Friday, 30 November 2018

In Telangana, Muslim Voters Stand Divided but Appear to Favour TRS

In Telangana, Muslim Voters Stand Divided but Appear to Favour TRS 

https://thewire.in/politics/telangana-assembly-polls-muslims-voters-divided-trs-kcr


The Muslim vote will play a crucial role in deciding who wins the upcoming assembly election, which is why both TRS and the grand alliance (Congress, TDP and others) are trying their level best to woo the community.


Mahtab Alam

29/NOV/2018
Hyderabad: Unlike the last assembly elections, where there was absolute clarity on who to vote for, this time around the relatives of Abdul Taha stand divided over whom to vote in the upcoming assembly elections.

“While half of my extended family is likely to vote for the Congress-Telugu Desam Party alliance, the other half thinks it is better to support the Telangana Rashtra Samithi which has done some good work for Muslims,” said Dr. Taha, an assistant professor at Centre for the Study of Social Exclusion and Inclusive Policy, Maulana Azad National Urdu University (MANUU), Hyderabad. Taha is from Suryapet district and his relatives live in Muslim-concentrated districts like Mehboobnagar, Nalgongda and Khammam. 

“Those in favour of TRS cite schemes like Shaadi Mubarak, minority schools, overseas scholarships and budget for minorities” explained Taha. “However, those who are in favour of the Congress-TDP alliance, believe that KCR is just making a fool of Muslims by delivering speeches in flowery Urdu. Moreover, there is also a fear that TRS might once again join hands with BJP,” he added.

According to Taha, the situation his relatives are currently in more or less represents the mood of Muslims across the state. 

Also read: Star Campaigners, Communal Messaging Unlikely to Brighten BJP’s Prospects in Telangana

Telugu writer and activist Yusuf Baba, better known as ‘Sky Baba’ echoed Taha’s observations. “Muslims are both happy and angry with KCR,” said Baba, a native of Nalgonda. “Happy because he built English medium residential schools for Muslims, started the Shaadi Mubarak scheme and because one of his deputy chief ministers is a Muslim,” Baba told The Wire. “At the same time, Muslims are suspicious of KCR because of his proximity with BJP and Modi in the recent past,” he added. 

Apart from KCR’s proximity to BJP, people are also vary of the claims made in the name of work done for the welfare of minorities.

“There is a huge difference between what KCR claims and the reality,” said Amjedullah Khan, spokesperson of Majis Bachao Tahreek (MBT), a local political party. Pointing out the gaps in the budget earmarked for minorities welfare and the actual amount spent over three years, he claimed that “not even half of the earmarked amount was spent last year”. 


Congress Telangana president N. Uttam Kumar Reddy, BJP chief K. Laxman and MIM’s leader Akbaruddin Owaisi are all facing criminal charges.

“Only 41.19% of earmarked budget was spent last year,” he said. “The year before was even worse, just 27.89%. And this year, according the latest available data, only 29.24% of earmarked budget has been spent.”

Taha had to make almost a similar point about the minority budget. “Another important point about the minority budget is that not more than 60% of the amount earmarked has been released in the last three years,” said the the Majlis Bachao Tehreek leader. 

It should be noted that as far as Shaadi Mubarak scheme is concerned, it is not Muslim specific. The scheme is for women above the age of 18. Amongst non-Muslims, it is known and promoted as Kalyana Lakshmi. The scheme was launched in October 2014 for SC/STs and minorities, but was later extended to one and all. 

The Muslim vote will play a crucial role in deciding who wins the upcoming assembly election. Muslims constitute 12.7% of the total population in the state. From a total of 119 constituencies, the community plays a decisive role on nearly 30 seats. The importance of Muslim votes also becomes evident from how both TRS as well as the grand alliance (Congress, TDP and others) are trying hard to woo Muslim voters.

Also read: As Congress Seizes the Moment in Telangana, Sonia and Rahul Gandhi Appear Confident

According Fasihullah Shaikh, editor of Hyderabad Youth Mirror, Muslims of the state can be broadly divided into two categories, rural and urban. “Rural Muslims have been traditional Congress voter and seeing new energy in Congress they are likely to once again vote for Congress,” Shaikh told The Wire. “As far as urban Muslims are concerned majority of them live in and  around Hyderabad and likely to be intact with AIMIM, hence in support of of TRS.”

Like Taha and Baba, Shaikh also maintained that as of now Muslim voters stand divided. Notwithstanding, these observations many believe, TRS is likely to be preferred by majority of Muslims. Part of the reason of their conviction is based on AIMIM’s full support to the ruling TRS. 


Rahul and Sonia Gandhi with alliance leaders at the rally on the outskirts of Telangana. Credit: PTI

The Asaduddin Owaisi led All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) is supporting TRS with full force. “I am convinced that K. Chandrasekhar Rao will be the next chief minister,” Owaisi declared recently. The party can directly influence voters in more than 20 constituencies, of which seven it has been winning in last two elections. In 2014, the party contested on 20 seats and performed reasonably well. However, this time it is only contesting eight seats even though the party had initially filed nominations for 21. 

