ధర్మ విజయమే సంకల్పం
26-12-2019 03:28:11
భారతీయ సంస్కృతిని గౌరవించే అందరూ హిందువులే
130 కోట్ల మంది ప్రజలూ హిందూ సమాజమే
దాదాపు రెండు దశాబ్దాల తరువాత తెలుగు నేలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఉమ్మడి ఏపీలో చివరిసారిగా కరీంనగర్‌లో 1999లో ఆరెస్సెస్ భారీ శిబిరాన్ని నిర్వహించింది. నాడు సర్ కార్యవాహ హెచ్‌వీ శేషాద్రి అందులో పాల్గొన్నారు. 2009లో హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో అప్పుడు సర్‌కార్యవాహ్(ప్రధాన కార్యదర్శి)గా ఉన్న మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఆరెస్సెస్ సారథి అయిన సర్‌సంఘ్ చాలక్ తెలుగు రాష్ట్రాల్లో స్వయంగా ఒక భారీ సభలో పాల్గొనడం ఇదే మొట్ట మొదటి సారి.
అందరి పట్ల సమభావనే హిందూ దృక్పథం
స్వేచ్ఛ ఉండాలి.. కానీ అరాచకత్వం ఉండొద్దు
లాఠీచార్జీతో చీకట్లు పోవు.. జ్ఞాన జ్యోతి రావాలి
ఆరెస్సెస్ కృషి చేసేది అందుకే: మోహన్ భాగవత్
హైదరాబాద్‌లో ఆరెస్సెస్ సార్వజనికోత్సవ సభ
భిన్నత్వంలో ఏకత్వమే కాదు.. ఏకత్వంలో భిన్న రూపాలను సంఘ్ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. ఈ దేశాన్ని గొప్పదేశంగా తీర్చిదిద్దడం రాజకీయ శక్తి ద్వారా సాధ్యం కాదు. సమాజంలో ఉంటూ సమాజాన్ని ఏకత్వంవైపు తీసుకువెళ్లే ప్రవృత్తి హిందూ సమాజంలో ఎప్పటినుంచో ఉంది. తాము దేశాన్ని విడిచిపెట్టినప్పుడు హిందూ ముస్లింలు కొట్టుకుంటారని ఆంగ్లేయులు భావించారు. కానీ, వారి కోరిక తీరదు. ఎందుకంటే, ఎన్ని భేదాభిప్రాయాలున్నా, సమస్యలున్నా, అందులో నుంచి కలిసి జీవించే ఉపాయం హిందూ సమాజానికి ఉందని రవీంద్రనాథ్ టాగూర్ చెప్పారు.
రాబోయే కాలంలో దేవతలందరికీ పూజలు చేయడం పక్కనబెట్టి, భరతమాతనే (దేశాన్ని) పూజించాలని, అప్పుడే ప్రపంచంలో భారతదేశం గొప్పస్థానం సంపాదిస్తుందని స్వామి వివేకానంద అభిప్రాయపడ్డారు. సంఘ్ కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తోంది.
- మోహన్ భాగవత్
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): సాత్విక శక్తుల విజయంతోనే అందరి శ్రేయస్సు, ఉన్నతి సాధ్యమని.. అలాంటి ధర్మవిజయమే ఆరెస్సెస్ సంకల్పమని సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. మాట్లాడే భాష, అనుసరించే మతం, పూజించే దేవుడితో సంబంధం లేకుండా జాతీయ స్ఫూర్తి కలిగిన, భారత సంస్కృతిని గౌరవించే ప్రతి ఒక్కరినీ హిందువుగానే భావిస్తామని.. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలనూ హిందూ సమాజంగా ఆరెస్సెస్ పరిగణిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సమాజమంతా మనదేనని.. అలాంటి సమాజ నిర్మాణం కోసం సంఘ్ కృషి చేస్తుందని భాగవత్ పేర్కొన్నారు. ఆరెస్సెస్ విజయ సంకల్ప శిబిరంలో భాగంగా బుధవారం సాయంత్రం ఇక్కడి సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన సార్వజనికోత్సవంలో మోహన్‌భగవత్, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘విజయ సంకల్పం అంటే.. ఎవరి విజయానికి సంకల్పం? ఎలాంటి విజయానికి సంకల్పం? ఇది సంఘ్ కార్యక్రమం. సంఘ్ కార్యకర్తలు ఎవరి విజయం కోసం కష్టపడతారు? ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ముందు ఇది అర్థం చేసుకోవాలి. సంఘ్ స్వయం సేవకులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. దేశం గెలుపునే కోరుకుంటారు. తమ విజయాన్ని కాదు. వారు తమ స్వార్థాన్ని చూసుకోరు. పేరు, ప్రతిష్ఠల కోసం పాకులాడరు. వెయ్యి మంచి పనులు చేసినా.. ఒక్కదాన్నీ తమ ఖాతాలో వేసుకోరు. దాన్ని సమాజానికి అర్పిస్తారు. మేం కోరుకునే విజయం ఏమిటంటే.. ధర్మవిజయం’’ అని వివరించారు. విజయం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ.. కొందరికి ఆసురీ (రాక్షస) ప్రవృత్తి ఉంటుందని.. తమదీ తమకే కావాలనుకుంటారని, పక్కవారిదీ తమకే కావాలనుకుంటారని పేర్కొన్నారు. ‘‘నేను చెప్పిందే సరైనది.. నేనే అన్నీ’ అని వారు అనుకుంటారు. నీతి, నియమం, క్రమశిక్షణ గురించి పట్టించుకోరు. ఎక్కడికి వెళ్లినా విధ్వంసం సృష్టిస్తారు. వారు కష్టాల్లో పడతారు. ఇతరులనూ కష్టాల్లో పడేస్తారు. వారి విజయం సర్వనాశనానికి కారణమవుతుంది. అలాంటివారి విజయాన్ని అసుర విజయం అంటారు. హృదయంలో ఏమాత్రం మంచితనం వారున్నవారైనా.. అలాంటివారి విజయాన్ని కోరుకోరు. అలాగే, కొందరిలో రాజసిక ప్రవృత్తి ఉంటుంది. వారు మాటలు గొప్పగా చెప్తారు. పనులు కూడా అప్పుడప్పుడూ మంచివి చేస్తారు. కానీ.. తమకు పేరు తెచ్చే, ప్రతిష్ఠ తెచ్చిపెట్టే పనులే చేస్తారు. వారికి మోహం, లోభం ఉంటాయి. వీలైతే ప్రపంచంలోని సంపద, అధికారం అంతా తమకే కావాలని కోరుకుంటారు. వారు తమ స్వార్థం కోసమైనప్పటికీ.. ప్రజలకు మంచి చేస్తారు. ఉపయోగపడే పనులు చేస్తారు. ప్రజల కోసం పోరాడతారు కూడా. అలాంటివారి విజయాన్ని ధనవిజయం అంటారు. వారి విజయం వల్ల వారికి డబ్బు, పేరు అన్నీ వస్తాయి. వారితోపాటు ఇతరులకు వస్తే సరే. రాకపోయినా వారికి పర్వాలేదు. మన సామాజిక పరంపరలో ఈ రెండు రకాల విజయాలు నిషిద్ధం. మూడోది ధర్మవిజయం. ఈ విజయం సాధించేవారు తమ కోసం ఏదీ కోరుకోరు. తాము కష్టపడినా సరే ఇతరులు సుఖంగా ఉండాలని వారు భావిస్తారు. వారికి తమ మేలు గురించిన చింత ఉండదు. ‘‘‘నత్వహం కామయే రాజ్యం.. న స్వర్గమ్ న పునర్భవం’.. నాకు రాజ్యం అక్కర్లేదు. స్వర్గవైభవాలు మోక్షం కూడా అక్కర్లేదు. ‘కామయే దుఃఖ తప్తానాం ప్రాణినామార్తి నాశనం’.. దుఃఖంలో ఉన్న ప్రాణుల దుఃఖాన్ని నివారించడమే నా కోరిక’ అంటారు వారు. ధర్మవిజయం కోరుకునేవారు ఇలా ఆలోచిస్తారు. ‘సంఘ్’ ఇలాగే ఆలోచిస్తుంది. హిందూ సమాజం ఇలాగే ఆలోచిస్తుంది. భారతదేశం ఇలాగే ఆలోచించి తన ఉనికిని చాటుకుంటోంది. ఇవాళ ప్రపంచమంతా రాజసిక, తామస శక్తుల ఆట నడుస్తోంది. ఈ రోజు మనదేశంలో కూడా అలాంటి ఆట నడుస్తోంది. వాటిపై సాత్విక శక్తుల విజయం కోరుకోవాలి. సాత్విక శక్తులు తమ కోసం కాక.. లోకం కోసం విజయాన్ని సాధిస్తాయి. ఆ విజయంతో