Sunday, 30 March 2025

Hindu Women that gave birth to Mogul Emperors

 [09:58, 31/03/2025] Vsp KS Chalam: మొఘల్ చక్రవర్తులకు జన్మనిచ్చిన హిందూ స్త్రీలు.

భారతదేశం చారిత్రికంగా భిన్న మత విశ్వాసాల సమ్మేళనం. అనేక సముదాయాలు వివిధ సంస్కృతులతో కలిసిమెలిసి జీవించాయి. మనుషుల మధ్య బంధుత్వాలకు మతాలు అడ్డురాలేదు. చరిత్రలో హిందూ ముస్లిమ్ ల మధ్య అనేక వివాహాలు జరిగాయి. ఇవి భిన్న సంస్కృతుల సమ్మేళనానికి దారితీసాయి. చాలామంది మొఘల్ చక్రవర్తులు హిందూ స్త్రీలకు పుట్టారు. వారి ఆస్థాన చరిత్రకారులు ఈ విషయాన్ని ఎక్కడా దాచిపెట్టలేదు.  స్పష్టంగానే రాసుకొన్నారు. వీటిని ఉత్త రాజకీయ తంత్రంగా భావించలేం. ఒక ముస్లిం రాజు హిందూ స్త్రీని పెండ్లాడి ఆమెను జనానాలో ఒకానొక దేహంగా మార్చకపోవటం;  ఆమెద్వారా కలిగిన పుత్రుడు సింహాసనం అధిష్టించటం అనేవి  ఉత్త రాజకీయ వ్యూహాలుగా పరిగణించలేం. రాజనీతిని మించిన మానవీయకోణాన్ని, సౌహార్దతను ఊహించాలి. భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన హిందు ముస్లిమ్ వివాహాలు కొన్ని ఇవి…….


**


1. హర్కబాయి (1542-1623) - అక్బర్ Maryam-Uz-Zamani 

జైపూర్ రాజైన భర్మల్ 1562 లో తనకూతురు  హర్కబాయిని అక్బరుకి ఇచ్చి వివాహం చేసాడు. ఈమె అక్బరుకు ఎంతో ఇష్టమైన రాణి అయింది. హర్కబాయి అపురూప సౌందర్యం, అద్భుతమైన మేధాశక్తి, గొప్ప దయ కలిగిన స్త్రీ.   అక్బర్ చూపించిన మతసహనం, లౌకికత వెనుక ఈమె హస్తం ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఈమె కోరికపై అక్బరు గోమాంసాన్ని తినటం మానివేసాడు. ఈమె ద్వారా వైదిక క్రతువులు, బ్రాహ్మణులు, సూర్యనమస్కారాలు, శాఖాహారం,  పూజలు లాంటివి ముఘల్ అంతఃపురంలోకి పవేశించాయి.  హిందూస్త్రీలు సంస్థానంలో హారతి ఇస్తే స్వీకరించాలని అందరినీ ఆదేశించాడు అక్బరు.  హర్కబాయి అక్బరులకు 1569లో కుమారుడు కలిగాడు.   ఇతనే మొఘల్ చక్రవర్తి జహంగీరు.  హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన మొదటి  చక్రవర్తి జహంగీరు. 

  

ముఘల్ సంస్థానంలో హర్కబాయి నాలుగుదశాబ్దాల సుదీర్ఘకాలంపాటు పట్టపురాణిగా ఆ పిదప రాజమాతగా ఎంతో గౌరవాన్ని పొందింది.  ఈమె పేరుమీద ఒక ఓడ ఉండేది. ఈమె అనేక నౌకా వ్యాపారాలు చేసేది. వ్యాపారాభివృద్ధినిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించేది.  ఈమె ఓడ పేరు రహిమి (Rahimi.) 12000  మంది సైనికులను కలిగి ఉన్న  నలుగురు మొఘలు సంపన్న వ్యక్తులలో ఈమె ఒకరు. స్త్రీలలో ఒకే ఒకరు.  ఇదీ ఈమె హోదా. 

జహంగీర్ తనతల్లి హర్కబాయిని ఎంతో గౌరవంగా Her Majesty అని సంబోధించేవాడు.  పాదాలకు నమస్కరించిన పిదప మాట్లాడేవాడు. 

1605 లో అక్బర్ చనిపోయేనాటికి హర్కబాయి  ముఘల్ స్త్రీలలో అత్యంత సంపన్నురాలు .  ఈమె తన 81 వ ఏట 1623 లో మరణించింది. హర్కబాయి గౌరవార్ధం అక్బరు సమాధిపక్కనే ఆగ్రాలో ఈమె సమాధికూడా నిర్మించారు. 

.

2. మన్ బాయి (1570-1605)- జహంగీర్ 

.

జహంగీర్ తల్లి హర్కబాయి సోదరుని పేరు రాజ భగ్వంత్ దాస్. ఇతను జైపూర్/ అంబర్ ను పాలించిన 23 వ రాజు. ఇతని కూతురు పేరు మన్ భవతి బాయి (Man Bai). జహంగీరు, మన్ బాయిలు బావమరదళ్ళు అవుతారు. మన్ బాయి గొప్ప సౌందర్యరాశి, సౌశీల్యవతి. మేనత్త హర్కబాయిలా తెలివైనది. ఆమెను జహంగీరుకు ఇచ్చి వివాహం చేయాలని హర్కబాయి ప్రతిపాదించగా,  వంశప్రతిష్టలు కలిగిన కుటుంబానికి చెందిన అమ్మాయి కనుక అక్బరు మన్ బాయిని కోడలుగా చేసుకోవటానికి వెంటనే అంగీకరించాడు. మన్ బాయి, జహంగీరుల వివాహం 1585 లో అంగరంగవైభవంగా జరిగింది.  వీరిద్దరికి 1587 ఖుస్రో మిర్జా అనే కొమారుడు కలిగాక మన్ బాయికి పట్టమహిషి (Shah Begum)   హోదా లభించింది. 


మన్ బాయి సోదరుని పేరు మాధవ సింగ్.  ఇతనితో తన  కొడుకు ఖుస్రో మిర్జా కలిసి భర్త జహంగీరుపై వ్యతిరేకంగా కుట్రలు పన్నటం మన్ బాయిని తీవ్రమైన మనస్తాపానికి గురిచేసేది . కొడుకుకు భర్తకు నచ్చచెప్పలేక మన్ బాయి తీవ్రఒత్తిడికి గురయి 1605 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మన్ బాయి, జహంగీర్ల దాంపత్యం ఎంతో అన్యోన్యమైనది.  భార్య చనిపోయిందని తెలిసిన జహంగీరు నాలుగురోజులపాటు భోజనం చేయలేదు.  


జహంగీరు భార్యావియోగంతో విరాగిగామారాడని తెలిసిన అక్బరు ఆ సమయంలో తను ధరించిన తలపాగ, శాలువాలను పంపించి ఓదార్చే ప్రయత్నం చేసాడు. కొడుకుపట్ల పిచ్చిప్రేమకు, భర్త పట్ల అనురాగానికి మధ్య నలిగిపోయి ఆత్మహత్య చేసుకొన్న కోడలి పట్ల ఎంతో కలత చెందాడు అక్బరు. 


జహంగీరు, అలహాబాదు, Khusrau Bagh ఆవరణలో మన్ బాయి జ్ఞాపకార్థం అందమైన సమాధిని నిర్మింపచేసాడు. 

.

3. జగత్ గోసాయిన్ (1573 – 1619) – జహంగీర్

.

ఈమెకే మనవతి బాయి, జోధ్ బాయి (జోదా అక్బరు జంట కాదు) అనే పేర్లు  కూడా ఉన్నాయి. ఈమె మార్వార్  (ప్రస్తుత జోధ్ పూర్) రాకుమార్తె. రాజ్ పుత్ రాజా ఉదయ్ సింగ్  కూతురు. ఈమె తాతగారైన Maldev Rathore  నాయకత్వంలో మార్వార్ బలమైన రాజపుత్రుల రాజ్యంగా ఏర్పడింది. 


యువరాజుగా ఉన్న జహంగీరు ఒకనాడు ఒక రాజకుటుంబ వేడుకలో అపురూపలావణ్యవతి అయిన జగత్ గోసాయిన్ ని చూసి ప్రేమించాడు. ఆమెను పెండ్లాడాలనే కోర్కెను వెలిబుచ్చాడు. ఈ పెళ్ళి ప్రతిపాదనను అక్బరు అంగీకరించలేదు. అక్బరు తల్లి హమీదాబాను అందరిని ఒప్పించింది.  అలా జహంగీరుకు జగత్ గోసాయిన్ కి 1586లో వివాహమైంది. ఈ వివాహం మార్వార్ రాజు సంస్థానంలో పండితుల వేదమంత్రాలతో ముస్లిమ్ కట్టుబాట్ల మధ్య   జరిగింది.   


అందం, ఆకర్షణీయ సంభాషణ, చమత్కారం, సమయస్పూర్తి, ధైర్యసాహసాలతో జగత్ గోసాయిని తక్కువ కాలంలోనే జహంగీరుకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారింది. జగత్  సంగీతంలో గొప్ప ప్రావీణ్యం కలిగిన గాయని. ఈమె 1592 లో జహంగీరుకు ఒక మగబిడ్డను ఇచ్చింది. అతనే మొఘల్  చక్రవర్తి షాజహాన్.   హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన రెండవవ్యక్తి ఇతను. ఈ బిడ్డ జాతకం ప్రకారం మహర్జాతకుడని పండితులు చెప్పటంతో తాత అయిన అక్బర్ చక్రవర్తి ఈ బిడ్డకు “కుర్రం” (సంతోషకరమైన) అని నామకరణం చేసి తనవద్దే ఉంచుకొని పెంచి పెద్దచేసాడు.  


1605 లో అక్బర్ మరణించాక కుర్రం తండ్రి వద్దకు వచ్చేసాడు. 1611 లో నూర్జహాన్ ను వివాహం చేసుకొన్నాకా ఆమె ఆకర్షణలోపడి జహంగీర్ జగత్ గోసాయిన్ పట్ల ఆదరణ  తగ్గించేసాడు. 1619 లో జగత్ గోసాయిన్ అనారోగ్యకారణాలతో మరణించింది.  ఈమె మరణానంతరం జహంగీర్ అన్ని రాజపత్రాలలో ఈమె పేరును Bilqis Makani (the Lady of Pure Abode) గా ప్రస్తావించమని ఆదేశించాడు.  1628 లో జగత్ గోసాయిన్ కుమారుడు షాజహాన్ ముఘల్ చక్రవర్తిగా సింహాసనం అధిష్టించే నాటికి ఈమె జీవించి లేదు.

.

4. నవాబ్ బాయి

.

కాశ్మీరుకు చెందిన రాజపుత్ రాజౌరి రాకుమార్తెను ఔరంగజేబు 1638 లో పెళ్ళిచేసుకొన్నాడు. ఈమె పేరు నవాబ్ బాయి. వీరిద్దరికి 1643 లో బహదూర్ షా I జన్మించాడు.  ఇతను ఔరంగజేబు మరణానంతరం ముఘల్ చక్రవర్తి అయి 1707 నుండి 1712 వరకూ పరిపాలించాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన మూడవ వ్యక్తి. 1662 లో ఔరంగజేబు తీవ్రంగా అస్వస్థుడవగా, అతని చెల్లెలు రోషనార రాజ్యాధికారాన్ని చేతిలోకి తీసుకొని పరిపాలించసాగింది.  ఈ చర్యను నవాబ్ బాయి ప్రతిఘటించింది. ఈమె కుమారులు  తండ్రికి వ్యతిరేకంగా వ్యవహరించేవారు. ఈ కారణాలతో నవాబ్ బాయి అంతఃపురంలో క్రమేపీ గౌరవాన్ని కోల్పోయి ఔరంగజేబు ప్రేమకు దూరమైంది.  


కొడుకులను భర్త ఖైదు చేయించాడని తెలిసి ఎంతో మానసిక క్షోభకు గురవగా, ఔరంగజేబు స్వయంగా వచ్చి నవాబ్ బాయిని ఓదార్చాడు.  ఒక బాధ్యతకలిగిన తండ్రిగా, పాలకుడిగా ఏ పరిస్థితులలో సొంతకొడుకులను ఖైదుచేయించవలసిందో ఆమెకు వివరించాడు.  1691లో నవాబ్ బాయి చనిపోయింది. ఆమె  గౌరవార్థం రాజ్యంలో ఒక వారంపాటు సంతాపదినాలు ప్రకటించాడు ఔరంగజేబు 

.

5. ఉద్దమ్ బాయి/కుడ్సియాబేగం

.

ఉద్దమ్ బాయి హిందూ కుటుంబానికి చెందిన ఒక సామాన్య నర్తకి. రాజాస్థానంలో చేరింది.  ఈమె తన సౌందర్యం, వాక్చాతుర్యం వల్ల ముఘల్ చక్రవర్తి అయిన  మహమ్మద్ షా (r. 1719–1748) ప్రేమను చూరగొంది. మహమ్మద్ షాకు ఉద్దమ్ బాయి పట్ల మక్కువ పెరిగి రాణి హోదాను ఇచ్చాడు. వీరిద్దరికి పుట్టిన   అహ్మద్ షా బహదూర్ 1748 - 1754 మధ్య ముఘల్ చక్రవర్తిగా రాజ్యమేలాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన నాల్గవ వ్యక్తి. 

 

కొడుకు శక్తిహీనుడు, దక్షతలేనివాడు కావటంచే ఉద్దం బాయి అనధికారికంగా రాజ్యపగ్గాలు చేపట్టింది. పరిపాలకురాలిగా ఎదిగి, ప్రభుత్వ వ్యవస్థను చేతుల్లోకి తీసుకొంది. ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకొంది. డిల్లీలో గోల్డెన్ మాస్క్, కుడ్సియా బాగ్ లాంటి గొప్పనిర్మాణాలు చేపట్టింది. 


పురుషుల ప్రపంచంలో  ధైర్యం, తెలివితేటలు, సమర్ధత కలిగిన గొప్ప మహిళగా; ఒక నాట్యకారిణినుండి ఒక సామ్రాజ్ఞిగా ఎదిగిన ధీశాలిగా  ఉద్దమ్ బాయి చరిత్రలో నిలిచిపోయింది. 

.

6. అనూప్ బాయి 1699- ??

.

తొమ్మిదవ మొఘల్ చక్రవర్తి జహందర్ షా మూడవ భార్య అనూప్ బాయి. ఈమె రాజపుత్రుల యువరాణి. ఈమె Muazzamabadi అనే బిరుదును కలిగి ఉండేది. దాని అర్థం గౌరవనీయురాలైన అని. ఈమె కుమారుడు అలంగీర్ II.  ఇతను  1754 – 1759 మధ్య ముఘల్ చక్రవర్తిగా పరిపాలించాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన ఐదవ వ్యక్తి. ముఘల్ రికార్డులలో 1756-1761 మధ్య ప్రభావితం చూపిన తొమ్మిది మంది మొఘల్ స్త్రీలజాబితాలో Muazzamabadi పేరు ఏడవ సంఖ్యలో ఉంది  .


ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అబ్దాలి రాజు,  30 జనవరి, 1757 న  ఢిల్లీ వచ్చినపుడు, అలంగీర్  II చక్రవర్తి  తల్లి హోదాలో అనూప్ బాయి 121 బంగారు నాణాలు, బాదంతో చేసిన పాయసం (లవజత్) ను అతనికి పంపించింది . ఆ సమయం మొఘల్ సామ్రాజ్యం అంతర్గత కలహాలతో సంక్షోభంలో ఉంది. బహుసా అబ్దాలి వంటి రాజుల  సహకారం పొందటం కొరకు అనూప్ బాయి ఆ కానుకలను పంపిఉండవచ్చు.  ఇదొక దౌత్యపరమైన కూటనీతి. ఈ ఉదంతాన్ని బట్టి అనూప్ బాయి తెరవెనుక పోషించినపాత్ర కొంతమేరకు అర్ధమౌతుంది. ఇంతకు మించి ఈమె గురించిన చారిత్రిక వివరాలు పెద్దగా తెలియరావు. అనూప్ బాయి 1735 లోనే మరణించిందని మరొక కథనం కలదు.  

.


7. బిలాల్ కన్వర్ / జినత్ మహల్

.

బిలాల్ కన్వర్ అలంగీర్ II భార్య. ఈమె హిందూ  స్త్రీ. బిలాల్ కన్వర్  1728 లో షా ఆలమ్ II కు జన్మనిచ్చింది . ఇతను 1760 – 1806 మధ్య ముఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. షా ఆలమ్ II హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన ఆరవ వ్యక్తి. ఇంతకు మించి బిలాల్ కన్వర్ గురించిన సమాచారం  పెద్దగా లభించదు. 

.

8. లాల్ బాయి

బహదూర్ షా II చివరి మొఘల్ చక్రవర్తి. ఇతని తల్లి పేరు లాల్ బాయి.  ఈమె హిందూ స్త్రీ.  1775 లో  లాల్ బాయి బహదూర్ షా II జన్మనిచ్చింది.  ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన ఏడవ వ్యక్తి.


బహదూర్ షా  II బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన మొదటి స్వాతంత్ర్య పోరాటానికి  నాయకత్వం వహించాడు.  బ్రిటిష్ వారు  ఇతనిని రంగూన్ తరలించి మరణించేవరకూ గృహనిర్భంధంలో ఉంచారు. 

**

.

9. మరికొన్ని ప్రముఖ వివాహాలు

.

కమలాదేవి - అల్లావుద్దిన్ ఖిల్జి: కమలాదేవి గుజరాత్ లోని వఘేలా రాజ్ పుత్  కరణ్ దేవ్ II భార్య. ఈమె గొప్ప అందగత్తె. విదుషీమణి.  అల్లావుద్దిన్ ఖిల్జీ 1298 లో గుజరాత్ ను ఓడించినపుడు ఈమెను ఢిల్లీసంస్థానానికి తీసుకువెళ్ళి పెళ్ళిచేసుకొన్నాడు.  ఇది చరిత్రలో నమోదైన  హిందూ-ముస్లిమ్ ల మధ్య జరిగిన మొదటి వివాహం. అప్పటికి ఈమెకు దేవలాదేవి అనే ఆరు నెలల కుమార్తె కలదు.  ఆమె   తండ్రి సంరక్షణలో ఉండి పెరిగి పెద్దదయింది.  కమలాదేవి క్రమేపీ అల్లావుద్దిన్ ఖిల్జి  విశ్వాసాన్ని చూరగొని, అతని రాజకీయ నిర్ణయాలలో సలహాలు ఇచ్చేస్థాయికి చేరుకొంది.  కమలాదేవి చొరవతో ఆమె కూతురైన దేవలాదేవిని ఢిల్లీకి తెప్పించాడు అల్లావుద్దిన్ ఖిల్జి, దేవలాదేవిని అల్లావుద్దిన్ ఖిల్జి కొడుకు ఖిజ్ర ఖాన్ కు ఇచ్చి వివాహం జరిపించారు. 