According to a report in LiveMint, “The decision is part of its tactical understanding with caretaker chief minister K. Chandrashekar Rao’s Telangana Rashtra Samithi (TRS), and could give Rao an edge in seats with sizable Muslim voters.” Apart from AIMIM, Jamaat-e-Islami Hind, an influential politico-religious organisation with substantial support base across Telangana has lent its support to TRS. 

Also read: KCR’s Empty Promises on Jobs May Cost Him in Telangana

Moreover, there seem to be a preference for KCR among Muslim government employees. “It is a compulsion for Muslims to ,vote for TRS this time because the Congress is not in a position to form the government,” said a government employee on the condition of anonymity. “KCR might not have done enough for Muslims but after Y.S. Rajasekhara Reddy he is seen as a Muslim friendly leader,” he said. Another Muslim government employee expressed a similar stand.          

Meanwhile, last week, a number ‘Muslim intellectuals’ met Rajya Sabha MP Ahmed Patel, who is also Sonia Gandhi’s political advisor, during his visit to the capital city and promised their support to the grand alliance in order to defeat the TRS in Telangana.

But according to a senior journalist, who requested anonymity, the meeting is unlikely to have much influence following as far as electoral politics is concerned. “They are good for drawing room discussions and hall meetings but can’t influence the voters. They themselves know it very well,” the senior journalist said.  

Thursday, 29 November 2018

Lucknow Pact 1916

Lucknow Pact 1916

VCL with Pankaj Singh

https://www.youtube.com/watch?v=2Y6Lx5wZ7SQ

Why Dr Ambedkar was against the politics of Muslim appeasement?

DNA : Why Dr Ambedkar was against the politics of Muslim appeasement?


https://www.youtube.com/watch?v=gDlrsj_I3Eg

Wednesday, 28 November 2018

Chandrababu Naidu Speech at Khammam Public Meeting

ఖమ్మం గడ్డపై కెసిఆర్ దుమ్ముదులిపెసిన చంద్రబాబు | Chandrababu Naidu Speech at Khammam Public Meeting


https://www.youtube.com/watch?v=IOJklaSCLkI

అయోధ్య రామమందిరం కేసు - మరి ఇప్పటి వరకు ఏం జరిగింది?

అయోధ్య రామమందిరం కేసు - మరి ఇప్పటి వరకు ఏం జరిగింది?

సుప్రీం కోర్టులో అయోధ్య రామమందిరం కేసు విచారణ వాయిదా: మరి ఇప్పటి వరకు ఏం జరిగింది?
29 అక్టోబర్ 2018
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్ షేర్ చేయండి
Image copyrightGETTY IMAGES
రామజన్మ భూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు విచారణను జనవరికి వాయిదా వేసిందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌తో కొత్తగా ఏర్పాటైన ముగ్గురు జడ్జిల ధర్మాసనం విచారించింది.

అంతకు ముందు ఈ కేసులో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నాజిర్ వాదనలు విన్నారు.

అయోధ్య వివాదం భారత్‌లో ఒక రాజకీయ అంశంగా మారింది. హిందూ సంస్థల కార్యకర్తలు 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చారు.

హిందూ ఆరాధ్య దైవం శ్రీరాముడు సరిగ్గా అక్కడే జన్మించాడని భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్‌తోపాటు మరికొన్ని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. బాబ్రీ మసీదును నిజానికి ఒక ఆలయం కూల్చి నిర్మించారని వారు చెబుతున్నారు.

బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగాయి. సర్వోన్నత న్యాయస్థానంలో ఆలయ నిర్మాణం కోసం వివాదాస్పద భూమిని బదిలీ చేయాలని తీవ్రమైన డిమాండ్లు వచ్చాయి.

రామ మందిరం-బాబ్రీ మసీదు అంశంలో వివాదాస్పద భూమి యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.

యాజమాన్య హక్కుల కేసు దేశంలోని కోర్టుల్లో 1949 నుంచి నడుస్తోంది. ఈ మొత్తం వివాదం ఎప్పుడు మొదలైంది, ఇప్పటివరకూ ఈ వివాదంలో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో చూద్దాం.

