Tuesday, 17 April 2018

మక్కా మసీదు పేలుళ్లలో దోషి ఎవరు ?

మక్కా మసీదు పేలుళ్లలో దోషి ఎవరు ?
17-04-2018 13:27:43

పోలీసుల ఓవరాక్షన్‌
నాంపల్లి కోర్టు వద్ద పటిష్ఠ బందోబస్తు
మీడియాను అనుమతించని వైనం
గేటు ముందు బైఠాయించిన విలేకరులపై లాఠీచార్జి
ఇద్దరికి గాయాలు
హైదరాబాద్‌ సిటీ: మక్కామసీదు పేలుళ్ల కేసు తుదితీర్పు వెలువడనున్న నేపథ్యంలో సోమవారం నాంపల్లి కోర్టు ఆవరణతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ఆదివారం రాత్రి నుంచే ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాంపల్లి కోర్టు ఆవరణను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు, విచారణ ఎదుర్కొంటున్న నిందితులను కోర్టు పనిగంటలు ప్రారంభం కాకముందే సోమవారం ఉదయం లోపలికి తీసుకెళ్లారు. అనంతరం న్యాయవాదులను... వివిధ కేసులకు సంబంఽధించి వచ్చే వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. కోర్టుకు దూరంగా వాహనాలను పార్కింగ్‌ చేయించారు. ఉదయం నుంచే కోర్టు చుట్టూ పోలీసు పహరా ఉండగా... తీర్పు తర్వాత కూడా భారీ బందోబస్తు నిర్వహించారు.

మీడియాపై దాడి
మీడియా సిబ్బందిని లోపలికి అనుమతించే విషయంలో పోలీసులకు.. మీడియా ప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. కోర్టు లోపలికి అనుమతించబోమని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ చెప్పడంతో మీడియా ప్రతినిధులు కోర్టు గేటు ముందు ఆందోళనకు దిగారు. వారిని అక్కడి నుంచి చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు ప్రయోగించగా టీవీ9 రిపోర్టర్‌ విజయ్‌సాథ, ఎన్‌టీవీ రిపోర్టర్‌ శర్మకు గాయాలయ్యాయి. చివరకు కోర్టు లోపలికి వెళ్లటానికి విలేకరులను అనుమతించడంతో వాగ్వాదం సద్దుమణిగింది.

దక్షిణ మండలంలో...
ఆదివారం రాత్రి నుంచే దక్షిణ మండంలోని పలు సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేసిన పోలీసులు సోమవారం రాత్రి వరకు కొనసాగించారు. డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో అదనపు డీసీపీలతోపాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు భద్రతా చర్యల్లో పాల్గొన్నారు. చార్మినార్‌, మక్కామసీదు పరిసర ప్రాంతాలలో భారీగా బలగాలను మోహరించారు. సోమవారం మధ్యాహ్నం మక్కా మసీదులో నమాజు అనంతరం అందరూ ప్రశాంతంగా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. చార్మినార్‌ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ... ఇరు వర్గాల మతపెద్దలతో చర్చించి పాతబస్తీలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరామని, రౌడీషీటర్ల ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించామన్నారు. సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు, 300 అదనపు సీసీ కెమెరాలను, సున్నిత ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశామని డీసీపీ పేర్కొన్నారు.


తీర్పుపై హైకోర్టులో పిటిషన్‌: ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్‌
వందల మంది సాక్షులను విచారించినప్పటికీ మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో అందరూ నిర్దోషులంటూ ఎన్‌ఐఏ కోర్టు తీర్పు చెప్పడాన్ని బ్లాక్‌ డేగా పరిగణిస్తున్నట్టు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్‌ అన్నారు. ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చంచల్‌గూడలోగల ఎంబీటీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఐఏ కోర్టు తీర్పు ముస్లింలను షాక్‌కు గురిచేసిందన్నారు. 11 ఏళ్ల విచారణ ఫలితం ఇదేనా అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. మక్కా మసీదు బాంబు పేలుళ్ల దోషులను తేల్చకపోతే తాము ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎన్‌ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన వారి బెయిల్‌ను రద్దు చేయించి హైకోర్టులో పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకోకపోతే ఎంబీటీ హైకోర్టులో పిటిషన్‌ వేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సుమారు 18 నుంచి 22 నెలలపాటు అమాయక యువకులు ఉగ్రవాదులుగా జైలు జీవితం గడిపారని.. వీరిలో ఒకరిద్దరికి ఆర్థిక సహాయం చేసి ఎంఐఎం చేతులు దులుపుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఓ నిందితుడు న్యాయమూర్తికి పేలుళ్ల కుట్రకు సంబంధించిన వివరాలను వెల్లడించినా సాక్ష్యంగా పరిగణించకపోవడం విచారకరమన్నారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్న తప్పులపై రాష్ట్రపతిని కలిసి విన్నవిస్తామన్నారు. సీబీఐ, ఎన్‌ఐఏ సాఽక్ష్యాధారాలను సేకరించడంలో ఎందుకు విఫలమయ్యాయో మరో దర్యాప్తు సంస్థ ద్వారా వెలికితీయాలని అమ్జదుల్లాఖాన్‌ డిమాండ్‌ చేశారు.