జహంగీరు చక్రవర్తి మరొక భార్య మలిక జహన్ హిందూ స్త్రీ. ఈమె జసల్మార్ కు చెందిన రావల్ భీమ్ కూతురు. 


ఔరంగజేబ్ కొడుకైన బహదూర్ షా I, రాజా రూప్ సింగ్ కూతురును పెండ్లాడాడు. 


1351 లో ఢిల్లీ సింహాసనాన్ని  అధిష్టించిన ఫిరోజ్ షా తల్లి పేరు నైలా.  ఈమె భట్నేర్ హిందూ రాజ కుమార్తె . 


విజయనగర రాజు దేవరాయ I తన కూతురుని 1407  బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కు ఇచ్చి అంగరంగవైభవంగా పెళ్ళిచేసాడు.  

ఖేర్లా రాజైన నరసింహరాయ్ 1417 లో తన కుతురును ఫిరోజ్ షాకు ఇచ్చి వివాహం జరిపించాడు. అపురూపసౌందర్యరాశి అయిన ఈమె ఆ తదుపరికాలంలో బహుమని సుల్తాను పట్టపురాణి హోదాను పొందింది. 


వారణాసిలో ఇరవైముగ్గురు ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ప్రేమించి హిందూమతంలోకి మారిపోయిన ఉదంతాన్ని మధ్య ఆసియా యాత్రికుడు అమిర్ అలి బాల్కి తన రాతలలో పేర్కొన్నాడు. ఇది ఆనాటి సామాన్యప్రజలలో  ఉండిన మత స్వేచ్ఛను తెలియచేస్తుంది

**


అదే విధంగా మొఘల్ రాజస్త్రీలను హిందూ రాజులకు ముఖ్యంగా రాజపుత్రులకు ఇచ్చి పెండ్లిచేసిన ఉదంతాలుకూడా చరిత్రలో కనిపిస్తాయి. అక్బరుకుమార్తెకు- మేవాడ్ యువరాజు అమర్ సింగ్ కు; అక్బర్ మేనకోడలుకు రాజామాన్ సింగుకు;  రూహాని బాయికు మహారాజా ఛత్రసాల్ కు;  వజీర్ ఖాన్ కుమార్తె మహారాణా కుంభకు: ఒకముస్లిం సైన్యాద్యక్షుని కుమార్తెకు రాజపుత్ర రాణాసంగకు జరిగిన వివాహాలు ముస్లిం రాచస్త్రీలకు హిందూ యువరాజులకు మధ్య జరిగిన వివాహాలకు కొన్ని ఉదాహరణలుగా చెబుతారు. 

.

10. ముగింపు

.

నేడు భిన్న విశ్వాసాల మధ్య వివాహాలను లవ్ జిహాద్ అని, బలవంతపు మతమార్పిడులు అని మాట్లాడటం శోచనీయం. అలాంటి ఆరోపణలు  రాజకీయ ప్రేరేపితం.  ఈ రోజు ముఘల్స్ అంటే రక్తపిపాసులుగా, మతం పేరుతో ప్రజల్ని ఊచకోత కోసిన రాక్షసులుగా చిత్రిస్తున్నారు.  కల్పితాలతో కట్టుకథలతో ఒక అబద్దపు నెరేటివ్ ను సృష్టిస్తున్నారు. వారి పేరు ఎవరైనా ఎత్తితే తీవ్రమైన దుర్భాషలతో, అవమానకరంగా మాట్లాడుతున్నారు.  ఊరూ పేరు, ఫొటో  లేని సోషల్ మీడియా అనామకుల నుండి అత్యంత ఉన్నతమైన పదవులలో ఉన్నవారు వరకూ ఇదే ధోరణి.  ఈ ద్వేషం బౌద్ధికంగా చాలా బలంగా ప్రజల మనసుల్లో నాటబడుతోంది. ఇక ఇలాంటి ద్వేషం భౌతికంగా ప్రతిఫలించటానికి  ఎంతో దూరంలో లేము. 


సాటి మనుషుల పట్ల ఎందుకింత ద్వేషమో అర్థం కాదు. ఈ ద్వేషం పునాదులపై ఏం నిర్మించాలని కోరుకొంటున్నారో ఊహకు అందదు. భిన్న అభిప్రాయాలు పరిఢవిల్లడం ప్రజాస్వామ్యం. మెజారిటేరియన్ భావజాలం మాత్రమే ఉండాలనుకోవటం ఫాసిజం.  మానవజాతి పరిణామక్రమంలో మతం అనేది ఆదిమ అనాగరిక లక్షణమని, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం అనేవి నాగరిక లక్షణాలనీ ఎప్పటికి అర్ధం చేసుకొంటారూ?


ఎవరైతే ముస్లిమ్ పాలనవల్ల నష్టపోయారో వారే సమాజంలో ముస్లిముల పట్ల  ఇంతటి ద్వేషానికి కారకులు అనటం సహజమైన అభియోగం.  ఎవరు ముస్లిమ్ పాలనవల్ల నష్టపోయారు అని భిన్న సామాజిక వర్గాలను పరిశీలిస్తే---


రాజపుత్రులు, చోళులు, కాకతీయులు, పాండ్యులు, హొయసల రాజులు లాంటివారు సార్వభౌమత్వాన్ని కోల్పోయినా ముస్లిమ్ రాజులకు సామంతులుగా మారి అధికారాన్ని కోల్పోలేదు.  అదే విధంగా  స్థానిక జమిందార్లు/కౌలుదార్లకు వారి వారి హోదాలు పోలేదు చాలాచోట్ల.  వ్యాపారులకు ముస్లిముల ద్వారా మధ్య ఆసియా వ్యాపారావకాశాలు పెరిగాయి.  చేతివృత్తికారులకు ఆ వ్యాపారాల వల్ల పనులు పెరిగాయి. 


ముస్లిమ్ పాలనలో  వర్ణవ్యవస్థ కొంతమేర సడలటంతో దళిత బహుజనులు కొద్దిగా ఊపిరి పీల్చుకొన్నారు. అతిశూద్రులు కొంతమంది వివక్షనుంచి తప్పించుకోవటానికి ఇస్లాంలోకి మారారు. అధికజనాభా గ్రామాలలో నివసించేవారు. కేంద్రీయ ముస్లిం  పాలనతో సంబంధంలేకుండా ఈ  గ్రామీణ ప్రజలు స్వయంపోషణతో జీవించారు. 


భక్తి ఉద్యమప్రభావంతో ముస్లిమ్ హిందూ ఐక్యత గ్రామాలలో బలపడింది. హోలి, దివాలి, సూఫీ, దర్గా, పీర్ల పండుగ లాంటి పండుగలలో హిందూముస్లిములమధ్య ఒకరకమైన సాంస్కృతిక సమ్మేళనం ఉండేది. దీనివల్ల కింది స్థాయి ప్రజలు ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలతో ఉండేవారు.


ఇక సమాజంలో ఎవరు ముస్లిమ్ పాలన వల్ల నష్టపోయారు అంటే కొంతమేరకు  పండితవర్గం కనిపిస్తుంది.  వీరు జనాభాలో 5%.  ఒక పండితుడు సభకు రాగా, ఏ మహారాజైనా లేచి వెళ్ళి అతనిని  ఆహ్వానించి ఉచితాసనంపై కూచుండబెట్టి,  పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకోవటం హిందూ ధర్మంలో భాగం.   ముస్లిమ్ పాలనలో ఈ రకపు గౌరవాన్ని పండితులు కోల్పోయారు.

 

యజ్ఞయాగాదులు, Temple patronage తగ్గిపోయాయి. ఔరంగజేబు అయితే దర్బారులో కవులు, కళాకారులను నిషేదించాడు. అలా అంతవరకూ. ప్రభువు మెల్లకన్నుపై పద్యాలు చెప్పి మాన్యాలు పొందిన వైభోగం కోల్పోయారు పండితులు. 


యజ్ఞయాగాదులు లేక శూద్రులు, అతిశూద్రులనుండి అతికష్టంగా కాపాడుకొన్న సంస్కృతం, వేదాలు పనికిరాకుండాపోయాయి. 


ఈ వర్గం సమాజంలో శిష్టవర్గం. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగిన వర్గం.  వీరికి జరిగిన నష్టం మొత్తం  సమాజానికి జరిగిన నష్టంగాను, వీరి శత్రువులు యావత్ సమాజపు శత్రువులుగాను చేయబడ్డారు. దీన్నే గ్రామ్సీ "కల్చరల్ హెగిమొని" అని వ్యవహరించాడు – సమాజంలోని ప్రభావశీల వర్గం తన విలువలు, నమ్మకాలను మిగిలిన ప్రజలచే వారికి తెలియకుండానే ఆమోదింపచేయటం.


