Mohan Bhagwat on Hindus and Muslims
ప్రార్ధనా రీతులు వేరైనంత మాత్రాన
మనుషులు ఒకటి కాకుండాపోరు.
-
ఆరెస్సెస్ సర్సంఘ్ ఛాలక్ మోహన్ భగవత్
(డాక్టర్ ఖ్వాజా ఇఫ్తికార్ అహ్మద్ పుస్తకం 'The
Meeting of Minds' ఆవిష్కరణ సందర్భంగా జులై 4న ఘాజియాబాద్ లో ఆర్ ఎస్ ఎస్ సర్సంఘ్ ఛాలక్
శ్రీ మోహన్ భాగ్వత్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలివి.
హిందూ, ముస్లింల గురించి ఆర్ ఎస్ ఎస్ నేరేటివ్ మారుతున్నదా? లేకుంటే, రోజురోజుకూ ప్రజాద్రణను కోల్పోతున్న బిజెపికి త్వరలో
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికల్లో లబ్ది చేకూర్చడానికి ఇదో నెత్తుగడనా? విస్తృతంగా
చర్చించండి.)
1.
1.
మనుషుల్ని కలపడం
రాజకీయాలకు చేతకాదు. పైగా రాజకీయం మనుషుల మధ్య చిచ్చుపెడుతుంది.
2.
హిందూ ముస్లిం ఐక్యత అనేదే
ఒక తప్పుడు ప్రయోగం. వాళ్ళిద్దరు వేరు కానపుడు కలిసే వుంటున్నపుడు ఇక కొత్తగా
ఐక్యత నే మాటకు తావెక్కడిదీ?
3.
తాము కలిసిలేమని హిందూ
ముస్లింలలో ఎవరు అనుకున్నా వాళ్ళిద్దరూ సంకటంలో పడినట్టే .
4.
వచ్చే ఎన్నికల్లో
ముస్లిం ఓట్ల కోసం ఈ మాటలు చెప్పడంలేదు. మాది రాజకీయ పార్టి కాదు.
5.
రాజనీతి అనేది
మనుషుల్ని జోడించే పనిముట్టు కాదు; మనుషుల్ని విడగొట్టే ఆయుధం.
6.
ప్రార్ధనా రీతులు
వేరైనంత మాత్రాన మనుషులు ఒకటి కాకుండాపోరు. ముస్లింలు నిరాకారుడ్ని పూజిస్తారు,
హిందువులు నిరాకారుడ్ని, ఆకారుడ్నికూడ పూజిస్తారు.
7.
అనేక భాషల్ని
మాట్లాడేవారు అనేక ధార్మిక భావనలు కలిగినవారు కలిసి జీవిస్తారని అధర్వణ వేదంలోనే
వుంది. ఎవరు ఎవర్ని పూజించినా ఆ ప్రార్ధనలన్నీ చేరేవి ఒక్కనికే.
8.
మనందరి డిఎన్ ఏ 40 వేల
సంవత్సరాలుగా కొనసాగుతోంది. మైనారిటీలంటే మనతోపాటు జీవిస్తూ వచ్చిన మన సోదరులు.
9.
అయితే, సంఘీయులు
మిమ్మల్ని అణిచివేస్తున్నారు అనే అభిప్రాయాన్ని కొందరు మైనారిటీల మనసుల్లో నాటే
ప్రయత్నాలు చేస్తున్నారు.
10. హిందువులు అత్యధికులుగా వున్న దేశంలోవుంటే
ఇస్లాం అంతరించిపోతుందని మరో ప్రచారం సాగుతోంది.
11. మన దేశానికి వచ్చిన వాళ్ళంతా ఈనాటికీ ఇక్కడే
వున్నారు. మన రాజ్యాంగం వాళ్ళందరి అస్తిత్వానికి హామీ ఇస్తున్నది.
12. మైనార్టీల మీద ఏమైనా ఆగడాలు జరిగితే మెజారిటీ
సమూహమే ఆ ఆకతాయిల్ని తప్పు పడుతుంది. నేను హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు
చేసి కొంచెం పాపులారిటీని పెంచుకోవచ్చు. కానీ, హిందువులే నన్ను తప్పుపడతారు.