Image copyrightGETTY IMAGES
1528: అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంగా భావించే ప్రాంతంలో ఒక మసీదు నిర్మించారు.
1853: మొదటి సారి ఈ స్థలం దగ్గర మత ఘర్షణలు జరిగాయి. మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ మసీదు నిర్మించారని చెబుతారు. అందుకే దీనికి బాబ్రీ మసీదు అనే పేరొచ్చిందని అంటారు. ఇప్పుడు కొన్ని హిందూ సంస్థలు అక్కడ రామమందిరం నిర్మించాలని భావిస్తున్నాయి.
Image copyrightGETTY IMAGES
1859: బ్రిటీష్ పాలకులు వివాదాస్పద స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. లోపల భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థించడానికి అనుమతి ఇచ్చారు.
1949: మసీదులో రాముడి విగ్రహాలు లభించాయి. కొంతమంది హిందువులు ఈ విగ్రహాలను అక్కడ ఉంచారని ఆరోపణలు వచ్చాయి. ముస్లింలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రెండు వర్గాలు కోర్టులో కేసు వేశాయి. ప్రభుత్వం ఈ స్థలాన్ని వివాదాస్పదంగా ప్రకటించి దానికి తాళాలు వేసింది.
Image copyrightGETTY IMAGES
1984: కొంతమంది హిందువులు విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలో శ్రీరాముడి జన్మస్థలానికి విముక్తి కల్పించి, రామమందిరం నిర్మించడానికి ఒక కమిటీని వేశారు. తర్వాత ఈ ఉద్యమానికి భారతీయ జనతాపార్టీ ప్రముఖ నేత లాల్‌కృష్ణ అడ్వాణీ నేతృత్వం వహించారు.
1986: జిల్లా మేజిస్ట్రేట్ హిందువులకు ప్రార్థించడానికి వివాదాస్పద మసీదు తాళం తీయమని ఆదేశించారు. ముస్లింలు దానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు పోరాట సమితిని ఏర్పాటు చేశారు.
1989: విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం ఉద్యమం తీవ్రం చేసింది. వివాదాస్పద స్థలం దగ్గర రామమందిరం పునాది వేసింది.
Image copyrightAFP
1990: విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు బాబ్రీ మసీదును స్వల్పంగా ధ్వంసం చేశారు. అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ చర్చల ద్వారా వివాదం పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ అవి సఫలం కాలేదు.
1992: విశ్వహిందూ పరిషత్, శివసేన, బీజేపీ కార్యకర్తలు డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూలగొట్టారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2 వేల మందికిపైగా మరణించారు.
Image copyrightGETTY IMAGES
1998: ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2001: బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం నిర్వహించడంపై ఉద్రిక్తతలు తలెత్తాయి. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించడమే లక్ష్యమని విశ్వహిందూ పరిషత్ మరోసారి చెప్పింది.
2002 జనవరి: అయోధ్య వివాదం పరిష్కరించేందుకు ప్రధానమంత్రి వాజ్‌పేయి అయోధ్య కమిటీ ఏర్పాటు చేశారు. సీనియర్ నేత శతృఘ్న్ సిన్హాను హిందూ, ముస్లిం నేతలతో చర్చల కోసం నియమించారు.
Image copyrightGETTY IMAGES
2002 ఫిబ్రవరి: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన మ్యానిఫెస్టోలో రామమందిర నిర్మాణం అంశాన్ని చేర్చడానికి బీజేపీ నిరాకరించింది. మార్చి 15న రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. వందలాది మంది హిందూ కార్యకర్తలు అయోధ్యకు తరలివచ్చారు. తర్వాత తిరిగి రైల్లో వెళ్తున్న కార్యకర్తలపై గుజరాత్ గోధ్రా దగ్గర దాడి జరిగింది. అందులో 58 మంది కరసేవకులు చనిపోయారు.
Image copyrightAFP
13 మార్చి 2002: సుప్రీంకోర్టు తన తీర్పులో అయోధ్యలో యథాతథ స్థితి కొనసాగిస్తామని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం స్వాధీనంలో ఉన్న భూమిలో ఎవరినీ అనుమతించకూడదని చెప్పింది. కేంద్రం కూడా సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తామని చెప్పింది.
15 మార్చి 2002: మందిర పరిసరాలకు బయటే రాతి స్తంభాలను అప్పగిస్తామని విశ్వహిందూ పరిషత్, ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం వీహెచ్‌పీ నేతలు, దాదాపు 800 మంది కార్యకర్తలు ప్రభుత్వ అధికారులకు తాము మందిరం కోసం తీసుకొచ్చిన రాతి స్తంభాలను అందించారు.
22 జూన్, 2002: రామ మందిర నిర్మాణం కోసం వివాదాస్పద భూమిని అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
Image copyrightGETTY IMAGES
2003 జనవరి : వివాదాస్పద రామ మందిరం-బాబ్రీ మసీదు పరిసరాల కింద ఏదైనా ప్రాచీన భవనాల అవశేషాలు ఉన్నాయా అనేది తెలుసుకోడానికి రేడియో తరంగాల ద్వారా పరిశోధనలు జరిగాయి. కచ్చితమైన ఆధారాలు ఏవీ దొరకలేదు.
2003 మార్చి : వివాదాస్పద స్థలంలో పూజలు చేసుకోడానికి అనుమతించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కోర్టు దానిని తోసిపుచ్చింది.
2003 ఏప్రిల్: అలహాబాద్ హైకోర్టు నిర్దేశాల ప్రకారం వివాదిత స్థలంలో పురాతత్వ శాఖ తవ్వకాలు ప్రారంభించింది. జూన్ వరకూ ఇవి సాగాయి. తర్వాత రిపోర్టులో మందిరాన్ని పోలిన కొన్ని అవశేషాలు లభించాయని తెలిపారు.
2003 మే: ‘1992 బాబ్రీ మసీదు కూల్చివేత’ కేసులో అప్పటి ఉపప్రధాని అడ్వాణీసహా 8 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది.
2003 జూన్: కంచి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి కేసు పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించారు. జులై లోపు అయోధ్య అంశం పూర్తిగా పరిష్కారం అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
Image copyrightGETTY IMAGES
2003 ఆగస్టు: రామమందిర నిర్మాణం కోసం ప్రత్యేక బిల్లు తేవాలని కోరిన వీహెచ్‌పీ డిమాండును బీజేపీ నేతలు, ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ తోసిపుచ్చారు.
2004 ఏప్రిల్ : అడ్వాణీ అయోధ్యలోని తాత్కాలిక రామమందిరంలో పూజలు చేశారు. కచ్చితంగా ఆలయం నిర్మిస్తామని తెలిపారు.
2004 జులై: శివసేన చీఫ్ బాల్ ఠాకరే అయోధ్య వివాదాస్పద స్థలంలో మంగల్ పాండే పేరుతో ఏదైనా జాతీయ స్మారకం రూపొందించాలని సలహా ఇచ్చారు.