బొల్లోజు బాబా

[10:10, 31/03/2025] Vsp KS Chalam: విషయం ఏమిటంటే వీళ్ళంతా ఒకే వర్గానికి చెందిన వారు . ముస్లిం ల లోని అగ్ర కులాల పట్ల హిందుత్వ కు వ్యతిరేకత లేదు వీలైతే ఒవైసీ లాగా ఉపయోగించు కుంటారు . వాటి వ్యతిరేకత ముస్లిం ల లోని బహుజన కులాల పై. అంటే బ్రహ్మ లకు తమ విదేశీ వాసనలు ఎప్పటికి పనిచేస్తూ తమ వారిని వేరేగా యీ దేశ మొదటి వాదులను వేరేగా చూస్తున్నారు. యీ విషయాన్ని మార్క్సిస్ట్ చరిత్ర కారులు విస్మరించారు . తప్పులన్నీ వారు చేసి అంబేద్కర్ నో యింకొక రినో నిందిస్తే ఫలితం ఏం? మరి యిది బ్రాహ్మణ కుట్ర అంటే ?

PM Modi: ఆధునిక 'అక్షయ వటవృక్షం' ఆర్ఎస్ఎస్:

 

Narendra Modi: సంఘ్‌ ఓ వటవృక్షం

ABN , Publish Date - Mar 31 , 2025 | 04:38 AM

ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘భారతీయ సంస్కృతి వటవృక్షం’గా కొనియాడారు. కాంగ్రెస్ విధానాల వల్ల నక్సలిజం వ్యాప్తి చెందిందని ఆయన ఆరోపించారు

Narendra Modi: సంఘ్‌ ఓ వటవృక్షం

సేవకు ప్రతిరూపం: ప్రధాని నరేంద్ర మోదీ

నాగపూర్‌లో ఆరెస్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సందర్శన

హెడ్గేవార్‌, గోల్వాల్కర్లకు నివాళి

కాంగ్రెస్‌ విధానాలతోనే నక్సలిజం వ్యాప్తి!

ఛత్తీస్‌గఢ్‌లో ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో మోదీ

న్యూఢిల్లీ, మార్చి 30: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సేవకు మరో పేరని ప్రధాని మోదీ అన్నారు. అది భారతీయ ప్రాచీన సంస్కృతికి, ఆధునికీకరణకు వటవృక్షంలాంటిదని చెప్పారు. దాని విలువలు, ఆదర్శలు జాతీయ చైతన్యాన్ని పరిరక్షిస్తున్నాయని తెలిపారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ప్రథమ, ద్వితీయ సర్‌సంఘ్‌చాలక్‌లు కేబీ హెడ్గేవార్‌, ఎంఎస్‌ గోల్వాల్కర్‌ల స్మృతి మందిరాలకు వెళ్లి నివాళులు అర్పించారు. సంఘ్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన రెండో ప్రధాని మోదీ. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2000లో వెళ్లారు. ఇద్దరూ మూడోసారి ప్రధాని అయిన తర్వాతే ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం గమనార్హం. సంఘ్‌ ప్రాంగణంలో మాధవ్‌ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు అనుబంధంగా మాధవ్‌ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమర మాట్లాడుతూ.. గత వందేళ్లుగా ‘సంఘటన్‌’, ‘సమర్పణ్‌’తో ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న తపస్సు.. ‘వికసిత్‌-భారత్‌-2047’ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇప్పుడు ఫలాలందిస్తోందని తెలిపారు.

Adevertisement
Powered by:PS
Advertisement: 0:07

sdfkjhbd.jpg

‘వందేళ్ల తర్వాత సంఘ్‌ మరో మైలురాయి దిశగా కదులుతోంది. స్వాతంత్య్ర పోరాటంలో 1925-47 సంక్షోభ సమయం. ఇప్పుడు 2025-47 మధ్య కాలం కూడా చాలా కీలకమైనది. భారీ లక్ష్యాలు మన ముందున్నాయి. వచ్చే వెయ్యేళ్లు శక్తిమంతమైన, పురోగామి భారత నిర్మాణానికి మనం శంకుస్థాపన చేయాలి’ అని అన్నారు. స్మృతిమందిరం వద్ద ఉన్న సందేశ పుస్తకంలో మోదీ హిందీలో సందేశం రాశారు. హెడ్గేవార్‌, గోల్వాల్కర్‌ల ఆలోచనలు తనతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిని, బలాన్ని ఇచ్చాయన్నారు. ఆయన వెంట సంఘ్‌ చీఫ్‌ భాగవత్‌, కేంద్ర మంత్రిగడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ కూడా ఉన్నారు. నాగపూర్‌లో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బౌద్ధమతాన్ని స్వీకరించిన ‘దీక్షాభూమి’ని కూడా మోదీ సందర్శించారు. ‘దీక్షాభూమి’ సామాజిక న్యాయానికి, బడుగుల సాధికారతకు చిహ్నమన్నారు. దీక్షాభూమిలోని స్తూపం వద్దకు వెళ్లి ‘అంబేడ్కర్‌ అస్థి’ వద్ద మోదీ నివాళులు అర్పించారు.


కాంగ్రెస్‌ విధానాలతోనే నక్సలిజం వ్యాప్తి!

కాంగ్రెస్‌ దశాబ్దాల తరబడి అనుసరించిన విధానాలు నక్సలిజానికి ఊతమిచ్చాయని మోదీ అన్నారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లోనే నక్సలిజం ప్రబలంగా విస్తరించిందని తెలిపారు. ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని.. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిశకం ప్రారంభమైందని చెప్పారు. మోదీ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లా మోహభట్టాలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. అనంతరం రూ.33,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంభన్‌పూర్‌-రాయ్‌పూర్‌ మధ్య మెమూ రైలును ప్రారంభించారు. రూ.9,790 కోట్లతో ఎన్‌టీపీసీ నిర్మించే సీపత్‌ సూపర్‌ థర్మల్‌ విద్యుత్కేంద్రం మూడో దశ(800 మెగావాట్లు) కు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.15,800 కోట్లతో నిర్మించిన మొదటి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజీపూర్‌ జిల్లాలో ఆదివారం 50 మంది నక్సలైట్లు సీఆర్‌పీఎఫ్‌, రాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో 14మందిపై రూ.68 లక్షల మేర రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


PM Modi: ఆధునిక 'అక్షయ వటవృక్షం' ఆర్ఎస్ఎస్: ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:03 PM

దేశనిర్మాణం, సమాజ సేవ, సంస్కృతీ పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ వలంటీర్లు విశిష్ట సేవలందిస్తున్నారని మోదీ అన్నారు. నాగపూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.

PM Modi: ఆధునిక 'అక్షయ వటవృక్షం' ఆర్ఎస్ఎస్: ప్రధాని మోదీ

నాగపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (RSS)ను భారతీయ సజీవ సంస్కృతికి చిహ్నమైన ఆధునిక ''అక్షయ వటవృక్షం''గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశానికి ఆర్ఎస్ఎస్ వలంటీర్లు చేస్తున్న నిస్వర్థ సేవలను కొనియాడారు. దేశనిర్మాణం, సమాజ సేవ, సంస్కృతీ పరిరక్షణలో విశిష్ట సేవలందిస్తున్నారని అన్నారు. నాగపూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.

Kamakhya Express Derail: పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్

Adevertisement
Powered by:PS
Advertisement: 0:00

ఆర్ఎస్ఎస్ విశిష్టతను ప్రధాని వివరిస్తూ... ''వందేళ్ల క్రితం నాటిన సిద్ధాంతాల విత్తనాలు ఈ నాడు వటవక్షంలా ప్రపంచ ముందున్నాయి. సిద్ధాంతాలు పతాకస్థాయికి చేరుకోగా, లక్షలు, కోట్ల మంది స్వయం సేవకులు ఈ వటవృక్షానికి కొమ్మలు. ఇది మామూలు వటవృక్షం కాదు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన ఆధునిక వటవృక్షం'' అని అన్నారు.


గుడి పడ్వా (మరాఠీ నూతన సంవత్సర పండుగ) సందర్భంగా ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ''వరుస పండుగల సీజన్ ఇది. గుడి పడ్వా, ఉగాది, నవ్రేహ్ (కశ్మీరీ హిందూ నూతన సంవత్సరం) పండుగలను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఇదే ఏడాది ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరం కూడా వచ్చింది. స్మృతి మందిర్‌కు నివాళులర్పించే మహదవకాశం నాకు వచ్చింది. ఇటీవలే మనం 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకొన్నాం. వచ్చే నెలలో బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవం ఉంది. నవరాత్రి, ఇతర పండుగల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తు్న్నాను'' అని ప్రధాని అన్నారు.


పేదలకు ఉత్తమమైన వైద్యసేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ప్రధాని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యసేవలు అందుతున్నాయని, దేశప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలు అందించడం తమ ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటని తెలిపారు. వేలాది జన్ ఔషది కేంద్రాల ద్వారా దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకగా మందులు లభిస్తున్నాయని అన్నారు. ఇందువల్ల వేలకోట్లలో ప్రజల సొమ్ము ఆదా అవుతోందని చెప్పారు. గత పదేళ్లలో లక్షలాది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను గ్రామాల్లో నిర్మించామని, అక్కడ ప్రాథమిక చికిత్స లభిస్తోందని వివరించారు. మెడికల్ కాలేజీలను రెట్టింపు చేయడంతో పాటు దేశంలో ఆపరేషనల్ 'ఎయిమ్స్‌'ను మూడురెట్లు పెంచామని చెప్పారు. నిపుణులైన వైద్యలను ప్రజలకు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని అన్నారు.


మాధవ్ నేత్రాలయ భవంతికి శంకుస్థాపన

మాధవ్ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్టూ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కొత్తగా ఎక్స్‌టెన్షన్ బిల్డింగ్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తదితరులు పాల్గొన్నారు. నాగపూర్‌లోని సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్‌ను 2014లో దివంగత ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ అలియాస్ గురూజీ స్మృత్యర్థం నిర్మించారు. కొత్త ప్రాజెక్టుతో 250 పడకల ఆసుపత్రిగా, 14 ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్స్, 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు చవకగా అందుబాటులోకి రానున్నాయి.

UMEED Bill

 Telugu Speech (15 Minutes)

నా ప్రియమైన సోదరులు, సోదరీమణులు,


మీ అందరికీ నమస్కారం! మనం ఈ రోజు ఇక్కడ ఒక ముఖ్యమైన ఉద్దేశంతో సమావేశమయ్యాము—వక్ఫ్ (సవరణ) బిల్, 2024, అంటే ఇప్పుడు యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియన్సీ, అండ్ డెవలప్‌మెంట్ (UMEED) బిల్‌కు వ్యతిరేకంగా మన గొంతును బలంగా వినిపించడానికి. ఈ బిల్ మన వక్ఫ్ ఆస్తులకు మరియు ముస్లిం సమాజం యొక్క భవిష్యత్తుకు ఒక ప్రమాదకరమైన ముప్పు. ఈ రోజు మనం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, 1991, మరియు ఈ బిల్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంటాం, మరియు దీని ఫలితంగా మన ఆస్తులు మరియు హక్కులపై ఏ ప్రభావం పడవచ్చో చూస్తాం.


ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, 1991 అంటే ఏమిటి?


ఈ చట్టం 15 ఆగస్టు 1947 నాటి భారత స్వాతంత్ర్య దినం వరకు ఉన్న ఏదైనా పూజా స్థలం యొక్క మతపరమైన స్వభావాన్ని కాపాడటానికి రూపొందించబడింది. దీని ఉద్దేశం ఏదైనా మసీదు, ఆలయం లేదా దర్గా యొక్క మతపరమైన స్వభావం మారకుండా చూడటం, మరియు పాత దావాల ఆధారంగా కొత్త వివాదాలు ఉత్పన్నం కాకుండా నిరోధించడం. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు విషయం మాత్రమే దీనికి మినహాయింపు. ఈ చట్టం శాంతి మరియు సోదరభావాన్ని కాపాడటానికి ఉద్దేశించబడింది. కానీ UMEED బిల్ ఈ చట్టానికి ఒక సవాలుగా నిలుస్తోంది.


UMEED బిల్ యొక్క వివిధ అంశాలు


ఈ బిల్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు ప్రతిపాదించబడ్డాయి:


సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు స్టేట్ వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులను చేర్చడం.

ఒక ఆస్తి వక్ఫ్‌దా లేక ప్రభుత్వ ఆస్తా అని నిర్ణయించే అధికారాన్ని వక్ఫ్ బోర్డుల నుండి డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు బదిలీ చేయడం.

"వక్ఫ్ బై యూజర్" అనే భావనను తొలగించడం—అంటే శతాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ఆస్తులను దస్తావేజు లేకపోతే వక్ఫ్‌గా గుర్తించకపోవడం.

అన్ని వక్ఫ్ ఆస్తులను ఆరు నెలల్లో సెంట్రల్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించడం.

వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసే మార్గాన్ని తెరవడం.

ఈ రెండు చట్టాల మధ్య సంబంధం


ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం, 1947లో ఉన్న మసీదు లేదా దర్గా యొక్క మతపరమైన స్వభావం అలాగే ఉండాలి. కానీ UMEED బిల్ ద్వారా "వక్ఫ్ బై యూజర్" తొలగించడం వల్ల శతాబ్దాల నాటి మసీదులు లేదా స్మశానాల స్థితి ప్రమాదంలో పడవచ్చు. ఒకవేళ దస్తావేజు లభించకపోతే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దానిని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించవచ్చు. ఇది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ యొక్క ఉద్దేశానికి విరుద్ధం. ఇది మన పూజా స్థలాలకు నష్టం కలిగించే ఒక చట్టపరమైన పరిణామం.


వక్ఫ్ ఆస్తులపై ప్రభావం


భారతదేశంలో 8.7 లక్షల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి, ఇవి 9.4 లక్షల ఎకరాల కంటే ఎక్కువ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. వీటిలో చాలా వరకు పాత దస్తావేజులు లేవు—ఇవి శతాబ్దాలుగా మౌఖిక సమర్పణ లేదా ఉపయోగం ద్వారా స్థాపించబడ్డాయి. ఆరు నెలల్లో నమోదు జరగకపోతే, ఈ ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లవచ్చు. 58,000 కంటే ఎక్కువ ఆస్తులపై ఆక్రమణ జరిగింది, మరియు 13,000 కేసులు నడుస్తున్నాయి—హైకోర్టు అప్పీళ్ల వల్ల ఈ సమస్యలు మరింత ఆలస్యం కావచ్చు. మన మసీదులు మరియు దర్గాల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది.


ముస్లిం సమాజంపై ప్రభావం


మత స్వాతంత్ర్యం యొక్క అంతం: వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం మరియు ట్రిబ్యునల్ నుండి ముస్లిం నైపుణ్యాన్ని తొలగించడం మన మత హక్కులపై దాడి. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మరియు 26కి విరుద్ధం, ఇవి మనకు మత వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛను ఇస్తాయి.

ఆర్థిక నష్టం: వక్ఫ్ ఆస్తుల విలువ 1.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ—ఇవి విద్య, ఆరోగ్యం, మరియు పేద ముస్లింల సంక్షేమం కోసం ఉద్దేశించబడ్డాయి. వీటి నష్టం మన సమాజానికి పెద్ద దెబ్బ తగిలిస్తుంది.

సామాజిక ఉద్రిక్తత: ఈ బిల్ ఒక రాజకీయ కుయుక్తి, ఇది ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రేకెత్తించవచ్చు.

మన స్థానం


నా సోదరులు, సోదరీమణులు, ఈ బిల్ కేవలం ఆస్తి సమస్య కాదు—ఇది మన గుర్తింపు, మన స్వాతంత్ర్యం, మరియు మన వారసత్వం యొక్క సమస్య. వక్ఫ్ అనేది అల్లాహ్ పేరిట సమర్పించబడిన ఆస్తి—దాని దుర్వినియోగం లేదా నష్టం మతపరమైన పాపం. మనం దీనికి వ్యతిరేకంగా గొంతు విప్పుతాం—పార్లమెంట్ నుండి వీధుల వరకు, మరియు అవసరమైతే కోర్టుల వరకు వెళతాం.


చివరి మాట


ఈ రోజు మార్చి 28, 2025, మరియు ఈ బిల్ ఇంకా పార్లమెంట్‌లో వేలాడుతోంది. కానీ మనం నిశ్శబ్దంగా కూర్చోము. మనం ఏకమై దీనికి వ్యతిరేకంగా పోరాడతాం, మరియు మన ఆస్తులు మరియు హక్కులను కాపాడతాం. మీ అందరినీ విన్నవిస్తున్నాను—మీ గొంతును బలోపేతం చేయండి, మీ సహచరులను మేల్కొలపండి, మరియు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడండి. అల్లాహ్ మనలను కాపాడి మనకు విజయాన్ని ప్రసాదించుగాక—ఇన్షా అల్లాహ్!


ధన్యవాదాలు, మరియు అల్లాహ్ మీకు రక్షణ కల్పించుగాక!


Keshav Rao Hedgewar

 Dr. Keshav Rao Hedgewar: స్వాభిమాన భారత స్వాప్నికుడు

ABN , Publish Date - Mar 29 , 2025 | 06:03 AM


డాక్టర్ కేశవరావ్ బలిరాం పంత్ హెడ్గేవర్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు.


Dr. Keshav Rao Hedgewar: స్వాభిమాన భారత స్వాప్నికుడు


స్వాభిమాన భారతాన్ని సాధించాలనే సంకల్పంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పురుడు పోశారు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవర్. బ్రిటిష్‌ వారి విభజించు, పాలించు అనే దుష్ట నీతిని గ్రహించిన హెడ్గేవర్. దేశ ఐక్యతకు ప్రతినబూనారు. 1889 ఏప్రిల్ 1న (ఉగాది పండుగ రోజున) బలిరాం పంత్ హెడ్గేవర్, రేవతి బాయ్ దంపతులకు కేశవరావు జన్మించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో జన్మించినా, వారి పూర్వీకులది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామం. 