ఎన్‌ఐఏ దిష్టిబొమ్మ దహనం, డీజేఎస్‌ కార్యకర్తల అరెస్టు
 మక్కా మసీదుతోపాటు అజ్మీర్‌, మాలేగావ్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లకు పాల్పడిన హిందూ ఉగ్రవాదులకు శిక్షలు వేయకపోతే భారతదేశంలో ఉగ్రవాదం పెరుగుతుందని డీజేఎస్‌ ప్రతినిధులు ఎం.ఎ మాజిద్‌, సలావుద్దీన్‌, అఫాన్‌ అన్నారు. మక్కా మసీదు బాంబు పేలుళ్ల నిందితులను న్యాయస్థానం నిర్దోషులుగా తీర్పు చెప్పటాన్ని నిరసిస్తూ డీజేఎస్‌ ఆధ్వర్యంలో మొగల్‌పురాలో ఎన్‌ఐఏ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని కార్యకర్తలను అరెస్టు చేశారు. డీజేఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. తీర్పుతో ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయని, దర్యాప్తు సంస్థలపై నమ్మకం పోయిందన్నారు. కొంతమంది ఆర్‌ఎ్‌సఎస్‌ భావాలు కలిగిన పోలీస్‌ అధికారుల కుట్ర ఫలితమే నేటి తీర్పు అని అన్నారు. మక్కామసీదు పేలుళ్ల విషయంలో సాక్ష్యాలు సేకరించకపోవడం ఎన్‌ఐఏ, సీబీఐ వైఫల్యమేనన్నారు.

ప్రభుత్వం ఆదుకోలేదు
బాంబు పేలుళ్లలో గాయపడిన సోదరుడు మక్బూల్‌ షరీఫ్‌ 2016 అక్టోబర్‌ 2వ తేదీన చనిపోయాడు. ఇప్పటి వరకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. సాక్ష్యాలు లేవని కేసును కొట్టివేయడం బాధాకరం. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి.
- ఖాజా షరీఫ్‌బాబా, కందికల్‌గేట్‌





ఓ బాంబును నిర్వీర్యం చేశాం
మక్కామసీదులో బాంబులు పేలాయని తమ టీమ్‌కు సమాచారం రాగా 15 నమిషాల్లో గోషామహల్‌ నుంచి అక్కడికి చేరుకున్నాం. ప్రజలు రాళ్లు రువ్వుతున్నారు. పోలీసు యూనిఫాంలో వెళితే తమపై దాడి చేస్తారని సివిల్‌ దుస్తుల్లో మసీదు లోపలికి వెళ్లాం. ఓ బల్ల కింద పెట్టె కనిపించింది. దానిలో రెండు పైపులున్నాయి. అది పేలని బాంబుగా నిర్ధారించుకున్నాం. దాన్ని ఖిల్వత్‌ ప్లే గ్రౌండ్‌కు తీసుకెళ్లి నిర్వీర్యం చేశాం. బాంబును సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేశారు. కనెక్షన్‌ కట్‌ అవడంతో పేలలేదు.
- నాగసాయి, ఇన్‌స్పెక్టర్‌, బాంబుస్క్వాడ్‌

సాక్ష్యాలు, ఆధారాలు తారుమారు చేశారు
మక్కామసీదు పేలుళ్ల ఘటన జరిగిన నాటి నుంచి విచారణాధికారులు, దర్యాప్తు సంస్థలు సీరియ్‌సగా లేవు. నిందితుల్లో ఒకరైన అసీమానంద్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత కూడా కేసు బలహీనంగా మారడానికి దర్యాప్తు సంస్థల పనితీరే కారణం. అమాయకులను వేధించి కేసును తప్పుదోవ పట్టించారు. 11 ఏళ్లు విచారణ చేసి కీలక సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేశారు.
- లతీఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌, ప్రధాన కార్యదర్శి, సివిల్‌ లిబర్టీస్‌
జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!


జీఎస్టీ అధికారులమంటూ వ్యాపారికి బురిడీ
గాంధీ బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం ఎక్కడికెళ్లిపోతోంది?
ఎన్నికలముందు ఆఫర్‌.. ఇప్పుడేమొ పెనాల్టీనా..?
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్
కాటేస్తున్న కామం.. నలుగురిలో ఒకరిపై లైంగిక దాడి..
టీఆర్ఎస్ కార్పొరేటర్‌‌పై చీటింగ్‌ కేసు
పొలిటికల్ లీడర్ల టెంపర్‌పై ఉద్యోగుల ఆగ్రహం
పేరుకే హైదరాబాద్‌లో ఉచిత పార్కింగ్‌‌.. బండిపెడితే దంచుడే..
ఇది హైదరాబాదేనా?.. మండుటెండలో నరకం అనుభవిస్తున్నారు..
‘డీసీసీబీ’కి కలెక్టరే ఇక బాస్‌..!?

No comments:

Post a Comment