అందరూ కలుస్తారు. చెల్లాచెదురుగా ఉన్నవారంతా ఒక్కచోటుకు చేరుతారు. అందరూ అభివృద్ధి చెందుతారు. ధర్మం పరిఢవిల్లుతుంది. సర్వత్రా శాంతి నెలకొంటుంది. అలాంటివారికీ విరోధులు ఉంటారు. కానీ, వారి హృదయంలో ఎప్పుడూ ప్రేమ తగ్గదు. కాగడా కిందకు వంచినా జ్వాల పైకే ఎగసినట్టు.. పరిస్థితులెలా ఉన్నా సాత్విక శక్తుల సద్వర్తన ఎల్లప్పుడూ పురోగమిస్తుంది. అలాంటి ధర్మవిజయం దేశానికి కావాలి. ఆ సంకల్పంతోనే సంఘ్ కార్యకర్తలంతా ఇక్కడ కూర్చున్నారు’’ అని మోహన్ భాగవత్ వివరించారు. లాఠీచార్జ్‌తో చీకట్లు పోవని.. దీపం వెలిగిస్తే చీకటి తనంతతానే తొలగిపోతుందని అన్నారు. దేశహితం కోసం, సమాజహితం కోసం సాత్విక పరివర్తన కావాలన్నారు. ‘మంచి సర్కారు వచ్చినప్పుడు అంతా బాగుపడుతుంది. కొత్త నేత ఎవరైనా వచ్చి కొత్త వెలుగు తెస్తాడు. నాకు ఎవరైనా మేలు చేస్తారు. నన్ను ఎవరో ఉద్ధరిస్తారు’ అనుకుంటే ఏ ఉపయోగం లేదని, అందరూ కలిసి ఆ కార్యాన్ని సాధించడానికి కృషి చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ఈ కార్యసాధనకు, ధర్మ విజయానికి స్వయం సేవకులు కృషిచేస్తారన్నారు. ‘‘సర్వసృష్టి పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి, అందరి పట్ల సమభావన కలిగి ఉండడమే హిందూ లేదా భారతీయ దృక్పథం. ఈ దేశంలో పరంపరాగతంగా ఇదే కనిపిస్తుంది. ఇక్కడ స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటాయి. అరాచకత్వం, విశృంఖలత్వం ఉండవు’’ అని వివరించారు.
వారే ‘నాయక్’లు
సమాజంలో సాధారణ ప్రజలు శ్రేష్ట వ్యక్తులను అనుసరిస్తారని.. వారినే రవీంద్రనాథ్‌ఠాగూర్ నాయక్‌లుగా అభివర్ణించారని భాగవత్ అన్నారు. ఏకత్వ సాధనే మన సమాజ లక్షణమని, సమాజ పరివర్తనతోనే ఉన్నతి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వమే కాదు.. ఏకత్వంలో భిన్న రూపాలను సంఘ్ సంపూర్ణంగా విశ్వసిస్తుందన్నారు. ఈ దేశాన్ని గొప్పదేశంగా తీర్చిదిద్దడం రాజకీయ శక్తి ద్వారా సాధ్యం కాదని.. సమాజంలో ఉంటూ సమాజాన్ని ఏకత్వంవైపు తీసుకువెళ్లే ప్రవృత్తి హిందూ సమాజంలో ఎప్పటినుంచో ఉందని అన్నారు. ‘‘దేశాన్ని విడిచిపెట్టినప్పుడు హిందూ ముస్లింలు కొట్టుకుంటారని ఆంగ్లేయులు భావించారు. కానీ, వారి కోరిక తీరదు. ఎందుకంటే, ఎన్ని భేదాభిప్రాయాలున్నా, సమస్యలున్నా, అందులో నుంచి కలిసి జీవించే ఉపాయం హిందూ సమాజానికి ఉంది’’ అని ఆనాడు రవీంద్రనాథ్‌ఠాగూర్ తన పుస్తకంలో పేర్కొన్నట్లు మోహన్ భాగవత్ వివరించారు. రాబోయే కాలంలో దేవతలందరికీ పూజలు చేయడం పక్కనబెట్టి, భరతమాతనే (దేశాన్ని) పూజించాలని, అప్పుడే ప్రపంచంలో భారతదేశం గొప్పస్థానం సంపాదిస్తుందని స్వామి వివేకానంద అభిప్రాయపడ్డారని గుర్తుచేశారు. కాగా.. తన జీవితంలో సాధించిన విజయాలకు తన మాతృమూర్తి కారణమని సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి అన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగడం విచారకరమన్నారు.

No comments:
Post a Comment