2005 జనవరి: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది.
Image copyrightGETTY IMAGES
2005 జులై: ఐదుగురు సాయుధ మిలిటెంట్లు వివాదాస్పద స్థలం దగ్గర దాడికి దిగారు. మిలిటెంట్లను భద్రతా దళాలు బయటే కాల్చిచంపాయి. ఈ దాడిలో ఒక భారత పౌరుడు చనిపోయారు.
6 జులై, 2005: బాబ్రీ మసీదు కూల్చిన సమయంలో ఉద్రేక పూరిత ప్రసంగం ఇచ్చిన కేసులో అడ్వాణీని కూడా చేర్చాలని ఆదేశాలు ఇచ్చింది.
28 జులై 2005: ఈ కేసులో అడ్వాణీ రాయ్ బరేలీలోని ఒక కోర్టుకు హాజరయ్యారు.
4 ఆగస్టు 2005: ఫైజాబాద్ కోర్టు ఈ కేసులో నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Image copyrightGETTY IMAGES
20 ఏప్రిల్ 2006: లిబ్రహాన్ కమిషన్ బాబ్రీ మసీదు కూల్చివేత ప్రణాళిక ప్రకారం జరిగిందని తెలిపింది. ఇందులో బీజేపీ, ఆరెస్సెస్, బజరంగ్ దళ్, శివసేన చేతులు కలిపాయని చెప్పింది.
2006 జులై: వివాదాస్పద స్థలంలో ఉన్న తాత్కాలిక ఆలయం భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో కంచె ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరింది. దీనిని ముస్లిం సంస్థలు వ్యతిరేకించాయి. ఇది కోర్టు ఆదేశాలకు వ్యతిరేకం అని చెప్పాయి.
Image copyrightGETTY IMAGES
19 మార్చి 2007: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ప్రధాని అయితే బాబ్రీ మసీదు కూలి ఉండదన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్పందనలు వచ్చాయి.
30 జూన్ 2009: బాబ్రీ మసీదు కూల్చిన కేసులో విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబ్రహాన్ కమిటీ 17 ఏళ్ల తర్వాత తన రిపోర్ట్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు అప్పగించింది.
7 జులై 2009: అయోధ్య వివాదానికి సంబంధించిన 23 కీలక ఫైళ్లు సెక్రటేరియట్ నుంచి మాయమయ్యాయని యూపీ ప్రభుత్వం ఒక అఫిడవిట్‌లో అంగీకరించింది.
Image copyrightGETTY IMAGES
24 నవంబర్ 2009: లిబ్రహాన్ రిపోర్ట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. అందులో లిబ్రహన్ కమిటీ అటల్ బిహారీ వాజ్ పేయి, మీడియాను దోషిగా పేర్కొంది. నరసింహరావుకు క్లీన్ చిట్ ఇచ్చింది.
20 మే, 2010: బాబ్రీ విధ్వంసం కేసులో అడ్వాణీ, ఇతర నేతలపై ఉన్న క్రిమినల్ కేసుల రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
26 జులై 2010: రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో వాదనలు పూర్తి.
8 సెప్టెంబర్ 2010: కోర్టు అయోధ్య వివాదంలో సెప్టంబర్ 24న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది.
17 సెప్టెంబర్ 2010: తీర్పును ఆపాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది..
Image copyrightAFP
30 సెప్టెంబర్ 2010: అయోధ్య వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్ట్ లక్నో ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. ఆ భూమిని మూడు భాగాలుగా విభజించింది.
9 మే 2011: సుప్రీంకోర్టు అలహాబాద్ కోర్టు తీర్పుపై స్టే విధించింది. విచారణ సమయంలో హైకోర్టు తీర్పు అమలు కాకుండా స్టే ఉంటుందని చెప్పింది. వివాదాస్పద స్థలంపై 1993 జనవరి 7 నాటి యథాతథ స్థితి కొనసాగుతుందని చెప్పింది.
26 ఫిబ్రవరి 2016: రామ మందిర నిర్మాణం గురించి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
20 జులై 2016: బాబ్రీ మసీదు రామజన్మభూమి కేసులో వాది హషీమ్ అన్సారీ 96 ఏళ్ల వయసులో అయోధ్యలో మృతి చెందారు.
21మార్చి 2017: అయోధ్య వివాదం కేసును పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జె.ఎస్.ఖెహర్ సూచించారు. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. దీనిని చాలా మంది నేతలు స్వాగతించారు.
07 ఆగస్టు 2017: సుప్రీంకోర్టు 1994లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పును సవాలు చేస్తు వచ్చిన పిటిషన్‌పై విచారణకు ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఏర్పాటు చేసింది.
08 ఆగస్టు 2017: యూపీ వక్ఫ్ బోర్డు అయోధ్య వివాదాస్పద భూమి నుంచి కాస్త దూరంలో ముస్లింలు ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టుకు చెప్పింది.
11 సెప్టెంబర్ 2017: సుప్రీంకోర్టు అయోధ్య రామజన్మభూమిపై నిఘా కోసం 10 రోజుల లోపు ఇద్దరు జడ్జిల పర్యవేక్షకులను నియమించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది.
20 నవంబర్ 2017: యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ సుప్రీంకోర్టుతో అయోధ్యలో మందిరం, లక్నోలో మసీదు నిర్మించవచ్చని చెప్పింది.
Image copyrightGETTY IMAGES
01 డిసెంబర్ 2017: 32మంది కార్యకర్తలు అలాహాబాద్ హైకోర్టులో 2010 తీర్పును సవాలు చేస్తూ ఇంటర్వెన్షన్ అప్లికేషన్ ఇచ్చారు. కార్యకర్తల్లో అపర్ణా సేన్, శ్యామ్ బెనగల్, తీస్తా శీతల్వాద్, సుబ్రమణ్య స్వామి కూడా ఉన్నారు.
08 ఫిబ్రవరి 2018: సుప్రీంకోర్టులో సివిల్ కేసులో విచారణలు ప్రారంభం
14 మార్చి 2018: సుప్రీంకోర్టు స్వామిసహా అందరి మధ్యంతర పిటిషన్లను కొట్టివేసింది.
06 ఏప్రిల్ 2018: 1994 తీర్పును పునఃపరిశీలించాలని ఈ కేసును ధర్మాసనానికి ఇవ్వాలని ముస్లిం పక్షాల తరపున సీనియర్ వకీలు రాజీవ్ ధవన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
06 జులై 2018: కొన్ని ముస్లిం సంస్థలు 1994 తీర్పును పునఃపరిశీలించాలంటూ కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Image copyrightGETTY IMAGES
13 జులై 2018: ఈ కేసులో జులై 20 నుంచి విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
20 జులై 2018: సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
27 సెప్టంబర్ 2018: రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు సంబంధించిన 1994 నాటి తీర్పును పునఃపరిశీలించేందుకు కోర్టు నిరాకరించింది. దానితోపాటు ఇస్మాయిల్ ఫారూఖీ కేసును రాజ్యాంగ ధర్మాసనం దగ్గరకు పంపడానికి కూడా అంగీకరించలేదు.
ఇవికూడా చదవండి:

