Prashant Kishore: వక్ఫ్ సవరణ బిల్లుతో విభేదించిన పీకే... ఆ పార్టీకే నష్టమని జోస్యం
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:28 PM
సమావేశంలోని ఒక పెద్ద సెక్షన్‌ను విడగొట్టేందుకు తీసుకువచ్చే ఏ చట్టానికైనా తమ పార్టీ వ్యతిరేకమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలని బీజేపీ కోరుకుంటోందని, కానీ దీని వల్ల జేడీ(యూ)కు అతిపెద్ద నష్టం జరుగనుందని జోస్యం చెప్పారు.

పాట్నా: వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill)పై జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) తన అసమ్మతిని తెలిపారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రశాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశంలోని ఒక పెద్ద సెక్షన్‌ను విడగొట్టేందుకు తీసుకువచ్చే ఏ చట్టానికైనా తమ పార్టీ వ్యతిరేకమని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలని బీజేపీ కోరుకుంటోందని, కానీ దీని వల్ల జేడీ(యూ) అతిపెద్ద నష్టం జరుగనుందని జోస్యం చెప్పారు.
Sanjay Raut: కంగనా తరహాలోనే కునాల్‌కు ప్రత్యేక రక్షణ.. సంజయ్ రౌత్ డిమాండ్
''జేడీయూ ఎంపీలు 12 మంది వ్యతిరేకిస్తే బిల్లు సభామోదం పొందే అవకాశం లేదు. బిల్లును వ్యతిరేకించకుంటే మాత్రం నితీష్ కుమార్ జేడీయూకు అతిపెద్ద నష్టం తప్పదు. కాంగ్రెస్ పార్టీ బీహార్‌ను లాలూప్రసాద్ చేతుల్లో పెట్టి అమ్మేసినట్టే, ఇప్పుడు బీహార్‌ను నితీష్‌కు బీజేపీ అప్పగించింది'' అని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు.
నితీష్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై అడిగినప్పుడు, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో ఏ ఒక్కరికీ తెలియదన్నారు. చిన్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియకే అనేకసార్లు హెల్త్ చెకప్‌లు జరుగుతుంటాయని, 12 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రం పరీక్షించే వారే లేరని అన్నారు. నితీష్ తన మంత్రులు, కనీసం జిల్లాలను కూడా గుర్తుపట్టేలా లేరని చెప్పారు. ఇదే విషయాన్ని మార్చి 23న కూడా ఆయన ప్రస్తావించారు. నితీష్ శారీరకంగా, మానసికంగా అలసిపోయారని, కనీసం తన క్యాబినెట్‌లోని మంత్రులను కూడా గుర్తింతలేకుండా ఉన్నారని వ్యాఖ్యానించారు. రోజురోజుకూ ఆయన మానసిక ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఇకపై ఆయన పాలించడానికి తగరని, 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నితీష్ ఆరోగ్యం గురించి మొదట ఆందోళన చెందిన వ్యక్తి ఆయన సొంత మిత్రుడు సుశీల్ కుమార్ మోదీనని గుర్తుచేసారు. నితీష్ ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ బులిటెన్ విడుదల చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు.
No comments:
Post a Comment