Monday, 21 May 2018

కథువా కేసులో ఫోరెన్సిక్ నివేదికలో తేలిన నిజం

కథువా కేసులో ఫోరెన్సిక్ నివేదికలో తేలిన నిజం
21-05-2018 10:14:29

జమ్మూ: కథువా బాలికపై హత్యాచారం ఘటనలో నిందితుడి బాగోతాన్ని ఫోరెన్సిక్ నిపుణులు బయటపెట్టారు. ఈ కేసులో నిందితుడైన కళాశాల విద్యార్థి విషాల్ జంగోత్ర కేసు నుంచి తప్పించుకునేందుకు సంఘటన జరిగిన రోజు తాను మీరట్ లోని యూనివర్శిటీ కళాశాలలో పరీక్షకు హాజరయ్యానని చెప్పి తన స్నేహితులతో సంతకాన్ని ఫోర్జరీ చేయించాడని ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. విషాల్ అసలు సంతకంతో పరీక్ష అటెండెన్స్ షీటులో సంతకం సరిపోలలేదు. జనవరి 15వ తేదీన జరిగిన పరీక్షకు విషాల్ తనకు బదులుగా స్నేహితుడిని పంపించి రాయించారని తేలింది. ఈ మేర ఫోరెన్సిక్ అధికారులు నివేదిక సమర్పించారు. పరీక్ష సంతకం ఫోర్జరీ వ్యవహారంలో విషాల్ ముగ్గురు స్నేహితులకు విచారణాధికారులు సమన్లు జారీ చేశారు. సంఘటన జరిగిన జనవరి 15వతేదీన విషాల్ కథువా సమీపంలోని రాస్నా గ్రామంలో ఉండి...కేసు నుంచి బయటపడేందుకు మీరట్ లో పరీక్ష రాసినట్లు సృష్టించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

No comments:

Post a Comment