Tuesday, 27 November 2018

సుప్రీంకోర్టు–రామమందిరం

సుప్రీంకోర్టు–రామమందిరం
28-11-2018 00:23:01

నాలుగున్నరేళ్ల పాటు అయోధ్య సమస్య పరిష్కారాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా భావించకుండా ఎన్నికల సమయంలో అయోధ్యపై తీర్పు కావాలని మోదీ సర్కార్ భావిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఎందుకు స్పందించాలి? తాను అనుకున్నప్పుడల్లా, తన రాజకీయ ప్రయోజనాలకోసం సర్వోన్నత న్యాయస్థానం స్పందించాలని ప్రభుత్వం భావించడం సరైన విషయమేనా?

‘రాజ్యాంగ నైతికత అనేదాన్ని మనం పెంపొందించాలే కాని అది సహజంగా జరగదు. మన వాళ్లు దాన్ని ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నది. భారత దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒక అప్రజాస్వామిక సమాజంపై అద్దిన పైమెరుగు మాత్రమే..’ అని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అన్నారు. సోమవారం నాడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 68 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కీలక ప్రశ్నలకు సమాధానం రావల్సి ఉన్నదన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, హుందాగా జీవించే పరిస్థితుల్లో భారతీయులు ఉన్నారా అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఈ ప్రశ్న చాలా విలువైనదే కాక అనేక ప్రశ్నలకు తావిస్తుంది.

స్వాతంత్ర్యం తర్వాత భారత రాజ్యాంగం పరిధిలో అందరికీ సమాన హక్కుల్ని ప్రసాదిస్తూ, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విలువ ఇస్తూ, ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తూ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అయినా పరిస్థితులు ఏమైనా మారాయా? అసలు రాజ్యాంగం ఎవరి కోసం? సమాజంలో ఉన్నవారికోసమా? లేక లేనివారికోసమా? అణిచివేసే వారికోసమా లేక అణగారిన వర్గాల వారికోసమా? కులం, మతం, జాతి, ప్రాంతం మొదలైన వాటి ఆధిపత్య స్వభావాన్ని రాజ్యాంగం మార్చివేసిందా?

