Saturday, 5 April 2025

Lok Sabha Cleared Wakf Amendment Bill.

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

ABN , Publish Date - Apr 02 , 2025

లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లు-2024 ఆమోదం పొందింది, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులోని వివాదాస్పద సెక్షన్‌ 40ను రద్దు చేసి, వక్ఫ్‌ ఆస్తుల డిజిటలైజేషన్‌కు మార్గం సుగమం చేశారు

Waqf Bill Sparks Debate: వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

అనుకూలంగా 226 ఓట్లు.. వ్యతిరేకంగా 163

ప్రతీ సవరణ మీద ఓటింగ్‌కు పట్టుబడిన విపక్షాలు

అర్ధరాత్రి దాటాక అన్ని సవరణలపై ఓటింగ్‌తో ఆమోదం

వక్ఫ్‌ బిల్లు పేరును ‘ఉమీద్‌’గా మార్చిన కేంద్రం

ప్రస్తుత చట్టంలోని సెక్షన్‌ 40 అత్యంత క్రూరమైనది

దాంతో ఏ భూమినైనా తమదేనని

వక్ఫ్‌ బోర్డు ప్రకటించవచ్చు

అలాంటి దారుణమైన సెక్షన్‌ను రద్దు చేశాం

లేదంటే పార్లమెంటు కూడా వక్ఫ్‌ ఆస్తే అంటారు!

జేపీసీ చేసిన అనేక సిఫారసులను పొందుపర్చాం

పేద ముస్లింల కోసం వక్ఫ్‌ ఆస్తులను వినియోగించాలి

బిల్లుపై చర్చలో మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు

బిల్లు రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్‌

ముస్లింలకు న్యాయం చేసేందుకే బిల్లు: అమిత్‌ షా

బిల్లు ప్రతులను చించివేసిన మజ్లిస్‌ ఎంపీ ఒవైసీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగాయి. వారి నిరసనల నడుమ బుధవారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్‌ బిల్లు పేరును ‘యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవల్‌పమెంట్‌ (యూఎంఈఈడీ-ఉమీద్‌)’గా మార్చినట్లు వెల్లడించారు. సంయుక్త పార్లమెంటు కమిటీ (జేపీసీ) చేసిన అనేక సిఫారసులను కూడా బిల్లులో పొందుపర్చినట్లు తెలిపారు. జేపీసీ సిఫారసులను బిల్లులో చేర్చలేదన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు.

ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ బిల్లును తీసుకురాకపోతే.. పార్లమెంట్‌ భూమిని కూడా వక్ఫ్‌ ఆస్తిగా చెబుతారని విమర్శలు గుప్పించారు. బిల్లుపై అర్ధరాత్రి వరకూ అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. అనంతరం మూజువాణీ ఓటుతో ‘ఉమీద్‌’ను ఆమోదించేందుకు స్పీకర్‌ ప్రయత్నించారు. అందుకు విపక్షాలు అభ్యంతరం తెలపడంతో ఓటింగ్‌ జరిపారు. అనుకూలంగా 226, వ్యతిరేకంగా 163 ఓట్లు వచ్చాయి.

విపక్ష సభ్యులు తాము ప్రతిపాదించిన ప్రతి సవరణపైనా ఓటింగ్‌ జరగాలని పట్టుబట్టారు. అన్ని సవరణలపై ఓటింగ్‌ జరపడంతో ఆమోదం లభించేసరికి అర్ధరాత్రి దాటింది. బిల్లుపై చర్చ సందర్భంగా కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ.. ఈ బిల్లు మతానికి సంబంధించినది కాదని, కేవలం ఆస్తుల విషయాలకు సంబంధించినదేనని స్పష్టం చేశారు. వక్ఫ్‌ బిల్లులోని అత్యంత క్రూరమైన సెక్షన్‌ 40 రద్దు కానుందన్నారు. ఈ సెక్షన్‌ కారణంగా ఏ భూమినైనా తమదేనని ప్రకటించుకునే హక్కు వక్ఫ్‌ బోర్డు, ట్రైబ్యునల్‌కు ఉందని.. దీన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇంతటి దారుణమైన సెక్షన్‌ను తాము తొలగించామని చెప్పారు. కొందరు ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్లుగా ముస్లిం వర్గాలకు చెందిన ఏ భూమినీ తాము లాగేసుకోబోమని స్పష్టం చేశారు. ‘‘పేద ముస్లింల కోసం వక్ఫ్‌ ఆస్తులను ఉపయోగించాలి. వారిని అలా వదిలేయకూడదు. వారి ఉన్నతి కోసం మోదీ ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ముస్లిం ప్రతినిధులు ఆ బిల్లును ఆహ్వానించారు. వీలైనంత త్వరగా దీనికి ఆమోదం లభించాలని ఆ వర్గంలోని పేదలు కోరుకుంటున్నారు. అలాగే రిజిస్టర్‌ చేసిన ఆస్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకు హక్కులు దక్కుతాయి.

ప్రభుత్వ భూమి విషయంలో వివాదం తలెత్తితే కలెక్టర్‌ కంటే పైస్థాయి అధికారి తీర్పు ఇవ్వాలంటూ జేపీసీ చేసిన ప్రతిపాదనను మేం అంగీకరించాం’’ అని రిజిజు స్పష్టం చేశారు. ‘‘బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయి. 1954లో తొలిసారి వక్ఫ్‌ చట్టం అమల్లోకి వచ్చింది. అది అప్రజాస్వామికం అని ఆనాడు ఎవరూ చెప్పలేదు. తాజా బిల్లును పరిశీలించిన జేపీసీకి అభినందనలు. ఈ బిల్లు తీసుకురాకపోతే.. కొందరు పార్లమెంట్‌ భవనాన్ని కూడా వక్ఫ్‌ ఆస్తిగా పేర్కొంటారు’’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్‌ ఆస్తికి సంబంధించినవని గతంలో ఏఐయూడీఎఫ్‌ చీఫ్‌ బద్రుద్దీన్‌ అజ్మల్‌ అన్నారు. దానికి స్పందనగానే రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు ఈ బిల్లు తోడ్పడుతుందని, వక్ఫ్‌ ఆస్తులన్నీ డిజిటల్‌ పోర్టల్‌లో ఉంటాయని, ఎవరూ ఆక్రమించేందుకు ఆస్కారం ఉండదని రిజిజు చెప్పారు. బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

దౌర్జన్యపూరితం: కాంగ్రెస్‌

వక్ఫ్‌ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బిల్లును వ్యతిరేకించారు. కేంద్రం దౌర్జన్యపూరితంగా బిల్లును తెస్తోందని ఆరోపించారు. సభలో ప్రవేశపెట్టే బిల్లుకు సవరణలు ప్రతిపాదించే హక్కు సభ్యులకు ఉంటుందన్నారు. సవరణలకు కనీస సమయం ఇవ్వకుండా హడావుడిగా ప్రవేశపెట్టారని ఆక్షేపించారు. మోదీ సర్కారు ఆరెస్సెస్‌ అజెండాను అమలు చేస్తోందని విమర్శించారు. లోక్‌సభలో కాంగ్రె్‌సపక్ష ఉప నేత గౌరవ్‌ గొగోయ్‌ మాట్లాడుతూ.. వక్ఫ్‌ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. బిల్లు కేవలం పాలనాపరమైన మార్పులకు సంబంధించినది కాదని.. మైనారిటీ వర్గాలను అవమానించడం, భారత సమాజాన్ని విభజించడమేనని చెప్పారు.కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తిప్పికొట్టారు. ‘‘జేపీసీ వేయాలన్నదే మీరు. కమిటీ సూచించిన మార్పులుచేర్పులను అంగీకరించకపోతే జేపీసీని ఎందుకు ఏర్పాటు చేయమన్నారు’’ అని ప్రశ్నించారు.

వక్ఫ్‌ భూముల విషయంలో అవినీతిని అడ్డుకొని, పేద ముస్లింల భూమిని కాపాడడమే ఈ బిల్లు ఉద్దేశమని తెలిపారు. వక్ఫ్‌ అంటే అరబిక్‌లో అల్లా పేరుతో దానం అని అర్థమని, అది దాతృత్వ కార్యక్రమని చెప్పారు. మీది కాని భూమిని దానం చేయడాన్ని దాతృత్వమని అనరని గుర్తుచేశారు.

అమిత్‌ షా, అఖిలేశ్‌ వ్యంగ్యాస్త్రాలు

వక్ఫ్‌ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద పార్టీ తన అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోంది’’ అని బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ‘‘అఖిలేశ్‌ నవ్వుతూ ఓ విషయం చెప్పారు. నేను కూడా అలాగే సమాధానం ఇస్తా. కొన్ని పార్టీల నాయకత్వం ఐదుగురి చేతుల్లోనే ఉంటుంది. వారి నుంచే అధ్యక్షుడిని నియమించుకుంటారు. కానీ, మేం 12-13 కోట్ల మంది పార్టీ సభ్యుల నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలి. అందుకు సమయం పడుతుంది. మీకు అలాంటిదేం అక్కర్లేదు. ఎందుకంటే మరో 25 ఏళ్లు మీరే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు’’ అని షా బదులిచ్చారు.

