|
లింగ వివక్షా అధికమే: మాస్టర్‌కార్డ్ సర్వే
న్యూఢిల్లీ: భారత్‌లో మతపరమైన, లింగపరమైన పక్షపాతం కారణంగా ఉద్యోగాలు, రుణాలు పొందటం కష్టంగా మారిందని ‘క్వాంటిటేటివ్ రీసెర్స్ ఆన్ ఎకనామిక్ ఇన్‌క్లూజన్’ పేరుతో నిర్వహించిన మాస్టర్‌కార్డ్ సర్వే వెల్లడించింది. లింగపరమైన వివక్ష కారణంగా భారత్‌లో ఉద్యోగం, రుణం పొందడం కష్టమైందని సర్వేలో పాల్గొన్నవారిలో 58 శాతం మంది పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఈ వివక్ష 33 శాతమని సర్వే తెలిపింది. ఇక మతవివక్ష కారణంగా ఇబ్బందులు ఎదురైనట్లు 58 శాతం మంది పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఈ వివక్ష 28 శాతమని తేలింది. ఒక పక్క ఆర్థిక సమ్మిళితంలో అందరినీ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం యత్నిస్తున్న వేళ ఈ సర్వే ఫలితాలు దేశం లో నెలకొన్ని వాస్తవ పరిస్థితులను ఎత్తిచూపుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక సేవలు అందరికీ ఎంత స్థాయిలో అందుబాటులో ఉన్నాయన్న అంశం... వ్యవస్థలో విశ్వాస కల్పనకు, వృద్ధికి గీటురాయి అని మాస్టర్‌కార్డ్ సర్వే అభిప్రాయపడింది. సర్వే నిర్వహించిన ఇతర దేశాలతో పోలిస్తే పౌరజీవనం, ఇన్‌ఫ్రా అంశాల్లో ఉపఖండంలోని పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని నివేదిక తెలిపింది. కానీ బేసిక్ ఆర్థిక సేవలు పొందటంలో మహిళలు, మైనార్టీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాల్సి ఉందని తెలిపింది. తమ దగ్గర ఉన్న సంపద భవిష్యత్ అవసరాలకు సరిపోదేమో అని దేశీయంగా సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది భయపడుతున్నా రు. ఇతర దేశాల్లో ఈ అంశంపై భయపడే వారి వాటా 82 శాతం ఉంది. ఉద్యోగాన్ని వెతుక్కోవడం, నిలుపుకోవడం ముఖ్యమని దేశీయంగా 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఉన్న త విద్య, ఉపాధి శిక్షణ తమకు ఉపయోగపడతాయని 50 శాతం మం ది పేర్కొన్నారు.
అయితే చాలామంది వ్యయాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత చదువుల కోసం ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వలేమన్నారు. ఉద్యోగాలు, రుణాలు పొందడానికి లింగవివక్ష కారణమవుతోందని 34 శాతం మంది మహిళలు పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళలకు పెళ్లి అనేది కుటుంబపరంగా, సమాజ పరంగా కాదనలేని కర్తవ్యమని మాస్టర్ కార్డ్ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలు ఆర్థిక సమ్మిళితం దిశగా పయనించడం.. ఈ పయనంలో వారికి తోడ్పడే అంశాలపై అధ్యయనానికి చేపట్టిన కనెక్టర్స్ ప్రాజెక్టులో భాగంగా ఈ సర్వే నిర్వహించారు. ఆర్థిక సేవలు పొందే అంశంలో అపోహలు తొలగించడం భారత వృద్ధికి కీలకమని మాస్టర్ కార్డ్ ఇండియా ప్రతినిధి అరి సర్కార్ చెప్పారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు, మహిళలకు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో మరింత భాగస్వామ్యం కల్పించడం అవసరమన్నారు. ఇందుకోసం కుటుంబాలకు, సమాజాలకు నేరుగా ఉపయోగపడే ప్రోత్సాహకాలను కల్పించాల్సి ఉందని అన్నారు.
Religious, gender bias greater in India for jobs: Study
NEW DELHI: As the government pushes its various financial inclusion initiatives, a new survey today claimed religious and gender bias makes it more difficult in India to get jobs or credit.
As per the survey results released by global financial services giant Mastercard, as many as 58 per cent of respondents in India said "it is difficult for them to get access to credit, savings, and jobs because of their gender, compared with 33 per cent across the surveyed countries".
"Again, 58 per cent also said it was difficult to get jobs or credit because of their ethnicity or religion, compared with 28 per cent across surveyed countries," it added.
The government last year had launched an ambitious Jan Dhan scheme to provide bank accounts to every household in the country.
Taking forward the government's financial inclusion initiatives, Prime Minister Narendra Modi yesterday launched three social security schemes including a life insurance cover for less than Re one per day, as also a health and accident cover at a premium of Re one per month.
Modi also said that the Jan Dhan scheme, launched on August 15 last year, has already seen opening of more than 15 crore accounts with Rs 15,800 crore deposited in them.
As per the Mastercard survey, "closing the perception gap of how accessible financial services are is key to building confidence and more inclusive forms of growth in India".
Mastercard said its "quantitative research on economic inclusion in India" showed that quality of life on the subcontinent is better than other surveyed countries by certain measures like Civic Life and Infrastructure.
However, there are issues like "access to basic financial services, especially on the part of women and ethnic and religious minorities" that need to be addressed.
The survey also showed that 67 per cent of respondents worry about money they owe to others and 82 per cent worry about their future prospects.
When asked about the issues that were important to them, 40 per cent said it was finding or keeping a job, while 20 per cent said it was "religious discrimination or persecution".
The survey is part of Mastercard's Connectors Project, where it has studied the role of networks in the developing world and how people move to greater economic inclusion, and crucially, who helps them on that journey.
|
No comments:
Post a Comment