అయినప్పటికీ జస్టిస్ గొగోయ్ అన్నట్లు రాజ్యాంగం అనేది మన జీవితాలతో పెనవేసుకుపోయింది. మన మొత్తం సమాజం రాజ్యాంగం అనే చట్రం పరిధిలో నడుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇంటా, బయటా మన జీవితాల్ని రాజ్యాంగ యంత్రాంగం నిర్దేశిస్తుంది. మన చుట్టూ ఉన్న పార్లమెంట్, అసెంబ్లీలు, ముఖ్యమంత్రులు, నేతలు, మన ఎన్నికలు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నవే. సమాజంలో సంక్షోభాలు ఏర్పడుతున్నకొద్దీ వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. మన జీవితాల్లో రాజ్యాంగం ప్రవేశించిందన్న మాటలో అవాస్తవం లేదు. కాని నిజంగా రాజ్యాంగం, రాజ్యాంగం ప్రకారం అమలు అవుతున్నదా? అన్న ఆవేదనను జస్టిస్ గొగోయ్ వ్యక్తం చేశారు. మనిషి ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినప్పటికీ రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛా సమానత్వాలను ఆ వ్యక్తి పాదాల క్రింద పణంగా పెట్టలేమని, అతడిని విశ్వసించి, సంస్థలను కాలరాసే అధికారాన్ని ఆ వ్యక్తికి అప్పజెప్పలేమని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను, స్వేచ్ఛా సమానత్వాలను పరిరక్షించకపోతే తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు. గొగోయ్ ఎవర్ని, ఏ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారో మనం ఊహించుకోవాల్సిందే కాని మన దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకూ, ఆయన వ్యాఖ్యలకూ సంబంధం లేదని మాత్రం చెప్పలేం.

రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల సభలో మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం కేసులో తీర్పు చెప్పవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కాంగ్రెస్‌ పార్టీ భయపెడుతోందని, ప్రధాన న్యాయమూర్తిని అభిశంసిస్తామని కూడా హెచ్చరించిందని ఆరోపించారు. ఒక ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టును ఎన్నికల సభల్లో ప్రస్తావనకు తీసుకురావడం అంటే దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా రాజకీయాల్లోకి లాగాలని భావిస్తున్నట్లే అవుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వతంత్రంగా లేరని, కాంగ్రెస్ భయపెడితే భయపడేవారని చెప్పడమే ఆయన ఉద్దేశమా? ప్రధానమంత్రే ఇలా అంటే న్యాయవ్యవస్థపై ఎవరికి గౌరవం ఉంటుంది? నిజానికి గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టదలుచుకున్న అభిశంసన తీర్మానానికీ అయోధ్యలో రామమందిరం అంశానికీ ఏ మాత్రం సంబంధం లేదు. అవి ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగానికి సంబంధించినవి. మరి ప్రధానమంత్రి ఈ అభిశంసన తీర్మానానికీ, అయోధ్యలో రామమందిరానికి సంబంధించిన కేసుకూ ఎందుకు ముడిపెడుతున్నారు? ఇందులో ఏదో మతలబు ఉన్నదన్నమాట. ప్రధానమంత్రి మాటలే నిజమైతే జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలోనే అయోధ్య కేసును తేల్చివేసి రామమందిర నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావించిందని, దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునేందుకే అభిశంసన తీర్మానాన్ని ముందుకు తెచ్చాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలో ఆయనకూ, ప్రభుత్వానికీ మధ్య ఒక అవగాహన ఏర్పడి ఉండవచ్చుననే అనుమానాలకూ ప్రధాని ప్రకటన తావిస్తున్నది.

ఏ కారణాల వల్లనైతేనేం, జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలో అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనే లేదు. అయోధ్యపై కేసును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడానికి నిరాకరించి, అక్టోబర్ 29 నుంచి ప్రతి రోజూ విచారణ జరుగుతుందని తీర్పు చెప్పి మరీ ఆయన పదవీవిరమణ చేశారు కాని ఆయన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గొగోయ్ ఆ తీర్పును ప్రక్కన పెట్టారు. ‘మాకింతకన్నా ముఖ్యమైన విషయాలెన్నో ఉన్నాయి.’ అని ఆయన ఈ కేసు విచారణను జనవరి నెలకు వాయిదా వేశారు.

నిజానికి నరేంద్రమోదీ ప్రభుత్వానికి కూడా ఎన్నికల సమయంలో తప్ప అయోధ్య అంత ముఖ్యమైన విషయం కాదని ఆ కేసు విచారణ జరిగిన తేదీలను బట్టి చూస్తేనే అర్థమవుతోంది. అయోధ్య భూ వివాదంపై 2011 మేలోనే సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ స్టే ఎత్తి వేసేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. కోర్టు వెలుపల ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా 2017 మార్చిలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహార్ చెప్పినప్పటికీ నరేంద్రమోదీ కానీ, బిజెపి కానీ, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ కానీ అటువంటి పరిష్కారానికి ఆసక్తి ప్రదర్శించలేదు. మళ్లీ జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలోనే 2018లో ఈ కేసులో చురుకుగా కదలిక ఏర్పడింది. కాని జస్టిస్ గొగోయ్ నిర్ణయం వల్ల బిజెపి, సంఘ్ పరివార్ సంస్థలు హతాశులైనట్లు కనపడుతోంది. నాలుగున్నరేళ్ల పాటు అయోధ్య సమస్య పరిష్కారాన్ని అత్యంత ముఖ్యమైన విషయంగా భావించకుండా ఎన్నికల సమయంలో అయోధ్యపై తీర్పు కావాలని మోదీ సర్కార్ భావిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఎందుకు స్పందించాలి? తాను అనుకున్నప్పుడల్లా, తన రాజకీయ ప్రయోజనాలకోసం సుప్రీం స్పందించాలని ప్రభుత్వం భావించడం సరైనదా?

నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఎన్నికల ప్రయోజనాలకు సంఘ్ పరివార్ పూర్తిగా అండదండనిస్తున్నట్లు గత కొద్ది నెలలుగా ఆర్ఎస్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, సాధువులు ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తే ముస్లింలు సహనాన్ని కోల్పోతున్నారని కేంద్రమంత్రులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా అయోధ్యలో శివసైనికులు, విహెచ్‌పి భారీ ఎత్తున లక్షమందికి పైగా సాధువులు, కార్యకర్తలతో బలప్రదర్శన చేయాలని నిర్ణయించడం 1992 డిసెంబర్ 6 నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. అటు కేంద్రంలోనూ, ఉత్తర ప్రదేశ్‌లోనూ బిజెపి సర్కార్ ఉన్నందువల్ల బలసమీకరణ చేయడం ఆ సంస్థలకు అంత కష్టం కాకపోవచ్చు.

తాజాగా నరేంద్రమోదీ చేసిన ప్రకటన రామమందిరం విషయంలో సంఘ్ పరివార్ సంస్థల ఆందోళనకు మరింత బలం చేకూర్చినట్లయింది. రామమందిర నిర్మాణం తాను కావాలని కోరుకుంటున్నానని, కాని కాంగ్రెస్ పార్టీయే సుప్రీం కోర్టు న్యాయమూర్తులను బెదిరించి తీర్పు రాకుండా చేసిందని ఆయన తేల్చేసినట్లు స్పష్టమవుతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇండోర్‌లో ప్రకటించారు. దీని వల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ప్రజల భావోద్వేగాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరగబోయే సార్వత్రక ఎన్నికల్లో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భావోద్వేగాలను రేకెత్తించి ప్రయోజనం పొందేందుకు కూడా మోదీ రంగం సిద్ధం చేశారన్న విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుపై అయోధ్య విషయంలో ఒత్తిడి పెంచుతున్నది ఎవరు? కాంగ్రెసా లేక మోదీ, షా, సంఘ్ పరివార్ పెద్దలా.. అన్న ప్రశ్న తలెత్తే అవకాశం లేకపోలేదు. జనవరిలో సుప్రీం కోర్టు అయోధ్యపై ఏం నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం కాని కోర్టు తీర్పుకు ముందే న్యాయ వ్యవస్థ, చట్టాలకు అతీతంగా వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నిజానికి మోదీ హయాంలో దేశంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే, స్మార్ట్ సిటీలతో దేశం వర్ధిల్లితే, నిరుద్యోగం, పేదరికం సమసిపోతే, నల్లధనం దేశానికి తిరిగి వస్తే భావోద్వేగాలు కల్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఇవాళ మధ్యప్రదేశ్‌లోనూ, రాజస్థాన్‌లోనూ నరేంద్ర మోదీ సభలకు జనం అంతగా ఆకర్షితులు కావడం లేదు. సిబిఐలో జరుగుతున్న పరిణామాలు, రాఫెల్ డీల్ వంటి అంశాలపై సుప్రీం కోర్టు లో సాగుతున్న విచారణ, ప్రతిపక్షాలు ఏకం కావడం మొదలైన అంశాలపై కూడా వారు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తమ దైనందిన సమస్యల గురించి వారు మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాటికి జవాబు చెప్పే ధైర్యం లేనందువల్లే మోదీ, ఆయన అభిమాన సంఘీయులు భావోద్వేగ అంశాలను లేవనేత్తి భయభ్రాంత వాతావరణం కల్పిస్త్తున్నారు. తాను కామ్ ధర్ (నిరంతరం పనిచేసే) ప్రధానినని, అచ్ఛేదిన్ (మంచిరోజులు) వస్తాయని మోదీ చెప్పిన మాటలు ప్రశ్నార్థకమవుతున్నాయి.