ముస్లింలపై యుద్ధం ప్రారంభించిన మోదీ సర్కారు: ఒవైసీ

వక్ఫ్‌ బిల్లుపై చర్చ సందర్భంగా మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును ముస్లింలపై దాడిగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం మసీదులు, దర్గాలు, మదర్సాలు, ముస్లింల స్వేచ్ఛపై యుద్ధాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని విమర్శించారు. వక్ఫ్‌ బిల్లు రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. ఆక్రమణదారులే యజమానులు అయిపోతారని, ముస్లిమేతరులు వక్ఫ్‌బోర్డు పాలనలో భాగస్వాములవుతారని ఆరోపించారు. ఆలయాలు, మసీదుల పేరిట బీజేపీ దేశంలో వివాదాలు సృష్టించాలని చూస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన బిల్లు ప్రతులను చించివేశారు.

దేశంలో వక్ఫ్‌ బోర్డు నిర్వహణలోని

మొత్తం స్థిరాస్తులు: 8,72,324

వాటిలో ముఖ్యమైన ఆస్తుల వివరాలు

1) శ్మశానాలు 1,50,569

2) దుకాణాలు 1,13,193

3) వ్యవసాయ

భూములు 1,40,803

4) మసీదులు 1,19,280

5) ఇళ్లు 92,517

6) ప్లాట్లు 64,975

7) దర్గాలు 33,502

Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే

ABN , Publish Date - Apr 02 , 2025 | 03:25 PM

బిల్లులో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలనే సవరణతో సహా అన్ని సవరణలకు టీడీపీ సానుకూలంగా ఉంది. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని మూడులైన్ల విప్‌ను కూడా టీడీపీ జారీ చేసింది.

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు 2024 (Waqf Amendment Bill)పై బుధవారంనాడు లోక్‌సభలో చర్చ మొదలుకావడంతో కొత్తం చట్టం పార్లమెంటులో ఆమోదం పొందుతుందా అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఎన్డీయేలో కీలక భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్) పార్టీలు బిల్లుకు సానుకూలంగా ఉన్నాయి. అయితే ప్రతిపాదిత బిల్లులో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఒక మార్పును సూచించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

స్టేట్ వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను అనుమతించాలని టీడీపీ కోరనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ముస్లిమేతరులకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం అనేది రాష్ట్రాల విచక్షణకు వదిలిపెట్టాలని పార్టీ ఏకగ్రీవ డిమాండ్‌గా ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఆ ఒక్క మార్పు మినహాయిస్తే బిల్లులో మహిళల భాగస్వా్మ్యాన్ని తప్పనిసరి చేయాలనే సవరణతో సహా అన్ని సవరణలకు టీడీపీ సానుకూలంగా ఉంది. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని మూడులైన్ల విప్‌ను కూడా టీడీపీ మంగళవారంనాడు జారీ చేసింది.



Sanjay Raut | The Waqf (Amendment) Bill, 2025

 

రాజ్యసభలో శివసేన ఎంపీ సంజయ్ రావుత్ అద్భుతమైన ప్రసంగం.

