Wednesday, 12 August 2015

40 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం

రాష్ట్రంలో... 40 వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతం : మంత్రి పల్లె
నెల్లూరు, ఆగస్టు 12 : రాష్ట్రంలో... మొత్తం 60, 770 ఎకరాల వక్ఫ్ భూములుండగా అందులో 40 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ... అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను జీవో నెం 18 ద్వారా స్వాధీనం చేసుకుంటామన్నారు. అలాగే ముస్లింల వివాహ పథకం ద్వారా వివాహం చేసుకునే జంటకు ప్రభుత్వం తరుపున రూ. 50వేలను చెల్లిస్తామన్నారు. నెల్లూరులో మరో షాదీమంజిల్‌ను నిర్మిస్తామని, అంతేగాక రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా జరుపుతామన్నారు.

http://www.andhrajyothy.com/Artical?SID=139647

Saturday, 8 August 2015

ఆ కోరిక తీర్చలేదని.. 19 మందిని చంపేశారు!

ఆ కోరిక తీర్చలేదని.. 19 మందిని చంపేశారు!

మోసుల్ (ఆగస్ట్ 8): ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల పైశాచికత్వం మరోసారి హద్దులు దాటింది. కేవలం శృంగారానికి నిరాకరించారన్న కారణంతో 19 మంది మహిళల్ని అతి కిరాతకంగా హత్య చేశారు ఐఎస్ ఉగ్రవాదులు.
 
కుర్దిస్తాన్ డెమోక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి ఈ వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఇరాక్‌లో చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్న ఉగ్రవాదులు ప్రత్యర్థి తెగలకు చెందిన మహిళలను అపహరించుకునిపోయి సెక్స్ బానిసలుగా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా మరికొంత మంది మహిళల్ని నడివీధిలో నిలబెట్టి వేలంపాట నిర్వహించి అమ్మేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో తమ సెక్స్ బానిసలుగా ఉండడానికి నిరాకరించిన 150 మంది ఇరాక్ మహిళలను ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. 

Friday, 7 August 2015

తెలంగాణలో స్వరాజ్యం?: కోదండరామ్

తెలంగాణలో స్వరాజ్యం?: కోదండరామ్

ఆప్‌ తరహాలో జాప్‌!?.. కోదండ నేతృత్వంలో కొత్త శక్తి!  యోగేంద్ర యాదవ్‌తో చేతులు కలపనున్న ప్రొఫెసర్‌ 10న ఢిల్లీలో కీలక సమావేశం.. సంపూర్ణ తెలంగాణ సాధనకు కృషి
 
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అణగారిన వ్యక్తుల గొంతుకై మరో ‘స్వరాజ్యం’ ఉద్బవించనుంది. సంప్రదాయ రాజకీయాలకు తెరదించి ప్రజల ఆశలను నెరవేర్చేందుకు నవశక్తి నడుం బిగిస్తోంది. మరోసారి సకల జనులను ఐక్యం చేయడానికి ప్రయత్నం మొదలైంది. ఈ మేరకు తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో కొత్త శక్తులు పురుడు పోసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆప్‌ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో ముఖ్య కారకుల్లో ఒకరైన యోగేంద్ర యాదవ్‌ తెలంగాణలో కోదండరాంతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారని, ఈనెల పదిన వీరిద్దరి మధ్య కీలక సమావేశం జరగనుందని అత్యంత విశ్వసనీయ వర్గాలు వివరించాయి. వివరించాయి. ఆప్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత యోగేంద్ర యాదవ్‌ ‘స్వరాజ్‌ అభియాన్‌’ అనే కొత్త వేదికను ప్రారంభించారు. దీనిద్వారా ఆయా రాషా్ట్రల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైనా యోగేంద్ర దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్‌ వెళ్లి కోదండరాంతో ఆయన భేటీ అయినట్లు తెలిసింది. వాస్తవానికి, ఆప్‌లో, అంతకుముందు సెఫాలజిస్టుగా ఉన్నప్పటి నుంచీ కోదండరామ్‌తో యోగేంద్ర యాదవ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
 
గతంలోనే ఆప్‌కు తెలంగాణ కన్వీనర్‌గా ఉండాలంటూ కోదండకు యోగేంద్ర యాదవ్‌ ఆఫర్‌ ఇచ్చారని, దానిని ఆయన తిరస్కరించారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం యోగేంద్రతో కలిసి పని చేయడానికి కోదండరాం సుముఖంగా ఉన్నారని, ఈనెల పదిన వీరిద్దరూ సమావేశం కానున్నారని ఆ వర్గాలు వివరించాయి. ఆరోజు జంతర్‌ మంతర్‌లో భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా స్వరాజ్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు కోదండరాం హాజరవుతున్నట్లు పైకి చెబుతున్నా.. నిజానికి భవిష్యత్‌ ప్రణాళికా రచనకు శ్రీకారం చుడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వివరించాయి. ‘ఇప్పుడు ప్రొఫెసర్‌గా ఉన్నా. రేపు ఏమి అవుతానో చెప్పలేను’, ‘సంపూర్ణ తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తాం’ అంటూ ఇటీవల కోదండరాం చేస్తున్న ప్రకటనల వెనక ఎంతో అర్ధం ఉందని కూడా ఆయా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ వైఖరితో అసంతృప్తితో ఉన్న కోదండరాం తన సహచరులతో పలు విషయాలను పంచుకున్నట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ అవలక్షణాలైతే ఉండకూడద నుకున్నామో.. అవన్నీ ఇంత త్వరగా దాపురిస్తాయని అనుకోలేదని ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నాయి. ఉద్యమ సమయంలో అందరినీ కలుపుకొనిపోయిన టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం అందరినీ పక్కన పెట్టడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడంపైనా కోదండరాం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది.
 
ప్రజా సమస్యలపై వలంటీర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, అధ్యయనబృందాలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పథకాలపై సర్వేకు పురమాయించినట్లు కూడా తెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాస్వామ్య వాతావరణం లేదని, అణచి వేయాలనుకునే నాయకత్వం వచ్చిందని, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన భావిస్తున్నట్లు ఆ వర్గాలు వివరించాయి. రాజకీయ, సాంఘిక సమీకరణాలను విశ్లేషించడంలో దిట్ట అయిన యోగేంద్ర యాదవ్‌ కోదండరామ్‌కు అండగా ఉండాలని నిర్ణయించారు. ఆప్‌ కోసం గతంలో ఢిల్లీలో నెరపిన మంత్రాంగాన్ని తెలంగాణలో కోదండరాం కోసం చేయనున్నారు. ఆప్‌ తరహాలో తెలంగాణలో జాప్‌ (జాయింట్‌ యాక్షన్‌ పార్టీ)ని ఏర్పాటు చేయాలని కూడా యోగేంద్ర సూచించినట్లు తెలిసింది. అయితే, దీనిపై ఇంకా కోదండరాం తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన మాటను మాత్రం తోసి పుచ్చలేదని తెలిసింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు జాప్‌కు అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

యాకూబ్‌ : ఇబ్బందికర సత్యాలు

యాకూబ్‌ : ఇబ్బందికర సత్యాలు

ముంబై వరుస పేలుళ్ల కుట్ర గురించి యాకూబ్‌కు పూర్త్తిగా తెలిసే వుంటుందా అనేది నిశ్చితంగా చెప్పలేము. సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇవ్వడం, ఆ తీర్పును అమలుపరచడం జరిగిపోయినందున 1993 ముంబై పేలుళ్లలో యాకూబ్‌ పాత్ర కచ్చితంగా ఏమిటనే విషయమై చర్చకు స్వస్తి చెప్పి తీరాలి. సామూహిక నేరాల విషయంలో భారత రాజ్యవ్యవస్థ, నేర న్యాయవిచారణా వ్యవస్థల వివక్షాపూరిత వైఖరిలో మార్పు తీసుకు వచ్చేందుకు మనం తప్పక ప్రయత్నించాలి. 
 
ముంబై పేలుళ్లు, 1992 డిసెంబర్‌- 1993 జనవరిలో అయోధ్య, ముంబైలలో సంభవించిన ‘సంఘటనల సమస్తానికి’ ప్రతిచర్యగా కన్పిస్తున్నాయని జస్టిస్‌ బి.ఎన్‌. శ్రీకృష్ణ నివేదిక వ్యాఖ్యానించింది. ఆ సంఘటనల కార్యకారణత్వాన్ని జస్టిస్‌ శ్రీకృష్ణ బాగా అర్థం చేసుకున్నారు. 1992-93లో ముంబైలో అల్లర్లు చోటుచేసుకోకపోతే 1993 మార్చిలో వరుస పేలుళ్లు సంభవించేవి కావు. అలాగే గోధ్రాలో రైలు బోగీల దగ్ధం జరగకపోతే 2002లో గుజరాత్‌ మారణకాండకు ఆస్కారముండేది కాదు. ఇందిరాగాంధీ హత్యకు గురికాకుండా ఉన్నట్టయితే 1984లో సిక్కుల ఊచకోత జరిగేది కాదు. మనం ఇంకా ఇలా వాదించవచ్చు: బాబ్రీ మస్జీదు కూల్చివేత జరిగి వుండకపోయినట్టయితే బాబ్రీ అనంతర అల్లర్లు జరిగేవికావు; అమృత్‌సర్‌ స్వర్ణాలయంపై దాడికి సైన్యాన్ని ఇందిర ఆదేశించికపోతే సిక్కు ఉగ్రవాదాన్ని మరింత ముందుగా అదుపు చేయడం సాధ్యమయివుండేది; అయోధ్యలో విశ్వహిందూపరిషత్‌ కార్యకర్తలు కరసేవ చేసివుండకపోయినట్టయితే గోధ్రాలోగానీ, మరెక్కడైనాగానీ ఏ రైలుపైన దాడి జరిగివుండేది కాదు. ఏ హింసాత్మక చర్యకైనా ‘మూలకారణాలను’ శోధించడం ప్రమాదకరమైన విషయమవుతుంది. చర్య-ప్రతిచర్య సిద్ధాంతాలు మూలకారణాలను ఖచ్చితంగా కనుక్కోగలుగుతాయా? అంతిమంగా అవి హింసను హేతుబద్ధీకరణ చేయడానికి దారితీయవూ?  
 
