తలాక్‌ను రద్దు చేయాల్సిందే!
15-10-2016 00:49:14
ఇది దేశ ప్రజల మనోగతం
దీనిని ఉమ్మడి పౌర స్మృతితో ముడిపెట్టొద్దు: వెంకయ్య
న్యూఢిల్లీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘‘తలాక్ అంశం వేరు.. ఉమ్మడి పౌరస్మృతి అంశం వేరు. ఆ రెండింటికీ ముడిపెట్టవద్దు’’ అని ముస్లిం పర్సనల్ లా బోర్డుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. తలాక్ విధానాన్ని రద్దు చేయాలన్నది దేశ ప్రజల మనోగతమని, మతాచారాల పేరిట మహిళల పట్ల జరిగే వివక్షను రూపుమాపాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు, ముస్లిం సంస్థల అధిపతులు ఈ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు, ముస్లిం నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ‘‘పురుషులైనా, మహిళలైనా.. మనుషులంతా సమానమేనన్న విషయాన్ని మతాధిపతులు, సామాజిక కార్యకర్తలు, సామాజికవేత్తలు గుర్తించాలి. ప్రజల్ని తప్పుదోవ పట్టించరాదు. ట్రిపుల్ తలాక్ అంశానికి, ఉమ్మడి పౌర స్మృతికి ముడిపెట్టి గందరగోళానికి తెరతీస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో పేర్కొన్న అంశం. దానిని ఎన్డీయే ప్రభుత్వమో లేక ప్రధాని మోదీయో లేవనెత్తలేదు. 1949లోనే దీనికి అంతా అంగీకరించారు. స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఈ అంశంపై చర్చలు మాత్రమే జరుగుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చ జరగాలని లా కమిషన్ భావిస్తోందని, అందరి అభిప్రాయాలనూ కోరుతోందని, చర్చల్లో అంతా తమ తమ వైఖరులను తెలియజేయాలని, అంతా కలిసి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు.
లింగ సమానత్వం, వివక్షకు తావు లేకుండా చూడటం, మహిళల్ని గౌరవించటం అన్నవే కీలకమైన అంశాలని, వాటిపై చర్చ జరపాలని, అంతే తప్ప రాజకీయ విమర్శలు చేయటం తగదని హితవు పలికారు. లా కమిషన్ ఆహ్వానానికి స్పందించకూడదని భావిస్తే అది వారి ఇష్టమని, దీన్ని రాజకీయ చర్చ చేయాలని చూడటం మంచిది కాదని చెప్పారు. కాగా, ‘‘పాకిస్థాన్, ఇరాన్ సహా డజనుకుపైగా ముస్లిం దేశాలు త్రిబుల్ తలాక్‌ను చట్టాలు చేసి మరీ నిషేధించాయి. అటువంటప్పుడు భారతదేశంలో ఎందుకు నిషేధించకూడదు?’’ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిలదీశారు. కాగా, ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని మతాధిపతులకే వదిలి వేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సూచించారు.

No comments:
Post a Comment