ధనిక దేశాల్లో దీర్ఘాయుష్షు! Updated :05-11-2015 03:07:10 |
పారిస్, నవంబరు 4: ధనిక దేశాల్లో సగటు ఆయుఃప్రమాణం పదేళ్లు పెరిగిందని ఆర్గనైజేన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) 2013 నివేదిక స్పష్టం చేసింది. నాలుగు దశాబ్దాల క్రితంతో పోలిస్తే పెరిగిన వై ద్య, ఆరోగ్య సదుపాయాలు ఈ మార్పులకు కారణమయ్యాయని వెల్లడించింది. అయితే, గతంలో ఓఈసీడీ నివేదిక సగటు వయస్సు కన్నా అమెరికన్ల సగటు జీవితకాలం ఒక ఏడాది ఎక్కువగానే ఉండేది. అలాంటిది ఈసారి అమెరికన్ల సగటు ఆయుఃప్రమాణం అనూహ్యంగా పడిపోయింది. ఓఈసీడీ తాజా జాబితాలో అమెరికా అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈమేరకు 34 దేశాల్లో జరిపిన పరిశీలనలో అమెరికా 78.8 సంవత్సరాల సగటుతో 27వ స్థానం దక్కించుకుంది. ఓఈసీడీ సగటు కన్నా ఇది చాలా తక్కువ. కాగా, వైద్యం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి తలసరి వ్య యంలో అమెరికా మిగతా దేశాలను వెనక్కినెట్టి ముందంజలో ఉంది. వైద్యం కోసం అమెరికన్లు మి గతావారితో పోలిస్తే రెండున్నర రెట్లు ఎక్కు వగా ఖర్చుచేస్తున్నారని నివేదిక వెల్లడించింది.
|
No comments:
Post a Comment