అయినప్పటికీ, జస్టిస్‌ శ్రీకృష్ణ పేర్కొన్నట్లు, ముంబై పేలుళ్లను వాటికి ముందు చోటుచేసుకున్న అల్లర్ల నుంచి విడదీసి చూడలేము. ఈ కారణంగానే ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యాకూబ్‌ మెమన్‌ మరణ శిక్షపై కథనం 1992-93 అల్లర్లను కూడా అనివార్యంగా ప్రతిబింబిస్తుంది. ముంబై మహీమ్‌ ప్రాంతంలో మెమన్‌ అండ్‌ మెహతా (గుజరాతీ హిందువు అయిన మెహతా ఈ సంస్థలో భాగస్వామి) అనే చార్టెర్డ్‌ అకౌంటెన్సీ సంస్థను విజయవంతంగా నిర్వహిస్త్తున్న యాకూబ్‌ ‘ముస్లింలు మాత్రమే’ ఉన్న భయంకర ఉగ్రవాద కుట్రలో ఎందుకు పాల్గొన్నాడు? బాబ్రీ కూల్చివేత అనంతరం చోటుచేసుకున్న మతతత్వ అల్లర్లలో బాగా నష్టపోయిన ప్రాంతాలలో మహీమ్‌ కూడా ఒకటి కావడమే యాకూబ్‌ను, ఆ కుట్రలో భాగస్వామి కావడానికి పురిగొల్పి వుంటుందా? అల్లర్లలో తన సోదరుడి కార్యాలయంపై దాడి జరగడం, కుటుంబానికి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ రావడం ‘పాకిస్థాన్‌కు వెళ్ళిపోవాలని’ మహీమ్‌ ప్రాంతంలోని ముస్లింలను స్థానిక శివసైనికులు బెదిరించడం ఇత్యాది అంశాలు యాకూబ్‌ను ఉగ్రవాద మద్దతుదారుగా మార్చివేసి వుంటాయా?
 
వరుస పేలుళ్ల కుట్ర గురించి యాకూబ్‌కు పూర్త్తిగా తెలిసేవుంటుందా అనేది నిశ్చితంగా చెప్పలేము (ఆ పేలుళ్లను అమలుపరచింది యాకూబ్ సోదరుడు టైగర్‌ మెమన్‌ అని చాలామంది విశ్వసిస్తున్నారు). సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇవ్వడం, ఆ తీర్పును అమలుపరచడం జరిగిపోయినందున 1993 ముంబై పేలుళ్లలో యాకూబ్‌ పాత్ర కచ్చితంగా ఏమిటనే విషయమై చర్చకు స్వస్తి చెప్పి తీరాలి. సామూహిక నేరాల విషయంలో భారత రాజ్యవ్యవస్థ, నేర న్యాయవిచారణా వ్యవస్థల వివక్షాపూరిత వ్యవహరణలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాన్ని మనం ప్రారంభించి తీరాలి.
 
యాకూబ్‌కు మరణశిక్షను అమలుపరచడం ఉగ్రవాదులను నిరోధించడానికి ఎంతైనా తోడ్పడుతుందని, వరుస పేలుళ్లలో 257 మంది మృతుల కుటుంబసభ్యులకు అంతిమ ఊరటనిస్తుందని టీవీ చర్చల్లో పాల్గొన్నవారిలో చాలామంది నొక్కి చెప్పడం జరిగింది. అయితే చాలా కొద్దిమంది మాత్రమే ముంబై అల్లర్లకు పాల్పడిన వారిని కూడా అంతే కఠినంగా శిక్షించాలని కోరారు.  
 
