కవిత పులిగారి
పోస్ట్ లో వారి అనుభవాలు విపులంగా వున్నాయి.
సమాజ కార్యాచరణకు
సంబంధించి విస్తృతంగా చర్చ జరగాల్సిన ప్రకటనలు రెండున్నాయి.
మొదటిది; ‘భారత
లౌకిక రాజ్యంగాన్ని పరిరక్షించుకుందాం’ నినాదంతో సాగిన CAA NRC NPR చట్టాల వ్యతిరేక
ఉద్యమం ముస్లింలది. దానితో ఎస్సీలకు పనిలేదు.
రెండవది; ప్రస్తుతం
బీఫ్ తినడం మీద బిజేపి చేస్తున్న రాద్దాంతం ముస్లింల సమస్య. దానితోనూ ఎస్సీలకు
పనిలేదు.
- Danny note
https://www.facebook.com/kavithapuliDC
1st March 2021
(కొద్దిగా పెద్దదే అయినా తప్పదు చదవండి.)
గౌరవనీయులు.. ఇట్లా రెచ్చగొట్టుకుంటా
సూర్లు అంటిచ్చి సుట్ట తాగే పనులు ఎందుకు..!?
పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే టైంలో CAA NRC NPR పంచాది నడిసింది. అప్పుడు గిట్లనే కొంతమంది దళితులు మాట్లాడుతలేరు అన్నరు. సోఫెస్టికేటెడ్ ముస్లిం మహీలలైతే ఒక ఇంఫార్మల్ మీటింగ్లో 'దళిత మహిళలు అస్సలు మాకు సపోర్ట్ చేస్తలేరు. వాల్ల ప్రసెన్స్ లేదు' అని ఆవేదన వ్యక్తం చేసిర్రు. అక్కడే ఉన్న నాకు సర్రున కోపం వచ్చింది. మరి మా దళిత మహిళల సమస్యల పట్ల స్పందించి మాకు సపోర్ట్ గా మీలో ఎవరైనా వచ్చారా..? ఎప్పుడైనా, మాట్లాడారా..? మద్దతు ఇచ్చారా...? అని అడగాలనిపించింది. ఆవేదనతో గొంతువరకు వచ్చిన ప్రశ్నలను నా విచక్షణ ఆపేసిందప్పుడు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో కొంత మాట్లాడాలనుకుంటున్నా..
వాస్తవం మాట్లాడితే ప్రపంచంలనే అత్యంత దుర్మార్గానికి, వివక్షకు, హింసకు గురవుతున్నది దళితులము. ఆ బాధ తెలిసినోల్లం కావటికనే ప్రపంచం బాధ మా బాధ గా ఫీలయితం. గందుకే ఎనకముందు సూడకుండా అన్నిటికి ముందటవడుతం. కానీ మాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చిన, మమ్మల్ని బట్టలిప్పి బాజాట్ల నడిపిచ్చిన, రేపులు చేసి చంపిన, మా అన్నదమ్ముల్ని నరికి సంపీనా ఎవ్వలు కుయ్యి మనరు. ట్రాజెడీ ఏందంటే ముస్లింలకు కూడా మేము అంటరానోళ్లమే. మాకు మేమె మనం మనం భాయ్ భాయ్ అనుకోని "జైభీమ్ - జైమీమ్" అంటము. నాకు చినప్పటి సంది తెలిసి అనుభవించిన అంటరానితనం బాపన్లు, కోమట్లు, రెడ్లు, వెలమలు నుంచి ఎదురైనట్టే అంతకంటే ఎక్కువ బీసీ లు, ముస్లింలు/దూదేకులోళ్ల నుంచే ఎదురైంది. అంతెందుకు మొన్నటి దాకా ఉన్న (ఇప్పుడు రిటైర్డ్ అయిండు) మా హెడ్మాస్టర్ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఖమ్మం ముస్లీం ఆయన. ఆయనకు అయితే దళితులంటే దొరకున్న పోకట ఉండేది. పోయిన సంవత్సరం మీర్ అలం దగ్గర నేను CAA ధర్నాకు పొయ్యే రోజు ఆయన మా బడి స్కావెంజర్ కు 2వేల రూపాయల జీతమిచ్చుకుంటా "ఓయ్ సంగీత.. ఈ జీతం ఏంచెత్తవు..!? అయిన మీ SC లు చిల్లరోళ్ళు తినుడు, తాగుడే పని కదా మీకు. ఒక్కరోజుల అయిపోవుడేనాఏ.." అని ఒకరకమైన హేళనగా అన్నడు. అయినా విని విననట్టు కోపం పంటి బిగువున ఆపుకొని ప్రొటెస్ట్ కు వెళ్లిన.
నాకు ముస్లిం ఫ్రెండ్స్ తక్కువ. అది కూడా కులం కారణంగానే. ఉన్నా ఒకరిద్దరు. వాళ్ల ఇళ్లల్లో ఇప్పటి వరకు నేను గ్లాసుడు మంచినీళ్లు తాగింది లేదు. వాళ్ళు పిలిచింది కూడా లేదు. నా జీవితంలో నన్ను ప్రేమగా హత్తుకున్న మొదటి ముస్లిం మహిళ Udugula Zareena అక్క. అప్పుడప్పుడు ప్రేమగా పలకరించే Shajahana akka Kaneez Fathima Shaik Saleema, Nasreen Khan, Khalida Praveen Garu మాత్రమే వివక్ష చూపకుండా స్నేహంగా ఉన్న కొద్దిమంది ముస్లిం మహిళలు అనుకుంటా.
మా సొంత మేనమామ బిడ్డ ముస్లీంను పెళ్లి చేసుకుంది. కొడుకు మాదిగ పిల్లను చేసుకున్నడని ఆమె అత్త కిరోసిన్ పోసుకుని చచ్చిపోయింది. మా వదిన బలంతంగా మతం మార్చుకోవాల్సి వచ్చింది. భుర్ఖా కంపల్సరీ. అట్లా బుర్ఖతో మా ఇండ్లల్లకు వస్తే నవ్వుదురు. వాళ్ళు కూడా మా ఇండ్లల్లకు ఆమెను రానియ్యరు. ఆమె మా చుట్టాలు అందరికి దూరమే ఇప్పుడు. పెళ్లికి ముందు చాలా ధైర్యంగా, తెలివిగా, చురుకుగా ఉన్న ఆమె ఇప్పుడు సమాజం అన్నా, బయట మనుషులన్నా చివరికి తనమీద తనకు కూడా నమ్మకం లేకుండా భయస్తూరాలిగా తయారయ్యింది. ఆమె అట్లా అయింది అంటే ఎంతటి మానసిక హింసను ఎదుర్కొని ఉంటదో ఆలోచించండి. నా టీనేజ్ లో నాకు అన్నీ దగ్గరుండీ నేర్పిచ్చి నన్ను గ్రూమ్ చేసిన ఆమె ఇప్పుడు అట్లా మారిపోయింది అంటే నేను అస్సలు జీర్ణించుకోలేక పోతున్నా. ఇలాంటి ఉదాహరణలు మస్తు ఉన్నయి.
నా చిన్నప్పుడు స్కూల్లో, ఊర్లో మిగతా అన్ని కుళాలోళ్లు మమ్మల్ని ముట్టుకోకపోయినా, అవమానించిన కలిగే బాధ కన్నా కల్యామాకుకో, నిమ్మకాయలకో, మైదాక్కుకో తురుకోళ్ల ఇంటికి పోతే బయట గేటు కాడనే నిలబెడితే ఎక్కువ బాదయ్యేది. మా నాన్న కాంగ్రెస్ పార్టీలో దివంగత "గొర్రె వెంకటస్వామి" కోసం హైదర్ అన్నా అనే లీడర్ కలిసి తో బాగా తిరిగేది. అయినా వాళ్ళ ఇంట్లకు మా నాన్న ఎన్నడూ పోకపోయ్యేది. అంతెందుకు ఎద్దు కూర గంపల పట్టుకచ్చి అమ్మే తురకాయన కూడా మా వాడొల్ల గిన్నెలు, డబ్బాలు ముట్టుకోకపోవు. హైస్కూల్ లో ముస్లీం పిల్లలు, మిగతా కులాల పిల్లలు జంటలు పట్టుకుని కలిసి ఆడుకునేది. నేను వాళ్ళందరికంటే కూడా నీట్గా, అందంగా, శుభ్రంగా ఉండేది. మంచి బట్టలు వేసుకునేది. మిగతోళ్ళు పోనీ నా క్లాస్మేట్స్ శభాన, పర్వీన్, ముంతాజ్ లు కూడా నాతో ఆడకపోదురు. ఎందుకో నాకర్ధం కాకపోయేటిదీ. మొహం మాడ్చుకొని ఉక్రోషం తో ఒకరోజు నాతో మంచిగా ఉండే నా క్లాస్మేట్ సరళ ను... 'ఎందుకబ్బా నన్ను ముట్టుకునే ఏ ఆటల కూడా ఆడిచ్చుకుంటలేరు మీరు అని అడిగిన'. అందుకు అది, 'మీరు ఎద్దు కూర తింటరు కదనే.. అందుకే'.. అని చెప్పింది. నాకర్ధం కాలేదు. వెంటనే 'మరీ పర్వీన్ ఓల్లు కూడా తింటరు కదనే' ఆని ఏడ్సుకుంటా అడిగిన. దానికి సరళ 'ఏమోనే ఆళ్ళు వేరే మీరు వేరే. ఆళ్ళు తురుకోళ్లు. మీరు మాదిగోళ్ళు.. గంతే'.. అన్నది. ఆ 'గంతే' అన్నది అప్పుడు నాకు అర్ధం కాలే. కానీ ఇన్నేండ్లకు ఇప్పుడు.. ఇప్పుడు అర్థం అయితాంది.
ఎందుకంటే 2019 లో నేపాల్ లో దక్షిణాసియా దేశాల జెండర్ ట్రెయినింగ్ కెపాసిటీ బిల్డింగ్ కోర్సు టైంలో నాకు జ్ఞానోదయం అయింది. ఏంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లీంల పట్ల, వారి సమస్యలు, ఆహారపు అలవాట్లు, సంస్కృతి పట్ల అందరికి సానుభూతి, సహనుభూతి, అంగీకారం ఉంటాయి. గౌరవ మర్యాదలు దక్కుతాయి. (ఇది పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, కాస్మెర్, మాల్దీవ్ దేశాల ముస్లీం మహిళలతో పాటు దక్షిణాసియా దేశాల మిగతా అగ్రవర్ణాల మహిళలతో నెలపాటు గడిపిన నా అనుభవ జ్ఞానం అది) అట్లాగే రేస్ కు కూడా అలాంటిదే.
కానీ కులం భిన్నమైనది. దానికి ఎటువంటి విచక్షణ ఉండదు. అంగీకారం, గౌరవం ఉండదు. మా తిండి మా సామాజిక సంబంధాలను నిర్ణయించదు. మా దళితుల్లో కూడా పూర్తి శాఖాహారులున్నరు. అయితే వాళ్ళను బాపనోళ్లు కలుపుకుంటున్నారా..!? పిల్షి ఇంట్ల కూసోపెట్టుకుంటున్నారా..!? లేదు కదా..!? కేవలం ఆహారపు అలవాట్లు ఒకటయినంత మాత్రాన మాతో ఎవరూ కలవరు. కానీ మేమే ప్రతిఒక్కరికి భుజం ఆనుతం. అట్లనే ఇప్పుడు కూడా ముస్లీమ్ ల కన్నా ఎక్కువగా మేమె స్పందించినం, ఖండించినం. మద్దతుగా పోస్టులు రాసినం ఫలితంగా యాదన్న ఖమ్మంపల్లి అరెస్ట్ అయిండు. నా అకౌంట్ రిపోర్ట్ చేసిర్రు. నిన్న అర్థరాత్రి వరకు నాకు రిపీట్ గా బెదిరింపు ఫోన్లు. పైగా దళిత సమాజం చచ్చుపడిపోయినరు అంటూ ఇక్కడ పోస్టులు ఏంటీ..!?
అవునూ గౌరవాయులైన Yousuf Shaik గారు..! ఆయినా ఆ పిచ్చోడు మోరిగితే మెమెందుకు స్పందించాలి. అన్నది ముస్లీంలను ఉదేశిస్తూ కదా..!? మరి ఎంతమంది ముస్లిం లు ఖండించినరూ..!? (ఏ భాషలో అయినా సరే.) ఇప్పటికి ముస్లీం లు అతనిపై లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు...!? మీఁరైనా ముస్లీంలను సమావేశపరిచి సదరు మాటలను ఖండిస్తూ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు..!?? మమ్మలనేందుకు దబాయిస్తున్నరూ..!? ఎమ్.. దళితులం అగ్గువకు దొరికినమా..!? లేదా ఉద్దేరకు దొరికినమా...!? ఎందుకు సర్ ఇట్లా..!?
ఓ దళిత గొర్రెలు.. మనం ఎగిరెగిరి దంచినా అదే కూలీ, ఎగరక దంచినా అదే కూలీ. ఎటొచ్చి సావుదెబ్బలు వడేది మనకే. ఉనకమీది రొకళ్ల లెక్క ఎగిరి పోలీసులు, కేసులు, పంచాదులు, ఫైన్ ల లొల్లులు అవసరం లేదు మనకు. అన్నది మనల్ని కాదు. ఒకేలా వాడు మనల్ని కలిపి అన్నా సరే మనం రేషానికి పోవుడు అవసరం లేదు.. మీకు వండిపెట్టే మేము లంజలమూ కాదూ.. తినే మీరు ఆ కొడుకులూ కాదు. బీఫ్ ను మన తాత ముత్తాతల, ముత్తాతల ముత్తాత జాంబవంతుడు కాన్నించి తింటన్నము. అది మన ఆహారపు సంస్కృతి. కుక్కను,పందిని, పిల్లిని, ఎలుకను తినేటోన్ని ఎవ్వడు అడుగుతలేడు. మనమెందుకు ఈ బక్వాస్ బీఫ్ పాలిటిక్స్ లో బలవుడు..? ఇగ ఈ పంచాదిని బందుజేయుర్రీ. మనం చెయ్యాల్సిన పని ఇదికాదు.
జైభీమ్.
మీ సోదరి
పులి కవిత.
Comments
Arunank Latha
కుండ తీసుకచ్చి మూడు బజాట్ల కాదా ఎత్తేసి మరీ చెప్పినవ్ ❤
· Reply · 1d
Kavitha Puli
Arunank Latha భారంగా మోయడం అవసరం లేదు అనిపించింది.
· Reply · 1d
Vinodkumar Matam
Arunank Latha కరెక్ట్ పనే
· Reply · 1d
CV Yaar
· Reply · 1d
Mukkanti Gadde
ముస్లింలను సానుభూతితో వదిలేస్తున్నాం కాని వాళ్ళు బ్రాహ్మణ మనువాద కులాలకంటే ఎక్కువ వివక్ష దళితులపై చూపిస్తారు నేను మా గుంటూరు జిల్లాలో చాలా చోట్ల గమనించాను మా ఊఊరిలోకూఢా ఇలాగే వుంది వీళ్ళ అసలు నిజస్వరూపం బయటపెట్టె సమయం ఇదే మీరు రాసిన పోస్టు అక్షరాల 💯 %నిజం
· Reply · 16h
Write a reply…
Hari Krishna MB
Very well written.. this is undeniable narration...
· Reply · 1d
SanjAy Maharaj
చక్కగా వివరణ ఇచ్చారు అక్కా ఎవడేవడో ఏమో అంటే మనం ఎందుకు రియాక్ట్ కావాలి మనమెందుకు కేసులు మీద వేసుకోవాలి,ఈ పనికిమాలిన పంచాయితీ లు బందు చేసి మన వారిని మనం ఎడ్యుకేట్ చేస్తూ వెళ్ళాలి జై భీం
· Reply · 1d
Srisail Reddy Panjugula
మీ ప్రతిమాటతో నాకు ఏకీభావం కవితా.
తమ సమస్యల పట్ల తప్ప ఇతర సామాజికాంశాలకు ముస్లింలు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వరు. వాళ్ళ సమస్యలు తక్కువని కాదు. కానీ, వారికి ఇతర కుల/మత/వర్గాల నుంచి వచ్చే మద్దతుతో పోలిస్తే... వారి luke-warm స్పందన బాధాకరం. ఈ విషయమై ముస్లిం మితృలతో తగాదాలూ అయినయి. అయినాసరే, మాట్లాడవలసి వచ్చినపుడు మౌనంగా ఉండడం సరికాదు.
మీరు ఆ పని చేసిన్రిపుడు 💐💐
· Reply · 1d
Kavitha Puli
Srisail Reddy Panjugula గారు.. thanks sir.. యేడాది కిందటే CAA అప్పుడే రాద్దాం అనుకున్న.. కానీ ఆ సమయం, సందర్భం లో రాయడం సంస్కారం కాదని రాయలేదు.
· Reply · 1d
Vinodkumar Matam
సంగారెడ్డిలో అయితే ఇతర వాటికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించే ముస్లిం సోదరులు ఇప్పుడు ర్యాలీ కాదు కదా నిరసన తెలుపలేదు, కెవిపిఎస్ దహన చేసి వ్యతిరేకత వ్యక్తం చేశారు.
· Reply · 1d
Vinodkumar Matam
· Reply · 1d
Aruna Queen
అన్నిటికీ ఆరోగ్యాలను,ఆర్థికం కాదని ఉరుకుతుంటే అందరికి అల్కగైనం.... ఇక అన్నిటికీ ఉర్కుడు బంద్ పెట్టాలి.. శృతికి మించి త్యాగాలు చేసుడు,మాట్లాడుడు బంద్ పెట్టాలి... జనాల్ని ఎం చెయ్యలనుకొని ఉరికిస్తున్నారో అర్థం అవట్లేదు.... వాళ్ళింట్లో కడుపులో సల్ల కదలొద్దు... మనం మాత్రం 24/7 కూడలిలో నిత్యం ఏదోఒక పంచాయతీ చేసుకుంటూ ఉండాలి... వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ బిసినెస్ లు చేసుకుంటూ ఉండాలి.. ఇదెక్కడి విచిత్రం...
· Reply · 1d
Kavitha Puli
Aruna Queen yes
· Reply · 1d
Kola Karuna
కర్ర విరగకుండా పామును చంపావు కవి. 👏👏👏
· Reply · 1d
Sajaya Kakarla
జరుగుతున్న చర్చ follow కాలేదు. కానీ ఒక మూర్కుడు అధికార మదం తో వదరిన దెబ్బకు రెండు పిట్టలు తీవ్రంగా గాయపరుచుకుంటున్నాయని దుక్కమ్ గా వుంది.
· Reply · 1d
Kavitha Puli
Sajaya Kakarla అక్కా.. ఒక పిట్ట ఇంకో పిట్టను వేతగాని ఉచ్చు వైపు నెట్టడానికి రుబాబు చేస్తుంటే ఎట్లా అక్కా..! ఒకవేళ రెండూ కూడా ఉచ్చులోనే ఉన్నాయనుకుంటే రెండూ కలిసి బయట పడే ప్రయత్నం చేయాలి కదా.
· Reply · 1d
Sajaya Kakarla
Indus Martin మాట్లాడుదాం
· Reply · 1d
Sajaya Kakarla
Kavitha Puli రెండూ వుచ్చు లోనె వున్నాయనేదే నేను అంటున్నది. అవి కలవకూడదనే కుట్ర నిరంతరం నడుస్తూ వుంటుంది. దానికి తెలియకుండానే చమురు అందిస్తారు కొంతమంది.
· Reply · 1d
Prasad Charasala
Indus Martin వాళ్ళకూ నొప్పి వుంది కదన్నా. కాకపోతే ఎవరి నొప్పిని వారే భరిస్తూ మరొకరి నొప్పిని ఫీలవడం లేదేమో.
ఈ హిందూ ఫాసిజం ఎదుర్కోవడానికి దళితుడికున్న అథారిటీ ముస్లింకు లేదు గనకా వారి నోరు అంత బలంగా లేవడం లేదు?
· Reply · 14h
Prasad Charasala
Indus Martin గత ఆరేళ్లుగా మారుతున్న పరిస్థితులు...
· Reply · 12h
Write a reply…
Madhu Kasarla
ఒక్క ముక్కలో చెప్పాలంటే...??
ఈ దేశంలో ప్రతి మనిషిలో కులతత్వం బలంగా నరనరాన ఉందీ...
ఇదీ 99.999%నిజo..
ప్రతీ కులం వాళ్ళు
మాదే గొప్ప అనీ గుండెలు చించుకుంటుర్రు...!!
అట్లే మతాలు కూడా...??
ఈ దేశంలో ప్రవేశించిన ప్రతీ మతంలో కూడా అంటారాని తనం బలంగా వుంది అనేది నగ్న సత్యం...
బ్రాహ్మణ క్రైస్తవులు,రెడ్డి క్రైస్తవులు
కమ్మ, కాపు క్రైస్తవులు వేరు దళిత క్రైస్తవులు వేరు..వీరి
మధ్య కూడా అగాధం వుంది అందుకే దళిత క్రైస్తవుల మీదా మాత్రమే దాడులు జరుగుతాయి...
అట్లే ముస్లింలో కూడా...
షేక్లు, సయ్యద్లు...
దూదేకులు, ఇస్లాం లోకి మారిన దళితులు (అంజుమన్ -ఇ -తబ్లిక్ )ద్వారా మారిన వారు.. ఆతరువాత (స్వామి రామానంద తీర్ద )ఆర్య సమాజ్ వాళ్ళు శుద్ధి ఉద్యమం ద్వారా తిరిగి హిందూమతంలోకి మార్చినారు )..
అసలు విషయం :
మన నాయకులు మాట్లాడకపోవాటానికి
రాజకీయకోణం ప్రధానమైనది..!!
(కులం, మతాలతో పెట్టుకుంటే,, వాటిమీద దూషణలు చేస్తే మనం రాజకీయాలు చేయలేము..
---మాన్యశ్రీ కాన్షిరాం గారు.
అందుకే ఏనాడు కాన్షిరాం గారు వీటి ఉచ్చుల్లో పడలేదు...!!
గమనించాలి...!!
మనల్నీ తిట్టినా వాణ్నినికి వాని సమాజం మొత్తం మద్దతు ఉంటే....??
మన తరపున పోరాదే వర్గాలు కూడా ఐక్యతగా ఉండాలి కదా...??
ముస్లింలు ఉగ్రవాదులు,, టెర్రరిస్ట్లు అనీ వాళ్ళని మాటుబేడ్తున్నార్రు..
దళితులను బహుజన జాతులను అవమానాలతో, అంచివేతలతో దాడులు,
మర్డర్లు చేస్తున్నారు....!!
NRC, CAA గురించీ దేశంలోనే కాకా ప్రపంచంలో మొత్తం ముస్లింలో ఒక చైతన్యం వచ్చింది, చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ లాంటోళ్ళు కూడా జైలు వెళ్లారు...!!
అట్లే దళిత బహుజన సమస్యలు ఎందుకు జాతీయ స్థాయిలో,, అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ కావటంలేదు.. ఆలోచించండి....??
మన వర్గాలల్లో కూడా బాగా ఉన్నోల్లకు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగినోళ్లకు మనజాతుల పట్ల చిన్న చూపే వాళ్ళు గతాన్ని మర్చిపోయి... అగ్రవర్ణ పోకడలు పోతారు, మళ్ళీ మనలనే తాకట్టు పెడతారు... అందుకే బాబాసాహెబ్ ఆనాడు
నా జాతే ఉన్నంతంగా ఎదిగిన జాతే నన్ను నా సమాజాన్ని మోసం చేస్తుంది అనీ బాధపడ్డాడు కాదా...??
మొత్తానికి
మనం మన అనాఖ్యతను బయటపెట్టి శత్రువుకు వెన్ను చూపొద్దు అనీ మనవి...!!
ముఖ్యం విషయం :
అన్నీ వర్గాలనుండి రాజాసింగ్ పై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలి,, అట్లే రాబోయే MLC ఎన్నికల్లో మన ఓటుతో తగిన బుద్ధి చెప్పాలే...??
వాణ్ని వదిలి పెట్టకుండా అట్రాసిటీ కేసులు ప్రతిజిల్లాలో పెట్టాలే...!!ముస్లింలు కూడా నోరేత్తాలే..!!బీఫ్ తినే వర్గాలకు వ్యాపారం,, లావాదేవీలు ఉంటే భయపడే వారేమో...??
అందుకే ముస్లిం సామాజం,, అగ్రవర్ణ సమాజాలు కూడా గమనిస్తున్నాయి కానీ నోరేత్తటం లేదేమో.. ఇదే కోసమేరుపు..!!
AlexanderD.🙏.
· Reply · 1d · Edited
Kavitha Puli
Madhu Kasarla నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నీకైనా క్లారిటీ ఉందా...!?
· Reply · 1d
Madhu Kasarla
Kavitha Puli మీకు నచ్చినట్టు నేను రాయలేను...🙏
శానుబూతి కోసం నేను రాయలేను...!!మీరూ నన్ను శత్రువు అనుకున్న సరే...??
మీకు చాలా రాజకీయ కుట్రలు బేరీజు చేయాలి...!!
రాజాసింగ్ గాడు కాకుండా..
వేరే వాళ్ళు **జకొడుకులు అంటే... మీరూ ఎంత ఆగమాగం ఆగం చేసేవాళ్ళు..
మీరూ ఎందుకు వాని మీదా కేసుపెట్టలేదు...??
వీలైతే వాణ్ని ఏమైనా రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాలు ఉంటే చెప్పండి...??
· Reply · 1d
SuReSH MeKaLA
మొత్తం చదివిన...అక్క చాలా అర్థవంతంగా వివరించిన మీకు సలాం..అక్షరాల ఇది నిజం.
· Reply · 1d · Edited
Ramarao Bonigala
"ఎగిరెగిరి దంచినాఅదేకూలి ఎగరకుండాదంచినాఅదేకూలి.చావుదెబ్బలుమనకే"❤️❤️❤️........🎉🎉🎉
· Reply · 1d
Kavitha Puli
Ramarao Bonigala సర్.. ఏ విషయంలో అయిన అంతే అవుతోంది కదా
· Reply · 9h
Ramchander Deekonda
మా హైదరాబాద్ల ఈ తుర్కోల్లు (ఇది తిట్టుమాట కాదు. మొదట్లో మన దేశంమీద దాడి చేసిన ముస్లింలు తుర్కీ అదే Turkey వారు కాబట్టి ముససల్మాన్లను అట్ల పిలుస్తరు) తెలుగోల్లందర్నీ "ధేఢ్" అంటూ "ధేఢ్వాడా" అంటూ చీదరించుకునేవారు. నాకు అర్థం కాక ఓ సారి మా నాయినను అడిగితే చెప్పిండు. మాల మాదిగ కులస్తులను వాళ్ళు అట్ల హేళన చేస్తరు అని.
మీకు తెలుసో లేదో. పాకిస్థాన్ పుట్టినప్పుడు, హిందువులు సిక్కులు భారతదేశానికి వచ్చేస్తుంటే దళితులను రానివ్వలేదు. ఎందుకో తెలుసా? వారి పైఖానాలు సాఫ్ చేస్తందుకు. అంబేద్కర్ గారు రాసిన ప్రతి దళితుడు చదవాల్సిన పుస్తకం ఒకటి ఉంది. Pakistan or Partition of India. ముస్లింల గురించి ఎంతో స్పష్టంగా రాసిండు మన అంబేద్కర్ గారు.
పాకిస్థాన్ ప్రథమ న్యాయ శాఖా మంత్రి "జోగేంద్రనాథ్ మండల్" గురించి ప్రతి భారతీయదళితుడు చదివి తీరాలి. ఆయనకూ, దళితులకూ ముస్లింలు చేసిన అవమానం, అన్యాయం అన్నీ తెలుస్తాయి. గూగుల్ చేసి చదవండి జోగేంద్రనాథ్ మండల్ జీవితకథ.
· Reply · 1d · Edited
Kavitha Puli
Ramchander Deekonda సర్ పాకిస్థాన్ పుస్తకం చదివాను.
· Reply · 1d
Srisail Reddy Panjugula
నామశూద్ర జోగేంద్రనాథ్ మండల్ తప్పక చదివితీరాల్సిన మహనీయుడు.
· Reply · 1d
Dubbagalla Varaprasad
ఈ పోస్ట్ నా మనసులోని మాట
· Reply · 1d
Mahesh Ryot
ఆలోచించాల్సిన విషయం.
· Reply · 1d
Subhash Satyanarayana
దేవుడా ఏమిటి ఈ ఆవేదన, భాధ, కోపం? వీలైతే ఒక్క సారి ఈ మానవ జాతిని ఒక్క బటన్ నొక్కి రీసెట్ చెయ్యి లేదా పూర్తిగా ఎరేస్ చెయ్యి.
Doesn’t look like no option but reset or erase. 🥲
Kavitha, love you for your patience and apologies for everything happened to you and Dalits. My eyes got wet while i was reading through the post.
నిరసన మార్చలేదు, కన్నీళ్ళైనా కరిగిస్తాయేమో చూద్దాం!
· Reply · 1d
Kavitha Puli
Subhash Satyanarayana గారు నాకు తెలిసి మా కుటుంబం జీవితంలో తిండికి, బట్టకు ఎన్నడూ కష్టపడలేదు, బాధపడలేదు. ఉన్నదాంతో సంతోషంగా బతికినం. కుటుంబం లో ఆడపిల్లలకు జెండర్ వివక్ష లేదు. మా పేరెంట్స్ ది కూడా గొడవ లేని అన్యోన్యత. కానీ వాటన్నిటినీ మించిన పెయిన్ మా కులం కారణంగా జరిగింది. 34 ఎళ్ళ ఈ జీవితంలో కుల వివక్ష నాకు అతిపెద్ద హారర్..
· Reply · 19h
Satish Satish
ఇది చదివిన తర్వాత నాకొకటి తోస్తున్నది. ఈ "జై భీం- జై మీమ్" అనేదాంట్లో ఏదైనా మత్లబ్ ఉందేమో అని నా అనుమానం. ఎందుకంటే విశ్వరత్న అంబేద్కర్ చాల క్లియర్ గ చెప్పిండు ముస్లింల అసలు కథ. మనను వాడుకుంటునారేమో. మనం ఈ దేశాన్ని వాల్లలాగ భావించలేము. పాకిస్థాన్ ల దళితులను నానా బాధలకు గురిచేస్తున్నారని మనం వార్తలు చూస్తూనేవుంటాం. వాల్లకు మతమే ముఖ్యం చదువు సైన్సు అందరూ ఒకటే అనే భావం వాల్లకు లేదు. వాళ్ళ మతం పుచ్చుకుంటే మంచోడు. లేక పోతే ఎంత చదువు కున్నోడైనా వాడు కాఫిర్ గా నే చూడబడతాడు.
గమనిక: మనలో చాలామందికి మంచి ముస్లిం మిత్రులుకూడా ఉన్నారు.
· Reply · 23h · Edited
Ramchander Deekonda
Satish Satish
అంబేద్కర్ మహానుభావుడు అంత బాగా చెప్పినా మనం వాల్లతో జతకట్టడం విడ్డూరంగా ఉంది. వారు వేయ్యేండ్లు హుకుం చలాయించిండ్రు. ప్రతి ముస్లిం మేమే పాలకులం అనుకున్నడు. "అనా-అల్-మలిక్" అనేది వారి నినాదం. అర్థం: నేనే పాలకుణ్ణి. మనకు నేర్పిన మంత్రం: నీ బాంచెన్ కాల్మొక్త. వారి మానసిక స్థితి పాలకులది. మనది బానిసలది. మనం శోషితులం. వారు స్వచ్ఛందంగా వెనకబడ్డారు. నిజాంల కాలంలో 70 ఏండ్ల క్రితం 11% ముస్లింలు 90% ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నరు. చేసిండ్రు. వేలయేండ్ల బాధ మనది , వారు పాలకులై ఉండి కూడా 70 ఏండ్లలో చదువుకు జాతీయ స్రవంతికి దూరంగా ఉంటూ మతానికే పెద్ద పీట వేస్తూ వెనకబడ్డారు అంతే. దళితులలా ఎన్నడూ అవమానాలకూ అస్పృశ్యతకూ, రాజకీయ సాంస్కృతిక వెనగబాటుకూ ఎన్నడూ గురికాలేదు. కాబట్టి వారి సమస్యలు వేరు వారి లక్ష్యం వేరు. మనది లౌకికవాదం. అందరూ గ్రహించాలి.
· Reply · 23h · Edited
Wilson Sudhakar Thullimalli
Well said 👏👏👏👏
· Reply · 23h
Ramchander Deekonda
అంబేద్కర్ మహానుభావుడు అంత బాగా చెప్పినా మనం వాల్లతో జతకట్టడం విడ్డూరంగా ఉంది. వారు వేయ్యేండ్లు హుకుం చలాయించిండ్రు. ప్రతి ముస్లిం మేమే పాలకులం అనుకున్నడు. "అనా-అల్-మలిక్" అనేది వారి నినాదం. అర్థం: నేనే పాలకుణ్ణి. మనకు నేర్పిన మంత్రం: నీ బాంచెన్ కాల్మొక్త. వారి మానసిక స్థితి పాలకులది. మనది బానిసలది. మనం శోషితులం. వారు స్వచ్ఛందంగా వెనకబడ్డారు. నిజాంల కాలంలో 70 ఏండ్ల క్రితం 11% ముస్లింలు 90% ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నరు. చేసిండ్రు. వేలయేండ్ల బాధ మనది , వారు పాలకులై ఉండి కూడా 70 ఏండ్లలో చదువుకు జాతీయ స్రవంతికి దూరంగా ఉంటూ మతానికే పెద్ద పీట వేస్తూ వెనకబడ్డారు అంతే. దళితులలా ఎన్నడూ అవమానాలనకూ, అస్పృశ్యతకూ, రాజకీయ సాంస్కృతిక వెనకబాటుకు ఎన్నడూ గురికాలేదు. కాబట్టి వారి సమస్యలు వేరు వారి లక్ష్యం వేరు. మనది లౌకికవాదం. అందరూ గ్రహించాలి.
· Reply · 23h · Edited
Nasreen Khan
మీ స్కూల్ దోస్త్ పర్వీన్ లాంటిదే నా సిట్యుయేషన్. ఆ సమయంలో నాకేమీ సమాజ పోకడ తెలియదు. అందుకే నన్ను సురేష్ గారు చేసిన ఇంటర్వ్యూలో బాల్యం నుంచి ఏదైనా వివక్ష ఎదుర్కాన్నారా అని అడిగితే లేదు అని చెప్పాను. కానీ నాకు రమణ, వెంకట రమణ, జీవరత్నం, దుర్గ, లక్ష్మి... ఇంకా చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారు దళితులా మరోకటా అనే పట్టింపే ఉండేది కాదు.
జర్నలిజం కదా వీటన్నింటినీ కళ్ళకు కట్టింది.
మీరన్నట్టు వాడుకునేటోళ్ళు, వాడబడేటోళ్ళు దళితుల్లో మాత్రమే లేరు. ముస్లింలలోనూ ఉన్నారు.
మంచి ఉదాహరణలతో చాలా చక్కగా చెప్పారు.నచ్చిందీపోస్ట్.
· Reply · 23h
Kavitha Puli
Nasreen Khan అర్థం చేసుకున్నందుకు మీకు బోలెడు ప్రేమ💖.. నిజానికి చిన్నప్పుడు పిల్లలకు ఏమీ తెలియదు. అన్నీ ఇంట్లోవాళ్ళు బలవంతంగా నేర్పిస్తరు. నా క్లాస్మేట్ ముంతాజ్ పిల్లలు కరీంనగర్ లో 7వ తరగతి వరకు నా స్థూడెంట్స్. మంచి పిల్లలు బాగా చదువుతరు. నేనంటే చాలా ప్రేమ. వాళ్ళ అమ్మ పిల్లలకు చిన్నప్పటి విషయాలు చెప్పిందట. ఒకరోజు ముంతాజ్ మా సీనియర్ టీచర్ రిటైర్మెంట్ కు వచ్చింది. దగ్గరికెళ్లి పట్టుకుంటే.. అప్పుడు అవన్నీ తెల్వది టీచర్ అన్నది. ఏయ్ నేను పి. కవ్వి ని అట్లే పిలువు అంటే చాలా ఖుషి అయ్యింది.
· Reply · 23h
Ramchander Deekonda
https://en.m.wikipedia.org/wiki/Jogendra_Nath_Mandal
Jogendra Nath Mandal - Wikipedia
EN.M.WIKIPEDIA.ORG
Jogendra Nath Mandal - Wikipedia
Jogendra Nath Mandal - Wikipedia
· Reply · 23h
Kavitha Puli
Ramchander Deekonda sir thankbyou
· Reply · 19h
Pasunoori Ravinder
ఎవ్వనికి కడుపునొచ్చినా మనమే మొత్తుకునుడు బంద్ చెయ్యాలి అని భలే చెప్పినవు రా కవీ
· Reply · 23h
Pagidimarri Thirumalesh Pagidimarri Thirumalesh
Manam nithyam road meeda unte etharulaku santhosham
Veeri saradakoraku
Manalani … See More
· Reply · 23h
K Koteshwar
Super analysis Kavitha garu
· Reply · 22h
భరణీ చిత్రలేఖ
మిత్రుడు సాబిర్ ఓసారి దళితుని శిరోముండనం విషయంలో ముస్లిమ్స్ ఎందుకు పట్టనట్టు వుంటున్నారని అడిగితే అక్కడ కామెంట్లు అభిప్రాయాలు చూసాక నా కళ్లకున్న పొరలు కూడ పోయాయి పూర్తిగా.ముస్లిం సమాజానికి నాయకత్వమేదీ ప్రతినిధులేరీ అని మాట్లాడారు.విచిత్రంగా ఒక దుర్మార్గాన్ని దుర్మార్గం అనడానికి నాయకత్వాల దాకా దేనికి? మనకున్నవి చాలవా అన్నారింకొకరు.ఈ లెక్కన దళిత్స్ కి మహిళలకు అంతకన్న ఎక్కువే వున్నయ్.totally agree with ur post Kavitha Puli
దూద్ క దూద్-పానీ కా పానీ పోస్ట్ ఇది
· Reply · 21h
Helena Harini KT
Tag me madam
· Reply · 21h
Kavitha Puli
Helena Harini KT i will
· Reply · 19h
Suri Bondugula
· Reply · 21h
Venkat Bee
గాంధీ-కాంగ్రెస్ ముస్లిం లకు, సిక్కులకు ప్రత్యేక హక్కులు ఇచ్చాడు గానీ మనకి ఇచ్చిన వాటిని కూడా లాక్కున్నాడు.
