‘ట్రబుల్’ తలాఖ్!
18-10-2016 00:47:45
44వ అధికరణ లాంటి ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో చాలా ఉన్నాయి. మద్యపాన నిషేధం కూడా అందులో ఒకటి. ఎన్ని రాష్ర్టాలు దాన్ని అమలుచేస్తున్నాయి? ఏమతమూ మద్యపాన నిషేధాన్ని అడ్డుకోవడం లేదు గదా..! కేవలం మతధర్మాల విషయంలోనే ఎందుకీ ద్వంద్వ వైఖరి..?
ఉమ్మడి పౌరస్మృతి’, ‘ట్రిపుల్ తలాఖ్’లకు సంబంధించిన చర్చ మరోసారి ప్రారంభమైంది. నిజానికి ఇది కొత్త చర్చేమీ కాదు. చాలా పాతదే. కాకపోతే అప్పుడప్పుడూ కొంతమంది పెద్దలు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకుంటూ ఉంటారు. అయితే, ఈ మూడు తలాఖులను గురించి అసలు ఇస్లామ్ ధర్మశాస్త్రం (షరియత్) ఏం చెబుతుందో చూద్దాం.
ఇస్లామ్ ప్రకారం ‘నికాహ్’(వివాహం) ఒక పవిత్రమైన బంధం, ఒప్పందం. దాన్ని కాపాడుకుంటూ, కలిసి కాపురం చెయ్యాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంటుంది. ఒకవేళ అనివార్యంగా ఏదైనా సమస్య వచ్చిపడి ఇద్దరి మధ్యా విబేధాలు తలెత్తితే, పరస్పర సంప్రదింపుల ద్వారా, ఇరుపక్షాల పెద్దమనుషుల ద్వారా పరిష్కరించుకోవాలని ధర్మం చెబుతోంది.
‘తలాఖ్, తలాఖ్, తలాఖ్’ అని పలికి ముస్లిములు భార్యలను వదిలేస్తున్నారు అన్న దుష్ప్రచారం విపరీతంగా జరుగుతోంది. కానీ, సయోధ్య ప్రయత్నాలన్నీ విఫలమై, ఇక కలిసి కాపురం చెయ్యడం దుర్లభం అని తేలిపోతే అనివార్యంగా విడాకులకు పోవడం తప్ప మార్గం లేదు. అయితే, దానికి సరైన విధానాన్ని కూడా షరియత్ తెలియజేసింది. అందరూ ప్రచారం చేసే పైనపేర్కొన్న తలాఖ్ సరైన పద్ధతి కానేకాదు. దీన్ని ‘తాలాఖె బిద్ అత్’ అంటారు. అంటే, ధర్మంలో లేనిదాన్ని ధర్మం పేరుతో ఆచరించడం అన్నమాట. అందుకే ఇలాంటి విధానాన్ని షరియత్ తీవ్రంగా గర్హించింది. అసలు విడాకులనే ఇస్లామ్ అత్యంత అవాంఛనీయ విషయంగా పేర్కొంది. ‘ధర్మబద్దమైన వాటిలో దైవానికి ఏమాత్రం ఇష్టం లేనిది విడాకులే’ అని ముహమ్మద్ ప్రవక్త చెప్పారు. అంటే, వివాహ బంధాన్ని కలకాలం కాపాడుకోవాలని, కొనసాగించాలని ఇస్లామ్ అభిలషిస్తుంది. అనివార్య పరిస్థితుల్లోనే, అయిష్టంగా విడాకులకు అనుమతిస్తుంది. దీన్ని అర్థం చేసుకోకుండా, చొక్కా మార్చినంత సింపుల్‌గా తలాఖ్ తలాఖ్ తలాఖ్ అని భార్యల్ని మార్చేస్తారన్న అభాండం ఎంతమాత్రం సరికాదు. సయోధ్య ప్రయత్నాలన్నీ విఫలమై, ఇక రాజీకి అశకాశమేలేదని తేలిపోతే అప్పుడు అనివార్యంగానే విడాకులకు పోవాలి. విడాకులు పరిశుధ్ధాస్థలో అంటే, రుతుకాలం పూర్తయి, స్నానం చేసిన తరువాత ఇవ్వాలి. తరువాత రెండవసారి రుతుస్రావం ఆగిపోయి, స్నానం చేసిన తరువాత రెండవ విడాకు ఇవ్వాలి. ఆ తరువాత మూడవసారి రుతుస్రావం ఆగి స్నానం చేసేవరకు ఆగాలి.