ఆ అల్లర్లలో 900 మందికి పైగా చనిపోయారు. కేవలం ముగ్గురికి మాత్రమే ఒక ఏడాది జైలు శిక్ష విధించారు. ఆ ముగ్గురిలో ఒకరు చనిపోగా మిగతా ఇద్దరు బెయిల్‌పై విడుదలయ్యారు. అయినప్పటికీ ముంబై అల్లర్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్న వారిని ‘జాతి-వ్యతిరేకులు’గా ముద్ర వేస్తున్నారు. 1993 మార్చి 12(వరుస పేలుళ్లు సంభవించిన రోజు)కి ముందు జరిగిన సంఘటనలను చాలా సులభంగా మరచిపోతున్నారు. ఎవరైనా ఆ వరుస పేలుళ్ల పూర్వరంగాన్ని గుర్తు చేసుకుంటే వారిని ‘ఉగ్రవాదులకు’ సంజాయిషీదారులని ఆరోపిస్తున్నారు. మతం పేరిట బాకులతో అల్లర్లలో పాల్గొనే వారిని ఆర్‌డీఎక్స్‌తో దాడులు జరిపే ఉగ్రవాదులతో పోల్చకూడదని వాదిస్తున్నారు. 
 
విజ్ఞతాయుతంగా ఆలోచించే ఉదారవాదులకు తమ అభిప్రాయాలను సమర్థించుకోవాల్సిన అగత్యమేర్పడింది. ఈ కారణంగానే యాకూబ్‌ వ్యవహారంలో వ్యక్తమవుతున్న అసమ్మతిని అసదుద్దీన్‌ ఓవైసీ లాంటి వారు హైజాక్‌ చేస్తున్నారు. ఓవైసీ ఉదారవాది కాదు. రాజకీయ వేత్త. ‘ముస్లింల ప్రయోజనాలను’ పరిరక్షించే వాడిగా పేరు పొందడానికి ఆయన ఆరాటపడుతున్నారు. బాల్‌ ఠాక్రే వ్యవహరించిన తీరుకు ఇది భిన్నమేమీ కాదు. 1992-93 అల్లర్లు, హింసాకాండ సందర్భంలో బాల్‌ ఠాక్రే తనను తాను హిందువుల ‘పరిరక్షకుడు’గా భావించుకున్నారు; అలా వ్యవహరించారు. 1995 మహారాష్ట్ర శాసనసభా ఎన్నికల్లో శివసేన విజయానికి ఇది ఎంతైనా తోడ్పడింది. అలాగే ప్రవీణ్‌ తొగాడియా, నరేంద్ర మోదీల విషయాన్ని చూడండి. 2002లో వారు తమను తాము హిందూ హృదయ్‌ సమ్రాట్‌లుగా, గుజరాత్‌ అస్మిత పరిరక్షకులుగా ప్రచారం చేసుకున్నారు. రాజీవ్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇలానే వ్యవహరించలేదూ? 1984 సార్వత్రక ఎన్నికల సందర్భంగా సిక్కులపై ఉగ్రవాదులనే ముద్ర వేస్తూ కాంగ్రెస్‌ కపట ప్రచారం చేసింది.
 
అప్పటికీ ఇప్పటికీ ఏమిటి తేడా? ఇస్లామిక్‌ స్టేట్‌ లాంటి ఉగ్రవాద సంస్థల అంతర్జాతీయ ‘జిహాద్‌’ బెడద అప్పుడు లేదు. ఇప్పుడు ఇస్లామిక్‌ స్టేట్‌ లాంటి ఉగ్రవాద సంస్థల ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ముస్లిం యువత ఆ ప్రభావానికి లోనై ప్రధాన స్రవంతికి దూరమవుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాల పట్ల ‘ప్రతీకార’ చర్యలకు పాల్పడుతున్నారు. రాజ్య వ్యవస్థ న్యాయబద్ధంగా వ్యవహరించాలని, అందరికీ సమానావకాశాలు కల్పించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఉగ్రవాద కుట్ర కేసులో కంటే మతతత్వ అల్లర్ల కేసులో సాక్ష్యాధారాలను సేకరించడం చాలా కష్టం అని 1992-93 అల్లర్ల కేసులపై దర్యాప్తు సరిగ్గా జరగకపోవడానికి సాకు చెప్పడం ఇంకెంత మాత్రం సబబు కాదు.
 
