Sunday, 30 March 2025

PM Modi: ఆధునిక 'అక్షయ వటవృక్షం' ఆర్ఎస్ఎస్:

 

Narendra Modi: సంఘ్‌ ఓ వటవృక్షం

ABN , Publish Date - Mar 31 , 2025 | 04:38 AM

ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘భారతీయ సంస్కృతి వటవృక్షం’గా కొనియాడారు. కాంగ్రెస్ విధానాల వల్ల నక్సలిజం వ్యాప్తి చెందిందని ఆయన ఆరోపించారు

Narendra Modi: సంఘ్‌ ఓ వటవృక్షం

సేవకు ప్రతిరూపం: ప్రధాని నరేంద్ర మోదీ

నాగపూర్‌లో ఆరెస్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సందర్శన

హెడ్గేవార్‌, గోల్వాల్కర్లకు నివాళి

కాంగ్రెస్‌ విధానాలతోనే నక్సలిజం వ్యాప్తి!

ఛత్తీస్‌గఢ్‌లో ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో మోదీ

న్యూఢిల్లీ, మార్చి 30: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సేవకు మరో పేరని ప్రధాని మోదీ అన్నారు. అది భారతీయ ప్రాచీన సంస్కృతికి, ఆధునికీకరణకు వటవృక్షంలాంటిదని చెప్పారు. దాని విలువలు, ఆదర్శలు జాతీయ చైతన్యాన్ని పరిరక్షిస్తున్నాయని తెలిపారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ప్రథమ, ద్వితీయ సర్‌సంఘ్‌చాలక్‌లు కేబీ హెడ్గేవార్‌, ఎంఎస్‌ గోల్వాల్కర్‌ల స్మృతి మందిరాలకు వెళ్లి నివాళులు అర్పించారు. సంఘ్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన రెండో ప్రధాని మోదీ. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2000లో వెళ్లారు. ఇద్దరూ మూడోసారి ప్రధాని అయిన తర్వాతే ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం గమనార్హం. సంఘ్‌ ప్రాంగణంలో మాధవ్‌ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు అనుబంధంగా మాధవ్‌ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమర మాట్లాడుతూ.. గత వందేళ్లుగా ‘సంఘటన్‌’, ‘సమర్పణ్‌’తో ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న తపస్సు.. ‘వికసిత్‌-భారత్‌-2047’ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇప్పుడు ఫలాలందిస్తోందని తెలిపారు.

Adevertisement
Powered by:PS
Advertisement: 0:07

sdfkjhbd.jpg

‘వందేళ్ల తర్వాత సంఘ్‌ మరో మైలురాయి దిశగా కదులుతోంది. స్వాతంత్య్ర పోరాటంలో 1925-47 సంక్షోభ సమయం. ఇప్పుడు 2025-47 మధ్య కాలం కూడా చాలా కీలకమైనది. భారీ లక్ష్యాలు మన ముందున్నాయి. వచ్చే వెయ్యేళ్లు శక్తిమంతమైన, పురోగామి భారత నిర్మాణానికి మనం శంకుస్థాపన చేయాలి’ అని అన్నారు. స్మృతిమందిరం వద్ద ఉన్న సందేశ పుస్తకంలో మోదీ హిందీలో సందేశం రాశారు. హెడ్గేవార్‌, గోల్వాల్కర్‌ల ఆలోచనలు తనతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిని, బలాన్ని ఇచ్చాయన్నారు. ఆయన వెంట సంఘ్‌ చీఫ్‌ భాగవత్‌, కేంద్ర మంత్రిగడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ కూడా ఉన్నారు. నాగపూర్‌లో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బౌద్ధమతాన్ని స్వీకరించిన ‘దీక్షాభూమి’ని కూడా మోదీ సందర్శించారు. ‘దీక్షాభూమి’ సామాజిక న్యాయానికి, బడుగుల సాధికారతకు చిహ్నమన్నారు. దీక్షాభూమిలోని స్తూపం వద్దకు వెళ్లి ‘అంబేడ్కర్‌ అస్థి’ వద్ద మోదీ నివాళులు అర్పించారు.


కాంగ్రెస్‌ విధానాలతోనే నక్సలిజం వ్యాప్తి!

కాంగ్రెస్‌ దశాబ్దాల తరబడి అనుసరించిన విధానాలు నక్సలిజానికి ఊతమిచ్చాయని మోదీ అన్నారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లోనే నక్సలిజం ప్రబలంగా విస్తరించిందని తెలిపారు. ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని.. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిశకం ప్రారంభమైందని చెప్పారు. మోదీ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లా మోహభట్టాలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. అనంతరం రూ.33,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంభన్‌పూర్‌-రాయ్‌పూర్‌ మధ్య మెమూ రైలును ప్రారంభించారు. రూ.9,790 కోట్లతో ఎన్‌టీపీసీ నిర్మించే సీపత్‌ సూపర్‌ థర్మల్‌ విద్యుత్కేంద్రం మూడో దశ(800 మెగావాట్లు) కు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.15,800 కోట్లతో నిర్మించిన మొదటి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజీపూర్‌ జిల్లాలో ఆదివారం 50 మంది నక్సలైట్లు సీఆర్‌పీఎఫ్‌, రాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో 14మందిపై రూ.68 లక్షల మేర రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


PM Modi: ఆధునిక 'అక్షయ వటవృక్షం' ఆర్ఎస్ఎస్: ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:03 PM

దేశనిర్మాణం, సమాజ సేవ, సంస్కృతీ పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ వలంటీర్లు విశిష్ట సేవలందిస్తున్నారని మోదీ అన్నారు. నాగపూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.

PM Modi: ఆధునిక 'అక్షయ వటవృక్షం' ఆర్ఎస్ఎస్: ప్రధాని మోదీ

నాగపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (RSS)ను భారతీయ సజీవ సంస్కృతికి చిహ్నమైన ఆధునిక ''అక్షయ వటవృక్షం''గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశానికి ఆర్ఎస్ఎస్ వలంటీర్లు చేస్తున్న నిస్వర్థ సేవలను కొనియాడారు. దేశనిర్మాణం, సమాజ సేవ, సంస్కృతీ పరిరక్షణలో విశిష్ట సేవలందిస్తున్నారని అన్నారు. నాగపూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.

Kamakhya Express Derail: పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్

Adevertisement
Powered by:PS
Advertisement: 0:00

ఆర్ఎస్ఎస్ విశిష్టతను ప్రధాని వివరిస్తూ... ''వందేళ్ల క్రితం నాటిన సిద్ధాంతాల విత్తనాలు ఈ నాడు వటవక్షంలా ప్రపంచ ముందున్నాయి. సిద్ధాంతాలు పతాకస్థాయికి చేరుకోగా, లక్షలు, కోట్ల మంది స్వయం సేవకులు ఈ వటవృక్షానికి కొమ్మలు. ఇది మామూలు వటవృక్షం కాదు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన ఆధునిక వటవృక్షం'' అని అన్నారు.


గుడి పడ్వా (మరాఠీ నూతన సంవత్సర పండుగ) సందర్భంగా ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ''వరుస పండుగల సీజన్ ఇది. గుడి పడ్వా, ఉగాది, నవ్రేహ్ (కశ్మీరీ హిందూ నూతన సంవత్సరం) పండుగలను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఇదే ఏడాది ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరం కూడా వచ్చింది. స్మృతి మందిర్‌కు నివాళులర్పించే మహదవకాశం నాకు వచ్చింది. ఇటీవలే మనం 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకొన్నాం. వచ్చే నెలలో బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవం ఉంది. నవరాత్రి, ఇతర పండుగల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తు్న్నాను'' అని ప్రధాని అన్నారు.


పేదలకు ఉత్తమమైన వైద్యసేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ప్రధాని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యసేవలు అందుతున్నాయని, దేశప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలు అందించడం తమ ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటని తెలిపారు. వేలాది జన్ ఔషది కేంద్రాల ద్వారా దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకగా మందులు లభిస్తున్నాయని అన్నారు. ఇందువల్ల వేలకోట్లలో ప్రజల సొమ్ము ఆదా అవుతోందని చెప్పారు. గత పదేళ్లలో లక్షలాది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను గ్రామాల్లో నిర్మించామని, అక్కడ ప్రాథమిక చికిత్స లభిస్తోందని వివరించారు. మెడికల్ కాలేజీలను రెట్టింపు చేయడంతో పాటు దేశంలో ఆపరేషనల్ 'ఎయిమ్స్‌'ను మూడురెట్లు పెంచామని చెప్పారు. నిపుణులైన వైద్యలను ప్రజలకు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని అన్నారు.


మాధవ్ నేత్రాలయ భవంతికి శంకుస్థాపన

మాధవ్ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్టూ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కొత్తగా ఎక్స్‌టెన్షన్ బిల్డింగ్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తదితరులు పాల్గొన్నారు. నాగపూర్‌లోని సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్‌ను 2014లో దివంగత ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ అలియాస్ గురూజీ స్మృత్యర్థం నిర్మించారు. కొత్త ప్రాజెక్టుతో 250 పడకల ఆసుపత్రిగా, 14 ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్స్, 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు చవకగా అందుబాటులోకి రానున్నాయి.

No comments:

Post a Comment