Thursday, 18 August 2022

మైనారిటీలను ఓటు వేయ్యనివ్వం: ‘హిందూ రాష్ట్ర శాసన ముసాయిదా’

 మైనారిటీలను ఓటు వేయ్యనివ్వం: ‘హిందూ రాష్ట్ర శాసన ముసాయిదా’

టైమ్స్ ఆఫ్‌ ఇండియా
ఆగస్టు 13 2002
కొత్త ఢల్లీ: 30 మంది ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు మరియు పండితుల బృందం హిందూ దేశంపు రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదాను సిద్ధం చేసింది, దీనిని ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ధరమ్‌ సన్సద్‌ (మతతత్వ శాసననభ) లో మొదట ప్రతిపాదించారు.
32 పేజీల ముసాయిదాను నగరంలోని శాండీ ఒడ్డున (గంగా నది ఒడ్డున) మాఘ మేళా-2023లో నిర్వహించే ధరమ్‌ సంసద్‌ ప్రదర్శించబడుతుంది.
మొదటి ముసాయిదాలో విద్య, రక్షణ, శాంతిభద్రతలు, ఓటింగ్‌ విధానం, దేశాధినేత హక్కులు మొదలైన వాటికి సంబంధించిన వివరాలను వివరంగా ప్రస్తావించారు.
రాజ్యాంగం ప్రకారం, కొత్త ఢిల్లీ స్థానంలో వారణాసి దేశ రాజధానిగా ఉంటుంది. అంతే కాకుండా కాశీ (వారణాసి)లో ‘మతతత్వ శాసనసభను' నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ముస్లింలు మరియు క్రైస్తవులు ఓటు హక్కు తొలగించి ఒక సాధారణ పౌరుని యొక్క అన్ని హక్కులను అనుభవిస్తారని కూడా ఇది ప్రతిపాదిస్తుంది. అంతే కాకుండా, ప్రతి పౌరుడికి తప్పనిసరి సైనిక శిక్షణ ఇవ్వబడుతుంది మరియు వ్యవసాయం పూర్తిగా పన్ను రహితంగా చేయబడుతుంది.
ఫిబ్రవరి 2022లో, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ధరమ్‌ సన్సద్‌లో భారతదేశాన్ని ‘హిందూ రాష్ట్రం’గా మార్చాలని తీర్మానం ఆమోదించబడింది మరియు రాజ్యాంగం రూపోందంచాలనే ఆలోచన చేశారు. దానికనుగుణంగా రాజ్యాంగ ముసాయిదా సిద్ధమైంది. ముసాయిదా తయారీలో వివిధ రంగాలకు చెందిన 30 మంది ప్రముఖులు సహకరించారు.
ముసాయిదా కమిటీకి ముఖ్యుడు స్వామి ఆనంద్‌ స్వరూప్‌, శాంభవి పీఠాధీశ్వర్‌ మరియు శంకరాచార్య పరిషత్‌ అధ్యక్షుడు. ఇందులో కామేశ్వర్‌ ఉపాధ్యాయ్‌, చైర్మన్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది బిఎన్‌ రెడ్డి, డిఫెన్స్‌ నిపుణుడు ఆనంద్‌ వర్ధన్‌, సనాతన ధర్మ పండితుడు చంద్రమణి మిశ్రా, డాక్టర్‌ విద్యా సాగర్‌ మొదలైనవారు కూడా ఉన్నారు.
రాజ్యాంగం కవర్‌ పేజీలో ప్రతిపాదిత ‘అఖండ భారత్‌’ మ్యాప్‌ ఉంటుంది. భారత్‌ నుంచి విడిపోయిన దేశాలను భవిష్యత్తులో విలీనం చేస్తామనే సందేశం మ్యాప్‌ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. కవర్‌ పేజీలో కొన్ని దేవాలయాలపై కాషాయ పతాకం రెపరెపలాడుతోంది. దుర్గా మాత, రాముడు, కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, గురు గోవింద్‌ సింగ్‌, ఆదిశంకరాచార్య, చాణక్య, వీర్‌ సావర్కర్‌, గొప్ప వ్యక్తుల చిత్రాలతో పాటు, శాంభవి మాత, రాణీ లక్ష్మీబాయి, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, స్వామి వివేకానంద తదితరుల చిత్రాలు ఉంటాయి.
ముస్లింలు, క్రైస్తవులకు ఓటు వేసే హక్కును తొలగించి , సాధారణ పౌరుడికి ఉండే అన్ని హక్కులను అనుభవిం చేలా తమ వ్యాపారాలు చేసికుంటూ, విద్య, ఉద్యోగం, మరియు సాధారణ పౌరులు అనుభవించే అన్ని సౌకర్యాలను పొందవచ్చు.
త్రేతా మరియు ద్వాపర యుగం నాటి న్యాయ వ్యవస్థ, శిక్షలు ‘‘గురుకుల వ్యవస్థ పునరుద్ధరణ, ఆయుర్వేదం, గణితం, నక్షత్రం, భూ-గర్భ, జ్యోతిష్య శాస్త్రం, మొదలైనవి విద్యలు అమలులోకి వాస్తాయని చెప్పడం జరిగింది.
టైమ్స్ ఆఫ్‌ ఇండియా సౌజన్యంతో
అనువాదం
కారసాల విజయ్ కుమార్

No comments:

Post a Comment