హిందూ ఉగ్రవాద బృందాల ప్రమేయమున్న మాలేగావ్‌, అజ్మీర్‌ పేలుళ్ల కేసుల్లో సాక్షులు పలువురు ప్రతికూలురుగా మారుతున్న దృష్ట్యా ముంబై పేలుళ్ల కేసులో తీర్పును ఉగ్రవాదాన్ని రాజ్య వ్యవస్థ ఎంత మాత్రం సహించదనడానికి చిహ్నంగా ఎలా భావించగలం? ముంబై పేలుళ్ల కేసు విచారణలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉన్న ఉజ్వల్‌ నికమ్‌ ప్రజల దృష్టిలో హీరోగా ఉండగా మాలెగావ్‌ పేలుళ్ల కేసులో ప్రాసిక్యూటర్లు ఎందుకు బెదిరింపులకు గురవుతున్నారు? 42 మంది ముస్లింలు కాల్చివేతకు గురైన హషింపురా ఘటన కేసులో మూడు దశాబ్దాల తరువాత తీర్పు వెలువడింది. ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గోధ్రాలో రైలు బోగీల దగ్ధం కేసులో నిందితులుగా ఉన్న వారు మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్షకు గురికాగా నరోదా పటియా లాంటి గుజరాత్‌ అల్లర్ల కేసులలోని నిందితులు బెయిల్‌పై ఎలా విడుదలయ్యారు? వారికి మరింత కఠిన శిక్షలు విధించాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఎందుకు కోరడం లేదు? వివిధ వర్గాలుగా చీలిపోయి వున్న సమాజంలో ఇటువంటి ప్రశ్నలను లేవనెత్తడం ‘జాతి-వ్యతిరేకులు’ అనే ఆరోపణకు గురికావడానికి దారితీస్తోంది. పాకిస్థాన్‌కు వెళ్ళిపోవాలనే బెదిరింపులను ఎదుర్కోవలసి వస్తోంది. అయితే వీటిని మరో దృష్టి కోణంలో చూడండి. ఈ ప్రశ్నలు వాస్తవంగా ‘ఇబ్బందికరమైన సత్యాలు’. ఏ పరిణతి ప్రజాస్వామ్యమైనా వీటిని ఎదుర్కొని తీరాలి. అలా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనమూ మరో పాకిస్థాన్‌ కాబోమనే భరోసా కలుగుతుంది. 
 
తాజా కలం: 1993లో జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ ఎదుట మూడురోజుల పాటు సాక్ష్యమిచ్చాను. మూడో రోజు కోర్టు నుంచి నిష్క్రమిస్తుండగా శివసైనికుడు ఒకరు నన్ను ఆపి ‘బాలా సాహెబ్‌ మా దేవుడు, మా రక్షకుడు, ఏ న్యాయస్థానమూ ఆయన్ని దోషిగా రుజువు చేయలేదు. ఇది మరచిపోవద్దు’ అని హెచ్చరించాడు. అతను సరిగానే మాట్లాడాడని రుజువయింది. 1995లో ముంబైలో బీజేపీ-శివసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శ్రీకృష్ణ నివేదికను చెత్తబుట్ట పాలుచేసింది. 2012లో బాలే ఠాక్రేకు కాంగ్రె్‌స-ఎన్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

Tuesday, 14 July 2015

అభివృద్ధికి కుల గణన గొళ్లెం!

అభివృద్ధికి కుల గణన గొళ్లెం!
కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో బీసీ రిజర్వేషన్ల అమలును సవాలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బీసీల కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని సుప్రీంకోర్టు 1993లో ఆదేశించింది. అయినప్పటికీ కుల గణన కార్యక్రమం అనేకసార్లు వాయిదాపడి చివరికి 2011లో ‘సామాజిక, ఆర్థిక కులగణన’ చేపట్టడం జరిగింది. వాటి వివరాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పేదరికం వివరాలను గ్రామీణ, పట్టణ పేదరికం, వృత్తుల్లోని ఆర్థిక వ్యత్యాసాలు మాత్రమే శాతాల్లో ప్రకటించారు. కులాలవారీగా వివరాలను ప్రకటించలేదు. అసలు 2011 సాధారణ జనాభా లెక్కలు పూర్తి అయిన తరువాత అదనంగా ‘సామాజిక, ఆర్థిక కుల గణన’ ప్రత్యేకంగా చేపట్టిన జనాభా లెక్కలివి. అంత ప్రాధాన్యం గల సామాజిక వర్గాల, కులాల ముఖ్యంగా బీసీ కులాల వారీగా లెక్కలు తీసినప్పటికీ ప్రకటించకపోవడం ఆందోళనకరమైన విషయం.

ప్రపంచ ప్రఖ్యాత అర్ధ శాస్త్రవేత్త సి.కె. ప్రహ్లాద ‘ఫార్ట్యూన్‌ ఎట్‌ ది బాటమ్‌ ఆఫ్‌ పిరమిడ్‌’ అనే గ్రంథంలో విశ్లేషించిన ఒక ముఖ్యాంశం ఇక్కడ గుర్తు చేసుకోవడం అవసరం. ఆయన ఏమన్నారంటే ‘గత 200 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సాగిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పారిశ్రామిక అభివృద్ధి, ఆధునిక విద్య మొదలైనవన్నీ ప్రపంచంలోని మూడింట ఒక వంతు జనాభా మాత్రమే ప్రయోజనం పొందుతున్నది. అనగా 600 కోట్ల ప్రపంచ జనాభాలో 200 కోట్ల జనాభా మాత్రమే దీనిని అనుభవిస్తున్నారు. ఈ ఉత్పత్తి విధానాలు, ఉత్పత్తి ప్రమాణాలు, మార్కెటింగ్‌ వ్యవస్థ సాంకేతిక విద్య, విజ్ఞానం, నూతన ఆవిష్కరణలు ఇదే పద్ధతిలో సాగితే నిరంతరం మూడింట రెండు వంతులు ఇలాగే పేదరికంలోకి నెట్టి వేయబడి అందరికీ ఫలాలు అందవు. అందువలన వీటన్నింటిలో సమూలంగా మార్పుచేసుకోవడం అవసరం. మూడింట రెండు వంతుల జనాభా ఈ సాంకేతిక అభివృద్ధి, విజ్ఞానం, విద్య అందుకోవడానికి నూతనంగా మౌళికంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనిషికి నైపుణ్యాలు కల్పించి ఉపాధి కల్పించడం ద్వారానే మిగతా మూడింట రెండు వంతుల జనాభా అభివృద్ధిలోకి రావడం సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.
 