ఎన్నికల పర్యటనలో భాగంగా ఇండోర్‌లో ఒక బిజెపి మిత్రుడి ఇంట్లో జరిగిన వివాహానికి వెళ్లినప్పుడు అక్కడ ఆయన సోదరుడు, సంఘ్ సీనియర్ నేత, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ బాధ్యతలు చూసే పెద్ద మనిషి కనిపించారు. ‘మా సోదరుడి మాటలతో నేను ఏకీ భవించను. నరేంద్రమోదీ, అమిత్ షా హయాంలో పార్టీ కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది.. ఒకప్పుడు మధ్యప్రదేశ్‌లో బిజెపి సర్కార్ రావడానికి ఎంతో కృషి చేసిన మమ్మల్ని ఎవరూ లెక్కచేయడం లేదు.. ఇండోర్ లో పార్టీకి దిగ్భ్రాంతికరమైన ఫలితాలు వస్తాయి..’ అని బిజెపి మిత్రుడు చెప్పారు. కాని ఆర్ఎస్ఎస్ పెద్దమనిషి మాత్రం మోదీ హయాంలో దేశంలో హిందూ మత భావనలకు విలువ, హిందువులకు ధైర్యం పెరిగిందని అన్నారు. ‘రాహుల్ గాంధీ కూడా దేవాలయాలకు వెళుతున్నారు.. మాకింకేం కావాలి? మోదీ దేశానికి ఏం చేశారా అని నన్నడగకండి.. మాకు కావల్సింది చేస్తున్నారు..’ అని ఆయన సంతృప్తి వ్యక్తపరిచారు. ఇక ప్రజలు ఏమి చేస్తారో కాలం తేలుస్తుంది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

గోమాంసం ఓకే BJP at Mizoram

గోమాంసం ఓకే
28-11-2018 02:28:54

మిషనరీకి టికెట్‌
మిజోరంలో కమలం రూటే వేరు
స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించటం, వాటికి తగట్టుగా తమ విధానాలను మార్చుకోవటం రాజకీయ పార్టీలకు ప్రాణావసరం. బీజేపీలాంటి జాతీయ పార్టీలు కూడా కొన్ని సందర్భాలలో స్థానికావసరాలుగా తగ్గట్టుగా తమ విధానాలను మార్చుకోకతప్పదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మిజోరం. 87 శాతం క్రైస్తవులు నివసించే ఈ రాష్ట్రంలో ఆచారాలు, వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. బీజేపీ దీనికి తగ్గట్టుగా తమ విధానాలను మార్చుకుంటూ వచ్చింది.

మతమార్పిడులకు సంబంధించిన అంశాలలో క్రైస్తవ మిషనరీల పాత్రపై బీజేపీ, దాని అనుబంధ సంస్థలు అనేక పోరాటాలు చేస్తున్నాయి. అలాంటి బీజేపీలోకి క్రైస్తవ మిషనరీ రెవరెండ్‌ ఎల్‌.ఆర్‌. కోల్నిని చేర్చుకోవటం.. ఆయనకు వెంటనే అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వటం మిజోరంలో చర్చనీయాంశమయింది. ఇప్పటి దాకా బీజేపీ ఓట్ల కోసం చక్మాలు, బౌద్ధులపైనే ఆధారపడుతూ వచ్చింది.

అయితే క్రైస్తవులు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఆధిపత్యం సాధించాలంటే వారిని కూడా తమతో కలుపుకొని పోవాలని బీజేపీ భావిస్తోంది. ‘‘మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. మా ప్రత్యర్థులు మాపై అలాంటి ముద్ర వేస్తున్నారు. క్రైస్తవులు అధికంగా ఉన్న మూడు ఈశాన్య రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు కదా?’’ అంటారు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటంలో కీలకపాత్ర వహించిన బిశ్వశర్మ. ఈ ఎన్నికల్లో గెలిస్తే- తాము క్రైస్తవులకు వ్యతిరేకం కాదని చెప్పటానికి ఒక ఉదాహరణగా బీజేపీ ప్రయత్నం చేయవచ్చు.

బీఫ్‌పై వైఖరి వేరే!
మిజోరంలో ఎక్కువ మంది ప్రజలు గోమాంసాన్ని తింటారు. పర్వతసానువుల్లో ఉన్న తమకు అదే బలవర్ధకమైన ఆహారమని వారు భావిస్తారు. గోమాంసం విషయంలో, బీజేపీ జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానం అందరికి తెలిసిందే! అయితే మిజోరంలో మాత్రం బీజేపీ చాలా భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. ఇది ఎన్నికలకు సంబంధించిన అంశమే కాదని.. తాము స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లలో కలగజేసుకోబోమనేది బీజేపీ నేతల వాదన. బీజేపీ కేంద్రనాయకత్వం, దాని అనుబంధ సంస్థలు ఈ వైఖరినే సమర్థిస్తున్నాయి. బీఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటుగా, సంపూర్ణ మద్య నిషేధంపై కూడా బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మిజోరంలో కాంగ్రెస్‌ సర్కారు 2014లో మద్యనిషేధాన్ని ఎత్తివేసింది. దీని వల్ల యువత మద్యానికి బానిసలు అవుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఇదొక ప్రధానమైన ప్రచారాంశంగా మారింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ తాము సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటిస్తే.. కాంగ్రెస్‌ తాము అధికారంలోకి వస్తే చర్చితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామంటోంది.

మద్యనిషేధానికి సంబంధించి బీజేపీకి జాతీయ విధానమేమీ లేదు. గుజరాత్‌తో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్న బీజేపీ.. ఇతర రాష్ట్రాల్లో ఆ విషయానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వటం లేదు. మిజోరంలో మాత్రం- తాము అధికారంలోకి వస్తే స్థానికంగా ఉత్పత్తి చేసే మద్యాన్ని అనుమతిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే మద్యాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది.