Tuesday, 10 April 2018

కర్ణాటక ఎన్నికలు -ముస్లిం ఓట్ బ్యాంక్

కర్ణాటక ఎన్నికలు -ముస్లిం ఓట్ బ్యాంక్
- ముహమ్మద్ షరీఫ్

కర్ణాటక జనాభాలో వక్కలిగలు,లింగాయత్ ల తర్వాత గణనీయమైన సంఖ్యలో13% గా ముస్లింలు ఉన్నారు.
ముస్లింలు చాలా నియోజకవర్గాలలో నిర్ణాయక శక్తి గా కూడా ఉన్నారు‌. లోక్‌సభ కు ఎన్నికై రైల్వే మంత్రిగా సేవలందించిన సి.కె. జాఫర్ షరీఫ్ ఈ రాష్ట్రానికి చెందిన వారే.ఆయన మనవడు, అల్లు డు కూడా కర్ణాటక రాజకీయాలలో ఉన్నారు.దేవెగౌడ కేబినెట్ లో ఏవిఏషన్ మంత్రిగా పనిచేసిన సి.కె .ఇబ్రాహీం కూడా ఈ రాష్ట్రానికి చెందినవారే.
ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యాన్ని చూస్తే కర్ణాటక శాసన సభలో
1952 లో ఒక్కరు,
1957 లో 9, 1967 లో ఆరు,1972 లో12,1978 లో పదిహేడు,1983 లో 2, 1989 లో 12, 1994 లో 6, 1999 లో 12, 2004లో 7, 2008 లో 9,2013 లో‌ 11 గా ఉంది.
నిజానికి sc, st ల‌తర్వాత నిర్ణాయక శక్తిగా ఉన్నటువంటి కర్ణాటక ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం అంతత మాత్రమే.
దానికి చాలా కారణాలున్నాయి.
ముస్లిం లలో బలమైన నాయకత్వం లేకపోవడం.
మంచి నాయకత్వ లక్షణాలున్న వారు రాజకీయంగా గుర్తింపు పొందలేకపోవడం.
రాజకీయ పార్టీలు ముస్లింల ఆలోచనలు అర్ధం చేసుకోగలవారిని తమ‌పార్టీ ల ముస్లిం ప్రతినిధులుగా నియమించుకోక పోవడం ఈ దుస్థితికి కారణం.
ఇక రాజకీయ పార్టీలు ముస్లింల ను ప్రమోట్ చేయక పోవడం కూడా ఒక‌కారణం ఉదాహరణకు రాష్ట్ర జనాభా లో 16% కల లింగాయత్ ల నుండి 50 మంది శాసన సభ్యులుగా ఎన్నిక కాగా ముస్లింల నుండి కేవలం‌10 మంది మాత్రమే ఎన్నిక కావడాన్ని బట్టి రాజకీయ పార్టీలకు ముస్లింల పై ఎంత శ్రధ్ధ ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇక రాజకీయ పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్, జెడి (ఎస్) లు నామ మాత్రంగా ముస్లింల కు సీట్లు ఇస్తుండగా , బిజెపి మాత్రం ముస్లింల కు సీట్లు ఇచ్చేది లేదని తేల్చేసింది.
2008 ఎన్నికల సభల్లో అద్వానీ మాట్లాడుతూ మావద్ద ముస్లిం లలో సమర్ధులు లేనందువల్ల మేము సీటు ఇవ్వలేకపోతున్నాం అంటే, యు.పి లో భాజపా భారీ మెజారిటీ తర్వాత ఎడ్యూరప్ప ముస్లింల కు కర్ణాటక భాజపా సీట్లివ్వదని తేల్చాడు.
ఇక రాబోయే ఎన్నికల్లో ముస్లింలు మాకు మద్దతిస్తే మేము ఉపముఖ్యమంత్రి ‌గా ముస్లిం ని చేస్తామని ప్రకటించారు జెడి (ఎస్) నేత కుమార స్వామి.
కానీ జె.డి (ఎస్) ఇప్పటికీ కింగ్ మేకర్ పాత్ర మాత్రమే పోషించే అవకాశం ఉండడం తో ఆయన ఆఫర్ కు ఆశించిన స్పందన రాకపోవచ్చు.
అదికూడా ఆ పార్టీకి రాష్ట్ర మంతా సమ ప్రాబల్యం లేకపోవడం కూడా మరొక సమస్య.ఇక సిధ్దరామయ్య‌ కు కూడా ముస్లింల ఓట్ల పై పెద్ద శ్రధ్ధ లేదు.
లింగాయత్ ల ఓట్లను కొల్లగొడితే చాలన్నది ఆయన వ్యూహం.
అంతే కాకుండా కొద్దో గొప్పో భాజపా ప్రభావం కాంగ్రెస్ పై కూడా పడిందనుకోవచ్చు.
బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందు ఒకటి లేదా రెండు స్థానాలకు పరిమిత మైన భాజపా ఆతర్వాత 1994 కి నలభై స్థానాలకు చేరుకోవడంతో కాంగ్రెస్ కూడా ముస్లింలకు ఇచ్చే సీట్లను తగ్గించుకుంటూ వస్తుంది.
అంతేకాక నియోజక వర్గాల పునర్విభజన ‌కూడ కర్ణాటక ముస్లింల కు అశనిపాతమైంది.డీ లిమిటేషన్ లో భాగంగా ఉత్తర కర్ణాటకలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ని కొన్ని నియోజకవర్గాలు ఐతే రిజర్వ్ చేయబడ్డాయి లేదా ప్రక్కనున్న వాటిలో కలపబడ్డాయి. ఇలా ముస్లింల ప్రాతినిధ్యానికి , ప్రాబల్యానికి గండి పడిందని చెప్పుకోవచ్చు.
మరోవైపు రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్ల పై గురిపెట్టాయి.aimim అరవై స్థానాల్లో తమ అభ్యర్ధులను నిలబెట్టే ప్రయత్నం చేస్తుందని aimim ఛీఫ్ తెలపగా,
JD(s) తమకు అధికారం కట్టబెడితే ఉపముఖ్యమంత్రి పదవి ముస్లింలకు ఇస్తామంది
ఇక సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (sdpi)
మహిళా ఎంపవర్మెంట్ పార్టీ (mep)లు ఆత్మగౌరవ నినాదంతో మన ఓటు మన కే అన్న
నినాదాన్ని స్తున్నాయి.
ఇంకెన్నాళ్ళు ఇతరుల ప్రాపకం పై ఆధారపడడం అంటూ ముస్లింల లో‌ఆశలు నింపుతున్నాయి. ఇక సి.యం‌ సిద్ధరామయ్య ఐతే మేమైతే కోట్లాది రూపాయలు ముస్లిం ల సంక్షేమం కోసం కోసం ఖర్చుపెట్టామంటూనే
తన కేబినెట్‌లో ఒక ముస్లిం కి కూడా స్థానం లేకపోవడాన్ని కప్పి పుచ్చు కుంటున్నారు
ముస్లింల ప్రాబల్యం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా
7 నియోజకవర్గాలలో 40% , 12 చోట్ల 30%, 10 చోట్ల 20%, 30 చోట్ల 15% ఓట్ షేర్ నూ కలిగి ఉన్నాయి.
ఉత్తర కర్ణాటకలోని ముస్లింల ప్రాబల్యం కల బిదర్,ఉద్గిర్, రాయ్ చూర్,కొప్పల్, మొదలగు ఆరు‌జిల్లాలు అత్యంత వెనుకబడిన జిల్లాలుగా పేరొందాయి.
మిగిలిన ప్రాంతాలలో ని ముస్లిం లతో పోలిస్తే తక్కువ జీవన ప్రమాణాలు కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.అరవైఏళ్ళుగా అభివృద్ధి కి నోచుకోలేదు
రీజనల్ డెవలెప్మెంట్ బోర్డు ఏర్పాటు అనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది.ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉంచబడతాయి‌ అనడానికి ఇదే తాజా ఉదాహరణ.
ఇక కర్ణాటక ఎన్నికల్లో aimim పోటీ చేస్తుందని ప్రకటించడంతో రాజకీయాలు వేడెక్కాయి.
కాంగ్రెస్ రంగంలోకి దిగి ‌ముస్లిం ఓట్లను చీల్చి బిజెపికి లాభం చేకూర్చడమే ఓవైసి లక్ష్యమంటూ దునుమాడింది.దీనికి ఉదాహరణ గా నాంధేడ్ మున్సిపల్ ఎన్నికను చూపుతుంది. ఓవైసీ కూడా కాంగ్రెస్ కీ భాజపాకీ తేడా లేదన్నారు ‌. ఇది వాస్తవ దూరం మాత్రం కాదు. అందుకే సెక్యులర్ వాదులు కూడా దీని గురించే ఆందోళన చెందుతూ సెక్యులర్ ఓటు చీలి మతతత్వ భాజపా కు లాభదాయకమౌతుందనే భయాన్ని వ్యక్త పరుస్తున్నారు.ఐతే 2013 ఎన్నికలు పరిశీలిస్తే అప్పుడు కూడా ముస్లిం ఓటు చీలింది‌.అలా చీలిన చోట్లలో భాజపాకు 5, కాంగ్రెస్ కు 4,ఇండిపెండెంట్ లు 4,kjp 1 సీటు పొందగలిగాయి.
ఈ విభజనకు కారణాలు అన్వేషిస్తే భట్కల్, దేవనగిరి,హొమ్నాబాద్ లలో జెడిఎస్ వలనా, కొన్ని చోట్ల SDPI వలనా ముస్లిం ఓట్లు చీలిపోయాయి
హెబ్బెల్ లోనైతే JDS నేత అబ్దుల్ అజీమ్ 25వేల ఓట్లు పొంది జాఫర్ షరీఫ్ మనమడు రహ్మాన్ షరీఫ్ ఓటమికి కారణమై భాజపా కు ఆ స్థానాన్ని కట్టబెట్టడం జరిగింది.
శరవనగర్ నలభై శాతం ఓటు బ్యాంక్ ముస్లిం లకుంది ఐనా ముస్లిం అభ్యర్థి ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థి జోసెఫ్ గెలుపొందాడు.
మంగుళూరు , మంగుళూరు నార్త్ రెండుచోట్లా sdpi ఓడి కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థులు విజయకేతన మెగరేశారు.
కనుక aimim ,sdpi, jdu, కాంగ్రెస్ ఇలా అందరూ ముస్లిం అభ్యర్ధులను నిలబెడితే ఓటు చీలి మతతత్వ శక్తులు లాభపడడం‌ ఖాయం.
దానికి ప్రత్యక్ష ఉదాహరణ 47% ముస్లిం ఓటు కల బిజాపూర్ 2008 లో ఇక్కడ ముస్లిం ఓటు డివైడ్ కావడంతో భాజపా గెలిచింది. 2013 లో అతి కష్టం మీద కాంగ్రెస్ మళ్ళీ దీనిని సాధించింది.
ఐతే గత ఎన్నికల్లో కొన్ని విచిత్రాలు కూడా కనిపించాయి.కేవలం 15% ముస్లిం జనాభా కల గంగావతి లో JDS అభ్యర్థి ఇక్బాల్ అన్సారీ గెలుపొందారు.అక్కడ హిందువులు కూడా ముస్లిం కి‌ ఓటేశారు అని అర్ధం అవుతుంది.
కనుక ఎన్నికలలో సామాజిక వర్గాల వారీ ఓట్ల సమీకరణ ప్రభావం చూపినా, పార్టీల ప్రాధాన్యత లు పనితీరు‌ఆధారంగా కూడా ప్రజలు తీర్పు నిస్తారని అర్ధం ఔతుంది.
2004 లో భాజపాకు 79,సీట్లిచ్చి, 2008 లో 110 సీట్లకు పెంచి మళ్ళీ 2013 లో 40 కి‌పరిమితం చేశారంటే ఇక్కడ పార్టీల‌ పనితీరు ఆధారంగా నే ప్రజలు తీర్పు ఇస్తారని గుర్తించాలి.