కులాలవారీగా తీసిన ఆ లెక్కలు ప్రకటించినప్పుడే రిజర్వేషన్‌లలో, బడ్జెట్‌లలో, ప్రణాళికలలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయడం సాధ్యమవుతుంది. అందుకోసమనే సుప్రీంకోర్టు బీసీ కులాల లెక్కలు తీయాలని ఆదేశించింది. తద్వారా కులాలవారీ లెక్కలను జిల్లాల వారీగా, రాషా్ట్రలవారీగా విడివిడిగా ప్రకటించాలి. వాటన్నిటినీ కలిపి జాతీయస్థాయిలో జనాభా శాతాన్ని నిర్ధారించాలి. అప్పుడే అన్ని రంగాలలో బీసీల జనాభా అనుసరించి అభివృద్ధి పథకాలు, విద్యా ఉపాధి ఉద్యోగ రంగాలలో, రాజకీయ రంగంలో రిజర్వేషన్‌లు ఏ మేరకు ఉండాలి అనే అంశంపై ఒక శాసీ్త్రయ ప్రాతిపదిక ఏర్పడుతుంది. అందువల్ల కులాలవారీ లెక్కలు వెంటనే ప్రకటించడం అవసరం. ఇప్పటికే ఈ వివరాలు ప్రకటించడానికి 4 ఏళ్ళు గడిచిపోయాయి. మన సమాజంలోని అన్నివర్గాల ప్రజలు వాస్తవ స్థితిగతులు శాసీ్త్రయంగా గణించడానికి ఎనిమిదన్నర దశాబ్దాల తర్వాత గానీ వీలు కాలేదు. ఆయ సామాజిక వర్గాలను పేదరికం నుంచి ఎదిగించడానికి ఇంత ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందోనని ప్రశ్నిస్తే మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల వద్ద సమాధానం మాత్రం దొరకదు. -చిచ్ఢినశి9ా)

కేంద్రంలో ఆనాటి జనతాపార్టీ ప్రభుత్వం 1979లో నియమించిన మండల్‌ కమిషన్‌ 1980లో దేశంలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేల్చింది. 1993నాటికి ఇంద్ర సహానీ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం (ప్రసిద్ధ మండల్‌ కేసు) కేసు తీర్పులో కులాలు వారీగా జనాభా గణను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే 2011 నాటికి యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల గణనను చేపట్టింది. అయితే ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ గణాంక వివరాలను బయటపెట్టేందుకు సిద్ధపడటంలేదు. ఈ గణన వలన దేశంలోని ప్రజల వాస్తవ జీవన ప్రమాణాలను బహిర్గతం చేస్తుంది. అయితే అన్ని వివరాలు వెలవరించిన కేంద్ర ప్రభుత్వం కుల గణనను మాత్రం గోప్యంగా ఉంచింది. ఈ నేపథ్యం కుల గణన కోసం ఎదురు చూస్తున్న బీసీ కులాలు ప్రభుత్వ చిత్తశద్ధిని శంకిస్తున్నాయి. తరతరాలుగా విద్యావంతులుగా, సంపన్నులుగా ఎదుగుతూ వస్తున్న వారి వారసులతో శతాబ్దాల తరబడి అణగారిపోయిన కులాల నుంచి వచ్చిన తొలి తరం, మలి తరం యువత ఎదగ డం అసాధ్యం. ఈ నేపథ్యంగానైనా రిజర్వేషన్‌లు అయినా కల్పించాలి. లేదా నైపుణ్యాలు అయినా పెంచే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించాలి. అలాగే పేదరికం నుంచి నివృత్తి కలిగించి మధ్యతరగతి జీవన ప్రమాణాలకు ఎదిగే విధంగా బడ్జెట్‌లను కేటాయించడం అవసరం. సామాజిక న్యాయాన్ని సాధించాలని సుప్రీంకోర్టు కోరాల్సిన అవసరం ఉంది. ఇలా అనేక ప్రయోజనాల రీత్యా దేశ అభివృద్ధి రీత్యా కులాల వారీగా బీసీల జనాభా లెక్కలను త్వరగా ప్రకటించాలని రాజకీయపార్టీలు, బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
 
