందనీ...సామాజిక, మతపరమైన కారణాల వల్లనే తానీ నిర్ణయం తీసుకున్నానని రాసుకొచ్చారు...
మహిళలకు క్రికెట్ చెరుపు చేస్తుందని ఇస్లాంలో వుందేమో నాకు తెలీదు. షాహిద్ అఫ్రీదీ వంటి పాకిస్తానీ మేధో దిగ్గజం నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం?
మతానికి సంబంధించి మీ సొంత అభిప్రాయం...
ఉత్తర భారత దేశం లోని ఉర్దూ మాట్లాడే ముస్లింల మాదిరిగా కబాబ్, బిర్యానీ అంటే ఇష్టం. కవిత్వం అంటే ప్రేమ. అన్నీ సాంస్కృతికంగానే. మతపరంగా ఎలాంటి విశ్వాసాలు లేవు. నేను నాస్తికుడిని.

No comments:
Post a Comment