ఈ మూడు రుతుక్రమాల కాలాన్ని ‘ఇద్దత్’ (గడువు) అంటారు. ఈ గడువు కాలంలో భార్యాభర్తలు రాజీ పడడానికి ప్రయత్నించాలి. ఇరు పక్షాల పెద్దలు సయోధ్య కుదర్చడానికి శక్తివంచన లేని ప్రయత్నం చెయ్యాలి. విడాకుల పత్రం (తలాఖ్ నామా) రాసుకోవడం ఉత్తమ విధానం. అందులో ‘తలాఖె రజయీ’ (ఒకసారి విడాకు) అని స్పష్టంగా రాయాలి. నమ్మకస్తులైన ఇద్దరువ్యక్తుల సమక్షంలో విడాకులు ఇవ్వాలి.
ఉమ్మడి పౌరస్మృతి గురించి మాటిమాటికీ మాట్లాడేవారు తరచుగా రాజ్యాంగంలోని 44వ అధికరణను ఉటంకిస్తూ ఉంటారు. నిజానికి భారత రాజ్యాంగంలో ఒక్క 44వ అధికరణ మాత్రమే కాదు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 25వ అధికరణ కూడా ఉందన్న విషయం మనం మరిచిపోకూడదు.
భారతదేశంలో వందలాది సంవత్సరాలుగా ముస్లిముల కోసం ప్రత్యేక చట్టం అమల్లో ఉంది. మొగల్ చక్రవర్తుల కాలంలో కూడా ఇస్లామియ చట్టమే రాజ్య శాసనంగా అమలయ్యేది. అంటే సివిల్, క్రిమినల్ చట్టాలు కూడా! ఇస్లామియ చట్టాల ప్రకారమే న్యాయ వ్యవస్థ నడిచేది. అయితే వివాహాలు, విడాకులు, ఆస్తి పాస్తులు, వారసత్వం తదితర విషయాల్లో ముస్లిమేతరులకు వారి వారి మత ధర్మాల ప్రకారం, వారివారి సాంప్రదాయక ఆచార నియమానుసారం నడుచుకునే సంపూర్ణ స్వేచ్ఛ, అధికారం వారికి ఉండేవి. అంటే, ముస్లిమేతరులకు ప్రత్యేకంగా ‘పర్సనల్ లా’ ఉండేదన్నమాట. క్రీ.శ. 1765లో ఈస్టిండియా కంపెనీ భారత న్యాయస్థానాలను పునర్ వ్యవస్థీకరించి, న్యాయవేత్తల సహకారంతో, ఆంగ్ల న్యాయమూర్తులు ఇస్లామియ శాసనాల కనుగుణంగానే తీర్పులిచ్చేవారు. ఆ తరువాత క్రమక్రమంగా ఆంగ్ల చట్టాలను ప్రవేశ పెట్టడం ప్రారంభించారు. ఈ విధంగా క్రీ.శ. 1862 నాటికల్లా ఇస్లామిక్ క్రిమినల్ లా ను పూర్తిగా రూపుమాపి, ఆ స్థానంలో ఇండియన్ పీనల్ కోడ్‌ను విధించారు. అది ఈ నాటికీ అదే పేరుతో కొనసాగుతోంది. ఈ విధంగా ఇస్లామిక్ చట్టాన్ని నికాహ్ (వివాహం) తలాఖ్ (విడాకులు) హిబా (దానం) విరాసత్ (వారసత్వం) లాంటి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలకే పరిమితం చేయడం జరిగింది. అయితే, ముస్లిమేతర సంస్కృతీ సంప్రదాయాల ప్రభావం వల్ల ముస్లిం సముదాయంలోని కొంతమందిలో ఇస్లామియ శాసనాల స్థానే సాంప్రదాయిక చట్టాలు పురుడుపోసుకున్నాయి. ఉదాహరణకు, హిందూ సంస్కృతి ప్రభావంవల్ల సీ్త్రలకు ఆస్తిలో హక్కును నిరాకరించడం జరిగేది. ఈ కారణంగా ముస్లిం మేధావులు, సామాన్య ముస్లిముల కోరిక మేరకు 1937లో ఆంగ్లపాలకుల కాలంలో ముస్లిం పర్సనల్ లా (muslim personal law shariathapplication act 1937) ప్రవేశపెట్టడం జరిగింది.
