Sunday, 29 December 2019

రాష్ట్రాలను సంప్రదించాకే ఎన్‌ఆర్‌సీ - న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌


రాష్ట్రాలను సంప్రదించాకే ఎన్‌ఆర్‌సీ -  న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌
సోమవారం, డిసెంబర్ 30, 2019

దిల్లీ: జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) చేపట్టాలనుకుంటే ప్రభుత్వం అందుకు తగిన ప్రక్రియను అనుసరిస్తుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఒకవేళ అలాంటి నిర్ణయమేదైనా తీసుకోదలిస్తే ముందుగా రాష్ట్రాలను సంప్రదిస్తామని ఆయన  చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

ఎన్‌ఆర్‌సీ చేపట్టాల్సి వస్తే దాన్ని నిగూఢంగా ఉంచాల్సిన అవసరం లేదని రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. అందుకు చట్టపరంగా కొన్ని ప్రక్రియలు ఉన్నాయన్నారు. ముందు నిర్ణయం తీసుకోవడం, ఆపై నోటిఫికేషన్‌ ఇవ్వడం, ప్రక్రియ ప్రారంభించడం, పరిశీలించడం, అభ్యంతరాలు స్వీకరించడం, వాటిని విచారించడం, అప్పీల్‌ చేసుకునే హక్కు ఇవ్వడం వంటివి అందులో భాగంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా అలాంటిదేమైనా చేయాల్సి వస్తే రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంటామన్నారు. ఏది చేసినా బహిరంగంగా చేస్తామే తప్ప దాయాల్సిన అవసరం లేదని రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment