Yousuf Shaik is with Lakshmi Narasaiah Gunturu and
19 others
.
42m ·
● ముస్లింలు దళితుల కన్నా వెనుకబడి ఉన్నారు -జస్టిస్ సచార్ కమిటీ రిపోర్టు
● మెజారిటీ ముస్లింలు దళితుల నుంచి ఇస్లాం స్వీకరించినవారే! తర్వాత బీసీ, ఎస్టీ, ఓసీ నుంచి -అంబేద్కర్ నుంచి అజ్ఘర్ అలీ ఇంజినీర్ దాకా
● రాజాసింగ్‌ను వదిలి స్కైబాబను కేంద్రం చేయడం అన్యాయం!
●●●
ఇండస్, అరుణాంక్, కవిత, అరుణ, ఇతర మిత్రులకు!
రాజాసింగ్ మీద కాకుండా చర్చను నామీదికి మళ్లించడం బాలేదు.
రాజేష్ మహాసేన ఒక దళిత రాజకీయ నాయకుడిగా స్పందించడంతో నేను తెలంగాణ నుంచి రాజకీయాల్లో ఉన్న దళిత నాయకులను, తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి ‘‘..తెలంగాణవాళ్ళు ఇంతగా చేవచచ్చిపోయారేం?’’ అని పోస్ట్ పెట్టాను. కామెంట్స్‌లో పొరపాటుగా మాట్లాడాను. దాంతో మీరు నాపై కోపాన్ని మొత్తంగా ముస్లింలపై చూపెడుతూ పోస్టులు పెట్టడం బాలేదు. బాధించింది.
అభినవ్ బూరం భాయ్ అన్నట్లు, ముస్లింవాద కవి ఖాజా ఫోన్ సంభాషణలో అన్నట్లు నేనొక్కడినే ముస్లింలకు ప్రతినిధిని కాను. పైగా మన సమాజంలో చాలామందితో పాటు మీడియా, రాజకీయ నాయకులు టోపీలు, బుర్ఖాలు ఉన్నవాళ్లనే ముస్లిం ప్రతినిధులుగా గుర్తిస్తారు! కాబట్టి నన్ను చూపి ముస్లింలను టార్గెట్ చేయడం బాలేదు. అలాగే ముస్లింలు బహుజనుల్లో భాగమనీ; ఎస్సీ, బీసీ, ఎస్టీ నుంచి ఎక్కువగా ఇస్లాం స్వీకరించినవాళ్లని చెప్పే మమ్మల్ని వ్యతిరేకించేవాళ్లు చాలామంది ఉన్నారు.
కవితా! అవును, ఊర్లలో ఆ వాతావరణం ఉంది. దానికి సమపాళ్లలో ముస్లింలు దళితులు, బీసీలతోని కలగలిసిపోయే వాతావరణమూ ఉంది. నేను ఊరివాణ్ణే! నా చిననాటి ప్రాణమిత్రుడు కత్తుల పరశురాములు మాదిగ. నన్ను కూడా మా ఇంట్లో ఒకరిద్దరు మాదిగలతో దోస్తానా ఏంది అని అడిగేది. కానీ తరువాత వాళ్లే మా పరశురాములును ఎంతో అభిమానించడం మొదలుపెట్టారు.
మీరు పట్నం చేరారు.. ఊర్లలో పెద్దకూర ఇష్టమైన ఆహారంగా ఉండే మాదిగ, మాలల తరఫున మాట్లాడాలి కదా! రాజాసింగ్ కేవలం ముస్లింలను ఉద్దేశించే ఆ తిట్టు తిట్టాడా? బీఫ్ తినేది కేవలం ముస్లింలేనా? కాదు కదా! అయినప్పుడు అందరం మాట్లాడవలసిందే! ముస్లింలు ఎక్కువగా మాట్లాడడం లేదు అన్నారు మీరు. ముస్లింల దారుణ పరిస్థితి మీకు తెలియదు. ముస్లింలు ఈ రాష్ట్రంలో ఐదు భాషల్లో చీలిపోయి ఉన్నారు. తెలుగు ఫేస్‌బుక్‌లో ఉన్నవాళ్లే ముస్లింలని మనం అనుకుంటే ఎలా? ఉర్దూలో, ఇంగ్లీషులో, హిందీలో, అరబ్బీలో స్పందించే ముస్లింలు కూడా ఉంటారు. అలాగే ఎంఐఎం మాత్రమే ముస్లింల ప్రతినిధి కాదు. వారి గురించి నన్ను అడిగితే లాభం లేదు. అలాగే పాతబస్తీలో ఎవరైనా ఏదైనా మాట్లాడినా, నిరసన తెలిపినా తెలుగు పత్రికల్లో రాదు. ఉర్దూ పత్రికల్లో వస్తుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఉర్దూ పత్రికలు చదవలేము కదా! మనం ఇలా వాదులాడుకొని ఊరుకుంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాతుల్లో లాగా బీఫ్ నిషేధించి దళితుల, ముస్లింల పొట్టగొడతారు. ఇవాళ ఆ రాష్ట్రాల్లో మనవాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. బీఫ్ ఆధారంగా జీవిస్తున్న లక్షలాదిమంది రోడ్డున పడ్డారు.
మీరు మీ అనుభవాల పెయిన్ నుంచి, నాలాంటి వాడి ఒక పోస్టు చూసి అసలా ఇష్యూనే పట్టించుకోవద్దని పిలుపునివ్వడం సరైంది కాదని నా మనవి.
ఇండస్ భాయ్! తెలంగాణలో బీఫ్ షాపులు దళితులు నడుపుతున్నట్లు చూడలేదు అన్నారు మీరు. పట్టణాల్లో బయట కనిపించకపోవచ్చు, దళిత బస్తీల్లో, ఊర్లలో దళిత వాడల్లో దళితులే కోసి కుప్పలేసి అమ్ముతారు. తెల్లారేసరికి అయిపోతుంది. దొరక్క ఎందరో నిరుత్సాహపడతారు. కొన్ని జబ్బుల పాలైన బీసీలు, అగ్రవర్ణాల వారు డాక్టర్ల సలహా మేరకు ముస్లింల చేత వండించుకొని బీఫ్ తింటారు.
భాయ్! మీరు నన్ను కోట్ చేస్తూ అన్యాయంగా మాట్లాడారు. పరవాలేదు. ముస్లింలు బీఫ్ మీద ఎందుకు స్పందించరు? అనేది మీ ప్రధాన ప్రశ్న. ఇందుకు మీ పోస్టు కామెంట్లలో ప్రసాద్ చరసాల మంచి పరిశీలన చెప్పారు:
"...ముస్లిముల పరిస్థితి గత కొన్నేళ్ళలో మరీ హీనంగా మారిపోయింది. వారు నోరెత్తిన తక్షణం జైల్లో వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది. ప్రజలూ దానికి అనుగుణంగా వున్నారు. కానీ దళితుల విషయంలో ప్రజలనుండి ప్రభుత్వ చర్యలకు ఆ నైతిక మద్దతు లేదు.
అందువల్ల ఒక విధంగా ప్రభుత్వాన్ని నిలదీసే నైతిక బలం దళితులకున్నంత ముస్లిములకు లేదని అనుకుంటున్నాను."
అదే నా జవాబు. నేనెందుకు ఆ విషయం మీద లైవ్ పెట్టలేదు అనేదానికి కూడా అదే జవాబు. (సంవత్సరం పొడవునా కెమెరా ముందు లైవులు.. అంటూ వ్యంగ్యం ధ్వనించారు. ఆ లైవుల కింద మీరెక్కడా స్పందించకపోవడం చూస్తూనే ఉన్నాం. అలాగే మాది ఇస్లాం సాహిత్యం కాదు, ముస్లింవాద సాహిత్యం అని గమనించ మనవి.) మరో జోడింపు ఏమిటంటే, దళితులు హిందూ చట్రం లోపలివారుగా, ముస్లింలు బయటివారుగా ఆరెస్సెస్, బీజేపీ చూస్తాయి. కాబట్టి హక్కుగా, ధైర్యంగా మీరు నిలదీసినట్లు, ప్రశ్నించినట్లు ముస్లింలు మాట్లాడే అవకాశం దాదాపు లేనట్లే!
చివరగా- ముస్లింలు అన్ని రంగాల్లో ముఖ్యంగా అక్షరాస్యతలో ఎంతో వెనుకబడి ఉన్నారు. దళితుల కన్నా వెనుకబడి ఉన్నారని జస్టిస్ సచార్ కమిటీ చెప్పింది. పైగా ఈ ముస్లింలలో మెజారిటీ మీలోంచే ఇస్లాం స్వీకరించినవాళ్లు. వాళ్లనలా వదిలేద్దామా?!
చాలా విషయాల్లో మతం పరిధిలోంచే ఆలోచించే మెజారిటీ ముస్లింలు మరింతగా వెనుకబడిపోతున్నారు. ఎన్నో విషయాల్లో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్లలో టీవీ చూడకూడదని, పత్రికలు చదవకూడదని ప్రచారం చేసే ముస్లింలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేయదూ! అందుకే దీన్ కే సాత్ దునియాకో లేకె చలో అంటూ మేమొక ఉద్యమమే చేయవలసి వస్తున్నది. అందుకని అన్నిచోట్లకి నాలాంటివాళ్లం రాకపోవచ్చు. అన్ని పనులూ మేమే చేయలేకపోవచ్చు. కాకపోతే 1994 నుంచి నేను ఆక్టివిస్టుగా చాలా కార్యక్రమాలు చేశాను. రాశాను. అవన్నీ ఏకరువు పెట్టలేను. కొన్నేళ్ల క్రితం బీఫ్ బచావో ఆందోళన్ అనే మీటింగ్‌ను లామకాన్‌లో ఏర్పాటు చేశాను. మనోళ్లంతా- సూరేపల్లి, పసునూరి, జూపాక, కొల్లూరి చిరంజీవి తదితరులు వక్తలు. ఫేస్‌బుక్‌లో ఫోటోలున్నాయి. గమనించగలరు.
ముస్లిం వ్యతిరేకతను పెంచుతూ, ముస్లింలను టార్గెట్ చేస్తూ ఓట్లు దండుకుంటూ బీఫ్ పేర, రకరకాల వ్యాపారాలపై అబద్ధాలు ప్రచారం చేస్తూ ముస్లింలకు బతుకు లేకుండా చేస్తున్నారు మనువాదులు. బాధితులని, వెనుకబడి ఉన్నారని చాలామంది ఇంటలెక్చువల్స్ ముస్లింల పక్షం నిలబడుతున్నారు. ఈ విషయాలన్నీ వదిలి మీరు కూడా ముస్లింలను టార్గెట్ చేయడం భావ్యం కాదు కదా!
ఫేస్‌బుక్‌లో తిప్పి తిప్పి కొడితే తెలుగు ఆక్టివిస్టులము ముప్ఫై, నలభై మందిమి ఉంటాం. మిగతా అంతా ఆక్టివిస్టులు కారు కదా! కేవల కవులు, రచయితలు, ప్రజాస్వామికంగా స్పందించేవారు. ముప్ఫై మంది ఆక్టివిస్టులమే వాదులాడుకుంటే మనకే నష్టం. నేను చేసింది పొరపాటు అని మీరు పాయింట్ అవుట్ చేశారు. ఆ పోస్టు తీసేశాను. అలాగే అగ్రవర్ణాల చైతన్యవంతులు ఎందుకు స్పందించడం లేదని అడిగిన పోస్టును కూడా తీసేశాను. ఇక ఎప్పుడూ ఇలా ఎవరినీ అడగకూడదని, నా పనేదో నేను చేసుకుంటూ పోవాలని నిర్ణయించుకున్నాను. నాది పొరపాటు అని ఒప్పుకుంటున్నాను. కాబట్టి ఈ చర్చను ఆపేయండని మనవి. అలాగే కవిత, అరుణను నా పోస్టు స్క్రీన్ షాట్స్ తీసేయమని కోరుతున్నాను.
-స్కైబాబ
02.03.2021 సాయంత్రం
నోట్: నా కథల్లో దస్తర్, జమ్మి, వెజిటేరియన్స్ ఓన్లీ, లతీఫ్‌మియా శాస్త్రం, ఓడిందెవరు?, అంటు కథలు దళితుల కోణం నుంచి రాసినవి. వెజిటేరియన్స్ ఓన్లీ, లతీఫ్‌మియా శాస్త్రం బీఫ్ ప్రధానంగా నడిచేవి. దళితుల, ముస్లింల రక్తసంబంధాన్ని ప్రతీకాత్మకంగా రాసిన కవితలు మర్ఫా, జంబుస్తాన్, బ్రాహ్మనిజం హటావో.. బహుజనిజం లావో.