ఐతే అభివృద్ధికి కట్టుబడని పార్టీలు ప్రజల మతపర మనోభావాల ద్వారా ఓట్లను చీల్చి లాభం పొందాలనుకుంటాయి.
దీనికి ఏ పార్టీ అతీతం కాదు.కనుక ఓట్ల చీలిక పై కలవరపడనవసరం లేదు .భారత దేశంలో అస్థిత్వ రాజకీయాలకు ప్రజలు పాజిటివ్‌ గా స్పందించినంత కాలం ఈ పరిస్థితి తప్పదనే అవగాహన తోనే ముస్లింలు ముందుకెళ్ళాలి.
2008 లో కాంగ్రెస్ ,JDS లకు గెలుపు పై నమ్మకం‌లేదు కనుక‌ మాకు ఓటేస్తే సచర్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని ముందుకొచ్చాయి.
2013 ఎన్నికలలో కానీ ఇప్పుడు కానీ ఆ మాటే కానరాదు.
కనుక మతతత్వ పార్టీల తోక‌కత్తిరిస్తూనే సెక్యులర్ పార్టీల‌పట్ల అప్రమత్తంగా ఉండాలి.దీనికి పరిష్కారం గా ముస్లిం సమాజం తనను తాను సంస్కరించుకొనే ప్రణాళికతో ముందుకెళ్ళాలి.
బలమైన ,అందరికీ‌ఆమోదయోగ్యమైన నాయకత్వాన్ని డెవలెప్ చేసుకోవాలి.గంగావతి లాంటిచోట్లిఒ లో ముస్లిం అభ్యర్థి గెలిచినట్లు ముస్లిం నాయకులు ఇతర మతస్తుల మనస్సులో స్థానం పొందేందుకు‌ ప్రయత్నించాలి. అప్పుడు ప్రజల్లో నమ్మకం కలిగి ప్రస్తుత పరిస్తితిని నిరోధించవచ్చు.
అరవై ఏళ్ళుగా కాంగ్రెస్ ముస్లింలను ఎదగనివ్వకుండా‌ చేసిందనడానికి‌ సచర్ కమిటీ నివేదికే‌ సాక్షి. ఉత్తర కర్ణాటకలోని ముస్లిం ప్రాబల్యం కల ప్రాంతాల్లో అవిద్య ,పేదరికాలు తాండవిస్తున్నాయి.
అలాంటి చోట నుండి సమర్ధవంతమైన నాయకత్వం ఎలా వస్తుంది.కనుక ముస్లిం ప్రజలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలనుకోనంత కాలం ఇక్కడ నాయకత్వ లోపం ఉంటూనే ఉంటుంది.
ఇతరుల దయా దాక్షిణ్యాల పై బ్రతకాల్సి ఉంటుంది..

ఈ అవిద్య ,పేదరికాల కారణంగానే ముస్లిం ఓటు ఎలా చీలుతుంది అనే అంశం పై కూడా చైతన్యం లేదు.
తమ ఓటుహక్కు ఎలా వినియోగించుకోవాలో తెలియడంలేదు.
ముస్లిం పార్టీలు, ఇతర పార్టీలు మనోభావాలను రెచ్చగొడుతుంటే
ఆ కాష్టంలో
సమిధలౌతున్నారు మస్లింలు.
లెనిన్ అన్నట్లు
ఏ నినాదాల వెనుక ఏ ప్రయోజనాలుంటాయో తెలుసుకోనంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు అన్నదానికి సాక్ష్యం మనదేశం లోని ముస్లిం ఓటరే.
ఇక కర్ణాటకలో వచ్చే నెల లో జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా నిరాకరణ తో కర్ణాటక తెలుగు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత.
జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వవైఫల్యాలు మత పరంగా ఓటర్ల ను పోలరైజ్ చేసే ప్రయత్నాల కంటే అధికంగాపనిచేస్తాయని చెప్పవచ్చు.

No comments:

Post a Comment