బాల్యం నుంచే భరతమాత వైభవం కోసం తపించిన హెడ్గేవర్.. స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్నారు. అడుగడుగునా భారతీయ జవసత్వాలు నింపుకున్న హెడ్గేవర్.. విక్టోరియా మహారాణి జయంతి సందర్భంగా పంచిన మిఠాయిలను విసిరేసి స్వాభిమానం చాటుకున్నారు. తోటి విద్యార్థులను కూడగట్టి విదేశీ జెండాలను పెకిలించి వేశారు. పాఠశాల సందర్శనకు వచ్చిన ఆంగ్లేయ అధికారులకు వందేమాతరం.. భారత్ మాతాకీ జై... నినాదాలతో స్వాగతం పలికారు. పేదరికంలో పుట్టినప్పటికీ, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ పట్టు సడలని.. మొక్కవోని దీక్షతో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. సుఖమయ జీవితాన్ని త్యాగం చేసి.. తల్లి భారతి ఔన్నత్యం కోసం తనను తాను సమర్పించుకున్నారు. 


కాంగ్రెస్ పార్టీ సభ్యుడుగా అనేక బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. 1921లో ఖిలాఫత్ ఆందోళనకు మహాత్మాగాంధీ మద్దతు ఇవ్వడం నచ్చక, సొంతబాట పట్టారు. దేశంలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తుంటే చెల్లాచెదురైన హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించారు. కులాలు, జాతులు, వర్ణాలు, వర్గాల పేరుతో ఎవరికి వారేగా ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంకల్పించారు. దేశానికి స్వాతంత్ర్యం రావడం ఖాయమని, అయితే దాన్ని స్వాభిమాన స్వాతంత్ర్యంగా నిలుపుకొని భారతీయ మూలాలను పరిరక్షించాలని నిర్ణయించారు. 1925 విజయదశమి రోజున కేవలం ఐదుగురు సభ్యులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పురుడు పోశారు డాక్టర్ హెడ్గేవర్‌. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్‌ను హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు విస్తరించాలని ప్రతినబూనారు. ‘‘అఖండ భారత్ హమారా హై’’ అంటూ నినదించారు.


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణలో పట్టుదల, క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన సుశిక్షితులైన స్వయంసేవకుల తయారీ కోసం సంఘ శాఖలను ప్రారంభించారు. నిస్వార్థంగా దేశం కోసం పనిచేసే సైనికులను తీర్చిదిద్దారు. విశ్వంలోని హిందువులందరినీ ఒక్కటి చేయాలనే ఏకైక లక్ష్యం ఏర్పాటు చేసుకుని, దార్శనికత ప్రదర్శించారు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటూ త్రికరణశుద్ధితో భరతమాత సేవలో తనువు సమర్పించుకున్న భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ హెడ్గేవర్. హిందువులంతా సంఘటితమైతేనే జాతీయత సాధ్యమని, అందుకు సంఘ శాఖలే ప్రధాన భూమిక పోషించాలని స్వయం సేవకులకు ఉద్బోధించారు. భారతీయులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా ఆత్మీయతను నూరిపోశారు. ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’.. అనే నినాదాలు మంత్రాలుగా మలిచి ప్రతి వ్యక్తిలో జాతీయభావాలు నూరిపోశారు. సంఘ్‌ శాఖల ద్వారా దేశభక్తుల తయారీని ప్రారంభించారు. సంఘ్‌ శాఖలో సామాజిక సమరసతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు డాక్టర్ హెడ్గేవర్‌. కుల జాడ్యానికి తావులేకుండా స్వయం సేవకులను తయారు చేశారు. ‘‘అందరం హిందువులం.. అందరం భారతీయులం’’ అనే ఆత్మీయ భావనను తీసుకువచ్చారు. ఒక సందర్భంలో సంఘ్‌ శిబిరాన్ని మహాత్మాగాంధీ సందర్శించి, అందులోని స్వయంసేవకులను మీరు ఏ కులానికి చెందినవారు అని ప్రశ్నించారు. దీంతో మేమంతా హిందువులం అని స్వయం సేవకులు సమాధానం చెప్పారు. మరొక సందర్భంలో డాక్టర్ అంబేడ్కర్ సంఘ శిబిరాన్ని సందర్శించారు. ఇక్కడ కులాల కుంపటి లేకుండా సామాజిక సమరసత వెల్లివిరియడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. 1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ విస్తరణ కోసం ప్రచారక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు హెడ్గేవర్‌. ‘‘ఆ జీవన పర్యంతం సమాజసేవకే అంకితం’’ అని ప్రతి వ్యక్తి మదిలో నింపి.. సజ్జన సమాజ నిర్మాణానికి తోడ్పడ్డారు. ఆ విధంగా తయారైన స్వయం సేవకులు దేశ నలుమూలలా విస్తరించి, హైందవ సమాజ జాగృతి కోసం కంకణం కట్టుకొని పనిచేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం రానే వచ్చింది. వచ్చిన స్వాతంత్ర్యాన్ని నిలుపుకునేలా, స్వాభిమాన భారతాన్ని తయారుచేసేలా సంఘాన్ని కూడా విస్తరించారు.



హిందూ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతలను ఒక్కొక్కటిగా పారదోలుతూనే హిందూ ఐక్యతకు ప్రాధాన్యమిచ్చారు స్వయం సేవకులు. దేశంలోని అన్ని రంగాలలో రాజకీయ, విద్యార్థి, కార్మిక, కర్షక, రైతు, మేధావి... ఇలా అన్ని క్షేత్రాలలో స్వయంసేవకుల ప్రాధాన్యం పెంచారు. ఫలితంగా స్వాతంత్ర్యానంతరం కాశ్మీర్ కోసం.. అయోధ్య రామ మందిరం కోసం అనేక ఉద్యమాలు చేసి ప్రాణత్యాగం చేసిన స్వయం సేవకులను, కర సేవకులను తయారు చేశారు. వారు సంఘ్ సిద్ధాంతాన్ని వ్యాపింప చేశారు. సమర్థ నాయకులు అటల్ బిహారీ వాజ్‌పాయి, నరేంద్ర మోదీ వంటి ప్రధానమంత్రులను సంఘ్‌ తయారు చేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా హెచ్‌ఎస్‌ఎస్ (హిందూ స్వయంసేవక్ సంఘ్) పేరుతో ప్రపంచంలోనే 60కి పైగా దేశాలలో విస్తృతంగా పనిచేస్తోంది. ఆర్ఎస్ఎస్‌కు అనుబంధంగా ధార్మిక కార్యక్రమాల కోసం విశ్వహిందూ పరిషత్‌ను స్థాపించి హిందూ ఐక్యత కోసం కృషి చేస్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే నాడు హెడ్గేవర్ నాటిన మొక్క నేడు మానుగా మారి, మహావృక్షమైంది. ఇంతటి గొప్ప సంస్థ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న శుభ సందర్భంలో డాక్టర్ హెడ్గేవర్ జయంతిని స్మరించుకోవడం అత్యంత ఆవశ్యకం. 


 పగుడాకుల బాలస్వామి విశ్వహిందూ పరిషత్, తెలంగాణ


Updated Date - Mar 29 , 2025 | 06:03 AM

Saturday, 29 March 2025

Prashant Kishore: వక్ఫ్ సవరణ బిల్లుతో విభేదించిన పీకే.

 

Prashant Kishore: వక్ఫ్ సవరణ బిల్లుతో విభేదించిన పీకే... ఆ పార్టీకే నష్టమని జోస్యం

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:28 PM

సమావేశంలోని ఒక పెద్ద సెక్షన్‌ను విడగొట్టేందుకు తీసుకువచ్చే ఏ చట్టానికైనా తమ పార్టీ వ్యతిరేకమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలని బీజేపీ కోరుకుంటోందని, కానీ దీని వల్ల జేడీ(యూ)కు అతిపెద్ద నష్టం జరుగనుందని జోస్యం చెప్పారు.

Prashant Kishore: వక్ఫ్ సవరణ బిల్లుతో విభేదించిన పీకే... ఆ పార్టీకే నష్టమని జోస్యం

పాట్నా: వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill)పై జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) తన అసమ్మతిని తెలిపారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రశాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశంలోని ఒక పెద్ద సెక్షన్‌ను విడగొట్టేందుకు తీసుకువచ్చే ఏ చట్టానికైనా తమ పార్టీ వ్యతిరేకమని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలని బీజేపీ కోరుకుంటోందని, కానీ దీని వల్ల జేడీ(యూ) అతిపెద్ద నష్టం జరుగనుందని జోస్యం చెప్పారు.

Sanjay Raut: కంగనా తరహాలోనే కునాల్‌‌కు ప్రత్యేక రక్షణ.. సంజయ్ రౌత్ డిమాండ్


''జేడీయూ ఎంపీలు 12 మంది వ్యతిరేకిస్తే బిల్లు సభామోదం పొందే అవకాశం లేదు. బిల్లును వ్యతిరేకించకుంటే మాత్రం నితీష్ కుమార్ జేడీయూకు అతిపెద్ద నష్టం తప్పదు. కాంగ్రెస్ పార్టీ బీహార్‌ను లాలూప్రసాద్ చేతుల్లో పెట్టి అమ్మేసినట్టే, ఇప్పుడు బీహార్‌ను నితీష్‌కు బీజేపీ అప్పగించింది'' అని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు.