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ క్రమంలో రిజర్వేషన్‌ల ప్రాధాన్యం తగ్గుతున్నది. ఉన్న ఉద్యోగాలనే ప్రభుత్వాలు తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు గత 20 ఏళ్ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనాభా 5 కోట్ల నుంచి 8 కోట్లకు చేరుకున్నది. ఆ మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థలలో వివిధ ఉద్యోగుల సంఖ్య పెరగాలి. కానీ ఒకప్పుడు ఉద్యోగాలు 14 లక్షలు ఉంటే, ప్రస్తుతం తెలంగాణ, ఆంఽధ్రప్రదేశ్‌ రాషా్ట్రలు కలిపి కూడా ఎనిమిది లక్షల ఉద్యోగాలయినా లేవు. అందువలన ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పన పెరగాల్సిన అవసరం ఉంది. జనాభా నిష్పత్తి అనుసరించి రిజర్వేషన్‌లు పెరిగితే మరికొన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ప్రైవేట్‌ రంగంలో కూడా ఏదో ఒక స్థాయిలో డైవర్సిటీ - భిన్నత్వంలో - ఏకత్వం అనే సామాజిక దృష్టితో ఆయా సామాజిక వర్గాలకు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రిజర్వేషన్‌లు కల్పించడం అవసరం.
 
కులాలవారీగా లెక్కలు తీయకుండా గంపగుత్తగా శాంపిల్‌ నమూనాలతో పథకాలు అమల్లోకి తెస్తే కలిగే ప్రయోజనం తక్కువ. ఇప్పటివరకు జరుగుతున్న తంతు అలాంటిదే. కుటుంబాల వారీగా, కులాలవారీగా, జిల్లాల వారీగా, రాషా్ట్రల వారీగా, వెనుకబడిన తరగతుల వివరాలను నిర్దిష్టంగా లెక్కలు తీసి ప్రకటించడం అవసరం. అయితే ఈ 2011 సామాజిక ఆర్ధిక కులగణనలో ఈ విధంగా వివరాలు సేకరించినట్లయితే వివరాలు వెలువరించాలి. కులగణనలో కులం ‘గోప్యం’గా ఉంచడం వలన ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమీలేదు. కులాలవారీ గణన వెల్లడించినట్లయితే ఆ సామాజిక వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లలో ఉన్న గందరగోళాన్ని నివారించవచ్చు. దామాషా మేరకు శాతాన్ని మరింతగా పెంపు చేసుకునే వీలుకలుగుతుంది. ఆ వర్గాలకు మరింత ప్రయోజనాలు చేకూర్చే అవకాశం లభిస్తుంది.
 
సామాజిక వాస్తవ జీవన చిత్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, దగా పడుతున్న సామాజిక వర్గాల లె క్కలను కులాలవారీగా, సాంఘిక, ఆర్థిక కొలమానాల ప్రాతిపదికగా గణించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం ముందుకు వస్తే ఈ ప్రక్రియ పూర్తయి వివరాలు చేతిలో అందుబాటులో ఉన్నప్పటికీ వెల్లడించక పోవడం చాలా పొరపాటు. ఈ వివరాలు ప్రధానంగా కులాల వారీ గణన బీసీలకు బాగా లాభించే అంశం. ఈ వర్గాలను విద్య ఉద్యోగ, సాంఘిక రంగాలలో మరింతగా అభివృద్ధి పథంలోకి శాసీ్త్రయంగా ఎదిగించడానికి వీలు కలుగుతుంది. అం దువల్ల కులాలవారీగా తీసిన జనాభాలెక్కలను జిల్లాల వారీగా, రాషా్ట్రల వారీగా వివరించి జాతీయస్థాయిలో బీసీకులాల జనాభాను స్పష్టం చేయడం ఇప్పటికైనా, ఎప్పటికైనా అవసరం.
 
- డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
పూర్వ సభ్యులు - బీసీ కమిషన్‌

Friday, 26 June 2015

ఈ రింగ్‌తో సున్తీ సురక్షితం

ఈ రింగ్‌తో సున్తీ సురక్షితం: డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

వాషింగ్టన్‌: ఆరోగ్యకరమైన విధానంలో సున్తీ నిర్వహించేందుకు రూపొందించిన షాంగ్‌రింగ్‌ పరికరానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం లభించింది. ఈ తరహా పరికరాల్లో డబ్ల్యూహెచ్‌వో ఆమోదం పొందిన వాటిలో షాంగ్‌రింగ్‌ మొదటిదని దీని రూపకర్తలు తెలిపారు.

Friday, 19 June 2015

రంజాన్ లేదా రందాన్ ?

రంజాన్ లేదా రందాన్ ?

