నిన్న రాజ్యసభలో శివసేన ఎంపీ సంజయ్ రావుత్ అద్భుతమైన ప్రసంగం.
హిందీ రానివాళ్ళ కోసం కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ అనువదిస్తున్నాను.
"సడన్ గా బీజేపీకి ముస్లింలకు మేలు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఈ ఆలోచన వల్ల ముస్లింలతో పాటూ హిందువులు కూడా భయపడిపోతున్నారు. ముస్లింల మేలు కోసం బహుశా మహమ్మద్ అలీ జిన్నా కూడా ఇంతగా ఆలోచించి ఉండరేమో అనిపిస్తుంది.
ఇంతవరకూ ముస్లింలను దొంగలు అన్నది వీళ్లే.. టెర్రరిస్టులు అన్నది వీళ్లే.. ముస్లింల దగ్గర కొనవద్దని చెప్పింది వీళ్ళే.. ముస్లింలు మీ భూముల్ని కాజేస్తారని హిందువుల్ని భయపెట్టింది వీళ్లే.. మీ మంగళ సూత్రాలు లాక్కుంటారని భయపెట్టింది బీజేపీ వాళ్లే.
ఇప్పుడు ఇదే బీజేపివాళ్ళు ముస్లింల వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే బిజెపి వాళ్లే కొత్త ముల్లాలుగా తయారైనట్టు కనబడుతుంది.
వక్ఫ్ ఆస్తుల్ని అమ్మి పేద ముస్లింలకు న్యాయం చేస్తామని బీజేపీ ప్రభుత్వం అంటున్నది. అంటే ముస్లింల ఆస్తులను అమ్మేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతా ఉంది. ఖచ్చితంగా అమ్మేస్తారు కూడా.
అయోధ్యలో 13000 ఎకరాల స్కాం జరిగింది. కేదారనాథ్ లో 300 కేజిల బంగారం మాయమైపోయింది. మీరు హిందువుల ఆస్తులు కాపాడలేకపోయారు గానీ ముస్లింల ఆస్తులు కాపాడతామని ప్రగల్భాలు పలుకుతున్నారు.
మరోవైపు చైనా ఆక్రమించిన భూముల్ని కాపాడలేక పోతున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. అమెరికా మనదేశంపై 27 శాతం సుంకం విధించింది. ఇది మనదేశానికి అత్యంత ప్రమాదకరం. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వక్ఫ్ అంశాన్ని తీసుకొచ్చారు.
దేశంలో పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం లాంటి అంశాలను కప్పి పుచ్చడానికి బీజేపీ ప్రభుత్వం 'హిందూ-ముస్లిం' అనే పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతుంది. ఇది అందరూ తెలుసుకోవాలి. "
కాపీ by బీరయ్య యాదవ్ గారు
No comments:
Post a Comment