నితీష్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై అడిగినప్పుడు, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో ఏ ఒక్కరికీ తెలియదన్నారు. చిన్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియకే అనేకసార్లు హెల్త్ చెకప్‌లు జరుగుతుంటాయని, 12 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రం పరీక్షించే వారే లేరని అన్నారు. నితీష్ తన మంత్రులు, కనీసం జిల్లాలను కూడా గుర్తుపట్టేలా లేరని చెప్పారు. ఇదే విషయాన్ని మార్చి 23న కూడా ఆయన ప్రస్తావించారు. నితీష్ శారీరకంగా, మానసికంగా అలసిపోయారని, కనీసం తన క్యాబినెట్‌లోని మంత్రులను కూడా గుర్తింతలేకుండా ఉన్నారని వ్యాఖ్యానించారు. రోజురోజుకూ ఆయన మానసిక ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఇకపై ఆయన పాలించడానికి తగరని, 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నితీష్ ఆరోగ్యం గురించి మొదట ఆందోళన చెందిన వ్యక్తి ఆయన సొంత మిత్రుడు సుశీల్ కుమార్ మోదీనని గుర్తుచేసారు. నితీష్ ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ బులిటెన్ విడుదల చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు.

Waqf Bill: వక్ఫ్‌ బోర్డు నిర్ణయాలపై సవాల్‌

 

Waqf Bill: వక్ఫ్‌ బోర్డు నిర్ణయాలపై సవాల్‌

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:38 AM

వక్ఫ్‌ బోర్డు నిర్ణయాలను కోర్టులో సవాల్‌ చేసేందుకు మార్పులు చేయాలని కేంద్ర హోమమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఏప్రిల్ 4న ముగిసే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో వక్ఫ్‌ బిల్లును ప్రవేశపెడతారని చెప్పారు

Waqf Bill: వక్ఫ్‌ బోర్డు నిర్ణయాలపై సవాల్‌

ఏ నిర్ణయంపై అయినా కోర్టుకు వెళ్లేలా బిల్లులో కీలక మార్పులు

బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లు: అమిత్‌ షా

న్యూఢిల్లీ, మార్చి 29: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 4తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వక్ఫ్‌ బిల్లుపై కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత సెషన్‌లోనే వక్ఫ్‌ (సవరణ) బిల్లును ప్రవేశపెడుతామని స్పష్టం చేశారు. టైమ్స్‌ నౌ సమ్మిట్‌-2025లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో చేసిన చట్టానికి భిన్నంగా.. వక్ఫ్‌ బోర్డు నిర్ణయాలను కూడా కోర్టుల్లో సవాల్‌ చేసే విధంగా చట్టాన్ని రూపొందిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013లో పార్లమెంట్‌లో సమగ్ర చర్చ చేపట్టకుండా వక్ఫ్‌ బిల్లును పాస్‌ చేయించుకుందని విమర్శించారు. బిల్లులోని చాలా నిబంధనలు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లేనప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ తన బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ విధంగా చేసిందని అన్నారు. ఏ చట్టమూ రాజ్యాంగం కంటే ఎక్కువేమీ కాదని అమిత్‌షా స్పష్టం చేశారు. వక్ఫ్‌ బోర్డు ప్రస్తుత స్థితిని ప్రశ్నిస్తూ.. ‘‘వక్ఫ్‌ బోర్డు గనుక ఒక నిర్ణయం తీసుకుంటే, దాన్ని దేశంలోని కోర్టుల్లో సవాల్‌ చేసేందుకు అవకాశం లేదు. భారత్‌ వంటి దేశంలో ఈ పద్ధతిని ఏ విధంగా అనుమతించగలం’’ అని షా అన్నారు.

Veda Pathasala - ఆచార్య పాణిగ్రహి చతుర్వేద సంస్కృత వేదపాఠశాల, హరిద్వార్‌

 ఆచార్య పాణిగ్రహి చతుర్వేద సంస్కృత వేదపాఠశాల, హరిద్వార్‌



ఉచితం  ఎవరైనా హిందూ సోదరుడు తన కొడుకును హరిద్వార్ గురుకుల్‌లో చదువు కోసం చేర్చాలనుకుంటే, మార్చి 15, 2025 నుండి జూలై 15, 2025 వరకు హరిద్వార్‌లోని ఆచార్య పాణిగ్రహి చతుర్వేద సంస్కృత వేదపాఠశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.  "ఆ పిల్లవాడు 6వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి."  గురుకులంలో వసతి, ఆహారం మరియు అన్ని ఇతర సౌకర్యాలు పూర్తిగా ఉచితం. అదనంగా, నెలకు ₹8,000 స్కాలర్‌షిప్ అందించబడుతుంది.

 పిల్లవాడు నాలుగు వేదాలు, వ్యాకరణం, సాహిత్యం, ఇంగ్లీష్ మరియు ఇతర ఆధునిక విషయాలలో విద్యను పొందుతాడు. గురుకుల్ వేదాలలో నిపుణుడిగా మారడానికి మరియు M.A వరకు ఉన్నత చదువులకు మార్గదర్శకత్వం అందించడానికి కూడా సహాయపడుతుంది.  

ఈ సందేశాన్ని మీ అన్ని హిందూ సమూహాలలో పోస్ట్ చేయండి. మీ మతం యొక్క గొప్ప విద్యా సంప్రదాయానికి మద్దతు ఇవ్వడానికి వీలైనంత ఎక్కువ మంది హిందువులకు ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించండి.  వెంటనే సంప్రదించండి! హీరాలాల్ జీ – 9654009263  (ఈ సందేశం హిందువుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు అందరు హిందువులకు చేరాలి.)  ✊ జై! హిందూ!!🚩

Thursday, 27 March 2025

Places of Worship Act and Waqf Amendment Bill

 Places of Worship Act and Waqf Amendment Bill

 

Places of Worship (Special Provisions) Act, 1991

Commonly known as the "Worship Act" in India. 

This Act is often discussed in the context of religious properties and disputes, making it relevant to the Unified Waqf Management, Empowerment, Efficiency, and Development (UMEED) Bill, which is the proposed renaming of the Waqf (Amendment) Bill, 2024. 

Let us clarify the relationship between the two and explain the potential effects on Waqf properties and the Muslim community. 

The Places of Worship Act, 1991

The Places of Worship Act was enacted to maintain the religious character of places of worship as it existed on August 15, 1947 (India’s Independence Day). It prohibits the conversion of any place of worship from one religion to another and bars courts from entertaining disputes that seek to alter the status of religious sites as they stood on that date, except for the Ram Janmabhoomi-Babri Masjid case, which was explicitly excluded due to ongoing litigation at the time. The Act aims to prevent communal conflicts over historical claims to religious sites. 

The UMEED Bill (Waqf Amendment Bill, 2024)

The UMEED Bill seeks to amend the Waqf Act, 1995, which governs Waqf properties—assets dedicated by Muslims for religious, pious, or charitable purposes under Islamic law. Key proposed changes include: 

  • Inclusion of Non-Muslims: Mandating non-Muslim members in the Central Waqf Council and State Waqf Boards. 
  • District Collector’s Role: Transferring the authority to determine whether a property is Waqf or government-owned from Waqf Boards to District Collectors. 
  • Removal of "Waqf by User": Eliminating the provision that recognizes properties as Waqf based on long-term use without formal deeds. 
  • Centralized Registration: Requiring Waqf properties to be registered via a central portal, with a six-month deadline for existing Waqfs to submit documentation. 
  • Appeals to High Courts: Allowing appeals against Waqf Tribunal decisions in High Courts, removing their finality. 
  • Stricter Creation Rules: Requiring a person to have practiced Islam for at least five years to create a Waqf and ensuring inheritance rights are not denied. 

Relationship Between the Two

The Places of Worship Act and the UMEED Bill intersect in their implications for religious properties, particularly Waqf properties like mosques, graveyards, and dargahs. The 1991 Act protects the status of such sites as they were in 1947, meaning any Waqf property recognized as a place of worship at that time should, in theory, retain its character. However, the UMEED Bill’s changes—especially the removal of "Waqf by user" and the empowerment of District Collectors—could create tension with this principle. For instance: 

  • Many Waqf properties, such as historical mosques or graveyards, lack formal documentation and have been recognized as Waqf due to centuries of use. The UMEED Bill’s omission of "Waqf by user" could challenge their status if documentation is unavailable, potentially opening them to disputes or government claims. 
  • The Places of Worship Act prohibits altering the religious character of these sites, but the UMEED Bill’s shift of authority to District Collectors (who may not be bound by the same religious considerations as Waqf Boards) might lead to decisions that indirectly undermine this protection. 

Effects on Waqf Properties

1.   Loss of Autonomy: By reducing the Waqf Boards’ power to determine property status and introducing non-Muslim members, the Bill weakens the community’s control over its religious and charitable assets. District Collectors, as government appointees, could prioritize state interests over Waqf claims, potentially leading to the loss of properties deemed "government land." 

2.   Documentation Challenges: India has approximately 8.7 lakh Waqf properties spanning over 9.4 lakh acres. Many lack formal deeds due to their historical nature (e.g., oral dedications from centuries past). The six-month deadline to register properties on a central portal could result in numerous Waqf assets losing their status if documentation is incomplete or contested. 

3.   Encroachment Risks: With "Waqf by user" removed and Tribunal powers curtailed, properties currently under litigation (over 13,000) or encroached upon (around 58,889) might face increased vulnerability. The shift to High Court appeals could prolong disputes, favoring parties with greater resources. 

4.   Historical Sites at Risk: Properties like mosques or dargahs recognized under the Places of Worship Act could face challenges if their Waqf status is questioned due to missing deeds, despite the 1991 Act’s protections. This creates a legal gray area where administrative decisions under the UMEED Bill might conflict with the Worship Act. 

