Sunday, 4 December 2022

ముస్లిం మహిళలకు ఎన్నికల టికెట్లు.. షాహీ ఇమామ్ సంచలన వ్యాఖ్యలు

 Muslim women: ముస్లిం మహిళలకు ఎన్నికల టికెట్లు.. షాహీ ఇమామ్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-12-04T20:16:36+05:30 IST


గుజరాత్ ఎన్నికల వేళ అహ్మదాబాద్‌లోని జామా మసీద్ షాహీ ఇమామ్ షబ్బీర్ అహ్మద్ సిద్దిఖీ (Shabbir Ahmed Siddiqui) అభ్యంతరకర


 Muslim women: ముస్లిం మహిళలకు ఎన్నికల టికెట్లు.. షాహీ ఇమామ్ సంచలన వ్యాఖ్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్

సం|| 93979 79750

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల వేళ అహ్మదాబాద్‌లోని జామా మసీద్ షాహీ ఇమామ్ షబ్బీర్ అహ్మద్ సిద్దిఖీ (Shabbir Ahmed Siddiqui) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం ఇస్లాంకు వ్యతిరేకమని, మతాన్ని బలహీన పరచడం తప్ప మరోటి కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ముస్లిం మహిళలకు టికెట్లు ఇచ్చేవారు ఇస్లాం వ్యతిరేకులన్న ఆయన మతాన్ని బలహీన పరుస్తున్నారని అన్నారు. టికెట్లు ఇచ్చేందుకు పురుషులే లేరా? అని ప్రశ్నించారు.


హిందువులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసోం పార్లమెంటు సభ్యుడు, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ (Badruddin Ajmal) క్షమాపణలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు. సీనియర్ నేతగా తాను ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా చెప్పారు. హిందూ అనే పదం తాను వాడలేదని, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం తనకు లేదని అన్నారు. అయితే, తన వ్యాఖ్యలు వివాదం కావడంతో తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని చెప్పారు. ఇందుకు సిగ్గుపడుతున్నట్టు తెలిపారు.


అయితే, అజ్మల్ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో ఆయన వ్యాఖ్యలను ముడిపెట్టారు. గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నస్తున్న బీజేపీని రక్షించేందుకే ఆయనీ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలిపి ఆయనీ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అజ్మల్ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది

No comments:

Post a Comment