న్యాయవాది చాంబర్లోనే మతమార్పిడి, నిఖా
jul 6 2021
న్యూఢిల్లీ, జూలై 5: ఢిల్లీలో ఆయనో న్యాయవాది. కడ్‌కడ్‌కూమా కోర్టులలో వాదించే లాయర్ ఇక్బాల్ మాలిక్ ఒక హిందూ అమ్మాయిపై కన్నేశాడు. బలవంతంగా ఆమెను ఇస్లాంలోకి మార్పించి కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్‌లోనే నికాహ్ చేసుకొన్నాడు. ఈ వ్యవహారంపై మహిళ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ బార్ కౌన్సిల్ ఆ న్యాయవాదికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఆయన లైసెన్సును తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. నికాహ్ లేదా వివాహాలకు న్యాయవాదులు కోర్టు ప్రాంగణాన్ని వినియోగించరాదని బార్ కౌన్సిల్ పేర్కొంది. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ, విశ్వసనీయతను కాపాడేందుకు ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపేందుకు కౌన్సిల్ ప్రత్యేక క్రమశిక్షణా కమిటీని నియమించింది.
No comments:
Post a Comment