Effects on the Muslim Community

1.   Erosion of Religious Autonomy: The inclusion of non-Muslims in Waqf governance and the removal of Muslim-specific expertise from Tribunals are seen by many as an intrusion into religious affairs, violating the community’s rights under Articles 25 and 26 of the Constitution (freedom to practice and manage religious affairs). Critics argue this contrasts with the management of Hindu temples or Sikh gurdwaras, where non-members of those faiths are not typically included. 

2.   Economic Impact: Waqf properties, valued at over Rs 1.2 lakh crore, support education, healthcare, and welfare for poor Muslims. Losing control or ownership could diminish these resources, disproportionately affecting marginalized sections of the community.  

3.   Communal Tensions: The Bill’s timing—amid a politically charged climate—and its perceived targeting of Muslim institutions could fuel distrust and polarization. Critics, including Muslim leaders and opposition parties, view it as part of a broader majoritarian agenda, potentially exacerbating social divides. 

4.   Legal and Administrative Burden: The shift to centralized registration and High Court appeals may overwhelm community members with legal costs and bureaucratic hurdles, especially for smaller Waqfs managed by mutawallis (custodians) with limited resources. 

Broader Context and Concerns

The Places of Worship Act was designed to preserve communal harmony by freezing the status of religious sites, but the UMEED Bill’s reforms could destabilize this balance for Waqf properties. While the government claims the Bill enhances efficiency and transparency (e.g., addressing corruption in Waqf Boards), opponents argue it facilitates state control over Muslim endowments, potentially aligning with historical precedents in countries like Turkey or Egypt, where Waqf properties were nationalized. 

For the Muslim community, the Bill raises existential questions about identity and agency. If Waqf properties—seen as sacred dedications to Allah—are stripped away or mismanaged, it could undermine a key pillar of Islamic charity and community welfare in India. The tension between the Worship Act’s intent and the UMEED Bill’s mechanisms underscores a critical debate: balancing administrative reform with religious freedom in a secular, pluralistic nation. 

In summary, while the UMEED Bill aims to modernize Waqf management, its interplay with the Places of Worship Act could jeopardize the security of Waqf properties, reducing the Muslim community’s control over its religious and charitable legacy. The outcome hinges on how these laws are interpreted and implemented, a process likely to spark legal battles and public contention.

Wednesday, 26 March 2025

Unified Waqf Management, Empowerment, Efficiency, and Development (UMEED) Bill

 *The Waqf (Amendment) Bill – 2024*

As of March 25, 2025, the Waqf (Amendment) Bill, 2024, has not yet been passed by both Houses of the Indian Parliament. Here’s a detailed explanation of its current status based on available information:

*The Waqf (Amendment) Bill, 2024, was introduced in the Lok Sabha on August 8, 2024, by Union Minority Affairs Minister Kiren Rijiju.* The bill aims to amend the Waqf Act, 1995, to address issues related to the management, regulation, and efficiency of Waqf properties in India. Due to significant opposition and debate, it was referred to a Joint Parliamentary Committee (JPC) on August 9, 2024, for further scrutiny. The JPC, chaired by BJP MP Jagdambika Pal, consists of 31 members (21 from Lok Sabha and 10 from Rajya Sabha).

The JPC conducted an extensive review, holding 38 meetings over approximately 112 hours and consulting with 286 organizations and stakeholders. On January 29, 2025, the JPC adopted its draft report and the revised bill by a majority vote, incorporating 14 amendments proposed by NDA members while rejecting 44 amendments suggested by the opposition. The report was presented to Lok Sabha Speaker Om Birla on January 30, 2025, and formally tabled in the Lok Sabha on February 3, 2025. 8The Union Cabinet approved the revised bill, now officially named the Unified Waqf Management, Empowerment, Efficiency, and Development (UMEED) Bill, on February 26, 2025.*

Despite these developments, the bill has not yet been passed by either the Lok Sabha or the Rajya Sabha. The Budget Session of Parliament, which began on January 31, 2025, and is scheduled to continue until April 4, 2025, provides a window for the government to table the bill. However, as of the latest updates, it remains pending in Parliament. Posts on X and some news reports suggest that the government intends to move the bill in the second half of the Budget Session, potentially in late March or early April 2025, after ensuring the necessary support in both Houses. *The ruling BJP has reportedly secured the numbers needed to pass the bill, with allies like JDU and TDP expected to back it, though this has not been officially confirmed.*

The bill still needs to go through the legislative process: it must be passed by the Lok Sabha, then sent to the Rajya Sabha for approval, and finally receive presidential assent to become law. *Opposition parties, including Congress, Trinamool Congress, and AIMIM, have strongly criticized the bill, labeling it unconstitutional and anti-minority, and have submitted dissent notes.* Some opposition members and Muslim organizations have also threatened legal challenges in the Supreme Court if the bill is enacted.

In summary, as of March 25, 2025, the Waqf (Amendment) Bill, 2024, has been approved by the Union Cabinet and is poised to be tabled in Parliament, but it has not yet been passed by either the Lok Sabha or the Rajya Sabha. Its fate depends on the proceedings in the ongoing Budget Session and the government’s ability to navigate opposition in both Houses.

-        *AM Khan Yazdani (Danny)*

*Convener, Muslim Thinkers Forum (MTF)*

 

వక్ఫ్ (సవరణ) బిల్లు – 2024

మార్చి 25, 2025 నాటికి వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 భారత పార్లమెంట్లో ఇంకా ఆమోదించబడలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దీని ప్రస్తుత స్థితి వివరాలు:

బిల్లు 2024 ఆగస్టు 8 లోక్సభలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ద్వారా ప్రవేశపెట్టబడింది. 1995లో అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా, భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నియంత్రణ, సామర్థ్యాన్ని మెరుగుపర్చడం దీని లక్ష్యం. అయితే బిల్లుపై పెద్ద ఎత్తున ప్రతిపక్షం నుంచి విమర్శలు రావడంతో, దీన్ని మరింత పరిశీలన కోసం ఆగస్టు 9, 2024 సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి అప్పగించారు. కమిటీకి బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ అధ్యక్షత వహిస్తున్నారు. కమిటీలో 31 మంది సభ్యులున్నారు (లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10).

JPC బిల్లును సుదీర్ఘంగా పరిశీలించడానికి 38 సమావేశాలను నిర్వహించి, మొత్తం 112 గంటల పాటు చర్చలు జరిపింది. మొత్తం 286 సంస్థలు, ప్రాముఖ్యత గల వ్యక్తులతో సంప్రదింపులు చేశారు. జనవరి 29, 2025 JPC బిల్లుపై తుది నివేదికను, సవరణలతో కూడిన బిల్లును ఆమోదించింది. NDA సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలను సమర్థించి, ప్రతిపక్షం సూచించిన 44 సవరణలను తిరస్కరించారు. జనవరి 30, 2025 నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. ఫిబ్రవరి 3, 2025 దీన్ని లోక్సభలో అధికారికంగా సమర్పించారు.
ఫిబ్రవరి 26, 2025 కేంద్ర కేబినెట్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దీని పేరు "యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ, అండ్ డెవలప్మెంట్ (UMEED) బిల్లు" గా మార్చబడింది.

ఇప్పటికీ బిల్లు లోక్సభ లేదా రాజ్యసభలో ఆమోదం పొందలేదు. బడ్జెట్ సమావేశాలు 2025 జనవరి 31 ప్రారంభమై ఏప్రిల్ 4, 2025 వరకు కొనసాగనున్నాయి. సమయంలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. సోషల్ మీడియాలో వచ్చిన నివేదికలు, వార్తల ప్రకారం, బిల్లు మార్చి చివర లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీజేపీ అధికారం కలిగిన NDA ప్రభుత్వం దీనికి అవసరమైన మద్దతును పొందినట్లు వార్తలొచ్చాయి. ముఖ్యంగా జేడీయూ, టిడిపి వంటి పక్షాలు దీనికి మద్దతివ్వవచ్చని ఊహాగానాలున్నాయి. అయితే అధికారికంగా దీనిపై ధృవీకరణ లేదు.

బిల్లు చట్టంగా మారడానికి కొన్ని కీలక దశలు మిగిలున్నాయి:

  1. ముందుగా లోక్సభలో ఆమోదం పొందాలి
  2. తరువాత రాజ్యసభలో ఆమోదం పొందాలి
  3. ఆపై రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే ఇది చట్టంగా మారుతుంది.

ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, AIMIM బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమైనదని, మైనారిటీలకు వ్యతిరేకమని ఆరోపిస్తూ తమ అభ్యంతరాలను సమర్పించాయి. కొన్ని ముస్లిం సంస్థలు, ప్రతిపక్ష నేతలు, బిల్లు చట్టంగా మారితే, సుప్రీంకోర్టులో చట్టపరమైన పోరాటం చేపడతామని హెచ్చరించారు.

సంక్షిప్తంగా: మార్చి 25, 2025 నాటికి వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇప్పటికీ లోక్సభ లేదా రాజ్యసభలో ఆమోదం పొందలేదు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలపై, అలాగే ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నదానిపై బిల్లుకు భవిష్యత్తు ఆధారపడి ఉంది.

- .ఎం. ఖాన్ యజ్దాని (డ్యానీ)
కన్వీనర్, ముస్లిం థింకర్స్ ఫోరం (MTF)