 Katari Rajendra Prasad

నిన్న రాజ్యసభలో శివసేన ఎంపీ సంజయ్ రావుత్ అద్భుతమైన ప్రసంగం.
హిందీ రానివాళ్ళ కోసం కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ అనువదిస్తున్నాను.
"సడన్ గా బీజేపీకి ముస్లింలకు మేలు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఈ ఆలోచన వల్ల ముస్లింలతో పాటూ హిందువులు కూడా భయపడిపోతున్నారు. ముస్లింల మేలు కోసం బహుశా మహమ్మద్ అలీ జిన్నా కూడా ఇంతగా ఆలోచించి ఉండరేమో అనిపిస్తుంది.
ఇంతవరకూ ముస్లింలను దొంగలు అన్నది వీళ్లే.. టెర్రరిస్టులు అన్నది వీళ్లే.. ముస్లింల దగ్గర కొనవద్దని చెప్పింది వీళ్ళే.. ముస్లింలు మీ భూముల్ని కాజేస్తారని హిందువుల్ని భయపెట్టింది వీళ్లే.. మీ మంగళ సూత్రాలు లాక్కుంటారని భయపెట్టింది బీజేపీ వాళ్లే.
ఇప్పుడు ఇదే బీజేపివాళ్ళు ముస్లింల వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే బిజెపి వాళ్లే కొత్త ముల్లాలుగా తయారైనట్టు కనబడుతుంది.
వక్ఫ్ ఆస్తుల్ని అమ్మి పేద ముస్లింలకు న్యాయం చేస్తామని బీజేపీ ప్రభుత్వం అంటున్నది. అంటే ముస్లింల ఆస్తులను అమ్మేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతా ఉంది. ఖచ్చితంగా అమ్మేస్తారు కూడా.
అయోధ్యలో 13000 ఎకరాల స్కాం జరిగింది. కేదారనాథ్ లో 300 కేజిల బంగారం మాయమైపోయింది. మీరు హిందువుల ఆస్తులు కాపాడలేకపోయారు గానీ ముస్లింల ఆస్తులు కాపాడతామని ప్రగల్భాలు పలుకుతున్నారు.
మరోవైపు చైనా ఆక్రమించిన భూముల్ని కాపాడలేక పోతున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. అమెరికా మనదేశంపై 27 శాతం సుంకం విధించింది. ఇది మనదేశానికి అత్యంత ప్రమాదకరం. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వక్ఫ్ అంశాన్ని తీసుకొచ్చారు.
దేశంలో పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం లాంటి అంశాలను కప్పి పుచ్చడానికి బీజేపీ ప్రభుత్వం 'హిందూ-ముస్లిం' అనే పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతుంది. ఇది అందరూ తెలుసుకోవాలి. "
కాపీ by బీరయ్య యాదవ్ గారు

Wednesday, 2 April 2025

Jilukara Srinivas on - Waqf Amendment Bill

 Facebook

Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
బిజెపి ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు చట్టానికి సవరణలు చేసి కొత్త చట్టం తీసుకొచ్చింది. చట్టం పేరును కూడా మార్చేసింది. Unified Waqf Management, Empowerment, Efficiency and Development అని కొత్త పేరు పెట్టింది. ప్రతిపాదిత సవరణలు చాలా పెద్ద చర్చకు దారితీసాయి. పార్లమెంటరీ జాయింట్‌ కమిటీ కూడా ఈ బిల్లు మీద చర్చలు జరిపి కొన్ని సవరణలు ప్రతిపాదించింది. అయితే, పార్లమెంటు సభ్యులకు కూడా సవరణలు ప్రతిపాదించే అవకాశం లేకుండా బిల్లు ప్రతులను చివరి నిమిషంలో పంపిణీ చేశారని ప్రతిపక్షాల నాయకులు సభలో విమర్శలు చేశారు.

పాలక పక్షం ఈ బిల్లును సమర్ధించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నది. వక్ఫ్‌ భూములను రక్షించడం, అన్యాక్రాంతం కాకుండా నివారించే లక్ష్యంతో ఈ చట్టం తెచ్చినట్టు చెబుతున్నప్పటికీ, వాస్తవంలో దేశవ్యాప్తంగా వక్ఫ్‌ బోర్డు పరిధిలోని 9లక్షల 40వేల ఎకరాలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఉద్దేశించిన చట్టమని అర్థం అవుతూనే వున్నది. ఇందులో భాగంగా బోర్డు సభ్యులుగా ముస్లింయేతరులను నియమించే ప్రొవిజన్సును ఈ చట్టంలో పొందుపర్చారు. ఇది అభ్యంతరకరమైన విషయం. వక్ఫ్‌ భూములంటే ముస్లింల ఆలయ భూములని అర్థం. హిందువులు భక్తితో ఆలయాలకు భూములను దానం చేసిన వాటిని దేవాలయ భూములని పిలుస్తారు. అవి అన్యాక్రాంతం కాకుండా దేవాదాయ శాఖ చూసుకోవాలి. అయితే, చాలా దేవాలయాల భూములు ధర్మకర్తలు, ఆలయ పూజారులు కలిసి అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలు వున్నాయి. అలాగే, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి పేదలు వాటిని సాగుచేసుకుంటూ యాజమాన్య హక్కుల కోసం పోరాడుతున్న సంగతి కూడా తెలిసిందే. అదే విధంగా వక్ఫ్‌ భూములంటే మసీదుల నిర్వహణ కోసం, ముస్లింలు దానం చేసిన భూములు అని అర్థం. అవి దేవుని మాన్యాలని అర్థం. వాటిని అమ్మే అధికారంగానీ, మరొకరికి బదలాయించే అధికారం గానీ ఆయా మసీదులకు వుండదు. ఒక్కసారి వక్ఫ్‌కు దానం చేసిన భూముల మీద దానకర్తలకు ఎలాంటి యాజమాన్య హక్కులుండవు. అలాగే, హిందూ దేవాలయాల భూముల మీద హిందూయేతరులకు ఎలాంటి అధికారం వుండన్నట్టే, ముస్లిం వక్ఫ్‌ భూముల మీద కూడా ముస్లిం యేతరులకు ఎలాంటి అధికారం వుండదు. ఇది 1995 చట్టంలో వున్నది. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంలో సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డులో ముస్లింయేతరులైన ముగ్గురు పార్లమెంటు సభ్యులు వుంటారు. అలాగే, రాష్ట్రస్థాయి వక్ఫ్‌ బోర్డులో కూడా ముగ్గురు ముస్లింయేతరులు వుంటారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా వుంటారు. వాళ్లు చట్టంలో నిర్వచించబడిన స్థాయి, హోదాగల వారై వుంటారు.