Sakshi | Updated: June 20, 2015 12:16 (IST)
రంజాన్ లేదా రందాన్ ?
 న్యూఢిల్లీ: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ లేదా రందాన్ మాసం శుక్రవారం ప్రారంభమైంది. ముస్లిం క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెలలో వచ్చే ఈ మాసాన్ని రంజాన్ అని పిలవాలా లేక రందాన్ అని పిలవాలా? అన్న సంశయం సగటు ముస్లింలకే కాకుండా విద్యావేత్తలకు కూడా కలుగుతోంది. భారతీయ ముస్లిం సంస్కృతి ప్రకారం గతంలో రంజాన్ అనే పిలిచేవారు.
కానీ ఇటీవల కాలంలో ఖురాన్‌లో రందాన్ అనే ఉన్నది కనుక అలాగే పిలవాలనే వాదనలు పెరిగి భారత ఉపఖండంలో కూడా అలాగే పిలుస్తున్నారు. మూలం ఒకటే అయినప్పుడు ఉచ్ఛారణ ఎలా ఉంటే మాత్రమేమిటనే ప్రశ్నించేవారు లేకపోలేదు. ఎలా ఉన్న ఒప్పుకునేవారుంటే ఫర్వాలేదుగానీ ఇలాగే ఉచ్ఛరించాలంటూ ఓ రూలుగా మాట్లాడినప్పుడే ఆ పదం మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఏ పదం ఉచ్ఛారణపైనా స్థానిక సాంస్కృతిక ప్రభావం తప్పకా ఉంటుంది.

భాషా శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం రంజాన్ లేదా రందాన్ పదం మూలాల్లోకి వెళితే రందాన్ అరబిక్ పదం. రంజాన్ పదం పర్షియన్ పదం. ఖురాన్‌లో రందాన్ అని ఉన్నది కనుక అలాగే ఉచ్ఛరించాలని ఢిల్లీ రచయిత రణ సఫ్వీ వాదిస్తున్నారు. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే ఖురాన్ లిఖించిన సమయంలో 'డీ'కి ఉన్న ఉచ్ఛారణ ఇప్పటి అరబికుల్లో లేదు. వారి ఉచ్ఛారణ ఇప్పటికే ఎంతో మారిపోయింది. ఎక్కడైనా స్థానిక సంస్కృతినిబట్టే వారి ఉచ్ఛారణలు ఉంటాయని చరిత్రకారులు ఎప్పుడో సూత్రీకరించారు. ఆ లెక్కన భారతీయ ముస్లింలపై పర్షియన్ల ప్రభావమే ఎక్కువ. అందుకే ఇంతకాలం ఇక్కడ రంజాన్ అని పిలుస్తూ వచ్చారు.

ప్రపంచంలో అరబిక్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొదటి నుంచి రందాన్ అని పిలుస్తూ వచ్చారు. సరే అరబిక్ ప్రకారమే రందాన్‌ను ఉచ్ఛరిద్దామనే సూత్రీకరణకు మనమూ వచ్చామనుకుద్దాం. ‘నమాజ్’ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందే. అరబిక్‌లో దీన్ని 'సలాహ్' అని పిలుస్తారు. రోజా కూడా పర్షియన్ పదమే, దీన్ని అరబిక్‌లో సామ్ (ఎస్‌ఏడబ్లూఎం) అని పిలుస్తారు. అంతెందుకు ‘ఖుదా’ అనే పదం ఫార్సీ నుంచి వచ్చింది. మరీ ఈ పదాల ఉచ్ఛారణను అలాగే ఉంచవచ్చా? అరబిక్ పదం 'రందాన్'లాగా వీటిని కూడా మార్చుకోవచ్చా? భారత్‌లోని బెంగాలీ భాషలోనే 'జెడ్' అనే ఆంగ్ల అక్షరానికి సమానమైన ఉచ్ఛారణ పదమే లేదు. మరి వారెలా పలకాలి అన్నది కూడా ప్రశ్నే కదా!.

 భారత ఉపఖండంలోనే ఉన్న పాకిస్తాన్‌లో కూడా ప్రజలు గతంలో రంజాన్ అనే పిలిచేవారు. అక్కడి టీవీ జర్నలిస్టులు ఆంగ్ల భాష యాసలో స్టైలిష్‌గా పలకడం కోసం 'రందాన్' అనడం మొదలుపెట్టారట. కాలక్రమంలో అక్కడ అరబిక్  'రందాన్'  ఉచ్ఛారణ స్థిరపడిపోయింది. పొరుగునే ఉన్నాం కనుక మనంపై కూడా ఆ ప్రభావం పడిందిమో!

 (గమనిక: రంజాన్ లేదా రందాన్ పదంపై సామాజిక వెబ్‌సైట్లలో చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ వార్త ఇవ్వడం సముచితమని భావిస్తున్నాం-సాక్షి డాట్ కామ్)