ముస్లింల పర్సనల్ లాలో ఉన్న ‘షరియత్ యాక్ట్ 1937’ ఏంచెబుతోందంటే, కక్షిదారులు ముస్లిములైన పక్షంలో నికాహ్, మహర్, తలాఖ్, ఖులా, మనోవర్తి, నికాహ్ రద్దు, విలాయత్, హిబా, విరాసత్, వక్ఫ్ - తదితర విషయాలన్నింటిలో నిర్ణాయక శాసనం (rule of decision)) షరియత్ చట్టం ప్రకారమే ఉంటుంది. తరువాత క్రీ.శ. 1939లో వీగిపోయిన ముస్లిం వివాహరద్దు చట్టం (dissolution of muslim marriages act 1939) అని ఒక చట్టాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. అందులో ఒక ముస్లిం మహిళ భర్త నుంచి విడిపోదలిస్తే ఆ మేరకు ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కావలసిన కారణాలు, ఆధారాలు (grounds) నిర్ణయించబడ్డాయి. ఉదాహరణకు, భర్త గనక నాలుగేళ్ళపాటు చెప్పాపెట్టకుండా ఎటైనా వెళ్లిపోవడమో, లేదా వేధింపులకు, దౌర్జన్యానికి పాల్పడడమో, లేదా దీర్ఘకాలిక రోగాలకో, సుఖవ్యాధులకో గురై ఉండడమో జరిగితే నికాహ్ రద్దు విషయమై ఆమె కోర్టు నుంచి ఉత్తర్వులు (decree) పొందవచ్చు. దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే, ముస్లిం పర్సనల్ లా కేవలం నికాహ్, ఖులా, విరాసత్ లాంటి కొన్ని షరియత్ ఆదేశాలకే పరిమితమై లేదు. దీని పరిధి అంతకన్నా విశాలమైనది, విస్తృతమైనది. కేవలం పెళ్లి పెటాకుల నిబంధనలే కాదు, మొత్తం వారసత్వ వ్యవస్థ అంతా దీని పరిధిలో కోచ్చేస్తుంది. ఈ వ్యవహారాలకు సంబంధించి ఏఅంశం వివాదాస్పదమైనా న్యాయస్థానం తన తీర్పును షరియత్ చట్టం ప్రకారమే ఇవ్వడానికి నిబద్ధమై ఉంటుంది. ఉదాహరణకు, ఏ స్త్రీ అయినా భర్త వేధింపులకు విసిగిపోయి విడిపోదలిస్తే, అందుకు భర్త అంగీకరించకుండా ఇబ్బందులు పెడుతుంటే ఆమె ధర్మాసనాన్ని ఆశ్రయించి షరియత్ చట్టం ప్రకారం తన వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. లేదా ఇస్లాం నిర్ణయించిన వారసత్వ హక్కును భర్త నిరాకరిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన హక్కును సాధించుకోవచ్చు. ఒక మహిళ తన హక్కును సాధించుకోవడంలో షరియత్ చట్టం ఇతోధికంగా ఆమెకు తోడ్పడుతుందే తప్ప, ఏవిధంగానూ అవరోధం కాదు.