ఈ ప్రొవిజన్‌ మీద అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాటి మంచి చెడ్డల జోలికి పోవడం అవసరం లేదు కానీ, చాలా రొటీన్‌ లాజిక్కునే అన్వయించుకోవచ్చు. హిందూ దేవాలయాల నిర్వహణలో ఇతర మతాల అధికారులను నియమిస్తే అంగీకరించక పోవడం సహజం. గతంలో ఇలాంటి విషయాల మీద తీవ్రమైన వివాదాలు జరిగిన సంగతి విధితమే. కానీ వక్ఫ్‌ బోర్డులలో ముస్లింయేతరులను నియమించడాన్ని బిజెపి సమర్ధించుకోవడానికి చూపుతున్న కారణాలు వింతగా వున్నాయి. బోర్డుల నిర్ణయాలలో పారదర్శకత, దాని పనితీరులో సామర్ధ్యం పెంపు కోసమే ఈ ప్రొవిజన్‌ అనడంలోనే గడుసుదనం వుంది. వాస్తవానికి మసీదులకు దానం చేసిన ఆస్తులను ఇతరులకు కట్టబెట్టడానికి ఈ ఏర్పాటు అన్నది స్పష్టం అవుతుంది. న్యాయశాఖ మంత్రి పేర్కొన్న డ్రాకోనియన్‌ సెక్షన్‌ 40ని తొలగించారు. ఈ సెక్షన్‌ ప్రకారం ఎక్కువ కాలం ఉపయోగించుకున్న భూములు కూడా వక్ఫ్‌ భూముల పరిధిలోకి వచ్చేవి అని పాలక వర్గం ఆరోపిస్తున్నది. ఇందులో నిజానిజాలేమిటో తేలాలి. విషయం ఏమిటంటే, వక్ఫ్‌ బోర్డు జాబితాలో చేరని భూములు చాలా వున్నాయి. అవి వివాదస్పదంగా మారాయి. కోర్టుల్లో విచారణ దశలో వున్నాయి. అలాంటి భూములను ముస్లింలు కోల్పోతారు. వ్యాజ్యంలో వున్న వక్ఫ్‌ భూముల యాజమాన్య హక్కులను నిర్ధారించడానికి జిల్లా కలెక్టరు లేదా తత్సమానమైన అధికారికి ఈ చట్టం అధికారం ఇచ్చింది. అయితే, బోర్డులో ముస్లింయేతరులున్నప్పుడు ఆ అధికారి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలడా? అనేది పెద్ద సంశయం.
ఈ కొత్త చట్టంతో వక్ఫ్‌ భూములు భద్రంగా వుంటాయనే భరోసా ఈ దేశంలోని పౌరులకు కలిగిందా అన్నది సంశయం. కార్పోరేట్‌ కంపెనీలకు వాటిని కట్టబెట్టే వెసులుబాటును ఈ చట్టం కలిపిస్తుంది.
ఒక చట్టాన్ని తయారు చేయడానికి ఎన్ని సాకులైనా చెప్పవచ్చు. కానీ అది అంతిమంగా ఏ వర్గానికి లబ్ది చేకూరుస్తుందనే వాస్తవం నిజానికి చట్టాన్ని తయారు చేసిన పాలకులకే ఎరుక. ప్రజలు ఆ నిజాన్ని వాసన పడుతారు. కానీ నిలువరించ గలరా?

` డా.జిలుకర శ్రీనివాస్‌
విసికె తెలంగాణ అధ్యక్షులు