వాళ్ళు ఆకతాయి పనుల్ని సహించరు.
13. శత్రువు అయినా సరే వాని జీవించే హక్కును
గుర్తించే వారసత్వం మనది.
14. పోరాటాలు జరుగుతాయి. యుధ్ధంలో ఓడిపోయినవాడు శరణు
కోరితే అతన్ని క్షమించి తీరాలి. ఇది మన పరంపర.
15. మన దేశంలో ఒక్క ముస్లిం కూడ వుండడానికి వీల్లేదని
ఎవరయినా అంటే వాళ్ళు హిందువులే కాదు. ఈమాటను ఈరోజు నేను కొత్తగా చెప్పడంలేదు;
డాక్టర్ హేగ్డేవార్ కాలం నుండే ఈ అవగాహన వుంది.
16. ఇస్లాం భారతదేశంలో ఎలా ప్రవేశించిందో మనంద్రికీ
తెలుసు. ఆరోజు నుండే హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
17. ఒక తప్పు జరిగినపుడు హిందువుల్ని హిందువులే
విమర్శిస్తున్నట్టు , ముస్లింలను ముస్లింలు విమర్శిస్తున్నట్టు నా దృష్టికి
రాలేదు.
18. భారత దేశం బలపడాలంటే అందరూ బలపడాలి. మనందరం
ఒకరనే భావన లోపలి నుండి రావాలి. వివేకవంతులు దానికోసం కృషిచేయాలి.
19. ఇది హిందువుల సంఘం గాబట్టి హిందువులే బలపడాలనే
ఆలోచన మంచిదికాదు. ఏ సమస్య అయినా డిస్కార్డ్ చేస్తే పరిష్కారం కాదు; సంవాదం
(డైలాగ్) ద్వార పరిష్కరించాలి.
20. ఎప్పుడయినా సరే సంఘర్షణవల్ల నష్టమే జరుగుతుంది.
ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ దేశాన్ని ముందుకు ఎలా నడిపించాలో ఆలోచించాలి.
21. మీ ఉనికిని కోల్పోమని ఎవ్వరూ అనరు. ఇస్లాం
రాకముందు కూడ ఇక్కడ వైవిధ్యం వుంది.
22. భారతదేశంలో ఇస్లాం ప్రమాదంలో ఉందనే ప్రచారాన్ని
నమ్మి దుష్టుల పన్నాగాల్లో చిక్కుకోవద్దు. తప్పుడు ప్రచారాలవల్ల అనుమానాలు,
అపనమ్మకాలు పెరిగాయి. వీటిని అరికట్టాలి.
23. హిందూస్తాన్ హిందువుల రాజ్యమే, గోమాత పూజనీయమే.
అయితే, లించింగ్ చేసేవాళ్ళు హిందుత్వానికి వ్యతిరేకులు. వాళ్ళు ఆకతాయిలు. వాళ్ళను
చట్ట ప్రకారం శిక్షించాలి.
24. హిందూ సమాజంలో ధైర్యాన్ని నింపి
ఆత్మవిశ్వాసాన్ని పెంచేపని సంఘ్ చేస్తుంది. అంటే ఇతరుల్ని వేధించమని కాదు.
భయపెట్టిగానీ, భయంతోగానీ ఐక్యత సాధ్యంకాదు. ప్రేమతో నమ్మకంతో ఐక్యత సాధ్యం
అవుతుంది.
25. హిందూ రాజ్యం అంటే హిందూ మతస్తుల రాజ్యం
అనికాదు; భారత దేశాన్ని తమ మాతృభూమిగా భావించేవాళ్ళు, ఈ దేశ సాంస్కృతిక
సాంప్రదాయాన్ని కొనసాగించేవాళ్ళు అందరూ హిందువులే.
26. మీకు హిందూస్తాన్ అనే పదం నచ్చకపోతే భారతదేశం
అనండి. పదాలదేమున్నది భావం ముఖ్యం. ఐక్యత ప్రయత్నాలు మనం ఎంత తొందరగా మొదలెడితే
అంత మంచిది.
// EOM//
No comments:
Post a Comment