అయినప్పటికీ ముస్లిం పర్సనల్ లాను మార్చాలని, ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలని దేశంలో పరివార్ శక్తులు పెద్ద ఉద్యమాన్నే ప్రారంభించాయి. ఇప్పుడు కేంద్రంలో ‘తమ’ ప్రభుత్వమే కొలువున్న నేపథ్యంలో ఇంకా ఇలాంటి అనేక అస్త్ర శసా్త్రలకు అవి పదును పెడుతున్నాయి. సాధ్వి నిరంజన్ జ్యోతి మాట్లాడినా, సాక్షి మహారాజ్ వాక్రుచ్చినా, రవిశంకర్ వల్లించినా, వెంకయ్య నాయుడు ఉల్లేఖించినా ఏ రూపంలో ఎవరు ప్రవచించినా ఉద్దేశం మాత్రం ఒకటే. నామమాత్రంగానైనా సరే ముస్లింల ప్రత్యేకతను ప్రతిబింబిస్తున్న ప్రస్తుత పర్సనల్ లా ను కూడా లేకుండాచేసి, ఆత్మ గౌరవంతో జీవించే హక్కును కాలరాయాలన్నది పరివార్ శక్తుల పన్నాగం. నిజానికి భారత రాజ్యాంగంలోని 25వ అధికరణ చాలా స్పష్టంగా ఇలా చెబుతోంది; ‘‘ప్రజలందరికీ సమానంగా భావ ప్రకటనా స్వాతంత్య్రం ఉంటుంది. తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా స్వీకరించే, దాన్ని అవలంబించే, దాన్ని ప్రచారం చేసుకునే హక్కు వారికి ఉంటుంది.’’
మత స్వాతంత్ర్యానికి ఉద్దేశించిన ఈ అధికరణప్రకారం, ఏదైనా ఒక వర్గానికి చెందిన మత స్వాతంత్ర్యాన్ని హరించి, తన మత బోధనలకు వ్యతిరేకంగా ఆచరించాలని బలవంత పెట్టే ఎలాంటి ‘సివిల్ కోడ్’కూ అవకాశం ఉండకూడదు. ఒకవేళ అలాజరిగితే అది నేరుగా మతంలో ప్రభుత్వ జోక్యం కిందికే వస్తుంది. అంటే, ‘ప్రజలందరికీ తమ మతధర్మాన్ని అవలంబించుకునే పూర్తి సేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయ’న్న రాజ్యాంగ హామీకి అర్థమే లేకుండా పోతుంది. రాజ్యాంగంలోని ఇంత ముఖ్యమైన, ప్రధానమైన ప్రాథమిక హక్కును చాటి చెబుతున్న 25వ అధికరణను విస్మరించి, నిర్దేశిక నియమానికి సంబంధించిన 44ను మాత్రమే పట్టుకోవడం నిజంగానే విడ్డూరం. ఎందుకంటే, 44వ అధికరణ లాంటి ఆదేశిక సూత్రాలు (Directive principles) రాజ్యాంగంలో చాలా ఉన్నాయి. మద్యపాన నిషేధం కూడా అందులో ఒకటి. కాని ఎన్ని రాష్ర్టాలు దాన్ని అమలుచేస్తున్నాయి? ఏమతమూ మద్యపాన నిషేధాన్ని అడ్డుకోవడం లేదు గదా..! కేవలం మతధర్మాల విషయంలోనే ఎందుకీ ద్వంద్వ వైఖరి..? అందుకని మన ఆలోచనా విధానంలోనే మార్పురావాలి.
యండి.ఉస్మాన్ ఖాన్
అక్షరసాహితి అధ్యక్షులు

No comments:
Post a Comment