ముస్లిం లకు అంటరానితనం లేదు. వాళ్ళది మత సమస్య. అందుకే వాళ్లు మనతో రారు. మన సమస్య వాళ్ళ సమస్య గా ఫీల్ అవరు.
· Reply · 20h
Kavitha Puli
Venkat Bee sir Exactly..
· Reply · 19h
Chekuri Chaitanya
ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతి గారు వంద సీట్లు ముస్లిం లకు కేటాయించింది.
బీజేపీ ఒక్క సీటు కూడా ముస్లిం లకు కేటాయించలేదు.
అయినా బీజేపీ నే గెలిచింది. ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా గెలవలేదు.
నాకు అప్పుడే డౌట్ వచ్చింది.
దళితనాయకత్వంలో ఉన్న పార్టీ పట్ల వీళ్ళ వివక్షత
· Reply · 19h
Padmasri Padmavathi
Wonderful madam
· Reply · 19h
Tuljaram Singh Thakur
దళితుల పట్ల ముస్లింల ప్రవర్తన అగ్రకుల హిందువులకు భిన్నంగా ఏమాత్రం లేదు!
· Reply · 12h
Lakshmi Narasaiah Gunturu
ఇది దళిత, ముస్లింలు ఒకరినొకరిని దెప్పుకుని తగాదా పడాల్సిన సందర్భం కాదనుకుంటా.
· Reply · 11h
Kavitha Puli
Lakshmi Narasaiah Gunturu సర్ నేను దెప్పిపొడవడం లేదు. ఇది తగాదా కూడా కాదు. మేము సహాయానికి వస్తున్నప్పుడు ఎదుటివాళ్ళు ఎందుకు రావట్లేదు..? రాకపోగా ఎదుటివాళ్ల ను సనస్యల వైపు ఉసిగొలపడం ఎందుకు..? అని సున్నితంగా, సూటిగా ప్రశిస్తున్న. ఎందుకంటే ఆవేశపడి కేసుల్లో ఇరుకాకుంటున్నది పేద దళిత యువత. వాళ్ళ బతుకులు ఎంతగా నష్టపోతున్నాయో తెలుసా ఈ రెచ్చగొట్టేవాళ్ళు, శెభాష్ అనే వాళ్లకు. కనీసం ఆ స్పృహ ఉంటుందా...!? పోనీ కలెక్టెవ్ గా కలిసి వస్తారా...!? రారుకదా.. అలా ఎందుకు రావట్లేదు.. అన్నది నా ప్రశ్న. కలిసి రావాలనే ఈ పోస్ట్.
· Reply · 9h
Lakshmi Narasaiah Gunturu
Kavitha Puli పోస్ట్ సారం అర్ధమౌతుంది తల్లీ.నీ ఉద్దేశం నాకు స్పష్టమయింది. ఈ పోస్ట్ ను ఆధారం చేసుకుని గాప్ ను పెం చుతూ మాట్లాడేవాళ్ళ గురించి నేను అంటుంది.
· Reply · 8h
Basha Builder
#Kavitha puli సోదరీ హిందూ దేశం లో పుట్టి హిందువులతో చదువుకుని చిన్నప్పటి అమాయకత్వం తో మిమ్మల్ని ముస్లిం పిల్లలు దూరం పెట్టి ఉండవచ్చు కానీ మాకు అంటరానితనం లేదు మా స్నేహితులను మేము గుండెలకు ఆనించుకుంటాం
· Reply · 11h
Tuljaram Singh Thakur
Basha Builder ఎక్కడ భయ్యా
ఇప్పటికీ మీ తిట్లు
ధేడ్,ఫకీర్ ,చంబార్ అనే ఉంటాయి
· Reply · 9h
Kavitha Puli
Basha Builder ఇది హిందూ దేశము కాదు బ్రదర్.. లైకిక, ప్రజాస్వామ్యం ఉన్న ఇది భారత దేశం. మీకు అంటారానితనం లేదు అనడం అంటే వాస్తవాలను అంగీకరించకపోవడమే.
· Reply · 9h
వేంకట రాయ
Tag చేయగలరు.
ఈ సమస్యను ఎక్కడనుంచి మొదలిడాలి ఎక్కడ ముగించాలి అనేదానిలో ఎవ్వరికీ ఏకాభిప్రాయం లేదు.
· Reply · 4h
Komali Ambedgar Chinthamalla
Just i am asking
ఏ సంభందం లేని ఈ దేశ ప్రజల కోసం
డా. బీ ఆర్ అంబెడ్కర్ ఎందుకు
త్యాగం చేశారు ?
· Reply · 3h