It is time to celebrate
ఇది కఛ్ఛితంగా గర్వించదగ్గ సందర్భం!
భోపాల్
లో గ్యాస్ లీకయితే అక్కడికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి వచ్చాను.
శిక్కులు
కష్టాల్లో వున్నప్పుడు వాళ్ళకు మద్దతుగా కథ రాశాను.
బలియాపాల్
టెస్ట్ రేంజ్ వ్యతిరేక పోరాటకారులకు స్వయంగా వెళ్ళి మద్దతు పలికాను.
గోర్ఖాల్యాండ్
ఉద్యమానికి మద్దతుగా వ్యాసాలు
రాసాను.
ఝార్ఖండ్
ఉద్యమ కాలంలో రాంచి శిబిరంలో వున్నాను.
నందిగ్రామ్
సెజ్ వ్యతిరేక ఉద్యమకారులనూ పరామర్శించి వచ్చాను.
కారంచేడు
ఉద్యమానికి సహ
నాయకునిగా వున్నాను.
కంచికచర్ల,
చుండూరు, వేంపెంట దాడుల్లో బాధితుల
పక్షాన వున్నాను.
భారత
దేశంలో మొట్టమొదటిసారిగా యానాది సంఘాల సమాఖ్యను నిర్మించాను.
చినగంజాం
సాల్ట్ ఫ్యాక్టరీ వ్యతిరేకపోరాటానికి అధ్యక్షత వహించాను.
పెదవేగి
అటవీ భూముల పోరాటానికి మద్దతుగా నిలిచాను.
వాడరేవులో
నిర్మించతలపెట్టిన షిప్ బ్రేకింగ్ యూనిట్ ను అడ్డుకున్నాను.
విప్లవ
కమ్యూనిస్టు ఉద్యమంలో భౌతికంగా,
బౌధ్ధికంగా, సాంకేతికపరంగా చాలా చురుగ్గా వున్నాను.
విజయవాడలో
ఇళ్ళ స్థలా కోసం పేద ప్రజలు సాగించిన పోరాటాలకు నాయకత్వం వహించాను.
తెలంగాణ ఉద్యమం
రెండో దశకు నాందీగా భావించే వరంగల్ డిక్లరేషన్ సభకు ఆహ్వానసంఘం సభ్యునిగా వున్నాను.
రొయ్యల చెరువులు
సృష్టించే కాలుష్యనికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల్లో అంతర్జాతీయ వేదికల మీద ప్రాతినిధ్యం
వహించాను.
నవ్యాంధ్రప్రదేశ్
లో ప్రజల గొంతును వినిపించడానికి ఆంధ్రప్రదేశ్
పౌరసమాజాన్ని నెలకొల్పాను.
ఇలా రాసుకుంటూపోతే
ఈ జాబితా అనంతంగా సాగుతూనే వుంటుంది.
వీటిల్లో
ఏ ఒక్కదాంట్లోనూ ముస్లింలు బాధితులుకాదు. ముస్లింల కోసం నేను నిలబడ్డ సందర్భమూ లేదు.
బీజేపి
అగ్రనేత అడవాణి స్వరణ్ జయంతి రథయాత్ర తరువాత, మరీ ముఖ్యంగా సంఘ్ పరివార శక్తులు 1992 లో బాబ్రీ మసీదును
కూల్చి వేసిన తరువాత ముస్లిం సమాజం తీవ్ర కష్టాల్లో
వుందని గుర్తించాను.
మొదటి
నుండీ కష్టాల్లో వున్నవారి విషయంలో స్పందిస్తున్నట్లే ముస్లింల
విషయంలోనూ స్పందించడం మొదలుపెట్టాను.
కొందరు
ఇతర విషయాలను చూడదలచరు. చూస్తే నన్ను లౌకికవాది అనాల్సివుంటుందని వాళ్ళకు భయం.
వాళ్ళు
నాలో నా మతాన్ని మాత్రమే
చూడదలుస్తారు.
కళ్ళులేనివాళ్ళ
మీద జాలి చూపాలిగానీ కళ్ళు మూసుకున్నవారిమీద కాదుకదా!
నేను
మతతత్త్వానికి, మతఅహంకారానికి, మతదౌర్జన్యానికీ వ్యతిరేకిని. ఆపని ముస్లింలు చేసినా వ్యతిరేకిస్తాను.
చాలా
మందికి మతానికీ, మతతత్త్వానికీ తేడా కూడా తెలీదు.
నిరక్షరాశ్య
మేధావులు కొందరుంటారు. Illiterate Intellectuals!
అమేరికాకు
వచ్చే ముస్లింల మీద ఆ దేశ అధ్యక్షుడు
డోనాల్డ్ ట్రంప్
నిషేధాన్ని విధించాడు.
ట్రంప్
నిషేధం విధించిన పక్షంరోజుల్లో అమేరికాలో ఒక మహత్తర సంఘటన
జరిగింది.
నిషేధానికి
గురైన ఇరాన్ దేశం నుండి నామినేషన్ పొందిన 'ద సేల్స్ మ్యాన్'
సినిమా (దర్శకుడు అస్గర్ ఫర్హది) విదేశీ
భాషా విభాగంలో ఆస్కార్ అందుకుంది. 'మూన్ లైట్' సినిమాలో నటించిన మహేర్షాల ఆలీ అనే ముస్లిం ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఆస్కార్ అందుకున్నాడు.
ఇది
గర్వించదగ్గ సందర్భం కాదా?
హైదరాబాద్
27 ఫిబ్రవరి
2017

No comments:
Post a Comment