Comments
Write a comment…
Aruna Queen
దళితుల కన్నా ముస్లింలు వెనకబడి ఉన్నారనే మేము కూడా తరతమ భేదాలు లేకుండా స్పందించేది.ముస్లింలకు కాదు ఎవరికైనా అన్యాయం జరిగితే మాకు జరిగినట్లుగానే స్పందించా0.స్పందిస్తున్నాం.ఇకపై కూడా..
మీరు పెట్టిన ఆ ఒక్క పోస్ట్ మరియు ఆ పోస్ట్ కి కమెంట్ చేస్తే మళ్ళీ అదే మాట ఇంకోసారి అనడమే మాకు బాధ కలిగించింది. దానివల్లనే మేము రెస్పాన్డ్ అవ్వాల్సి వచ్చింది అంతేకానీ అప్పటివరకు మా ఫోకస్ అంత రాజసింగ్ గాడి మీదనే ఉండే. మళ్ళీ కవిత కరీంనగర్ లో పుట్టి పెరిగింది.. తన అనుభవాలను తను చెప్పింది.. అందులో మొత్తం ముస్లిం సమాజాన్ని తప్పు పట్టలేదు.కేవలం తన అనుభవాలను, వాళ్ళ సొంత అక్కకి జరిగిన విషయాలు ,ఇంకొన్ని మాత్రమే ప్రస్తావించింది.
నాది నల్గొండ. నాకు ముస్లిం సమాజంతో కానీ,ముస్లిం ఫ్రెండ్స్ తో కానీ ఎలాంటి వివక్ష ఎదురుకాలేదు.నేను ఈ విషయం అల్రెడీ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటా.. ఒకసారి ఫేస్బుక్లో కూడా ఒక పోస్ట్ రాసిన..
థాంక్యూ.. జై భీం జై మీమ్
· Reply · 14m
Lakshmi Narasaiah Gunturu
కామెంట్స్ లో నువ్వు మాట్లాడింది బాగోని మాట నిజం.ఈ వివరణ బాగుంది.
· Reply · 18m
Galla Venkata Ratnakar
Good response sky...
· Reply · 35m
Andey Bhaskar
Lama Khan ekkada anna pls cheppandi
· Reply · 8m
Dheeraj Kumar
దళితుల జనాభా 15 % ముస్లీం జనాభా కూడా 15%. ఇద్దరూ దాదాపు అక్షరాస్యత శాతం నిరుద్యోగం పేదరికం అనుభవిస్తున్నారు.
దళితులు కులవివక్షకు గురవుతున్నారు.
ముస్లీంలు మత వివక్షకు గురవుతున్నారు.
దళితులని కులం పేరుతో దూషిస్తే అట్రాస్టీ చట్టం ఉంది.
అలాగే ముస్లీంలను క్రైస్తవులను మతం పేరుతో దూషించినా నేరం అయ్యేలాగా చట్టం చేయాలి.
కాకపోతే మనువాదులు దళితులను
హిందూ-క్రైస్తవులు ,
వర్గీగరణకు అనుకూలం వ్యతిరేకం,
అట అని విడగొట్టగలుగుతున్నారు .
మతం మారితే రిజర్వేషన్లు తీశేస్తాం ,
అట్రాస్టీ చట్టం తొలగిస్తాం అని భయపెడుతున్నారు.
కానీ ముస్లీంలను మాత్రం ఏ విధంగా భయపెట్టలేకపోతున్నారు. విడగొట్టలేకపోతున్నారు.
.BC లను దళితుల మీద నెగిటివ్ చెప్పి కలుపుకుంటున్నారు.
BC లు గ్రహించవలిసంది ఏంటంటే అటు ముస్లీంలతో క్రైస్తవులతో పోరాడుతూ దళితుల కంటే ఎక్కువ అని ఫీల్ అవుతూ అగ్రకులాలలతో సమానం అని ఫీల్ అవుతూ మనువాదం వల్ల అందరి కంటే ఎక్కువ నష్టపోతొంది మీరే .జనాభాలో ఎక్కువ ఉండి అందరి కంటే చట్టసభలలో తక్కువ ఉంది మీరే
No comments:
Post a Comment