Thursday, 6 June 2024

MHPS Farooq Shubli on Muslim support to TDP

 రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీల మద్దతు టిడిపికి ఏకపక్షం: ఫరూక్ షిబ్లీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు


- మాజీ సీయం జగన్ కంచు కోటలు సైతం బద్దలు 

- ఎన్.డి.ఏ. కూటమితో జతకట్టారని జగన్ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన ముస్లిం సమాజం 

- ఏ కూటమితో ఉన్నా చంద్రబాబు లౌకికవాదాన్ని నమ్మిన రాష్ట్ర ముస్లిం మైనారిటీలు 


విజయవాడ : ప్రజా వ్యతిరేక సునామీలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోయిందని, అందులో ముఖ్యంగా ముస్లింలంతా నా వెంట ఉన్నారని డబ్బా కొట్టుకునే జగన్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు మరి ముఖ్యంగా రాయలసీమ ముస్లింలు నేడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఉన్నా ఏకపక్షంగా చంద్రబాబుపై నమ్మకంతో టీడీపీకే పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ యన్.డి.ఏ. కూటమితో ఉందని, చంద్రబాబు ముస్లింల వ్యతిరేకి అని దుష్ప్రచారం చేసినా, రాష్ట్ర ముస్లిం పజానీకం చంద్రబాబు ఏ కూటమితో జతకట్టినా ఆ కూటమి లౌకిక కూటమిగా మారుతుందని, 2014లో కూడా బీజేపీతో ఉన్నప్పుడు ముస్లింలకు ఎటువంటి నష్టం జరగలేదని, భవిష్యత్తులో కూడా జరుగదనే నమ్మకంతో,  టీడీపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వ అరాచకాలపై  వైఫల్యాలపై ధ్వజమెత్తా మాజీ సీయం ఎప్పుడు నా ముస్లింలు, నా ముస్లింలు అని చెప్పే 2019లో ముస్లిం మైనారిటీ ఓట్లను గంపగుత్తుగా వేయించుకొని గద్దెనెక్కిన తరువాత ముస్లింల సంక్షేమాన్ని విస్మరించి, రాష్ట్రంలో ముస్లిం సమాజంపై వైకాపా నాయకుల వేధింపులు, అత్యాచారాలు, ప్రశ్నిస్తే హత్యలు చేయడం, వాటిపై ఏనాడూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ నోరెత్తిన పాపాన పోలేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుండి ముస్లింల మాన, ప్రాణాలకు  భరోసా లేకుండా పోయింది. నంద్యాల అబ్దుల్ సలాం ఆత్మహత్య, హాజీరా అత్యాచారం, హత్య ఘటన, పలమనేరు మిస్బా ఉదంతం, డాక్టర్ సుధాకర్ ఉదంతం, అదేవిధంగా అనంత బాబు ఘటన, చాగల మర్రి అక్బర్ ఘటనలు ఇలాంటి  వేధింపులు ముస్లింలపై జరిగితే ఖండించకపోగా, ఏనాడూ నోరుకూడా మెదపలేదు. మరీ ముఖ్యంగా ఈ వేధింపులపై ప్రశ్నిస్తున్న నాపై హత్యాయత్నం కేసు నమోదుచేసి ప్రశ్నించే గొంతుకను అణగద్రోక్కాలని ఎన్ని ఆక్రమకేసులు పెట్టారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. జగన్ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు లెక్కచేయకుండా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడూ ఎండగడుతూ ముస్లిం సమాజాన్ని ఉత్తేజపరుస్తోంది. ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం, మైనారిటీ కార్పొరేషన్ ను నిర్వీర్యం, ముస్లిం విదేశీ విద్య, వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయపోరాటం కేవలం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితికే సాధ్యమైందని పేర్కొన్నారు. ముస్లింల ఓట్లతో గద్దెనెక్కి ముస్లింలను తీవ్ర మోసం చేసిన జగన్ ప్రభుత్వానికి మైనారిటీల సత్తాను చాటాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ముస్లిం సంఘాలను ఏకతాటిపై తేవడం, ముస్లిం సంఘాలన్ని తెలుగుదేశం పార్టీకి మద్ధతు ఇవ్వడంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సఫలీకృతం అయ్యిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయకత్వం పట్ల ముస్లిం సమాజం ఏమేరకు నమ్మకం ఉంచిందో శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చిన ముగ్గురికి సీనియర్ నాయకులు యన్.యం.డీ ఫారూఖ్, షాజహాన్, మహమ్మద్ నసీర్ లు గెలిపిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రకటించిన ఏడు గురు ముస్లిం అభ్యర్థులను తిరస్కరిస్తూ వెలువడిన ఫలితాలే నిదర్శనం. తెలుగుదేశం పార్టీకి మద్ధతు తెలిపిన జమియత్ ఉలమా ఏ హింద్, తంజీమే ముఫ్తీయాన్, అల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, ఉలేమా కౌన్సిల్, సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అన్నీ ముస్లిం సంఘాలకు ఫారూఖ్ షుబ్లీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి జామాల్, మోయిన్, అక్రం, ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు ముఫ్తీ మొహమ్మద్ ఫారూఖ్ MHPS విజయవాడ కమిటీ సభ్యులు బాబు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment